Malachi - మలాకీ 3 | View All

1. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
మత్తయి 11:3-10, మార్కు 1:2, లూకా 1:17-76, లూకా 7:19-27, యోహాను 3:28

“నా దూతను”– యెషయా 40:3; మత్తయి 3:1-3; మత్తయి 11:10, మత్తయి 11:14 పోల్చిచూడండి. బాప్తిసం ఇచ్చే యోహాను మొదటి దూత. క్రీస్తు తన పరిచర్య మొదలు పెట్టకముందు అతడు వచ్చాడు. ఇస్రాయేల్‌ప్రజ అతణ్ణి అంగీకరించలేదు. క్రీస్తు రెండో సారి రాకముందు మరో దూతగా ఏలీయా వస్తాడు (మలాకీ 4:5). మలాకీ 3:1-6 క్రీస్తు మొదటి రాక, లేక రెండో రాక, లేక రెండు రాకల గురించి చెప్తున్నది. పాత ఒడంబడికలోని మరికొన్ని భవిష్యద్వాక్కుల లాగానే ఈ వాక్కులు ఈ యుగంలోని క్రీస్తుసంఘానికి ఆధ్యాత్మికంగా చెందవచ్చు. అక్షరాలా వీటి నెరవేర్పు ఈ యుగాంతంలో జరగవచ్చు. ఇవి రెంటికీ వర్తించవచ్చన్న మాట. యెషయా 60:1-22 నోట్ చూడండి. “ఒడంబడిక దూత”– అంటే ఇస్రాయేల్‌వారి అభిషిక్తుడైన యేసు క్రీస్తు. యెషయా 42:6; యిర్మియా 31:31-34 పోల్చిచూడండి.

2. అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు;
ప్రకటన గ్రంథం 6:17

ఈ మాటలు కృప గురించి కంటే తీర్పును గురించే చెప్తున్నట్టు ఉన్నాయి. మలాకీ 4:1-5; యెషయా 2:10-18; యోవేలు 2:11; ప్రకటన గ్రంథం 6:15-17 పోల్చిచూడండి. “కంసాలి నిప్పు”– యెషయా 1:25; జెకర్యా 13:8-9.

3. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును.లేవీయులు నీతిని అనుసరించి యెహో వాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.
1 పేతురు 1:7

“వెండిని”– కీర్తనల గ్రంథము 66:10-12; దానియేలు 12:10. ఈ కృపా యుగమంతటిలోనూ ఇంతవరకూ ఇకముందూ కొనసాగే విధానం ఇది. అయితే ప్రభువు ఈ పనిని ఈ క్రొత్త ఒడంబడిక యుగంలోని తన యాజులు అంటే విశ్వాసుల్లో జరిగిస్తున్నాడు గాని ఇస్రాయేల్‌లోని లేవీవారిలో కాదు. లేవీవారిని ఆయన శుద్ధి చేయడం అనేది రాబోయే కలంలో జరుగుతుంది – యిర్మియా 33:18-22; యెహెఙ్కేలు 40:46; యెహెఙ్కేలు 44:10-16; యెహెఙ్కేలు 45:5; యెహెఙ్కేలు 48:11-13. “నీతి...నైవేద్యాలు”– ఏ యుగంలోనైనా దేవుడు కోరేది ఇదే. రోమీయులకు 12:1-2; హెబ్రీయులకు 13:15-16; 1 పేతురు 2:5 పోల్చి చూడండి.

4. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును, యూదావారును యెరూష లేము నివాసులును చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును.

ఇది యూదా, జెరుసలం మొత్తానికి చెందిన మాటలాగా ఉంది. క్రీస్తు మొదటి రాకలో ఇది నెరవేరలేదు. మత్తయి 23:37-39 పోల్చి చూడండి.

5. తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారులమీదను అప్ర మాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయ ములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢ ముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యాకోబు 5:4

“తీర్పు”– వ 2. యేసు ప్రభువు మొదటిసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చేందుకు రాలేదు – యోహాను 12:47. తన రెండో రాకడలో ఆయన తీర్పరిగా వస్తాడు – అపో. కార్యములు 17:31; 2 తిమోతికి 4:1. “మాంత్రికుల మీద”– ద్వితీయోపదేశకాండము 18:9-13; గలతియులకు 5:19-21. “వ్యభిచారుల”– నిర్గమకాండము 20:14; హెబ్రీయులకు 13:4. “అబద్ధ సాక్షుల మీద”– నిర్గమకాండము 20:16; లేవీయకాండము 19:12; ప్రకటన గ్రంథం 21:8. “నాకు భయపడకుండా”– యిర్మియా 2:19; యిర్మియా 5:22; రోమీయులకు 3:18. “కూలి విషయంలో...అన్యాయం”– లేవీయకాండము 19:13; యాకోబు 5:4; నిర్గమకాండము 22:21-22; ద్వితీయోపదేశకాండము 24:19; యెషయా 1:17; యెహెఙ్కేలు 22:7; ఆమోసు 2:6-7.

6. యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.

“మార్పు చెందను”– హెబ్రీయులకు 13:8; యాకోబు 1:17. “నాశనం కాలేదు”– ఇస్రాయేల్‌వారు దేవునిపట్ల నమ్మక ద్రోహం చేసి నాశనానికి పాత్రులయ్యారు. దేవుడు వారిని నాశనం చేయకుండా ఆగినది ఎందుకంటే ఆయన వారికి కొన్ని వాగ్దానాలు చేశాడు. వారి విషయం ఆయన వేసుకొన్న పథకాలను ఆయన మార్చదలచుకోలేదు. వాటిని నెరవేర్చేందుకు కృత నిశ్చయుడై ఉన్నాడు. రోమీయులకు 11:29 పోల్చి చూడండి.

7. మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవియ్యగామేము దేనివిషయ ములో తిరుగుదుమని మీరందురు.
యాకోబు 4:8

8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరం దురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.

“ఎలా తిరగాలి”– మలాకీ 1:2, మలాకీ 1:7. మలాకీ 1:14 లో దేవుడు వారిలో కొందరిని “వంచకులు” అన్నాడు. ఇప్పుడు వారందరినీ దొంగలు అంటున్నాడు. ఆయనకు చెందినదాన్ని తమకే ఉంచేసుకున్నందు వల్ల దేవుని దగ్గర దొంగిలిస్తున్నారు. పదో భాగాలు, అర్పణల విషయంలో ఇలా చేశారు. లేవీయకాండము 27:30; సంఖ్యాకాండము 18:21, సంఖ్యాకాండము 18:24 చూడండి. పదోభాగం ఇవ్వడం ఇప్పుడు క్రైస్తవులకు ఇయ్యబడిన శాసనం కాదు. విశ్వాసులు ధర్మశాస్త్రం కింద లేరు. కృప క్రిందే ఉన్నారు – రోమీయులకు 6:14. అందువల్ల కృప ఆధారంగానే ఇవ్వండని దేవుడు వారికి చెప్తున్నాడు. 2 కోరింథీయులకు 8:12; 2 కోరింథీయులకు 9:6-7 చూడండి. అయితే మన హృదయాల్లో కృపకు ప్రేమ తోడై పని చేస్తే ధర్మశాస్త్రం కింద ఉన్న యూదులకన్న తక్కువ ఇవ్వాలని అది చెప్పదు (1 కోరింథీయులకు 16:2; 2 కోరింథీయులకు 8:1-4). దేవునికి, ఆయన పనికి విశ్వాసులు కనీసం పదో భాగమైనా ఇవ్వాలి. విశ్వాసులు తాము, తమకున్నది అంతా దేవునిదేనని గుర్తించి (1 కోరింథీయులకు 6:19-20) ఆ ప్రకారమే దేవునికి ఇవ్వాలి. ఇవ్వడం గురించి 2 కోరింథీయులకు 9:15 నోట్స్, రిఫరెన్సులు చూడండి.

9. ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.

“శాపం”– మలాకీ 2:2 చూడండి. దేవుని శాసనాలను ధిక్కరించిన వారంతా శాపం కిందనే ఉన్నారు. (ద్వితీయోపదేశకాండము 27:26; యాకోబు 2:10). వారు దేవుని శాసనాలను మీరేవారు.

10. నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

“గిడ్డంగి”– ఆలయం దగ్గర ధాన్యం మొదలైనవి నిలవ చేసే గదులు (నెహెమ్యా 13:12). “నన్ను పరీక్షించండి”– అపనమ్మకం మూలంగా దేవుణ్ణి పరీక్షించకూడదు (నిర్గమకాండము 17:2; ద్వితీయోపదేశకాండము 6:16; కీర్తనల గ్రంథము 78:18, కీర్తనల గ్రంథము 78:41, కీర్తనల గ్రంథము 78:56; కీర్తనల గ్రంథము 106:14; 1 కోరింథీయులకు 10:9). దేవుడిక్కడ మాట్లాడుతున్నది వేరే రకమైన పరీక్ష. తన వాగ్దానాలను నమ్మి, లోబడి ఫలితాలు ఎలా ఉంటాయో చూడమని ఇస్రాయేల్‌తో అంటున్నాడు ఆయన మనందరికీ కూడా ఇలాంటి వాగ్దానమే ఇచ్చాడు – లూకా 6:38. నమ్మిక కలిగి, విధేయులై ధారాళంగా ఇచ్చేవారిని దీవించడమంటే దేవునికి ఎంతో ఇష్టం. మనలో ఇలాంటి లక్షణాలేవీ లేకపోతే ఆయన దీవెనలను మనం ఆశించరాదు. “సేనలప్రభువు యెహోవా”– 1 సమూయేలు 1:3 నోట్. తనపై నమ్మకం పెట్టుకొన్న తన ప్రజల మేలుకోసం ఆయన అన్నిటినీ, అన్ని సంఘటనలనూ అనుకూల పరచగల సమర్థుడు.

11. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు

తన ప్రజలను దీవించడానికి దేవునికి అనేక మార్గాలున్నాయి. ప్రకృతి అంతా ఆయన స్వాధీనమే.

12. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

13. యెహోవా సెలవిచ్చునదేమనగానన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికినిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు.

“ఏం చెప్పాం?”– ఒప్పుకొని, పశ్చాత్తాప పడవలసింది పోయి దేవుడు వారి గురించి చెప్పిన ప్రతి మాటనూ వారు ఎదిరించారు.

14. దేవుని సేవచేయుట నిష్ఫల మనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,

యోబు 21:7-15; కీర్తనల గ్రంథము 73:3-12. మనుషులు రాబోతున్న దేవుని తీర్పు సంగతి తెలియక తమ ఆలోచనల్లో ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. “సేవ చేయడం వ్యర్థం”– దేవుని ప్రజలు దేవునితో చెప్పదగని మాటల్లో ఇంతకంటే కఠినమైనది ఉంటుందా? ఆయన మంచివాడు, ప్రేమగలవాడు, నమ్మకమైన సేవకు ప్రతిఫలిమిస్తాడు అన్న సత్యాలను త్రోసిపుచ్చడంతో ఇది సమానం. మంచివాళ్ళు సైతం ఇలాంటి పొరపాటు ఆలోచనలో పడి, ఇలా మాట్లాడి పొరపాటు చేసే అవకాశం ఉంది. కీర్తనల గ్రంథము 73:2-3, కీర్తనల గ్రంథము 73:13-14, కీర్తనల గ్రంథము 73:22 పోల్చిచూడండి. అయితే 1 కోరింథీయులకు 15:58 చూడండి.

15. గర్విష్ఠులు ధన్యు లగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.

16. అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

17. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించు నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

“నావారుగా”– యెషయా 43:21; యోహాను 6:37; యోహాను 17:6; 1 కోరింథీయులకు 6:19. వారు తమలో తాము మాట్లాడుకునే పద్ధతిని బట్టి తాము యెహోవాకు చెందినవారమని కనపరుస్తారు. దేవుడు దాన్ని బహిరంగంగా స్థిరపరుస్తాడు. “ప్రత్యేకమైన సొత్తు”– నిర్గమకాండము 19:5; ద్వితీయోపదేశకాండము 7:6; కీర్తనల గ్రంథము 135:4; కీర్తనల గ్రంథము 149:4. ప్రపంచం మొత్తంలోకి దేవుడు తాను విమోచించినవారినీ, తనలో నమ్మకం ఉంచి తన్ను సేవించేవారినీ తన ప్రత్యేకమైన ఆస్తిగా భావిస్తాడు. “కనికరించే విధంగా”– నిర్గమకాండము 34:6-7; మత్తయి 25:31-46; యోహాను 12:26 పోల్చి చూడండి. “కనికరిస్తాను”– అంటే ఆయన లోకానికి తీర్పు తీర్చేందుకు లేచేటప్పుడు.

18. అప్పుడు నీతిగలవా రెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.Shortcut Links
మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |