ఐగుప్తు (ఐగుప్తు)


రెండు ఇరుకు మార్గములు లేక రెండంతల యిబ్బంది, ఆఫ్రికా ఖండము నందు ఉత్తర భాగమున నైలునది ప్రవహించు ఒక గొప్ప దేశము

Bible Results

"ఐగుప్తు" found in 31 books or 518 verses

ఆదికాండము (72)

12:10 అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.
12:11 అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును.
12:14 అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి
13:1 అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్లెను.
13:10 లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను.
15:18 ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా
21:21 అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.
25:18 వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు అతడు తన సహోదరులందరి యెదుట నివాసమేర్పరచుకొనెను.
26:2 అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.
37:25 వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.
37:28 మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.
37:36 మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి.
39:1 యాసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను.
40:1 అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి
40:5 వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కలకనెను.
41:8 తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను.
41:19 మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు.
41:29 ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.
41:30 మరియు కరవుగల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును.
41:33 కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను.
41:34 ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను అయిదవ భాగము తీసికొనవలెను.
41:36 కరవుచేత ఈ దేశము నశించిపోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను.
41:41 మరియు ఫరో - చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను.
41:43 తన రెండవ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు - వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.
41:44 మరియు ఫరో యోసేపుతో - ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.
41:46 యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.
41:48 ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను.
41:53 ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత
41:54 యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను.
41:55 ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో - మీరు యోసేపు నొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను.
41:56 కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను;
41:57 మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.
42:1 ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.
42:2 మరియు అతడు - చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా
42:3 యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.
43:2 వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి - మీరు మరల వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా
43:15 ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.
45:4 అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపున
45:8 కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటివారి కందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను.
45:9 మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో - నీ కుమారుడైన యోసేపు - దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు;
45:13 ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి
45:18 మీ తండ్రిని మీ యింటివారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకెచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు.
45:19 నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లల కొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి.
45:20 ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా
45:23 అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తినుబండములను మోయుచున్న పది ఆడుగాడిదలను పంపెను.
45:25 వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి
45:26 యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.
46:3 ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్పజనముగా చేసెదను.
46:4 నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యియుంచునని సెలవియ్యగా
46:6 వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి.
46:7 అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను.
46:8 యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే;
46:20 యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.
46:26 యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు.
46:27 ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.
47:6 ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచిన యెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను
47:11 ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను.
47:13 కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను.
47:14 వచ్చిన వారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను.
47:15 ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపు నొద్దకు వచ్చి - మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి.
47:20 అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరో కొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక, భూమి ఫరోది ఆయెను.
47:21 అతడు ఐగుప్తు పొలిమేరలయొక్క యీ చివరనుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను.
47:26 అప్పుడు అయిదవ భాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు.
47:27 ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి.
47:28 యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.
47:29 ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి - నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.
47:30 నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను.
48:5 ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు.
50:7 కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను; అతనితో ఫరో యింటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును
50:14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులును అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చిరి.
50:22 యోసేపు అతని తండ్రి కుటుంబపువారును ఐగుప్తులో నివసించిరి, యోసేపు నూటపది సంవత్సరములు బ్రదికెను.
50:26 యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.

నిర్గమకాండము (106)

1:1 ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను.
1:5 అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
1:8 అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను.
1:15 మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి
1:17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా
1:18 ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? ఈ పనియేల చేసితిరి అని అడిగెను.
1:19 అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.
2:23 ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.
3:7 మరియు యెహోవా యిట్లనెను - నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.
3:10 కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.
3:11 అందుకు మోషే - నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా
3:12 ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.
3:16 నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని,
3:17 ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.
3:18 వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజు నొద్దకు వెళ్లి అతని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.
3:19 ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;
3:20 కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.
4:18 అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి సెలవైన యెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.
4:19 అంతట యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లుమని మిద్యానులో మోషేతో చెప్పగా,
4:20 మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.
4:21 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. అతడు ఈ జనులను పోనియ్యడు.
5:4 అందుకు ఐగుప్తు రాజుమోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను.
5:12 అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్య కాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదిరిపోయిరి.
6:11 ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.
6:13 మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారి కాజ్ఞాపించెను.
6:26 ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.
6:27 ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే.
6:28 ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున
6:29 యెహోవా నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా
7:3 అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను.
7:4 ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను.
7:5 నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రా యేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.
7:11 అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.
7:19 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు అహరోనుతో నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువుల మీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.
7:21 ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను.
7:22 ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములవలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను.
8:5 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనును చూచి నీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువలమీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా
8:6 అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.
8:7 శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.
8:16 అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.
8:17 అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను¸
8:24 యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.
9:4 అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని
9:9 అప్పుడు అది ఐగుప్తు దేశమంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను.
9:22 యెహోవా - నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను.
9:23 మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.
9:24 ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.
9:25 ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను.
10:7 అప్పుడు ఫరో సేవకులు అతని చూచి - ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకా తెలియదా అనిరి.
10:12 అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చునట్లు ఐగుప్తుదేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తుదేశము మీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటని తినివేయునని చెప్పెను.
10:13 మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.
10:14 ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను.
10:15 ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు.
10:19 అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలవలేదు.
10:21 అందుకు యెహోవా మోషేతో - ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను.
10:22 మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడు దినములు గాఢాంధకార మాయెను.
11:1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను - ఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.
11:3 యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.
11:4 మోషే ఫరోతో ఇట్లనెను - యెహోవా సెలవిచ్చిన దేమనగా - మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.
11:5 అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతువులలోను తొలిపిల్లలన్నియు చచ్చును.
11:6 అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.
11:9 అప్పుడు యెహోవా - ఐగుప్తుదేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.
12:1 మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను
12:12 ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహో వాను.
12:13 మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
12:17 పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.
12:27 మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి.
12:29 అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.
12:30 ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.
12:39 వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.
12:40 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.
12:41 ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.
12:42 ఆయన ఐగుప్తుదేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.
12:51 యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.
13:3 మోషే ప్రజలతో నిట్లనెను - మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు.
13:8 మరియు ఆ దినమున నీవునేను ఐగుప్తు లోనుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసినదాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను.
13:9 యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెననుటకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును.
13:14 ఇకమీదట నీ కుమారుడు - ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి - బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను.
13:15 ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.
13:16 బాహుబలముచేత యెహోవా మనలను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతిమీద సూచన గాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను.
13:17 మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయులదేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు.
13:18 అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱసముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.
14:5 ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్ప బడి మనమెందుకీలాగు చేసితివిు? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితివిు అని చెప్పుకొనిరి.
14:7 మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడు కొనిపోయెను.
14:8 యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లుచుండిరి.
14:11 అంతట వారు మోషేతో - ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల?
14:12 మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటెె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి.
16:1 తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.
16:6 అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో యెహోవా ఐగుప్తు దేశములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును.
16:32 మరియు మోషే ఇట్లనెను - యెహోవా ఆజ్ఞాపించినదే మనగా - నేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.
17:3 అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషే మీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి.
18:1 దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో వినినప్పుడు
19:1 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలు దేరిన నాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.
20:2 నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;
22:21 పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గదా.
23:9 పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులై యుంటిరిగదా.
23:15 పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.
29:46 కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహో వాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.
32:1 మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.
32:4 అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.
32:7 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.
32:8 నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.
32:11 మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?
32:23 వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము; ఐగుప్తులోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమాయెనో మాకు తెలియదనిరి.
33:1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవును నీవు ఐగుప్తుదేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.
34:18 మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబునెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.

లేవీయకాండము (10)

11:45 నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.
18:3 మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలనుబట్టి నడవకూడదు.
19:34 మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింప వలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.
19:36 న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
22:33 నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై యుండునట్లు ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.
23:42 నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.
25:38 నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
25:42 ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు;
25:55 ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తుదేశములో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.
26:45 నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులోనుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను.

సంఖ్యాకాండము (27)

1:1 వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవ త్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను
3:13 ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూ లును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను.
8:17 ఏలయనగా మనుష్యులలోను పశు వులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తుదేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించు కొంటిని.
9:1 ఐగుప్తుదేశములోనుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను
11:5 ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.
11:18 నీవు జనులను చూచి యిట్ల నుముమిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచు కొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా విను నట్లు ఏడ్చిమాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పు కొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు.
11:20 ఒక నెల దినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చిఐగుప్తు లోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి.
13:22 వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.
14:3 ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి.
14:4 వారుమనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా
14:19 ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించి యున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా
14:22 నేను ఐగుప్తులోను అరణ్యము లోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.
15:41 నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే.
20:5 ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి.
20:15 మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి; మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితివిు; ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి.
20:16 మేము యెహోవాకు మొఱ పెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము.
21:5 కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.
22:5 కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెనుచిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు.
22:11 చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను; వారు భూతల మును కప్పుచున్నారు; నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను.
23:22 రాజుయొక్క జయధ్వని వారిలో నున్నది దేవుడు ఐగుప్తులోనుండి వారిని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు.
24:8 దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి యెముకలను విరుచునుతన బాణములతో వారిని గుచ్చును.
26:3 కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రా యేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు
26:59 కహాతు అమ్రా మును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.
32:11 ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తుదేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూనుకుమారుడైన యెహోషువయు తప్ప
33:1 మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.
33:38 యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.
34:5 అస్మోనునుండి ఐగుప్తు నదివరకు సరిహద్దు తిరిగి సముద్రమువరకు వ్యాపించును.

ద్వితీయోపదేశకాండము (47)

1:27 మీ గుడారము లలో సణుగుచుయెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములో నుండి మనలను రప్పించి యున్నాడు.
1:31 ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.
4:20 యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండు టకై, ఐగుప్తుదేశములో నుండి ఆ యినుపకొలిమిలోనుండి మిమ్మును రప్పించెను.
4:34 మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహ త్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా?
4:38 నీకంటె బలమైన గొప్ప జనములను నీ ముందరనుండి వెళ్ల గొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడు గానుండి ఐగుప్తులోనుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను.
4:45 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెలుపలికి వచ్చు చుండగా
4:48 మోషేయు ఇశ్రాయేలీయులును ఐగుప్తులోనుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేసి అతని దేశమును, యొర్దాను ఇవతల ఉదయదిక్కున నున్న బాషాను రాజైన ఓగుయొక్క దేశమును, అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండవరకున్న అమో రీయుల యిద్దరు రాజులదేశమును,
5:6 దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
5:15 నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందు చేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను.
6:12 దాసుల గృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము.
6:21 నీవు నీ కుమారునితో ఇట్ల నుముమనము ఐగుప్తులో ఫరోకుదాసులమైయుండగా యెహోవా బాహుబలముచేత ఐగుప్తులోనుండి మనలను రప్పించెను.
6:22 మరియు యెహోవా ఐగుప్తుమీదను ఫరో మీదను అతని యింటివారందరి మీదను బాధకరములైన గొప్ప సూచకక్రియలను అద్భుతములను మన కన్నుల యెదుట కనుపరచి,
7:8 అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.
7:15 యెహోవా నీయొద్దనుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తు లోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరిమీదికే వాటిని పంపించును.
7:18 నీ దేవు డైన యెహోవా ఫరోకును ఐగుప్తుదేశమంతటికిని చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించి నప్పుడు
8:14 నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో.
9:7 అరణ్యములో నీవు నీ దేవు డైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాప కము చేసికొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తుదేశ ములోనుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు మీరు ప్రవేశించువరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి.
9:12 నీవు లేచి యిక్కడ నుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులోనుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారి కాజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను.
9:26 నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితినిప్రభువా యెహోవా, నీవు నీ మహిమవలన విమోచించి బాహుబలమువలన ఐగుప్తులోనుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము.
10:19 మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి.
10:22 నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.
11:3 ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయనచేసిన సూచక క్రియలను కార్యములను
11:4 ఆయన ఐగుప్తుదండు నకును దాని గుఱ్ఱములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎఱ్ఱసముద్ర జల మును వారిమీద ప్రవహింపజేసిన దానిని
11:10 మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలు దేరి వచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.
13:5 నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవు డైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త కేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
13:10 రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములో నుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు.
15:14 నీవు ఐగుప్తుదేశములో దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వాని కియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను.
16:1 ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను.
16:3 పస్కా పండు గలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశ ములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాప కము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.
16:6 నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్త మించు సాయంకాలమున పస్కా పశువును వధించి
17:16 అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవాఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను.
20:1 నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱ ములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచు నప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.
23:4 ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చు చుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి.
23:7 ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింప కూడదు. ఐగుప్తుదేశములో నీవు పరదేశివై యుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు.
24:9 మీరు ఐగుప్తులోనుండి వచ్చి నప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి.
24:18 నీవు ఐగుప్తులో దాసుడవైయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడనుండి విమోచించె నని జ్ఞాపకము చేసికొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.
24:22 నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటి వని జ్ఞాపకముచేసికొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను.
25:17 మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీ కెదురుగా వచ్చి
26:5 నీవునా తండ్రి నశించుచున్న అరామీదేశస్థుడు; అతడు ఐగుప్తు నకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను.
26:8 అప్పుడు యెహోవా బాహుబలమువలనను చాపిన చేతి వలనను మహా భయమువలనను సూచక క్రియలవలనను మహత్కార్యములవలనను ఐగుప్తులోనుండి మనలను రప్పించి
28:27 యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టు చేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.
28:60 నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును.
28:68 మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ జూపు కొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.
29:2 మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెనుయెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనము నకును చేసినదంతయు, అనగా
29:16 మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు.
29:25 మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి
34:10 ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని

యెహోషువ (15)

2:10 మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.
5:4 యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులోనుండి బయలు దేరినవారందరిలో యుద్ధసన్నద్ధులైన పురుషులందరు ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి.
5:5 బయలుదేరిన పురుషులందరు సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొందియుండలేదు.
5:6 యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమా ణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధు లందరు యెహోవా మాట వినకపోయినందున వారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి.
5:9 అప్పుడు యెహోవానేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహో షువతో ననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గా లను పేరు.
9:9 వారునీ దేవుడైన యెహోవా నామ మునుబట్టి నీ దాసులమైన మేము బహుదూరమునుండి వచ్చి తివిు; ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న
13:2 మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నియు, గెషూరీ యుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని
15:4 అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరిహద్దు.
15:46 దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును,
24:4 ఇస్సాకునకు నేను యాకోబు ఏశావుల నిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనునట్లు వాటిని ఏశావు కిచ్చితిని. యాకోబును అతని కుమారులును ఐగుప్తులోనికి దిగిపోయిరి.
24:6 నేను ఐగుప్తులోనుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోను రౌతులతోను మీ తండ్రులను ఎఱ్ఱసముద్రమువరకు తరిమిరి.
24:7 వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్ర మును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివసించితిరి.
24:14 కాబట్టి మీరు యెహోవాయందు భయ భక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యము గాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి.
24:17 ఐగుప్తుదేశమను దాసుల గృహములోనుండి మనలను మన తండ్రులను రప్పించి, మన కన్నులయెదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి, మనము నడిచిన మార్గములన్నిటిలోను, మనము వెళ్లిన ప్రజ లందరిమధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు.
24:32 ఇశ్రాయేలీ యులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.

న్యాయాధిపతులు (7)

2:1 యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెనునేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చినీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.
2:11 ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి
6:8 యెహోవా ఇశ్రాయేలీ యులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని.
6:13 గిద్యోనుచిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.
11:13 అమ్మోనీయుల రాజుఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమా ధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించు మని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.
11:16 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.
19:30 అప్పుడు దాని చూచినవారందరు, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు ఈలాటిపని జరుగుటయైనను వినబడుటయైనను లేదు; మీరు ఇది మన స్సుకు తెచ్చుకొని దీనినిబట్టి ఆలోచనచేసి దీనినిగూర్చి మాటలాడుడని ఒకరితో నొకరు చెప్పుకొనిరి.

1 సమూయేలు (8)

2:27 అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చియిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పిత రుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని.
8:8 వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.
12:6 మరియు సమూయేలు జనులతో ఇట్లనెనుమోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తుదేశములోనుండి రప్పించినవాడు యెహోవాయే గదా
12:8 యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తు లోనుండి తోడుకొని వచ్చి యీ స్థలమందు నివసింప జేసిరి.
15:2 సైన్యములకధిపతియగు యెహోవా సెల విచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా.
15:6 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతోకూడ నేను మిమ్మును నాశనము చేయ కుండునట్లు మీరు వారిలోనుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీ యులలోనుండి వెళ్లిపోయిరి.
15:7 తరువాత సౌలు అమాలేకీ యులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి
27:8 అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజెరీయులమీదను అమాలేకీయులమీదను పడిరి ప్రయాణస్థులు పోవుమార్గమున షూరునుండి ఐగుప్తువరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా

2 సమూయేలు (2)

7:6 ఐగుప్తులోనుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని.
7:23 నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తుదేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములో నుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది.

1 రాజులు (19)

3:1 తరువాత సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకార మును కట్టించుట ముగించిన తరువాత ఫరోకుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.
4:21 నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.
8:9 ఇశ్రా యేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను.
8:16 నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండు నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములో నైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెల విచ్చెను.
8:21 అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని, ఐగుప్తుదేశ ములోనుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే యున్నది.
8:51 వారు ఐగుప్తుదేశములోనుండి ఆ ఇనుపకొలిమిలోనుండి నీవు రప్పించిన నీ జనులును నీ స్వాస్థ్యమునై యున్నారు.
8:53 ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులోనుండి రప్పించి నప్పుడు నీవు నీ దాసుడైన మోషేద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలోనుండి వారిని ప్రత్యేకించితివి గదా.
8:65 మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి.
9:9 జనులిట్లందురు ఐగుప్తు దేశములోనుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.
9:16 ఐగుప్తు రాజైన ఫరో గెజెరుమీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను.
10:28 సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను; రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియా మకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగ కొనితెప్పించిరి.
10:29 వారు ఐగుప్తులోనుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరు వందల తులముల వెండియు, గుఱ్ఱమొకటింటికి నూట ఏబది తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజు లందరికొరకును అరాము రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.
11:17 అంతట హదదును అతనితోకూడ అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులును ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి; హదదు అప్పుడు చిన్న వాడై యుండెను.
11:18 వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశమునుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను.
11:21 అంతట దావీదు తన పితరులతోకూడ నిద్రపొందిన సంగతిని, సైన్యాధిపతియైన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు వినినేను నా స్వదేశమునకు వెళ్లుటకు సెలవిమ్మని ఫరోతో మనవిచేయగా
11:40 జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తుదేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే యుండెను.
12:2 నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారి పోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తు లోనేయుండి ఆ సమాచారము వినెను.
12:29 ఇశ్రా యేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.
14:25 రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తురాజైన షీషకు యెరూష లేము మీదికి వచ్చి

2 రాజులు (10)

17:4 అతడు ఐగుప్తురాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరురాజునకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను.
17:7 ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశ ములో నుండియు, ఐగుప్తురాజైన ఫరోయొక్క బలము క్రిందనుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి
17:35 మహాధికారము చూపి బాహు బలముచేత ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారముచేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలని పేరుపెట్టబడిన యాకోబు సంతతివారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు
18:21 నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చు కొని దూసి పోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొను వారి కందరికిని అట్టివాడే.
18:24 అట్లయితే నా యజ మానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే.
21:15 వారు తమ పితరులు ఐగుప్తుదేశములోనుండి వచ్చిన నాటనుండి నేటివరకు నా దృష్టికి కీడుచేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువు లందరిచేత దోచబడి నష్టము నొందుదురు.
23:29 అతని దినముల యందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.
23:34 యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.
24:7 బబులోనురాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తురాజు వశముననున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తురాజు ఇక నెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను.
25:26 అప్పుడు కొద్దివారేమి గొప్ప వారేమి జనులందరును, సైన్యాధిపతులును, లేచి కల్దీయుల భయముచేత ఐగుప్తుదేశమునకు పారిపోయిరి.

1 దినవృత్తాంతములు (2)

13:5 కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకునుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.
17:21 నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి

2 దినవృత్తాంతములు (17)

1:16 సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర నిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి.
1:17 వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.
5:10 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మంద సమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.
6:5 ఆయన సెలవిచ్చినదేమనగానేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలు కొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై యేమనుష్యునియైనను నేను నియమింపలేదు.
7:8 ఆ సమయ మందు సొలొమోనును, అతనితో కూడ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నదివరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరును ఏడు దినములు పండుగ ఆచరించి
7:22 జనులుఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమ స్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.
9:26 యూఫ్రటీసునది మొదలుకొని ఫిలిష్తీ యుల దేశమువరకును ఐగుప్తు సరిహద్దువరకును ఉండు రాజు లందరి పైని అతడు ఏలుబడి చేసెను.
9:28 ఐగుప్తునుండియు సకల దేశములనుండియు సొలొమోనునకు గుఱ్ఱములు తేబడెను.
10:2 రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తునుండి తిరిగిరాగా జనులు అతని పిలిపించిరి.
12:2 వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువదివేల గుఱ్ఱపు రౌతులతోను యెరూషలేముమీదికి వచ్చెను.
12:3 అతనితో కూడ ఐగుప్తునుండి వచ్చిన లూబీయులు సుక్కీయులు కూషీ యులు అనువారు లెక్కకు మించియుండిరి.
12:9 ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను.
20:10 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయా బీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి.
26:8 అమ్మోనీ యులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను.
35:20 ఇదంతయు అయిన తరువాత యోషీయా మందిర మును సిద్ధపరచినప్పుడు ఐగుప్తురాజైన నెకో యూఫ్రటీసు నదియొద్దనున్న కర్కెమీషుమీదికి దండెత్తి వెళ్లుచుండగా యోషీయా అతనిమీదికి బయలు దేరెను.
36:3 ఐగుప్తురాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి, ఆ దేశమునకు రెండువందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి
36:4 అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదామీదను యెరూషలేముమీదను రాజుగా నియమించి, అతనికి యెహోయాకీము అను మారు పేరుపెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసికొని పోయెను.

నెహెమ్యా (2)

9:9 నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.
9:18 వారు ఒక పోతదూడను చేసికొనిఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను

కీర్తనల గ్రంథము (14)

68:31 ఐగుప్తులోనుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవునితట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తివచ్చెదరు.
78:12 ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.
78:43 ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.
78:51 ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను.
80:8 నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి
81:5 ఆయన ఐగుప్తు దేశసంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని.
87:4 రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని యందురు.
89:10 చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి.
105:23 ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాముదేశమందు పరదేశిగా నుండెను.
106:7 ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి.
106:21 ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను
114:1 ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు
135:8 ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలి చూలులను ఆయన హతముచేసెను.
136:10 ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.

సామెతలు (1)

7:16 నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.

యెషయా (27)

7:18 ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.
11:11 ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును
11:15 మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.
11:16 కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును
19:1 ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది
19:6 ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.
19:12 నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా?
19:13 సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి
19:14 యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసి యున్నారు
19:15 తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు
19:17 యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకువిరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల ఐగుప్తీయులు వణకుదురు.
19:18 ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము.
19:19 ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును.
19:20 అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.
19:23 ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు.
19:24 ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును.
20:3 యెహోవానా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరియై జోడు లేకయే నడచుచున్న ప్రకారము
27:12 ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య మును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.
27:13 ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.
30:2 వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా ణము చేయుదురు.
30:3 ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును.
30:7 ఐగుప్తువలని సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజన మైనది అందుచేతనుఏమియు చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను.
31:1 ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.
36:6 నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.
36:9 లేనియెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించు కొంటివే.
43:3 యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.
52:4 దేవుడైన యెహోవా అనుకొనుచున్న దేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను.

యిర్మియా (50)

2:6 ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు.
2:18 నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.
2:36 నీ మార్గము మార్చు కొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.
7:22 నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని
7:25 మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.
11:4 ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తినినేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.
11:7 ఐగుప్తులోనుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటివరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చితిని; నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చితిని
16:14 యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట
23:7 కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక
24:8 మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
25:19 మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసులును అతని ప్రధానులును అతని జనులందరును
26:21 రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను.
26:22 అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను;
26:23 వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసి కొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.
31:32 అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.
32:20 నీవు ఐగుప్తుదేశములో చేసినట్టు నేటివరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుష్యుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు.
32:21 సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహా బలముకలిగి, చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి, ఐగుప్తు దేశములోనుండి నీ ప్రజలను రప్పించి
34:13 ఇశ్రా యేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని.
37:5 ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గరనుండి బయలుదేరిరి.
37:7 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెనుమీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును.
41:18 అయితే వారు బబులోనురాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి.
42:13 అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట విననివారై యీ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్లుదము,
42:15 యూదావారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి; ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్లినయెడల
42:16 మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టు కొనును; మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలిసికొనును, అక్కడనే మీరు చత్తురు,
42:17 నేను వారిమీదికి రప్పించు కీడునుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనువాడైనను ఉండడు, ఐగుప్తులో నివసింపవలెనని అక్కడికి వెళ్ల నిశ్చయించుకొను మనుష్యులందరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు.
42:18 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు, మీరు ఐగుప్తునకు వెళ్లినయెడల నా ఉగ్రత మీమీదికిని వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింప బడువారుగాను ఉందురు, ఈ స్థలమును మరి యెప్పుడును చూడరు.
42:19 యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్లకూడదని యెహోవా మీకాజ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యమిచ్చితినని మీరే నిశ్చయముగా తెలిసికొనుచున్నారు.
43:2 హోషేయా కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును యిర్మీయాతో ఇట్లనిరి నీవు అబద్ధము పలుకుచున్నావు ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్లకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.
43:7 ఐగుప్తుదేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా
43:12 ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజ బెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చి వేయును, ఆ దేవతలను చెరగొనిపోవును, గొఱ్ఱెలకాపరి తన వస్త్రమును చుట్టుకొనునట్లు అతడు ఐగుప్తుదేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడనుండి సాగి పోవును.
43:13 అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతాపట్టణము లోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును.
44:1 మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసము చేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
44:8 మీకుమీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్కరింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీ చేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు?
44:12 అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించుకొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను నశింతురు, ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందురు.
44:13 యెరూషలేము నివాసులను నేనే లాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గముచేతగాని క్షామముచేతగాని తెగులుచేతగాని శిక్షించెదను.
44:14 కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారి పోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.
44:16 మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,
44:24 మరియు యిర్మీయా ప్రజలనందరిని స్త్రీలనందరిని చూచి వారితో ఇట్లనెను ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి.
44:26 కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవామాటవినుడియెహోవా సెలవిచ్చునదేమనగా ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు, ఐగుప్తులో నివసించు యూదు లలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయు చున్నాను.
44:27 మేలు చేయుటకు కాక కీడుచేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తుదేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.
44:28 ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములో నుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.
44:30 అతనికి శత్రువై అతని ప్రాణమును తీయ జూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తురాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.
46:2 ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసునదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట.
46:11 ఐగుప్తుకుమారీ, కన్యకా, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు
46:14 ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి ఏమనగాఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.
46:17 ఐగుప్తురాజగు ఫరో యుక్తసమయము పోగొట్టుకొను వాడనియు వట్టిధ్వని మాత్రమేయని వారచ్చట చాటించిరి.
46:19 ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.
46:20 ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చే యున్నది.
46:24 ఐగుప్తు కూమారి అవమానపరచబడును ఉత్తరదేశస్థులకు ఆమె అప్పగింపబడును
46:25 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించు చున్నాను.

యెహెఙ్కేలు (33)

17:15 అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు
19:4 అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తుదేశమునకు దాని తీసికొనిపోయిరి.
20:5 ఎట్లనగా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణముచేసిన నాడును, ఐగుప్తుదేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణముచేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున
20:6 వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.
20:9 అయితే ఏ అన్య జనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి తిని.
20:10 వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి అరణ్యము లోనికి తోడుకొని వచ్చి
23:3 వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, ¸యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.
23:8 మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.
23:19 మరియు ¸యౌవనదినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చెను.
23:27 ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తుదేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండ ఈలాగున మాన్పించెదను.
27:7 నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు
29:2 నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశ మంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా
29:3 ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;
29:6 అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందరు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను;
29:9 ఐగుప్తుదేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొను చున్నాడు గనుక
29:10 నేను నీకును నీ నదికిని విరోధినైతిని, ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదను.
29:12 నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తుదేశమును పాడగునట్టుగా చేసెదను, పాడై పోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనముల లోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్ల గొట్టుదును.
29:19 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తుదేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించు చున్నాను, అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును, అది అతని సైన్యమునకు జీతమగును.
30:4 ఖడ్గము ఐగుప్తు దేశముమీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషుదేశస్థులు వ్యాకులపడుదురు, శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టు దురు.
30:6 యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తును ఉద్ధరించు వారు కూలుదురు, దాని బలగర్వము అణగిపోవును, మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు జనులు ఖడ్గముచేత కూలుదురు.
30:8 ఐగుప్తుదేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
30:9 ఆ దినమందు దూతలు నా యెదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శకలిగిన దినమున జరిగి నట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చే యున్నది.
30:13 యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.
30:15 ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మరించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను
30:16 ఐగుప్తుదేశములో నేను అగ్నియుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.
30:18 ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెర లోనికి పోవుదురు.
30:21 నరపుత్రుడా, నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా
30:22 నేను ఐగుప్తురాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి, అతని చేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను.
30:25 బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తుదేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోనురాజు చేతికియ్యగా నేను యెహోవానైయున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.
31:2 నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు?
32:2 నరపుత్రుడా, ఐగుప్తురాజైన ఫరోనుగూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము జనములలో కొదమ సింహమువంటివాడవని నీవు ఎంచబడితివి, జలములలో మొసలివంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి.
32:15 నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరిని నిర్మూలముచేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
32:16 ఇది అంగలార్పు వచనము, వారు దానిని యెత్తి పాడుదురు, అన్యజనుల కుమార్తెలు దానిని యెత్తి పాడుదురు; ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

దానియేలు (4)

9:15 ప్రభువా మా దేవా, నీవు నీ బాహు బలమువలన నీ జనమును ఐగుప్తులోనుండి రప్పించుటవలన ఇప్పటివరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపముచేసి చెడునడతలు నడిచినవారము.
11:8 మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపురాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును.
11:42 అతడు ఇతర దేశములమీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.
11:43 అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తుయొక్క విలువ గల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీ యులను తనకు పాదసేవకులుగా చేయును.

హోషేయ (12)

2:15 అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు
7:16 వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.
8:13 నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు; అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు, త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములనుబట్టి వారిని శిక్షించును; వారు మరల ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను.
9:3 ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.
9:6 లయము సంభవించినందున జనులు వెళ్లి పోయి యున్నారు; ఐగుప్తుదేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపు పట్టణమువారికి శ్మశాన భూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువు లను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును.
11:1 ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచి తిని.
11:5 ఐగుప్తుదేశమునకు వారు మరల దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరురాజు వారిమీద ప్రభుత్వము చేయును.
11:11 వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తుదేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరుదేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు.
12:1 ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్ద మాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.
12:9 అయితే ఐగుప్తుదేశములోనుండి మీరు వచ్చినది మొదలు కొని యెహోవానగు నేనే మీకు దేవుడను; నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింప జేతును.
12:13 ఒక ప్రవక్తద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తుదేశములోనుండి రప్పించెను, ప్రవక్తద్వారా వారిని కాపాడెను.
13:4 మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవా నగు నేనే మీ దేవుడను; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు.

యోవేలు (1)

3:19 ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.

ఆమోసు (6)

2:10 మరియు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపర చవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.
3:1 ఐగుప్తుదేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రా యేలీయులారా, మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారినందరినిగూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.
3:9 అష్డోదు నగరులలో ప్రకటనచేయుడి, ఐగుప్తుదేశపు నగరులలో ప్రకటనచేయుడి; ఎట్లనగా - మీరు షోమ్రోను నకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి.
8:8 ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.
9:5 ఆయన సైన్యములకధిపతి యగు యెహోవా; ఆయన భూమిని మొత్తగా అది కరిగి పోవును, అందులోని నివాసులందరును ప్రలాపింతురు, నైలునదివలెనే అదియంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలునదివలెనే అది అణగిపోవును.
9:7 ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశములో నుండి ఫిలిష్తీయులను, కీరుదేశములోనుండి సిరియనులను రప్పించితిని.

మీకా (3)

6:4 ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.
7:12 ఆ దినమందు అష్షూరుదేశమునుండియు, ఐగుప్తుదేశపు పట్టణములనుండియు, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసునదివరకు ఉన్న ప్రదేశమునుండియు, ఆ యా సముద్రముల మధ్యదేశములనుండియు, ఆ యా పర్వతముల మధ్యదేశములనుండియు జనులు నీ యొద్దకు వత్తురు.
7:15 ఐగుప్తుదేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరతును.

హగ్గయి (1)

2:5 మీరు ఐగుప్తుదేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.

జెకర్యా (1)

10:10 ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశ ములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశము లోనికిని వారిని తోడుకొని వచ్చెదను.

మత్తయి (3)

2:13 వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.
2:15 ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చ బడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.
2:19 హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై

అపో. కార్యములు (12)

2:9 పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు,
7:9 ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి
7:10 దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అను గ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.
7:11 తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహు శ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.
7:12 ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్కడికి మొదటి సారి పంపెను.
7:15 యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,
7:17 అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏలనారంభించెను.
7:34 ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చి యున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను.
7:36 ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.
7:39 ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై
7:40 మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి.
13:17 ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి

హెబ్రీయులకు (4)

3:16 విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా
8:9 అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకైవారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగావారు - వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.
11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
11:27 విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.

యూదా (1)

1:5 ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించి నను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.

ప్రకటన గ్రంథం (1)

11:8 వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"ఐగుప్తు" found in 10 lyrics.

కరుణ చూపించుమా - Karuna Choopinchumaa

కరుణ చూపించుమా యేసయ్య కన్నీరు తుడవగా - Karuna Choopinchumaa Yesayya Kanneeru Thudavagaa

దేవునికి భయపడవా మానవా - Devuniki Bhayapadavaa Maanavaa

నా జీవం నీ కృపలో దాచితివే - Naa Jeevam Nee Krupalo Daachithive

నిబంధనా జనులం - Nibandhanaa Janulam

నిబంధనా జనులం - నిరీక్షణా ధనులం

నీవే నా సంతోషగానము - Neeve Naa Santhosha Gaanamu

ఫలములనాశించిన పరలోక తండ్రి - Phalamulanaashinchina Paraloka Thandri

సత్తువభూమిలో శ్రేష్టమైన ద్రాక్షతీగలను నాటించిన దేవుడు

సీయోను పాటలు సంతోషముగా - Seeyonu Paatalu Santhoshamugaa

Sermons and Devotions

Back to Top
"ఐగుప్తు" found in 39 contents.

సువార్త నిమిత్తం క్రీస్తు హతసాక్షి - జెలోతే అనబడిన – సీమోను
40 Days - Day 8 సువార్త నిమిత్తం క్రీస్తు హతసాక్షి - జెలోతే అనబడిన – సీమోనుజెలోతే అనబడిన సీమోను, కొత్త నిబంధన గ్రంధంలో తరచుగా పట్టించుకోని పేరు. అయినప్పటికీ, పన్నెండు మందిలో అతనిని చేర్చుకోవడం యేసు పట్ల ఆయనకున్న భక్తిని తెలియజేస్తుంది.రోమీయ

ప్రకటన గ్రంథ ధ్యానం 1వ అధ్యాయం - Revelation 1 Detailed Study
Previous - Revelation Chapter 2 వివరణ > >   ఉపోద్ఘాతం: క్రీస్తు రెండవ రాకడ మర్మము ప్రతిఒక్కరికీ తెలియపరచబడాల

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 13వ అనుభవం
ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ 3:11 https://youtu.be/iHrmd-WvE6s ఈ లోక సంబంధమైన ఆస్తి - అంతస్తులు, పేరు - ప్రఖ్యాతులు ధనాపేక్షతో

యేసుతో పోల్చాబడిన యోసేపు యొక్క భార్య
యోసేపు అనగా “ఫలించెడి కొమ్మ “ అని అర్థము. ఇతడు మన అది పితరుడైన యకోబుకు రాహేలు ద్వారా కలిగిన ప్రధమ పుత్రుడు. రాహేలుకు వరపుత్రుడైన యోసేపును తండ్రి తన మిగిలిన కుమారులకన్నా అధికముగా ప్రేమించేవాడు. అందుకు గుర్తుగా రంగురంగుల నిలువుటంగీనీ ప్రత్యేకముగా కుట్టించాడు.ఈ ప్రత్యేకతను సహించలేని అన్నలు అసూయతో ని

ప్రకటన గ్రంథ ధ్యానం 3వ అధ్యాయం - Revelation 3 Detailed Study
<< Previous - Revelation Chapter 2 వివరణ ప్రకటన 3:1 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగు

నిర్గమకాండము
ఉద్దేశ్యము : ఐగుప్తులోని ఇశ్రాయేలీయులు బానిసత్వము నుండి విడిపింపబడుట మరియు వారు ఒక దేశముగా ప్రబలుటను గురించినది. గ్రంథకర్త : మోషే కాలము : సుమారు ఆదికాండ గ్రంథకాలములోనే క్రీ.పూ 148

ఆమోసు
ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా

విమానం కనుగొనడానికి ప్రయత్నించిన రైట్ బ్రదర్స్
దేవుని వాక్యం మీద విశ్వాసముతో విమానం కనుగొనడానికి ప్రయత్నించిన రైట్ బ్రదర్స్ విమానమును కనిపెట్టిన వ్యక్తులు, ఒర్విల్ రైట్ (Orville Wright - August 19, 1871 – January 30, 1948) మరియు విల్బర్ రైట్ (Wilbur Wright - April 16, 1867 – May 30, 1912). వీరిద్దరిని రైట్ బ్రదర్స్ అంటారు. వీరి తండ్ర

Telugu Bible Quiz
Bible Quiz 1. ఏ రాజు మృతినొందిన సంవత్సరమున యెషయా కు పరలోక దర్శనము కలిగెను ?2. సొలొమోను ఎవరికంటే జ్ఞానవంతుడై ఉండెను ?3. హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుష్షును యెహోవాపెంచెను?4. సత్యమును ఎదురించువారు ఎవరు ?5. దిగంబరియై జోడు లేక నడచిన వారు ఎవరు ?6. ఏ కళ్లము నొద్ద

విశ్వాసమే నీ విజయం
విశ్వాసంలో మాదిరి నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12 జార్జ్ ముల్లర్ గారి అనాధ ఆశ్రమంలో ఒకరోజు వంటవాడు ఈరాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమి లేదని చెప్పాడు

యెహోషువ
మోషే యొక్క పంచకాండములకు తరువాత యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథము వరకు ఉన్న 12 చరిత్ర పుస్తకములు బైబిలులోని రెండవ భాగము అని చెప్పవచ్చును. వాటిలో మొదటి పుస్తకమైన యెహోషువ పంచకాండముల పుస్తకములను, ఇశ్రాయేలీయుల చరిత్రను కలుపుచున్నది. మూడు ముఖ్యమైన యుద్ధముల ద్వారా కనానును జయించుట ఈ పుస్తకము యొక్

Day 71 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యోహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను, ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను ... కాబట్టి ఫరో మోషే ఆహారోనులను త్వరగా పిలిపించి ... అప్పుడు యెహోవ గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచు పోయీ ఎర్రసముద్రములో పడవేసెను. ఐగుప్టు సమస్త ప్రాంతములల

Day 81 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను . . . ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను (అపొ.కా 7:30,34)

Day 112 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నేను నడచుమార్గము ఆయనకు తెలియును (యోబు 23:10). విశ్వాసీ, ఎంత ఆదరణకరమైన హామీ ఇది! నువ్ నడిచేదారి అది ఎంత అస్తవ్యస్తంగా, వంకరటింకరగ, అర్థం కాకుండా ఉన్నప్పటికీ అది శ్రమలతో కన్నీళ్ళతో నిండిన దారైనప్పటికీ, అది దేవునికి తెలుసు. అగ్నిగుండం వేడిమి ఏడింతలు ఎక్కువ కావచ్చు. దేవుడు దాన్ని చల్లబరుస్తా

Day 132 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నమ్మువానికి సమస్తమును సాధ్యమే. (మార్కు 9: 23). ఈ "సమస్తమును" అనేది ఊరికే లభించదు. ఎందుకంటే విశ్వాసం అనే మార్గాన్ని మనకి బోధించాలని దేవుడు ఎప్పుడు తహతహలాడుతున్నాడు. మనం ఇలా విశ్వాసమనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి. విశ్వాసంలో క్రమశిక్షణ, విశ్వాసంలో సహనం, విశ్వా

Day 137 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నలువదిఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు... దేవదూత అతని కనబడెను... రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను (అపో.కా. 7: 30-34). ఒక్కసారి దేవుడు మనల్ని కొంతకాలంపాటు మన పనీలో నుండి పక్కకు తప్పించి, ఊరకుండి, తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడ

Day 263 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను (యోహాను 11:40). తమ ప్రభువు ఏమి చేస్తున్నాడో మరియ, మార్తలకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ అన్నారు "ప్రభువా, నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చినట్టయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడు." ఈ మాటల వెనుక వాళ్ళ అభిప్రాయం మనకు తేటతెల

Day 354 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను (యోహాను 16:32). నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయ్యవలసి ఉంటుంది. ఎన్నో తడబాట్లకి గురై ఎన్నోవాటిని దూరం చేసుకుని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్నీ, ఒంటరితనాన్నీ వహించవలసి ఉంటుంది. పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు,

విలాప వాక్యములు
ఒక మహానగరము యొక్క గోషలాగ విలాపవాక్యములు కనబడుచున్నది. ఒక కాలములో యూదుల యొక్క అతిశయింపదగిన పట్టణముగా కనిపించిన యెరూషలేము బబులోనియులు స్వాధీనపరచుకొనినదానిని బట్టి ఆ పట్టణము ఒక ఇసుక దిబ్బలాగా మార్చబడిన సంగతులను కన్నీరు భాషగా విలాపించుచున్నారు. గ్రంథకర్త ఐదు విలాప కావ్యముల కూర్పును యిర్మీయా ఈ

లేవీయకాండము
ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశమును విడిచి సాగిపొమ్మని దేవుడు వారికి ఆజ్ఞాపించిన తరువాత, విడుదల పొందిన ఆ జనులను దేవునిలో కేంక్రరింపబడే ఒక జనసమూహముగా చేయుట అవశ్యకమై యున్నది. వారిని ఎల్లప్పుడు సేవించు ప్రజలుగా ఆయన నియమించెను. ఈ విధముగా వారు దేవుని ఎలా సేవించాలి? ఎలా ఆరాధించాలి? ఆయనకు లోబడి ఎలా జీవించాలి

ఆదికాండము
పురాతన ప్రతులైన ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందురు. ({2Chro,34,30}). క్రీ.పూ 3వ శతాబ్దములోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాతనిబంధన గ్రంథమును తర్జుమా చేసిన సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము,

యోసేపు : ఫలించెడి కొమ్మ.
యోసేపు అనగా దేవుడు వృద్ధి చేయును (God will increase) మిద్యానీయులైన వర్తకులు .. యోసేపును .. ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి. ఆది 37:28 రాబోయే కరువును తప్పించడానికి నిలబడే ముఖద్వారంలాగా నిలబెట్టడానికి దేవుని ప్రణాళిక సిద్దమైనప్పుడు వ

దేవుని ముఖాన్ని చూస్తే..?
దేవుని ముఖాన్ని చూస్తే..? ఎదుటివారి ముఖాన్ని చూసినప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో సుళువుగా అర్ధమవుతుంది. కోపంగా ఉన్నారా, ప్రేమను చూపిస్తున్నారా అనే భావనలు వారి ముఖ వ్యక్తీకరణలను బట్టి తెలుసుకుంటూ ఉంటాము. ఎదుటివారి నుండి సమాధానం పొందుకోవాలానే సమయంలో వారి మాటలతో పూర్తిగా సంతృప్తి ప

క్రైస్తవుని జీవన శైలిలో - సన్నద్ధమైన శక్తి సాధనాలు - Christian Lifestyle - Equipped with Faith
క్రైస్తవుని జీవన శైలిలో - సన్నద్ధమైన శక్తి సాధనాలు ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. రోమా 1:17 దేవుడు మోషేను ఐగుప్తులోనుండి తన ప్రజలను విడిపించడానికి నియమించుకున్నప్

విశ్వాసపు సహనం
విశ్వాసపు సహనం దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులకు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి ఆరు లక్షల ఇశ్రాయేలీయుల కాల్బలం కనానువైపు ప్రయాణం మొదలయ్యింది. సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనుకునేలోపే ముందు ముంచెత్తే ఎర్ర సముద్రం వెనక మష్టుపెట్ట జూసే ఫారో సైన్యం. మరణం ఇరువైపులా దాడిచేస్తుంటే ఆర

అనుభవ గీతాలు
అనుభవ గీతాలు ఒక రోజు సాయంత్రం మేము మరియు మా సంఘంలోని మరి కొన్ని కుటుంబాలతో కలిసి చర్చించుకోవడం మొదలుపెట్టాము. చెన్నై పట్టణంలో నివసించే మాకు, ఎవరైనా తెలుగు వారు పరిచయం అయ్యారంటే ఆ ఆనందమే వేరు. మన వాళ్ళు కలిసారంటే ఎక్కడలేని తెలుగు వంటలు, ఆంధ్రా రాజకీయాల చర్చలు జరుగుతూనే ఉంటాయి కదా. అయితే ప్

ప్రవర్తనలో పరిపక్వత
ప్రవర్తనలో పరిపక్వత Audio: https://youtu.be/C7ueFnsoa3M పక్షపాతాన్ని చూపించడము పిల్లల మధ్య విరోధానికి అతి పెద్ద కారణం అని పిల్లల వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉంటారు. ఈ విరోధాలు ఎలా దారి తీస్తాయో మన ఊహలకు అందనివి. తన తండ్రికి

దానియేలు
దానియేలు యొక్క జీవితము, సేవయు బబులోను చెరనివాసకాలమైన డెబ్బై సంవత్సరములు విస్తరించియున్నది. 16వ ఏటే చెరపట్టబడిన దానియేలు రాజకార్యము నిమిత్తము ఎన్నుకొనబడ్డాడు. దాని తరువాత దేవుని తాత్కాలిక నిత్య ఉద్దేశమును ఇశ్రాయేలీయులకు అన్యజనులకు బయలుపరచు దేవుని ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు గ్రంథములోని 12 అధ్యాయము

యెహెజ్కేలు
యెహెజ్కేలు ఒక యాజకుడుగాను, ప్రవక్త గాను ఉన్నాడు. ఈయన యూదా చరిత్రలో మిక్కిలి అంధకారకాలమైన 70 సంవత్సరముల బబులోను చెర నివాస కాలములో దేవుని కొరకు శత్రుదేశమైన బబులోనులో తనయొక్క ప్రవచన సేవను నెరవేర్చాడు. యెరూషలేము నాశనమగుటకు ముందు బబులోనుకు కొనిపోబడిన ఈ ప్రవక్త దర్శనములు, ఉపమానములు, రూపములు, ప్రవచనములు

యోసేపు
యాకోబు కుమారుడైన యోసేపుకు 11 మంది సోదరులు ఉండేవారు. యోసేపు అంటే ఆయన తండ్రియైన యాకోబుకు అందరికంటే ఎక్కువ ఇష్టం. యోసేపుకు వాళ్ళ నాన్న ఎన్నో బహుమతులు ఇచ్చేవారు. అలాగే యాకోబు, యోసేపుకు ఒక అందమైన రంగు రంగుల చొక్కాను ఇచ్చారు. అది చూసి యోసేపు సోదరులు తట్టుకోలేక, ఎంతో ఈర్ష్యపడ్డారు. వాళ్ళకు యోసేప

మిమ్మును అనాధలనుగా విడువను
నిర్గమ 3:8 “... పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను”. ఇది అద్వితీయ సత్యదేవుని మనసు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం, నాలుగు వందల ముప్పై సంవత్సరములు కఠిన బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులు పెట్టిన మూలుగులు ఆ నీతి స్వరూపుడగు తండ్రి విని, తాను ప్రేమించిన వారిని రక్ష

మోషే
మన అందరికీ పది ఆజ్ఞలు తెలుసు కదా. అవి ఎవరు మనకు ఇచ్చారు? అవి ఎక్కడ నుండి వచ్చాయి? ఈ కథలో మనం తెలుసుకుందాం. మనందరికి మోషే అంటే ఎవరో తెలుసు కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుండి తాను చూపించే దేశమునకు నడిపిస్తారు. ఐగుప్తులో వారు బానిసలుగా ఉండేవారు. వారిని విడిపించి వా

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 28వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 28వ అనుభవం: నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. యోహాను 6:55 ఐగుప్తు బానిసత్వం నుండి బలిష్టమైన దేవుని హస్తం ఇశ్రాయేలీయులను విడిపించి, అరణ్య మార్గం గుండా పాలు తేనెలు ప్రవహించే దేశంవైపు నడిపించింది. కనాను ప్రయాణంలో ఇశ్రాయేలీయులను దే

తన్నుతాను హెచ్చించుకొన్న మహిళ
తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును (లూకా 18:14) అని బైబిల్ బోధిస్తుంటే, మిర్యాము అనే ప్రవక్త్రి తన్నుతాను హెచ్చించుకొని దేవుని నుండి శాపాన్ని పొందుకుంది (సంఖ్యా 12:1-10). లేవీ వంశమునకు చెందిన అమ్రాము, యొకెబేదుల ఏకైక పుత్రిక మిర్యాము. మిర్యాము అనగా “పుష్ఠిగల” లేక “బలిష్ఠమైన” అని అర్

దేవుడంటే విసుగు కలిగిందా?
దేవుడంటే విసుగు కలిగిందా? శీర్షిక (టైటిల్) చూసి బహుశా కొందరికి కోపం కలుగ వచ్చు! కానీ ఇది ముమ్మాటికీ నిజము. చాల మంది విశ్వాసులు ప్రార్థించి, ప్రార్థించి విసిగి పోయి దేవుడు తమను వదిలేసాడు, లేదంటే దేవుడే లేడు అని ఆలోచించటానికి దైర్యం చేస్తారు. అటు పైన ఇదివరకు అసహ్యంగా చూసిన లోక రీతులను కూడా

అనుభవ గీతాలు
అనుభవ గీతాలుఒక రోజు సాయంత్రం మేము మరియు మా సంఘంలోని మరి కొన్ని కుటుంబాలతో కలిసి చర్చించుకోవడం మొదలుపెట్టాము. చెన్నై పట్టణంలో నివసించే మాకు, ఎవరైనా తెలుగు వారు పరిచయం అయ్యారంటే ఆ ఆనందమే వేరు. మన వాళ్ళు కలిసారంటే ఎక్కడలేని తెలుగు వంటలు, ఆంధ్రా రాజకీయాల చర్చలు జరుగుతూనే

విశ్వాసపు సహనం
విశ్వాసపు సహనందాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులకు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి ఆరు లక్షల ఇశ్రాయేలీయుల కాల్బలం కనానువైపు ప్రయాణం మొదలయ్యింది. సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనుకునేలోపే ముందు ముంచెత్తే ఎర్ర సముద్రం వెనక మష్టుపెట్ట జూసే ఫారో సైన్యం. మరణం ఇరువై

10 ప్రసిద్ధ బైబిల్ కథనాలు
అనేక ప్రసిద్ధ బైబిల్ కథనాలు సాహిత్యం, కళ మరియు మీడియా యొక్క వివిధ రూపాల్లో తిరిగి చెప్పబడ్డాయి మరియు స్వీకరించబడ్డాయి. ఇక్కడ అత్యంత ప్రసిద్ధ మరియు ప్రియమైన కొన్ని ఉన్నాయి:సృష్టి - ఆదికాండము పుస్తకంలో వివరించిన విధంగా దేవుడు ఆరు రోజుల్లో ప్రపంచాన్ని మరియు దాని

విశ్వాసపు సహనం
విశ్వాసపు సహనందాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులకు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి ఆరు లక్షల ఇశ్రాయేలీయుల కాల్బలం కనానువైపు ప్రయాణం మొదలయ్యింది. సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనుకునేలోపే ముందు ముంచెత్తే ఎర్ర సముద్రం వెనక మష్టుపెట్ట జూసే ఫారో సైన్యం. మరణం ఇరువై

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , యాకోబు , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , యెరూషలేము , సెల , ప్రేమ , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , సొలొమోను , రాహాబు , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , యెహోషాపాతు , ఐగుప్తు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , తెగులు , కెజీయా , ఎలియాజరు , గిల్గాలు , యోబు , బేతేలు , రోగము , అబ్దెయేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , కనాను , తీతు , ఆషేరు , ఆసా , మార్త , దొర్కా , సీమోను , రక్షణ , సబ్బు , బేతనియ , బెసలేలు , ఎఫ్రాయిము , యెహోవా వశము , యొర్దాను , హిజ్కియా , ఏఫోదు , ఎలీషా , పరదైసు , హాము , కయీను , తామారు , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , రూతు , బర్జిల్లయి ,

Telugu Keyboard help