Isaiah - యెషయా 37 | View All

1. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకుపోయి

1. When King Hezekiah listened to their message, he tore his clothes to show he was upset. Then he put on sackcloth and went to the Lord's Temple.

2. గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయాయొద్దకు పంపెను.

2. Hezekiah sent Eliakim, the palace manager, Shebna, the royal secretary, and the elders of the priests to the prophet, Isaiah son of Amoz. They wore the special clothes that showed they were sad and upset.

3. వీరు గోనెపట్ట కట్టు కొనినవారై అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరిహిజ్కియా సెలవిచ్చునదేమనగాఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.

3. They said to Isaiah, 'King Hezekiah has commanded that today will be a special day for sorrow and sadness. It will be a very sad day�as sad as when a baby should be born, but there is not enough strength for the birth.

4. జీవముగల దేవుని దూషించు టకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.

4. The commander's master, the king of Assyria, has sent him to say bad things about the living God. Maybe the Lord your God will hear it and prove the enemy is wrong. So pray for those who are still left alive.'

5. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా

5. When King Hezekiah's officers came to Isaiah,

6. యెషయా వారితో ఇట్లనెనుమీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరురాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.

6. he said to them, 'Give this message to your master, Hezekiah: The Lord says, 'Don't be afraid of what you heard from the commanders! Don't believe what those 'boys' from the king of Assyria said to make fun of me.

7. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును; వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును.

7. Look, I will send a spirit against the king of Assyria. He will get a report that will make him return to his own country. And I will cut him down with a sword in his own country.''

8. అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.

8. The commander heard that the king of Assyria had left Lachish. He found him at Libnah, fighting against that city.

9. అంతట కూషురాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.

9. Then the king of Assyria got a report that said, 'King Tirhakah of Ethiopia is coming to fight you.' So the king of Assyria sent messengers to Hezekiah again.

10. యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడియెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.

10. He told them, 'Tell King Hezekiah of Judah these things: 'Don't be fooled by the god you trust when he says, 'Jerusalem will not be defeated by the king of Assyria.'

11. అష్షూరురాజులు సకలదేశము లను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా?

11. You have heard what the kings of Assyria did to all the other countries. We destroyed them completely. Will you be saved? No!

12. నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?

12. Did the gods of those people save them? No, my ancestors destroyed them all. They destroyed Gozan, Haran, Rezeph, and the people of Eden living in Tel Assar.

13. హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి

13. Where is the king of Hamath? The king of Arpad? The king of the city of Sepharvaim? The kings of Hena and Ivvah?''

14. హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి

14. Hezekiah received the letters from the messengers and read them. Then he went up to the Lord's Temple and laid the letters out in front of the Lord.

15. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను

15. He prayed to the Lord:

16. యెహోవా, కెరూ బుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై యున్నావు.

16. Lord All-Powerful, God of Israel, you sit as King above the Cherub angels. You alone are the God who rules all the kingdoms on earth. You are the creator of heaven and earth.

17. సైన్యముల కధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకిం చుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము.

17. Lord, please listen to me. Lord, open your eyes and look at this message. Hear the words that Sennacherib sent to insult the living God!

18. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి

18. It is true, Lord. The kings of Assyria did destroy all those nations.

19. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.
గలతియులకు 4:8

19. They did throw the gods of those nations into the fire, but they were not real gods. They were only wood and stone�statues that people made. That is why the kings of Assyria could destroy them.

20. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా వని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.

20. But you are the Lord our God, so please save us from the king of Assyria. Then all the other nations will know that you are the Lord, the only God.'

21. అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెనుఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట ప్రార్థన చేసితివే.

21. Then Isaiah son of Amoz sent this message to Hezekiah. Isaiah said, 'The Lord, the God of Israel, says this, 'You prayed to me about the message that came from King Sennacherib of Assyria. I have heard you. '

22. అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణ చేయు చున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచు చున్నది.

22. So this is the Lord's message against Sennacherib: 'The virgin daughter Zion does not think you are important. She makes fun of you. She shakes her head at you and laughs behind your back.

23. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవునినే గదా?

23. But who was it that you insulted and made fun of? Who was it that you spoke against? You were speaking against the Holy One of Israel. You acted like you were great and he was nothing.

24. నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీ వీలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర ముల మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవి లోనికిని ప్రవేశించియున్నాను.

24. You sent your officers to insult the Lord. This is what you said: 'I took my many chariots up the high mountains deep inside Lebanon. I cut down its tallest cedars and its best fir trees. I have been on its highest mountain and deep inside its forests.

25. నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపోచేసియున్నాను

25. I dug wells and drank water from new places. I dried up the rivers of Egypt and walked where the water was.'

26. నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది.

26. ''How could you say this, Sennacherib? Did no one ever tell you that I, the Lord, planned these things long ago? From ancient times I decided what would happen. And now I have made it happen. I let you tear down strong cities and change them into piles of rocks.

27. కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి. విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.

27. The people living there had no power. They were afraid and confused. They were about to be cut down like grass and plants in the field. They were like grass growing on the housetops, dying before it grows tall.

28. నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.

28. I know all about your battles; I know when you rested, when you went out to war, and when you came home. I also know when you got upset at me.

29. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

29. Yes, you were upset at me. I heard your proud insults. So I will put my hook in your nose and my bit in your mouth. Then I will turn you around and lead you back the way you came.''

30. మరియయెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.

30. Then the Lord said, 'I will give you a sign to show you that these words are true. You will not be able to plant seeds this year, so next year you will eat grain that grew wild from the previous year's crop. But in the third year, you will eat grain from seeds that you planted. You will harvest your crops, and you will have plenty to eat. You will plant vineyards and eat grapes from them.

31. యూదా వంశములో తప్పించు కొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.

31. The people from the family of Judah who have escaped and are left alive will be like plants that send their roots deep into the ground and produce fruit above the ground.

32. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్య ములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును.

32. That is because a few people will come out of Jerusalem alive. There will be survivors coming from Mount Zion. ' The strong love of the Lord All-Powerful will do this.

33. కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెము నైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు.

33. So the Lord says this about the king of Assyria: 'He will not come into this city or shoot an arrow here. He will not bring his shields up against this city or build up a hill of dirt to attack its walls.

34. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.

34. He will go back the way he came. He will not come into this city. The Lord says this!

35. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.

35. I will protect this city and save it. I will do this for myself and for my servant David. '

36. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి.

36. That night the angel of the Lord went out and killed 185,000 men in the Assyrian camp. When the people got up in the morning, they saw all the dead bodies.

37. అష్షూరురాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత

37. So King Sennacherib of Assyria went back to Nineveh and stayed there.

38. అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కు చుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతుదేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.

38. One day Sennacherib was in the temple of his god Nisroch, worshiping him. His sons Adrammelech and Sharezer killed him with a sword and ran away to Ararat. So Sennacherib's son Esarhaddon became the new king of Assyria.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Isaiah - యెషయా 37 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యెషయా 37,  2 రాజులు 19కి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి, దయచేసి 2 రాజులు 19పై వ్యాఖ్యానాన్ని చూడండి.



Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |