John I - 1 యోహాను 5 | View All

1. యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు. పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును.

1. యేసే క్రీస్తు అని నమ్మినవాణ్ణి దేవుడు తన సంతానంగా పరిగణిస్తాడు. తండ్రిని ప్రేమించిన ప్రతీ ఒక్కడు కుమారుణ్ణి ప్రేమించినట్లుగా పరిగణింపబడతాడు.

2. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము.

2. దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించటం వల్ల ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తున్నట్లు మనము తెలుసుకోగలము.

3. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
ద్వితీయోపదేశకాండము 30:11

3. ఆయన ఆజ్ఞల్ని పాటించి మనము మన ప్రేమను వెల్లడి చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు.

4. దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే

4. దేవుని కారణంగా జన్మించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము.

5. యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?

5. యేసు దేవుని కుమారుడని విశ్వసించే వాళ్ళే ప్రపంచాన్ని జయిస్తారు.

6. నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమేగాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.

6. యేసు క్రీస్తు నీళ్ళ ద్వారా, రక్తంద్వారా వచ్చాడు. ఆయన నీళ్ళ ద్వారా మాత్రమే రాలేదు. నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా కూడా వచ్చాడు. ఆత్మ సత్యవంతుడు. అందుకే ఆ ఆత్మ సాక్ష్యం చెపుతున్నాడు.

7. సాక్ష్య మిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును,రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి యున్నారు.

7. సాక్ష్యం చెప్పేవారు ముగ్గురున్నారు.

8. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.

8. ఆత్మ, నీళ్లు, రక్తం ఈ ముగ్గురూ ఒకే సాక్ష్యాన్ని చెపుతున్నారు.

9. దేవుని కుమారునియందు విశ్వాస ముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారునిగూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే.

9. [This verse may not be a part of this translation]

10. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది.

10. దేవుని కుమారుని పట్ల విశ్వాసమున్నవాడు ఈ సాక్ష్యాన్ని నమ్ముతాడు. దేవుడు తన కుమారుని విషయంలో యిచ్చిన సాక్ష్యం నమ్మనివాడు దేవుడు అసత్యవంతుడని నిందించినవాడౌతాడు.

11. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే.

11. ఆ సాక్ష్యం యిది! దేవుడు మనకు నిత్యజీవం యిచ్చాడు. ఈ జీవము ఆయన కుమారునిలో ఉంది.

12. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను.

12. కుమారుణ్ణి స్వీకరించిన వానికి ఈ జీవము లభిస్తుంది. ఆ కుమారుణ్ణి స్వీకరించనివానికి జీవం లభించదు.

13. ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.

13. దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు నిత్యజీవం లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియాలని యివన్నీ మీకు వ్రాస్తున్నాను.

14. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము.

14. దేవుణ్ణి ఆయన యిష్టానుసారంగా మనము ఏది అడిగినా వింటాడు. దేవుణ్ణి సమీపించటానికి మనకు హామీ ఉంది.

15. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు.

15. మనమేది అడిగినా వింటాడని మనకు తెలిస్తే మన మడిగింది మనకు లభించినట్లే కదా!

16. సకల దుర్ణీతియు పాపము; అయితే మరణకరము కాని పాపము కలదు.

16. మరణం కలిగించే పాపము తన సోదరుడు చెయ్యటం చూసిన వాడు తన సోదరుని కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అతనికి క్రొత్త జీవితం యిస్తాడు. ఎవరి పాపం మరణానికి దారితీయదో వాళ్ళను గురించి నేను మాట్లాడుతున్నాను. మరణాన్ని కలిగించే పాపం విషయంలో ప్రార్థించమని నేను చెప్పటం లేదు.

17. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.

17. ఏ తప్పు చేసినా పాపమే. కాని మరణానికి దారితీయని పాపాలు కూడా ఉన్నాయి.

18. మనము దేవుని సంబంధులమనియు,లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.

18. దేవుని బిడ్డగా జన్మించిన వాడు పాపం చెయ్యడని మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించిన వాణ్ణి దేవుడు కాపాడుతాడు. సైతాను అతణ్ణి తాకలేడు.

19. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చిమనకు వివేక మనుగ్రహించియున్నాడని యెరుగుదుము.

19. మనము దేవుని సంతానమని, ప్రపంచమంతా సైతాను ఆధీనంలో ఉందని మనకు తెలుసు.

20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.

20. దేవుని కుమారుడు వచ్చి నిజమైన వాడెవడో తెలుసుకొనే జ్ఞానాన్ని మనకు యిచ్చాడు. ఇది మనకు తెలుసు. మనము నిజమైన వానిలో ఐక్యమై ఉన్నాము. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో కూడా ఐక్యమై ఉన్నాము. ఆయన నిజమైన దేవుడు. ఆయనే నిత్య జీవం.

21. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.

21. బిడ్డలారా! విగ్రహాలకు దూరంగా ఉండండి.



Shortcut Links
1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |