Job - యోబు 32 | View All

1. యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.

1. So these three men gave no more answers to Job, because he seemed to himself to be right.

2. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.

2. And Elihu, the son of Barachel the Buzite, of the family of Ram, was angry, burning with wrath against Job, because he seemed to himself more right than God;

3. మరియయోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపి నందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.

3. And he was angry with his three friends, because they had been unable to give him an answer, and had not made Job's sin clear.

4. వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.

4. Now Elihu had kept quiet while Job was talking, because they were older than he;

5. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.

5. And when Elihu saw that there was no answer in the mouth of the three men, he was very angry.

6. కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట లాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.

6. And Elihu, the son of Barachel the Buzite, made answer and said, I am young, and you are very old, so I was in fear, and kept myself from putting my knowledge before you.

7. వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని;

7. I said to myself, It is right for the old to say what is in their minds, and for those who are far on in years to give out wisdom.

8. అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును.

8. But truly it is the spirit in man, even the breath of the Ruler of all, which gives them knowledge.

9. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.

9. It is not the old who are wise, and those who are full of years have not the knowledge of what is right.

10. కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.

10. So I say, Give ear to me, and I will put forward my knowledge.

11. ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై

11. I was waiting for your words, I was giving ear to your wise sayings; while you were searching out what to say,

12. మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.

12. I was taking note; and truly not one of you was able to make clear Job's error, or to give an answer to his words.

13. కావునమాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు పలుకకూడదు.

13. Take care that you do not say, Wisdom is here; God may overcome him, but not man.

14. అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి ప్రత్యుత్తర మియ్యను.

14. I will not put forward words like these, or make use of your sayings in answer to him.

15. వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు.

15. Fear has overcome them, they have no more answers to give; they have come to an end of words.

16. కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పక యున్నారు వారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?

16. And am I to go on waiting while they have nothing to say? while they keep quiet and give no more answers?

17. నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను.

17. I will give my answer; I will put forward my knowledge:

18. నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.

18. For I am full of words, I am unable to keep in my breath any longer:

19. నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది.

19. My stomach is like wine which is unable to get out; like skins full of new wine, it is almost burst.

20. నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.

20. Let me say what is in my mind, so that I may get comfort; let me give answer with open mouth.

21. మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష పాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను

21. Let me not give respect to any man, or give names of honour to any living.

22. ముఖస్తుతి చేయుట నా చేత కాదు అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.

22. For I am not able to give names of honour to any man; and if I did, my Maker would quickly take me away.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Job - యోబు 32 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యోబు మరియు అతని స్నేహితుల మధ్య జరిగిన వివాదానికి ఎలీహు అసహనానికి గురయ్యాడు. (1-5) 
యోబు సహచరులు నిశ్శబ్దంగా పడిపోయారు, అయినప్పటికీ నమ్మకంగా ఉన్నారు. అదనపు వ్యక్తులు కూడా హాజరయ్యారు. ఎలీహు యోబు పట్ల సరైన అసంతృప్తిని కలిగి ఉన్నాడు, ఎందుకంటే అతను దేవుని నీతిని మరియు దయను నిలబెట్టడం కంటే తన స్వంత కీర్తిని నిరూపించుకోవడంలో ఎక్కువ శ్రద్ధ వహించాడు. యోబు స్నేహితులు యోబుతో సూటిగా వ్యవహరించనందున ఎలీహు వారి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తగాదాలు చాలా అరుదుగా రెండు వైపులా లోపాలు లేకుండా ప్రారంభమవుతాయి మరియు చాలా అరుదుగా అవి తప్పులు కొనసాగకుండానే విప్పుతాయి. సత్యాన్వేషణలో ఉన్నవారు అన్ని దృక్కోణాల నుండి సత్యమైన మరియు ధర్మబద్ధమైన వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి, అయితే తప్పుగా ఉన్న వాటిని ఆమోదించడం లేదా సమర్ధించడం లేదు.

అతను వారిని గద్దిస్తాడు. (6-14) 
ఎలిహు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వంలో కమ్యూనికేట్ చేస్తానని, వాదనలోని రెండు వైపులా ప్రసంగిస్తూ మరియు సరిదిద్దుతున్నట్లు పేర్కొన్నాడు. ఎక్కువ అనుభవం ఉన్నవారు మొదట్లో మాట్లాడే ప్రాధాన్యతను అతను గుర్తించాడు. అయితే, దైవిక జ్ఞానం దేవుని విచక్షణతో ప్రసాదించబడింది, ఇది అతని దృక్కోణాన్ని ప్రదర్శించడానికి అతనికి ధైర్యం ఇస్తుంది. దేవుని బోధలపై దృష్టి పెట్టడం ద్వారా మరియు పరిశుద్ధాత్మపై ఆధారపడడం ద్వారా, యువకులు వృద్ధుల జ్ఞానాన్ని అధిగమించగలరు. అయినప్పటికీ, ఈ జ్ఞానం వారిని శ్రద్ధగల శ్రోతలుగా, కొలిచిన వక్తలుగా మరియు ఇతరులను ఓపికగా వినడానికి వారిని నడిపిస్తుంది.

అతను పక్షపాతం లేకుండా మాట్లాడతాడు. (15-22)
మన మాటలు దేవుని ఆత్మచే ప్రేరేపించబడ్డాయని మనకు నమ్మకం ఉన్నప్పటికీ, మన వంతు మాట్లాడే వరకు వేచి ఉండటం ముఖ్యం. దేవుడు క్రమానికి విలువ ఇస్తాడు, గందరగోళానికి కాదు. నీతిమంతుడైన వ్యక్తికి, ప్రభువును మహిమపరిచే మరియు ఇతరులను ఉద్ధరించే విధంగా మాట్లాడటం నిజంగా సంతోషదాయకం. మన సృష్టికర్తగా దేవుని గొప్పతనాన్ని ఎంత లోతుగా ఆలోచిస్తే, ఆయన కోపం మరియు న్యాయం పట్ల మనం ఎంతగా గౌరవం కలిగి ఉంటామో, మానవులకు అనుచితంగా భయపడే లేదా పొగిడే ఉచ్చులో మనం పడే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. దేవుని ఉగ్రత మరియు ఆయన దయ గురించిన ఆలోచనను మనం నిరంతరం ఉంచుకుంటే, చేతిలో ఉన్న పనితో సంబంధం లేకుండా మన బాధ్యతలను నెరవేర్చడంలో మన నిబద్ధతలో మనం తిరుగులేనివారమవుతాము.



Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |