Numbers - సంఖ్యాకాండము 31 | View All

1. మరియయెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి.

1. And the Lorde spake vnto Moses sayenge:

2. తరువాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా

2. auenge the childern of Israel of the Madianites and afterwarde be gathered vnto thy people.

3. మోషే ప్రజలతోమీలో కొందరు యుద్ధసన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు

3. And Moses spake vnto the folke sayenge: Harnesse some of you vnto warre and let them goo apon the Madianites and auenge the Lorde of the Madianitis.

4. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోను ప్రతి గోత్రములోనుండి వేయేసిమందిని ఆ యుద్ధమునకు పంపవలె ననెను.

4. Ye shall sende vnto the warre a thousande of euery trybe thorow out all the trybes of Israel.

5. అట్లు గోత్రమొక్కంటికి వేయిమంది చొప్పున, ఇశ్రాయేలీయుల సేనలలో నుండి పండ్రెండు వేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా

5. And there were taken oute of the thousandes of Israel .xij. thousande prepared vnto warre of euery trybe a thousande.

6. మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసి మందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను.

6. And Moses sent them a thousande of euery trybe with Phineas the sonne of Eleazer the preaste to warre and the holye vessels and the trompettes to blowe with in his honde.

7. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధముచేసి మగవారినందరిని చంపిరి.

7. And they warred agenst the Madianites as the Lorde commaunded Moses ad slewe all the males.

8. చంపబడిన యితరులుగాక మిద్యానురాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.

8. And they slewe the kynges of Madian among other that were slayne: Eui Rekem Zur Hur and Reba: fyue kynges of Madian. And they slewe Bala the sonne of Beor with the swerde.

9. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱె మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి.

9. And the childern of Israel toke all the wemen of Madian presoners and their childern and spoyled all their catell their substance and their goodes.

10. మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి.

10. And they burnt all their cities wherein they dwelt and all their castels with fyre.

11. వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి.

11. And they toke all the spoyle and all they coude catche both of men and beestes.

12. తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా

12. And they broughte the captynes and that which they had taken and all the spoyle vnto Moses and Eleazer the preast ad vnto the companye of the childern of Israel: euen vnto the hoste in ye feldes of Moab by Iordanenye to Iericho.

13. మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొనుటకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి.

13. And Moses and Eleazer the preast and all the lordes of the congregacion went out of the hoste agenst them.

14. అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను.

14. And Moses was angrie with the officers of the hoste with ye captaynes ouer thousandes and ouer hundredes which came from warre and batayle

15. మోషే వారితో మీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చితిరా?

15. and sayde vnto them: Haue ye saued the wemen alyue?

16. ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా.
యూదా 1:11, ప్రకటన గ్రంథం 2:14

16. beholde these caused the childern of Israel thorow Balam to commytt trespace agest ye Lorde by ye reason of Peor and their folowed a plage amoge ye congregacion of the Lorde.

17. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి;

17. Nowe therfore slee all the men childern and the wemen that haue lyen with men fleshlye:

18. పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.

18. But all the wemen children that haue not lyen with men kepe alyue for youre selues.

19. మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపట్టినవారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్ర పరచుకొనవలెను.

19. And lodge without the hoste .vij. dayes all that haue killed any persone and all that haue twiched any dead body and purifye both youre selues and youre presoners the .iij. daye and the .vij.

20. మీరు బట్టలన్నిటిని చర్మ వస్తువులన్ని టిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్య వస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను.

20. And sprinkle all youre raymentes and all that is made of skynnes and all worke of gootes heer ad all thynges made of wodd.

21. అప్పుడు యాజకుడగు ఎలి యాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధియేదనగా

21. And Eleazer the preast sayed vnto all ye me of warre which went out to batayle: this is the ordinaunce of the lawe which the Lorde commaunded Moses:

22. మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును

22. Gold syluer brasse yeron tyn and leed

23. అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులనుమాత్రము అగ్నిలో వేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్ర పరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను.

23. and all that maye abyde ye fyre ye shall make it goo thorow the fyre ad then it is cleane. Neuerthelater it shalbe sprinkled with sprinklinge water. And all yt soffereth not the fyre ye shall make goo thorow the water.

24. ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను.

24. And wash youre clothes the seuenth daye and then ye are cleane. And afterwarde come in to the hoste.

25. మరియయెహోవా మోషేకు ఈలాగుసెలవిచ్చెను.

25. And the Lorde spake vnto Moses sayenge:

26. నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలో నేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగాచేసి

26. take the summe of the praye that was taken both of the weme and of catell thou and Eleazer the preast and the auncient heedes of ye congregacion.

27. యుద్ధ మునకు పూనుకొని సేనగా బయలుదేరినవారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవలెను.

27. And deuyde it in to two parties betwene them that toke the warre vppo the and went out to batayle and all the congregacion.

28. మరియు సేనగా బయలు దేరిన యోధులమీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱెమేకల లోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగ ములోనుండి తీసికొని

28. And take a porcion vnto the Lorde of the men of warre whiche went oute to batayle one of fyue hundred of the wemen and of the oxen and of the asses and of the shepe:

29. యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను.

29. and ye shall take it of their halfe and geue it vnto Eleazer the preast an heueofferynge vnto the Lorde.

30. మనుష్యుల లోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱెమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను.

30. And of the halfe of ye childern of Israel take one of fyftye of ye wemen of the oxen of the asses and of the shepe and of all maner of beestes and geue them vnto the leuites which wayte apon ye habitacion of the Lorde.

31. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి.

31. And Moses and Eleazer the preast did as the Lorde commaunded Moses.

32. ఆ దోపుడుసొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది

32. And ye botye and the praye which the men of warre had caught was .vi. hundred thousande and lxxv. thousande shepe:

33. ఆరులక్షల డెబ్బదియయిదు గొఱ్ఱెమేకలును,

33. ad .lxxij. thousande oxen:

34. డెబ్బది రెండువేల పశువులును, అరువది యొక వేయి గాడిదలును,

34. and .lxi. thousande asses:

35. ముప్పది రెండు వేలమంది పురుష సంయోగమెరుగని స్త్రీలును,

35. and .xxxij. thousande wemen that had lyen by no man.

36. అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱెమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱెమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పదియారువేలు.

36. And the halfe which was the parte of the that wet out to warre was .iij. hundred thousande and .xxxvij. thousande and fyue hundred shepe:

37. వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.

37. And the Lordes parte of the shepe was .vi. hundred and .lxxv.

38. ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు,

38. And the oxen were .xxxvi. thousande of which the Lordes parte was .lxxij..

39. వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.

39. And the asses were .xxx. thousande and fyue hundred of whiche the Lordes parte was .lxi..

40. మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.

40. And the wemen were .xvi. thousande of which the Lordes parte was .xxxij. soules.

41. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను.

41. And Moses gaue that summe which was the Lordes heueofferynge vnto Eleazer the preast: as the Lorde comaunded Moses.

42. సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయుల కిచ్చెను.

42. And the other halfe of the childern of Israel whiche Moses seperated from the men of warre

43. మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందల గొఱ్ఱెమేకలును

43. (that is to wete the halfe that pertayned vnto the congregacion) was .iij. hundred thousande and .xxxvij. thousande and fyue hundred shepe:

44. ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును

44. and .xxxvi. thousande oxen:

45. పదునారువేల మంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమైయుండగా, మోషే

45. and .xxx. thousande asses and fyue hudred:

46. ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను

46. and .xvi. thousande wemen.

47. ఏబదింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయుల కిచ్చెను.

47. And Moses toke of this halfe that pertayned vnto the childern of Israel: one of euery fyftie both of the wemen and of the catell and gaue them vnto the leuites which wayted vppon the habitacion of the Lorde as the Lorde commaunded Moses.

48. అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి

48. And the officers of thousandes of the hoste the captaynes ouer the thousandes and the captaynes ouer the hundreds came forth and sayed vnto Moses:

49. నీ సేవకులమైన మేము మా చేతిక్రింద నున్న యోధులను లెక్కించి మొత్తము చేసితివిు; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు.

49. Thy servauntes haue taken the summe of the men of warre which were vnder oure hande and there lacked not one man of them.

50. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా

50. We haue therfore broughte a present vnto the Lorde what euery man founde of Iewels of golde cheyns bracelettes ringes earynges and spangels to make an attonement for oure soules before the Lorde.

51. మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారియొద్ద తీసికొనిరి.

51. And Moses and Eleazer toke the golde off them: Iewels of all maner facions.

52. సహస్రాధిపతులును శతాధిపతులును ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగార మంతయు పదునారువేల ఏడు వందల ఏబది తులములు.

52. And all the golde of the heueoffrynge of the Lord of the captaynes ouer thousandes and hundreds was .xvi. thousand .vij. hundred and .l. sycles

53. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొనియుండెను.

53. which ye me of warre had spoyled euery man for him selfe.

54. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతులయొద్ద నుండియు శతాధిపతుల యొద్దనుండియు ఆ బంగారును తీసికొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి.

54. And Moses and Eleazer ye preast toke the golde of the captaynes ouer the thousandes and ouer the hundreds and brought it in to the tabernacle of witnesse: to be a memoriall vnto ye childern of Israel before ye Lorde.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 31 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మిద్యానుతో యుద్ధం. (1-6)
ఎవరైనా దేవుడు చెప్పకుండా ప్రతీకారం తీర్చుకున్నా, ఎక్కువ అధికారం కావాలన్నా, కోపం వచ్చినా యుద్ధం మొదలు పెట్టినా దానికి దేవుడికి సమాధానం చెప్పాలి. కానీ మంచి కారణంతో పోరాడమని దేవుడు ఒక సమూహానికి చెబితే, అది సరే. ఇశ్రాయేలీయులు దేవుడు కోరుకున్నది చేస్తున్నందున పోరాడి గెలవడానికి దేవుని అనుమతి ఉంది. ఇశ్రాయేలీయులు పోరాడుతున్న వ్యక్తులు శిక్షకు అర్హులు కాదని ఎవరైనా అనుకుంటే, వారు దేవుణ్ణి ఇష్టపడరు మరియు అతని శత్రువుల పక్షంగా ఉంటారు. పాపం పెద్ద విషయం అని ప్రజలు అనుకోకపోవచ్చు, కానీ దేవుడు దానిని నిజంగా ద్వేషిస్తాడు. అందుకే కొన్నిసార్లు మొత్తం దేశాలు నిజంగా చెడ్డవిగా శిక్షించబడుతున్నాయి. 

బిలాము చంపబడ్డాడు. (7-12) 
ఇశ్రాయేలీయులు మిద్యానీయులకు సహాయం చేసిన మిద్యాను రాజులను మరియు బిలామును ఓడించారు. బిలాము ఇశ్రాయేలు గురించి మంచి విషయాలు చెప్పాడు, కానీ అతను వారి శత్రువులతో కలిసి పనిచేశాడు. అతను తన చెడు చర్యలకు శిక్షించబడ్డాడు. హోషేయ 4:5 వారు తల్లులు మరియు పిల్లలను ఖైదీలుగా తీసుకున్నారు. వారు తమ ఇళ్లకు మరియు కోటలకు నిప్పంటించారు మరియు వారి స్థావరానికి తిరిగి వెళ్లారు. 

పాపానికి కారణమైన వారు చంపబడ్డారు. (13-38) 
యుద్ధ సమయంలో, మహిళలు మరియు పిల్లలను గాయపరచకూడదని నియమాలు ఉన్నాయి. అయితే ఎవరైనా తప్పు చేస్తే స్త్రీ అయినా, పురుషుడైనా శిక్ష అనుభవించాల్సిందే. ఒక నిర్దిష్ట యుద్ధంలో, స్త్రీలు చాలా చెడ్డవారు మరియు చెడు పనులు చేశారు. కానీ పిల్లలను తప్పించారు కాబట్టి వారు మంచి వ్యక్తులుగా ఎదగగలిగారు. చెడు పనులకు దూరంగా ఉండటం మరియు చెడు పనులకు ఇతరులను ప్రలోభపెట్టకూడదని ఈ కథ మనకు బోధిస్తుంది. ఆడవాళ్ళను, పిల్లలను చెడు కారణాలతో ఉంచకుండా, బానిసలుగా మార్చడం గతంలో జరిగింది. కొన్నిసార్లు దేశం మొత్తం చెడ్డ పనులు చేస్తే, పిల్లలు కూడా జరిగే చెడు పనుల వల్ల ప్రభావితమవుతారు. కానీ పిల్లలు చనిపోయినా, వారు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. 

ఇశ్రాయేలీయుల శుద్ధీకరణ. (39-24) 
ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో తమను తాము పరిశుభ్రంగా మరియు మంచిగా మార్చుకోవడానికి కొన్ని నియమాలను పాటించాలి. దేవుడు ఓకే అని యుద్ధం చేస్తున్నప్పటికీ, వారు ఇంకా తమ శిబిరం నుండి సమయం కేటాయించవలసి వచ్చింది మరియు ఏడు రోజులు దేనినీ ముట్టుకోలేదు. ఇతరులను బాధపెట్టడం ఎంత చెడ్డదో వారు గుర్తుంచుకుంటారు కాబట్టి ఇది జరిగింది. మిద్యానీయులు అని పిలువబడే వారు పోరాడుతున్న ప్రజల నుండి వారు తీసుకున్న వస్తువులను వారు ఉపయోగించుకునే ముందు వాటిని కూడా శుభ్రం చేయాలి.

పాడు విభజన. (25-47)
దేవుడు మనకున్న దానిలో కొంత భాగాన్ని అడుగుతాడు. అతను కొంతమంది వ్యక్తుల నుండి ఇతరుల కంటే ఎక్కువ అడుగుతాడు, వారి వద్ద ఉన్నదానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఇతర మార్గాల్లో దేవుణ్ణి సేవించలేకపోతే, ఆయన పట్ల మనకున్న ప్రేమను చూపించడానికి మనం ఎక్కువ డబ్బు లేదా వస్తువులను ఇవ్వాలి. 

సమర్పణలు. (48-54)
ఇశ్రాయేలీయులు చాలా మంది శత్రువులతో యుద్ధంలో విజయం సాధించడం ద్వారా అద్భుతమైన పని చేసారు, మరియు వారు ఎవరినీ కోల్పోలేదు లేదా ఎవరికీ హాని కలిగించలేదు. వారు ఏదైనా తప్పు చేసినందుకు క్షమించమని మరియు వాటిని సురక్షితంగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వారు కనుగొన్న నిధిలో కొంత భాగాన్ని దేవునికి ఇచ్చారు.




Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |