Matthew - మత్తయి సువార్త 10 | View All

1. ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను.

2. ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను;

3. ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి;

మీకా 7:6 కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.

4. కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

5. యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని

6. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి.

యిర్మియా 50:6 నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱెలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి.

7. వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.

8. రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.

9. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి;

10. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?

సంఖ్యా 18:31 మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము.

11. మరియు మీరు ఏపట్టణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.

12. ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.

13. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.

14. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.

15. విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.

ఆది 18:20-192 మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకనునేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను.అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెను దుష్టులతో కూడ నీతిమంతులను నాశనము చేయుదువా?ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండిన యెడల దానిలో నున్న యేబదిమంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా?ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడుయెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెనుఅందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదుగురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను;అతడింక ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగాఅతడు ప్రభువు కోపపడని యెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను.అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగాఅతడు ప్రభువు కోపపడని యెడల నేనింకొక మారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయకయుందుననెను.యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.

16. ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.

17. మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,

18. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.

19. వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.

20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.

21. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.

మీకా 7:6 కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.

22. మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.

23. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.

24. శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు.

25. శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.

26. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.

27. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రక టించుడి.

28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

29. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.

30. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి

1సమూ 14:45 అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.

31. గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.

32. మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.

33. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.

34. నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.

35. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.

మీకా 7:6 కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.

36. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.

37. తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;

ద్వితి 33:9 అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి.

38. తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.

39. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

40. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.

41. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.

1రాజులు 17:9-24 నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెల విచ్చితిని.అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచినాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెనుభయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.భూమిమీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదనిఅందుకామెనీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటి వారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి.యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.అటుతరువాత ఆ యింటి యజ మానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడాయెను.ఆమె ఏలీయాతోదైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగాఅతడునీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టియెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహో వాకు మొఱ్ఱపెట్టిఆ చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొనియెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగాయెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి - ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగాఆ స్త్రీ ఏలీయాతోనీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదు ననెను.

2రాజులు 4:8-37 ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీభోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.కాగా ఆమె తన పెనిమిటిని చూచి మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగు దును.కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచిఈషూనేమీయురాలిని పిలువు మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడుఅతడునీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామెనేను నా స్వజనులలో కాపుర మున్నాననెను.ఎలీషాఆమె నేనేమి చేయకోరుచున్నదని వాని నడుగగా గేహజీఆమెకు కుమారుడు లేడు; మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను.అందుకతడుఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను.ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషామరుసటి యేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండు నని ఆమెతో అనెను. ఆమె ఆ మాట వినిదైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను.పిమ్మట ఆ స్త్రీ గర్భ వతియై మరుసటి యేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను.ఆ బిడ్డ యెదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారియొద్దనున్న తన తండ్రి దగ్గరకుపోయి అక్కడ ఉండగా వాడునా తలపోయెనే నా తలపోయెనే, అని తన తండ్రితో చెప్పెను.అతడు వానిని ఎత్తుకొని తల్లియొద్దకు తీసికొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగావాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లియొద్దకు తీసికొనిపోయెను. పిల్లవాడు మధ్యాహ్నమువరకు తల్లి తొడమీద పండుకొని యుండి చనిపోయెను.అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చిఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము;నేను దైవజనునియొద్దకు పోయి వచ్చెదనని తన పెని మిటితో ఆమె యనగాఅతడునేడు అమావాస్య కాదే; విశ్రాంతి దినముకాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమెనేను పోవుట మంచిదని చెప్పిగాడిదకు గంతకట్టించి తాను ఎక్కి తన పని వానితోశీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చి తేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను.ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనునియొద్దకు వచ్చెను. దైవజనుడు దూరమునుండి ఆమెను చూచి అదిగో ఆ షూనేమీయురాలు;నీవు ఆమెను ఎదు ర్కొనుటకై పరుగున పోయినీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామెసుఖముగా ఉన్నామని చెప్పెను.పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనునియొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టు కొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడుఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను.అప్పుడు ఆమెకుమారుడు కావలెనని నేను నా యేలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవి చేయగాఅతడునీ నడుము బిగించు కొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.తల్లి ఆ మాట వినియెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను.గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కన బడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను.ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచితానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసిమంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.అప్పుడతడు గేహజీని పిలిచిఆ షూనే మీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలి చెను. ఆమె అతనియొద్దకు రాగా అతడునీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను.అంతట ఆమె లోప లికివచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొనిపోయెను.

42. మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అపొస్తలులు పిలిచారు. (1-4) 
"అపొస్తలుడు" అనే పదానికి దూత అనే అర్థం ఉంది, ఎందుకంటే ఈ వ్యక్తులు క్రీస్తు యొక్క దూతలు, అతని రాజ్యం గురించి అతని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి పంపబడ్డారు. వివిధ రకాల వ్యాధులను నయం చేసే అధికారాన్ని క్రీస్తు వారికి ప్రసాదించాడు. సువార్త యొక్క దయలో, ప్రతి గాయానికి ఒక పరిష్కారం ఉంది, ప్రతి బాధకు ఒక పరిహారం ఉంది. క్రీస్తు శక్తి ద్వారా పరిష్కరించబడని ఆధ్యాత్మిక రుగ్మత ఏదీ లేదు. వారి పేర్లు డాక్యుమెంట్ చేయబడ్డాయి, ఇది వారి గౌరవానికి చిహ్నం; అయినప్పటికీ, వేడుకకు వారి గొప్ప కారణం ఏమిటంటే, వారి పేర్లు స్వర్గంలో చెక్కబడి ఉన్నాయి, అయితే ప్రపంచంలోని ప్రభావవంతమైన వ్యక్తుల యొక్క ప్రసిద్ధ పేర్లు మరుగున పడిపోతాయి.

అపొస్తలులు ఉపదేశించి పంపారు. (5-15) 
యూదులు సువార్తను తిరస్కరించే వరకు అన్యజనులు దానిని స్వీకరించకూడదు. ఈ పరిమితి అపొస్తలులకు వారి ప్రారంభ మిషన్ సమయంలో వర్తించబడుతుంది. వారు ఎక్కడికి వెళ్లినా, వారి సందేశం స్థిరంగా ఉంటుంది: "పరలోక రాజ్యం సమీపంలో ఉంది." వారి బోధన విశ్వాసాన్ని స్థాపించడం, రాజ్యంపై నిరీక్షణను పెంపొందించడం, పరలోక విషయాల పట్ల ప్రేమను పెంపొందించడం మరియు భూసంబంధమైన విషయాల పట్ల అసహ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆసన్నత ప్రజలు ఆలస్యం చేయకుండా సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. క్రీస్తు వారి బోధనలను ధృవీకరించడానికి అద్భుతాలు చేసే శక్తిని వారికి ఇచ్చాడు, ఇది దేవుని రాజ్యం రాకతో తగ్గిపోయింది. ఆధ్యాత్మికంగా అనారోగ్యంతో ఉన్న ఆత్మల స్వస్థత మరియు పాపంలో చిక్కుకున్న వారి పునరుజ్జీవనాన్ని అద్భుతాలు ప్రదర్శించాయి.
ఆత్మల స్వస్థత మరియు రక్షణ కొరకు మనం ఉచిత కృప యొక్క సువార్తను ప్రకటించినప్పుడు, మనం కేవలం కిరాయి సైనికులుగా కనిపించకుండా జాగ్రత్త వహించాలి. అపొస్తలులకు తెలియని పట్టణాలు మరియు నగరాల్లో ఎలా ప్రవర్తించాలో నిర్దిష్ట మార్గదర్శకత్వం అందించబడింది. క్రీస్తు రాయబారులుగా మరియు శాంతి దూతలుగా, వారు తమ సందేశాన్ని అత్యంత పాపాత్ములైన వ్యక్తులకు కూడా అందజేయడం బాధ్యత వహించారు, అయినప్పటికీ వారు ప్రతి ప్రదేశంలో అత్యంత స్వీకరించే హృదయాలను వెతకడానికి ప్రోత్సహించబడ్డారు. మనము ప్రతి ఒక్కరి కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థించాలి మరియు అందరికీ మర్యాదగా ఉండాలి.
తమ సందేశాన్ని తిరస్కరించిన వారికి ఎలా ప్రతిస్పందించాలో కూడా అపొస్తలులకు సూచించబడింది. వారు దేవుని పూర్తి సలహాను ప్రకటించవలసి వచ్చింది, మరియు ఈ దయగల సందేశానికి చెవిటి చెవికి మారిన వారికి వారు ఉన్న ప్రమాదకరమైన స్థితి గురించి తెలుసుకోవాలి. ఇది విన్నవారందరూ హృదయపూర్వకంగా తీసుకోవలసిన గంభీరమైన పాఠం. సువార్త, విశేషాధికారాల సమృద్ధి అంతిమంగా ఒకరి జవాబుదారీతనం మరియు ఖండనను పెంచుతుంది.

అపొస్తలులకు సూచనలు. (16-42)
మన ప్రభువు తన శిష్యులను హింసకు సిద్ధంగా ఉండమని హెచ్చరించాడు. ప్రాపంచిక లేదా రాజకీయ విషయాలలో ప్రమేయం, చెడు లేదా స్వార్థం యొక్క రూపాన్ని కలిగించే ఏవైనా చర్యలు మరియు ఏవైనా అండర్హ్యాండ్ వ్యూహాలతో సహా వారి ప్రత్యర్థులకు ప్రయోజనాన్ని అందించే దేనికైనా దూరంగా ఉండాలని వారికి సలహా ఇవ్వబడింది. వారు ఆశ్చర్యానికి గురికాకుండా నిరోధించడానికి మాత్రమే కాకుండా వారి విశ్వాసాన్ని బలపర్చడానికి క్రీస్తు ఈ పరీక్షలను ఊహించాడు. వారు అనుభవించే బాధలను మరియు ఆ బాధలకు మూలాలను వారికి తెలియజేశాడు. ఇది మనకు తన సేవలో అత్యంత సవాలుగా ఉన్న అంశాలను బహిర్గతం చేయడంలో క్రీస్తు యొక్క న్యాయమైన మరియు విశ్వసనీయతను ప్రదర్శిస్తుంది. కమిట్ అయ్యే ముందు ఖర్చును జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా మనల్ని కూడా అలాగే చేయమని ప్రోత్సహిస్తున్నాడు.
హింసించేవారు మృగాల కంటే మరింత క్రూరంగా ఉంటారు, వారి స్వంత రకమైన వేట. తరచుగా, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న శత్రుత్వం కారణంగా ప్రేమ మరియు కర్తవ్యం యొక్క బలమైన బంధాలు విచ్ఛిన్నమవుతాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల చేతుల్లో బాధ ముఖ్యంగా బాధాకరం. క్రీస్తు యేసులో దైవభక్తి గల జీవితాన్ని గడపాలని ఎంచుకునే ఎవరైనా హింసను ఎదుర్కొంటారని స్పష్టంగా తెలుస్తుంది మరియు అనేక కష్టాల ద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని మనం ఎదురుచూడాలి. సమస్య యొక్క ఈ అంచనాలతో పాటు, విచారణ సమయాలకు మార్గదర్శకత్వం మరియు ఓదార్పు కూడా ఉన్నాయి.
క్రీస్తు శిష్యులు శత్రుత్వంతో వ్యవహరిస్తారు మరియు పాముల వలె హింసించబడతారు, వారి విధ్వంసం వెతకాలి. అలాంటి పరిస్థితుల్లో పావురాలలా అమాయకంగా ఉంటూనే వారికి పాముల జ్ఞానం అవసరం. వారు ఇతరులకు హాని కలిగించకుండా ఉండటమే కాకుండా చెడు సంకల్పాన్ని కూడా కలిగి ఉండకూడదు. వివేకవంతమైన జాగ్రత్త అవసరం, కానీ అది ఆత్రుత, దిగ్భ్రాంతికరమైన ఆలోచనలకు దారితీయకూడదు; ఈ ఆందోళనను దేవుని చేతుల్లో ఉంచాలి.
క్రీస్తు శిష్యులు ముఖ్యంగా గొప్ప ఆపద సమయాల్లో మంచిగా మాట్లాడటం కంటే మంచి చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. వారు ప్రమాద మార్గాన్ని తప్పించుకోవచ్చు కానీ తమ కర్తవ్యాన్ని వదులుకోరు. వారు తప్పించుకోవడానికి పాపాత్మకమైన లేదా చట్టవిరుద్ధమైన మార్గాలను ఆశ్రయించకూడదు, ఎందుకంటే అది దేవుడు అందించిన అవకాశం కాదు. ప్రజల భయం ఒక ఉచ్చును సృష్టిస్తుంది, గందరగోళం మరియు పాపంలో చిక్కుకుపోతుంది, కాబట్టి దానిని ప్రతిఘటించాలి మరియు వ్యతిరేకంగా ప్రార్థించాలి.
కష్టాలు, బాధలు మరియు హింసలు దేవునికి తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను లేదా ఆయన పట్ల వారి ప్రేమను చల్లార్చలేవు. శరీరం మరియు ఆత్మ రెండింటినీ నరకానికి గురిచేయగల దేవునికి మనం భయపడాలి. సువార్త సిద్ధాంతం అందరికీ సంబంధించినది కాబట్టి శిష్యులు తమ సందేశాన్ని బహిరంగంగా ప్రకటించాలి. అపొస్తలుల కార్యములు 20:27లో చెప్పబడినట్లుగా, వారు దేవుని యొక్క మొత్తం సలహాను తెలియజేయాలి. వారు ఎందుకు హృదయపూర్వకంగా ఉండాలో వివరించడం ద్వారా క్రీస్తు వారికి భరోసా ఇస్తాడు: వారి బాధలు అతని సువార్తను వ్యతిరేకించే వారికి సాక్ష్యంగా పనిచేస్తాయి. దేవుడు తన తరపున మాట్లాడమని మనలను పిలిచినప్పుడు, ఏమి చెప్పాలో బోధించడానికి మనం ఆయనపై ఆధారపడవచ్చు. మా కష్టాల ముగింపుపై ఆశాజనకమైన దృక్పథం కష్ట సమయాల్లో గణనీయమైన మద్దతును అందిస్తుంది; వారు బాధలను భరించగలరు, ఎందుకంటే వారు దాని ద్వారా స్థిరపడతారు. దేవుని బలం ప్రతి రోజు డిమాండ్లతో సరిపోతుంది.
ఈ ప్రకరణం అన్ని జీవుల పట్ల, పిచ్చుకల పట్ల కూడా దేవుని శ్రద్ధ యొక్క లోతును నొక్కి చెబుతుంది. ఇది దేవుని ప్రజల భయాలను నిశ్శబ్దం చేస్తుంది, అవి చాలా పిచ్చుకల కంటే ఎక్కువ విలువైనవని వారికి గుర్తుచేస్తుంది మరియు దేవుడు తన ప్రజల గురించి వారి తలపై ఉన్న వెంట్రుకల సంఖ్యను కూడా తెలుసుకొని నిశితంగా పరిశీలిస్తాడు. మన కర్తవ్యం క్రీస్తును విశ్వసించడం మాత్రమే కాదు, ఆ విశ్వాసాన్ని ప్రకటించడం, పిలిచినప్పుడు బాధలో కూడా, అలాగే ఆయనకు సేవ చేయడం. ఇక్కడ ప్రస్తావించబడిన క్రీస్తు యొక్క తిరస్కరణ నిరంతర తిరస్కరణకు సంబంధించినది, మరియు పేర్కొన్న ఒప్పుకోలు విశ్వాసం మరియు ప్రేమ యొక్క నిజమైన మరియు అచంచలమైన వ్యక్తీకరణను సూచిస్తుంది. నిజమైన మతం అమూల్యమైనది మరియు దాని సత్యాన్ని విశ్వసించే వారు ఇష్టపూర్వకంగా మూల్యం చెల్లిస్తారు, మిగతావన్నీ దానికి లొంగిపోయేలా అనుమతిస్తాయి. క్రీస్తు మనలను బాధల ద్వారా తనతో పాటు మహిమకు నడిపిస్తాడు. ఈ ప్రస్తుత జీవితంతో కనీసం అనుబంధం లేని వారు రాబోయే జీవితానికి ఉత్తమంగా సిద్ధంగా ఉంటారు. క్రీస్తు శిష్యుల పట్ల చూపే అతిచిన్న దయ కూడా, సామర్థ్యం మరియు అవసరం ద్వారా ప్రేరేపించబడినప్పుడు, అంగీకరించబడుతుంది. మేము దేవుని నుండి ఏమీ సంపాదించలేము కాబట్టి వారు ప్రతిఫలానికి అర్హులని క్రీస్తు చెప్పలేదు, కానీ వారు దేవుని నుండి దయగల బహుమతిగా బహుమతిని పొందుతారు. క్రీస్తుపై మనకున్న విశ్వాసాన్ని ధైర్యంగా ప్రకటించుకుందాం మరియు అన్ని విషయాలలో ఆయన పట్ల మనకున్న ప్రేమను ప్రదర్శిస్తాం.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |