Ezekiel - యెహెఙ్కేలు 10 | View All

1. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి అగుపడెను.

1. And as I loked, beholde in the firmament that was aboue the head of the Cherubims, as it were a Saphir stone [made] lyke the similitude of a throne, was seene ouer them.

2. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను.

2. Then spake he to hym that had the lynnen rayment vpon hym, and sayde: Crepe in betwene the wheeles that are vnder the Cherub, and take thine hand full of hotte coales out from betwene the Cherubims, and scatter them ouer the citie. And he crept in, that I myght see.

3. అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను.

3. (Nowe the Cherubims stoode vpon the ryght syde of the house when the man went in, and the cloude fylled the inner court.

4. యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.

4. And the glorie of the Lorde remoued from the Cherubims, and came vpon the doore of the house: so that the temple was full of cloudes, and the court was full of the shine of the Lordes glorie.

5. దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.

5. Yea and the sounde of the Cherubims winges was hearde into the fore court, lyke as it had ben the voyce of the almightie God when he speaketh.)

6. కెరూబుల మధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను.

6. Nowe when he had bidden the man that was clothed in lynnen, saying, Take fire from the middest of the wheeles which were vnder the Cherubims: he went, and stoode besyde the wheeles.

7. కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను;

7. Then one Cherub reached foorth his hande from betwene the Cherubims vnto the fire that was betwene the Cherubims, and toke therof, and gaue it into the handes of hym that had on the lynnen rayment: which toke it, and went out.

8. అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవ హస్తరూప మొకటి కనబడెను;

8. And vnder the wynges of the Cherubims there appeared the likenesse of a mans hande.

9. నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను.

9. I loked also, and behold foure wheeles beside the Cherubims, one wheele by one Cherub, and another by another Cherub, and the wheeles were to loke vpon after the fashion of the precious stone Tharsis.

10. ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండి యొక్కొక చక్రమునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను.

10. As touchyng their appearaunce (they were all foure of one fashion) as yf one wheele had ben in another.

11. అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను, తల యేతట్టు తిరుగునో అవి ఆ తట్టే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను.

11. When they went foorth, they went vpon their foure sides, not turnyng backe in their goyng: for which way the [head of the] first loked, after it they went, so that they turned not backe in their goyng.

12. ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను.
ప్రకటన గ్రంథం 4:8

12. And their whole bodyes, their backes, their handes, and wynges, yea and the wheeles also were full of eyes rounde about the foure wheeles.

13. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.

13. And to the wheeles, he cryed to them in my hearyng, O wheele,

14. కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
ప్రకటన గ్రంథం 4:7

14. Euery one of them had foure faces, so that the face of the first was the face of a Cherub, and the face of the seconde the face of a man, and of the thirde the face of a lion, and of the fourth the face of an egle.

15. ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.

15. And the Cherubims were lyfted vp: This is the beast that I sawe at the water of Chebar.

16. కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.

16. Nowe when the Cherubims went, the wheeles went by them: and when the Cherubims lyft vp their wynges to mount vp from the earth, the same wheeles also turned not from besides them.

17. జీవులకున్న ప్రాణము చక్రము లలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను

17. Shortly when they stoode, these stoode also, and when they were lifted vp, the wheeles lift vp them selues also with them: for the spirite of the beast was in the wheeles.

18. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా

18. Then the glorie of the Lorde departed from aboue the doore of the temple, and remayned vpon the Cherubims.

19. కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.

19. And the Cherubims flackered with their wynges, and lyft them selues vp from the earth, so that I sawe when they went, & the wheeles besides them, and they stoode at the doore of the east gate of the house of the Lorde, so the glorie of the God of Israel was vpon them on hye.

20. కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.

20. This is the beast that I sawe vnder the God of Israel by the riuer of Chebar, and I perceaued that it was the Cherubims.

21. ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.

21. Euery one had foure faces, and euery one foure wynges, and vnder their wynges the likenesse of mens handes.

22. మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.

22. Touchyng the similitude of their countenaunces, they were the very same countenaunces which I sawe at the riuer Chebar, and the selfe same appearaunces: euery one in his goyng went strayght forwarde.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

నగరం యొక్క దహనం యొక్క దృశ్యం. (1-7) 
కెరూబుల క్రింద ఉన్న చక్రాల మధ్య నుండి అగ్నిని తొలగించే చర్య, పదమూడు సంఖ్యలు, జెరూసలేంపై దేవుని రాబోయే కోపానికి ప్రతీకగా కనిపించింది. ఇది ఒక జనాభాపై తీర్పును రగిలించే దేవుని దైవిక కోపం యొక్క అగ్ని ధర్మం మరియు పవిత్రమైనది అనే భావనను తెలియజేసింది. అంతిమంగా, నిర్ణీత రోజున, మొత్తం ప్రపంచం మరియు దానిలోని ప్రతిదీ అగ్ని ద్వారా దహించబడుతుంది.

ఆలయం నుండి బయలుదేరే దైవిక మహిమ. (8-22)
భూసంబంధమైన రాజ్యం మరియు దాని వ్యవహారాల పాలనలో దైవిక ప్రావిడెన్స్ యొక్క పనితీరును ఎజెకిల్ గ్రహించాడు. దేవుడు ప్రజల నుండి అనుగ్రహాన్ని ఉపసంహరించుకున్నప్పుడు, పైన ఉన్న ఖగోళ జీవులు మరియు అన్ని భూసంబంధమైన సంఘటనలు అతని నిష్క్రమణకు దోహదం చేస్తాయి. జీవితపు ఆత్మ, దేవుని సారాంశం, దైవిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి స్వర్గంలో మరియు భూమిపై ఉన్న అన్ని జీవులకు మార్గనిర్దేశం చేస్తుంది. దేవుడు క్రమంగా తిరుగుబాటు చేసే ప్రజల నుండి దూరంగా ఉంటాడు, మరియు వారు పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే, అతను వారి వద్దకు తిరిగి రావడానికి ఇష్టపడతాడు. ప్రభువు అందుబాటులో ఉన్నప్పుడు ఆయనను వెతకాలని మరియు ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఆయనను పిలవాలని పాపులకు ఇది హెచ్చరిక రిమైండర్‌గా పనిచేస్తుంది. దేవునితో మనకున్న సంబంధంలో వినయంగా మరియు అప్రమత్తంగా నడుచుకోవాలని మనందరినీ ప్రోత్సహిస్తుంది.






Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |