Kings II - 2 రాజులు 16 | View All

1. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదు నేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమా రుడగు ఆహాజు ఏలనారంభించెను.

1. Ahaz began to rule as king over Judah. It was in the 17th year of the rule of Pekah, the son of Remaliah. Ahaz was the son of Jotham.

2. ఆహాజు ఏలనారంభించి నప్పుడు ఇరువది యేండ్లవాడై యెరూషలేమునందు పదు నారు సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.

2. Ahaz was 20 years old when he became king. He ruled in Jerusalem for 16 years. Ahaz didn't do what was right in the eyes of the Lord his God. He didn't do what King David had done.

3. అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువ కుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను.

3. He followed the ways of the kings of Israel. He even sacrificed his son in the fire to another god. He followed the practices of the nations. The Lord hated those practices. He had driven out those nations to make room for the people of Israel.

4. మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.

4. Ahaz offered sacrifices and burned incense at the high places. He also did it on the tops of hills and under every green tree.

5. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలురాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేముమీదికి యుద్ధమునకువచ్చి అక్కడ నున్న ఆహాజును పట్టణమును ముట్టడివేసిరి గాని అతనిని జయింపలేక పోయిరి.

5. Rezin and Pekah marched up to Jerusalem and surrounded it. Rezin was king of Aram. Pekah, the son of Remaliah, was king of Israel. They attacked Ahaz. But they couldn't overpower him.

6. ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.

6. At that time Rezin, the king of Aram, got back Elath for Aram. He drove out the people of Judah. Then the people of Edom moved into Elath. And they still live there to this very day.

7. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరురాజునకు కానుకగా పంపి

7. Ahaz sent messengers to Tiglath-Pileser. He was king of Assyria. The message of Ahaz said, 'I am your servant. You are my master. Come up and save me from the powerful hands of the kings of Aram and Israel. They are attacking me.'

8. నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా

8. Ahaz took the silver and gold that were in the Lord's temple. He also took the silver and gold that were among the treasures in the royal palace. He sent all of it as a gift to the king of Assyria.

9. అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి, దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని, రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.

9. So the king of Assyria did what Ahaz asked him to do. He attacked the city of Damascus and captured it. He sent its people away to Kir. And he put Rezin to death.

10. రాజైన ఆహాజు అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి, దాని పోలికెను, మచ్చును, దాని పని విధ మంతయును యాజకుడైన ఊరియాకు పంపెను.

10. Then King Ahaz went to Damascus. He went there to see Tiglath-Pileser, the king of Assyria. Ahaz saw an altar in Damascus. He sent a drawing of it to the priest Uriah. He also sent him plans for building it.

11. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి, రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను.

11. So the priest Uriah built an altar. He followed all of the plans King Ahaz had sent from Damascus. He finished it before Ahaz returned.

12. అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి

12. The king came back from Damascus. When he saw the altar, he approached it. Then he offered sacrifices on it.

13. దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను.

13. He offered up his burnt offering and grain offering. He poured out his drink offering. And he sprinkled blood from his friendship offerings on the altar.

14. మరియయెహోవా సన్నిధి నున్న యిత్తడి బలిపీఠము మందిరము ముంగిటి స్థలమునుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను.

14. The bronze altar for burnt offerings stood in front of the Lord. It was between the new altar and the Lord's temple. Ahaz took it away from the front of the temple. He put it on the north side of the new altar.

15. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగాఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి, యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను.

15. Then King Ahaz gave orders to the priest Uriah. He said, 'Offer sacrifices on the large new altar. Offer the morning burnt offering and the evening grain offering. Offer my burnt offering and my grain offering. Offer the burnt offering of all of the people of the land. Offer their grain offering and their drink offering. Sprinkle on the altar all of the blood from the burnt offerings and sacrifices. But I will use the bronze altar to look for advice and direction.'

16. కాగా యాజ కుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయుచేసెను.

16. The priest Uriah did just as King Ahaz had ordered.

17. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటిమీదనున్న తొట్టిని తొలగించెను, ఇత్తడి యెడ్లమీద నున్న సముద్రమును దింపి రాతి కట్టుమీద దానిని ఉంచెను.

17. Ahaz took away the sides of the bronze stands. He removed the bowls from the stands. He removed the huge bowl from the bronze bulls it stood on. He placed the bowl on a stone base.

18. మరియు అతడు అష్షూరు రాజునుబట్టి విశ్రాంతిదినపు ఆచరణకొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణముగుండ పోవు ద్వారమును యెహోవా మందిరమునుండి తీసివేసెను.

18. He took away the covered area that had been used on the Sabbath day. It had been built at the Lord's temple. He removed the royal entrance that was outside the temple. Ahaz did all of that to honor the king of Assyria.

19. ఆహాజుచేసిన యితర కార్య ములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది.

19. The other events of the rule of Ahaz are written down. Everything he did is written down. All of those things are written in the official records of the kings of Judah.

20. ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను; అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను.

20. Ahaz joined the members of his family who had already died. His body was buried in the family tomb in the City of David. His son Hezekiah became the next king after him.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 16 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఆహాజు, యూదా రాజు, అతని దుష్ట పాలన. (1-9) 
ఆహాజు చాలా తక్కువ సంఖ్యలో ఇబ్బందికరమైన రోజులను మాత్రమే అనుభవించాడు. మనస్సాక్షికి ఇబ్బంది కలిగించే వ్యక్తులు తరచుగా ఎక్కడైనా ఆశ్రయం పొందుతారు, కానీ కష్ట సమయాల్లో దేవుడిని ఆశ్రయిస్తారు. తప్పు దాని స్వంత పరిణామాలను కలిగి ఉంది. ఒక దుష్కర్మ వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు మరొకరి ద్వారా పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నించడం సాధారణ ధోరణి.

ఆహాజ్ విగ్రహం యొక్క బలిపీఠం నుండి ఒక నమూనాను తీసుకుంటాడు. (10-16) 
ఇప్పటి వరకు, దేవునికి అంకితం చేయబడిన బలిపీఠం భద్రపరచబడింది మరియు ఉద్దేశించిన విధంగా ఉపయోగించబడింది. అయితే, ఆహాజు దాని స్థానంలో వేరే బలిపీఠం పెట్టాడు. ఆధ్యాత్మికత యొక్క రూపం పట్ల మానవ మనస్సు యొక్క సహజమైన వంపు తక్షణమే తొలగించబడదు. అయినప్పటికీ, ఇది గ్రంథం మరియు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం ద్వారా మార్గనిర్దేశం చేయబడకపోతే, ఈ మొగ్గు అర్ధంలేని మూఢనమ్మకాలకు లేదా అసహ్యకరమైన విగ్రహారాధనకు దారి తీస్తుంది. ప్రత్యామ్నాయంగా, ఇది తప్పు చేసేవారి మనస్సాక్షిని ఖాళీ ఆచారాలతో శాంతింపజేస్తుంది. చరిత్ర అంతటా, సంశయవాదులు తరచుగా అసంబద్ధమైన మరియు నిరాధారమైన తప్పులను స్వీకరించడానికి ప్రసిద్ధి చెందారు.

ఆహాజు ఆలయాన్ని పాడు చేశాడు. (17-20)
ఆహాజ్ సబ్బాత్ పవిత్రత పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించాడు, తద్వారా వివిధ రకాల తప్పులకు విస్తృత మార్గాన్ని సృష్టించాడు. అతను అస్సిరియన్ రాజు తరపున ఈ చర్యను చేపట్టాడు. ఒకప్పుడు దేవుని ఇంటిలో ఆరాధించడానికి సులభంగా యాక్సెస్ ఉన్న వ్యక్తులు తమ పొరుగువారితో ఆదరణ పొందేందుకు తమ మార్గాన్ని మళ్లించినప్పుడు, వారు తమ స్వంత పతనానికి వేగంగా దిగుతున్నారు.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |