Genesis - ఆదికాండము 12 - గ్రంథ విశ్లేషణ

1. యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
అపో. కార్యములు 7:3, హెబ్రీయులకు 11:8

1. Now the Lord said to Abram, "Leave your country, your family and your father's house, and go to the land that I will show you.

2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

2. And I will make you a great nation. I will bring good to you. I will make your name great, so you will be honored.

3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా
అపో. కార్యములు 3:25, గలతియులకు 3:8

3. I will bring good to those who are good to you. And I will curse those who curse you. Good will come to all the families of the earth because of you."

4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.

4. So Abram left as the Lord told him to do, and Lot went with him. Abram was seventy-five years old when he left Haran.

5. అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసికొని కనానను దేశమునకు వచ్చిరి.
అపో. కార్యములు 7:4

5. Abram took his wife Sarai, and his brother's son Lot, and all the things they had gathered, and the people who joined them in Haran. And they left to go to the land of Canaan. So they came to the land of Canaan.

6. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరే దగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.

6. Abram passed through the land as far as the oak of Moreh at Shechem. The Canaanite people were living in the land at that time.

7. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
గలతియులకు 3:16

7. Then the Lord showed Himself to Abram and said, "I will give this land to your children and to your children's children." So Abram built an altar there to the Lord Who had shown Himself to him.

8. అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.

8. Then he went from there to the mountain east of Bethel. He put up his tent, with Bethel on the west and Ai on the east. There he built an altar to the Lord and called upon the name of the Lord.

9. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను.

9. Then Abram traveled on, still going toward the Negev.

10. అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశ ములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.

10. Now there was no food in the land. So Abram went south to Egypt to stay there, because it was very hard to live in the land with no food.

11. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును.

11. When he was about to go into Egypt, Abram said to his wife Sarai, "I know that you are a beautiful woman.

12. ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు.

12. When the men of Egypt see you, they will say, 'This is his wife.' And they will kill me, but they will let you live.

13. నీవలన నాకు మేలుకలుగు నట్లును నిన్నుబట్టి నేను బ్రదుకు నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను.

13. Say that you are my sister. Then it may go well with me because of you. And because of you they will not kill me."

14. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి

14. When Abram came into Egypt, the men of Egypt saw that the woman was very beautiful.

15. ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.

15. Pharaoh's rulers saw her and told Pharaoh of her beauty. So the woman was taken into Pharaoh's house.

16. అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను.

16. And Pharaoh acted well toward Abram because of Sarai. He gave Abram sheep, cattle, male and female donkeys, and camels, and men and women servants.

17. అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను.

17. But the Lord sent much sickness upon Pharaoh and his house because of Abram's wife Sarai.

18. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు?

18. Then Pharaoh called Abram and said, "What is this you have done to me? Why did you not tell me that she was your wife?

19. ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితే నేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొనిపొమ్మని చెప్పెను.

19. Why did you say, 'She is my sister,' so that I took her for my wife? Now then, here is your wife.' Take her and go."

20. మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.

20. And Pharaoh told his men what to do with Abram. They led him away with his wife and all that belonged to him.