Click to Donate & Support us or contact us for any Support 8898 318 318

Chronicles II - 2 దినవృత్తాంతములు 19

1. యూదారాజైన యెహోషాపాతు ఏ యపాయ... మును చెందకుండ యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగిరాగా

1. Then Jehoshaphat the king of Judah returned safely to his house in Jerusalem.

2. దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటనచేసెనునీవు భక్తిహీనులకు సహాయముచేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.

2. And Jehu the son of Hanani the seer went out to meet him, and said to King Jehoshaphat, "Should you help the wicked and love those who hate the LORD? Therefore the wrath of the LORD [is] upon you.

3. అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.

3. "Nevertheless good things are found in you, in that you have removed the wooden images from the land, and have prepared your heart to seek God."

4. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బేయేర్షెబానుండి ఎఫ్రాయిము మన్యమువరకు జనులమధ్యను సంచరించుచు, వారి పితరుల దేవుడైన యెహోవావైపునకు వారిని మళ్లించెను.

4. So Jehoshaphat dwelt at Jerusalem; and he went out again among the people from Beersheba to the mountains of Ephraim, and brought them back to the LORD God of their fathers.

5. మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదా వారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారి కీలాగున ఆజ్ఞాపించెను

5. Then he set judges in the land throughout all the fortified cities of Judah, city by city,

6. మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియ మమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతో కూడ నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి.

6. and said to the judges, "Take heed to what you are doing, for you do not judge for man but for the LORD, who [is] with you in the judgment.

7. యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.
అపో. కార్యములు 10:34, రోమీయులకు 2:11, ఎఫెసీయులకు 6:9, కొలస్సీయులకు 3:25, 1 పేతురు 1:17

7. "Now therefore, let the fear of the LORD be upon you; take care and do [it,] for [there is] no iniquity with the LORD our God, no partiality, nor taking of bribes."

8. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణ యించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల యిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి

8. Moreover in Jerusalem, for the judgment of the LORD and for controversies, Jehoshaphat appointed some of the Levites and priests, and some of the chief fathers of Israel, when they returned to Jerusalem.

9. వారికీలాగున ఆజ్ఞా పించెనుయెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థమనస్సుతోను మీరు ప్రవర్తింప వలెను.

9. And he commanded them, saying, "Thus you shall act in the fear of the LORD, faithfully and with a loyal heart:

10. నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయవిధులను గూర్చియు,ఆయాపట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లు వారు యెహోవాదృష్టికి ఏ అప రాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.

10. "Whatever case comes to you from your brethren who dwell in their cities, whether of bloodshed or offenses against law or commandment, against statutes or ordinances, you shall warn them, lest they trespass against the LORD and wrath come upon you and your brethren. Do this, and you will not be guilty.

11. మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతో కూడ ఉండును.

11. "And take notice: Amariah the chief priest [is] over you in all matters of the LORD; and Zebadiah the son of Ishmael, the ruler of the house of Judah, for all the king's matters; also the Levites [will be] officials before you. Behave courageously, and the LORD will be with the good."