ఎఱ్ఱ సముద్రము (ఎఱ్ఱ సముద్రము)


ఐగుప్తునకు, అరేబియాకును మధ్యమున నున్న సముద్రము

Bible Results

"ఎఱ్ఱ సముద్రము" found in 9 books or 18 verses

నిర్గమకాండము (4)

10:19 అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలవలేదు.
15:4 ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి
15:22 మోషే ఎఱ్ఱ సముద్రమునుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.
23:31 మరియు ఎఱ్ఱ సముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు.

సంఖ్యాకాండము (2)

33:10 ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి.
33:11 ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.

యెహోషువ (2)

4:24 మీరు ఎల్లప్పుడును మీ దేవు డైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్ళను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.
24:6 నేను ఐగుప్తులోనుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోను రౌతులతోను మీ తండ్రులను ఎఱ్ఱసముద్రమువరకు తరిమిరి.

న్యాయాధిపతులు (1)

11:16 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.

నెహెమ్యా (1)

9:9 నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.

కీర్తనల గ్రంథము (5)

106:7 ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి.
106:9 ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలములలో నడిపించెను.
106:22 ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.
136:13 ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును.
136:15 ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.

యిర్మియా (1)

49:21 వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.

అపో. కార్యములు (1)

7:36 ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.

హెబ్రీయులకు (1)

11:29 విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"ఎఱ్ఱ సముద్రము" found only in one lyric.

యుద్ధము యెహొవాదే

Sermons and Devotions

Back to Top
"ఎఱ్ఱ సముద్రము" found only in one content.

మిమ్మును అనాధలనుగా విడువను
నిర్గమ 3:8 “... పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను”. ఇది అద్వితీయ సత్యదేవుని మనసు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం, నాలుగు వందల ముప్పై సంవత్సరములు కఠిన బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులు పెట్టిన మూలుగులు ఆ నీతి స్వరూపుడగు తండ్రి విని, తాను ప్రేమించిన వారిని రక్ష

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , యాకోబు , కోరహు , ఆత్మ , అహరోను , అబ్రాహాము , ప్రేమ , యెరూషలేము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , సెల , సాతాను , ఇశ్రాయేలు , ప్రార్థన , పౌలు , సొలొమోను , యూదా , దేవ�%B , రాహేలు , రాహాబు , లోతు , బబులోను , సీయోను , యాషారు , ఇస్కరియోతు , జక్కయ్య , స్వస్థ , ఇస్సాకు , యెహోషాపాతు , ఐగుప్తు , సమరయ , సారెపతు , యోకెబెదు , నోవహు , అతల్యా , అన్న , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , బేతేలు , ఎలియాజరు , కెజీయా , తెగులు , మగ్దలేనే మరియ , గిల్గాలు , కూషు , ఏలీయా , యోబు , రోగము , అబ్దెయేలు , ఆషేరు , కనాను , ఆసా , తీతు , అకుల , వృషణాలు , రక్షణ , బేతనియ , ఎఫ్రాయిము , హిజ్కియా , సీమోను , దొర్కా , మార్త , సబ్బు , బెసలేలు , యెహోవా వశము , యొర్దాను , తామారు , యెఫ్తా , ఎలీషా , ఏఫోదు , హాము , పరదైసు , కయీను , ఊజు , అంతియొకయ , బర్జిల్లయి , రిబ్కా ,

Telugu Keyboard help