Matthew - మత్తయి సువార్త 22 | View All

1. యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను.

1. yēsu vaarikuttharamichuchu thirigi upamaana reethigaa iṭlanenu.

2. పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది.

2. paralōkaraajyamu, thana kumaaruniki peṇḍli vinduchesina yoka raajunu pōliyunnadhi.

3. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తనదాసు లను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి.

3. aa peṇḍli vinduku piluvabaḍina vaarini rappin̄chuṭaku athaḍu thanadaasu lanu pampinappuḍu vaaru raanollaka pōyiri.

4. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధ ముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని

4. kaagaa athaḍu idigō naa vindu siddhaparachiyunnaanu; eddu lunu krovvina pashuvulunu vadhimpabaḍinavi; anthayu siddha mugaa unnadhi; peṇḍli vinduku raṇḍani piluvabaḍina vaarithoo cheppuḍani vērē daasulanu pampenu gaani

5. వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి.

5. vaaru lakshyamu cheyaka, okaḍu thana polamunakunu mariyokaḍu thana varthakamunakunu veḷliri.

6. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.

6. thakkinavaaru athani daasulanu paṭṭukoni avamaanaparachi champiri.

7. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.

7. kaabaṭṭi raaju kōpapaḍi thana daṇḍlanu pampi, aa narahanthakulanu sanharin̄chi, vaari paṭṭaṇamu thagalabeṭṭin̄chenu.

8. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు.

8. appuḍathaḍu peṇḍli vindu siddhamugaa unnadhi gaani piluvabaḍinavaaru paatrulu kaaru.

9. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.

9. ganuka raajamaargamulaku pōyi meeku kanabaḍu vaarinandarini peṇḍli vinduku piluvuḍani thana daasulathoo cheppenu.

10. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారి నందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను.

10. aa daasulu raajamaargamulaku pōyi cheḍḍa vaarinēmi man̄chivaarinēmi thamaku kanabaḍinavaari nandarini pōguchesiri ganuka vinduku vachinavaarithoo aa peṇḍli shaala niṇḍenu.

11. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి

11. raaju koorchunna vaarini chooḍa lōpaliki vachi, akkaḍa peṇḍlivastramu dharin̄chukonani yokani chuchi

12. స్నేహితుడా,పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను.

12. snēhithuḍaa,peṇḍli vastramulēka ikkaḍi kēlaagu vachithi vani aḍugagaa vaaḍu mauniyai yuṇḍenu.

13. అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.

13. anthaṭa raaju veeni kaaḷlu chethulu kaṭṭi velupaṭi chikaṭilōniki trōsivēyuḍi; akkaḍa ēḍpunu paṇḍlu korukuṭayu uṇḍunani parichaarakulathoo cheppenu.

14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.

14. kaagaa piluvabaḍina vaaru anēkulu, ērparachabaḍinavaaru kondarē ani cheppenu.

15. అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు

15. appuḍu parisayyulu veḷli, maaṭalalō aayananu chikkuparachavalenani aalōchanacheyuchu

16. బోధకుడా,నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము.

16. bōdhakuḍaa,neevu satyavanthuḍavai yuṇḍi, dhevuni maargamu satyamugaa bōdhin̄chuchunnaavaniyu, neevu evanini lakshyapeṭṭavaniyu, mōmaaṭamu lēnivaaḍavaniyu erugudumu.

17. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి.

17. neekēmi thoochuchunnadhi? Kaisaruku pannichuṭa nyaayamaa? Kaadaa? Maathoo cheppumani aḍuguṭaku hērōdeeyulathoo kooḍa thama shishyulanu aayanayoddhaku pampiri.

18. యేసు వారి చెడు తన మెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించు చున్నారు?
1 సమూయేలు 16:7

18. yēsu vaari cheḍu thana merigi vēshadhaarulaaraa, nannenduku shōdhin̄chu chunnaaru?

19. పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము1 తెచ్చిరి.

19. pannurooka yokaṭi naaku choopuḍani vaarithoo cheppagaa vaaraayanayoddhaku oka dhenaaramu1 techiri.

20. అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారుకైసరువనిరి.

20. appuḍaayana ee roopamunu paivraathayu evarivani vaarinaḍugagaa vaarukaisaruvaniri.

21. అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను.

21. andukaayana aalaagaithē kaisaruvi kaisarunakunu, dhevunivi dhevunikini chellin̄chu ḍani vaarithoo cheppenu.

22. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లి పోయిరి.
యెషయా 52:14

22. vaareemaaṭa vini aashcharyapaḍi aayananu viḍichi veḷli pōyiri.

23. పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి
యెషయా 52:14

23. punarut'thaanamulēdani cheppeḍi saddookayyulu aa dinamuna aayanayoddhaku vachi

24. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను;
ఆదికాండము 38:8, ద్వితీయోపదేశకాండము 25:5

24. bōdhakuḍaa, okaḍu pillalu lēka chanipōyinayeḍala athani sahōdaruḍu athani bhaaryanu peṇḍlichesikoni thana sahōdaruniki santhaanamu kalugajēya valenani mōshē cheppenu;

25. మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.

25. maalō ēḍuguru sahōdaruluṇḍiri; modaṭivaaḍu peṇḍlichesikoni chanipōyenu; athaniki santhaanamu lēnanduna athani sahōdaruḍu athani bhaaryanu theesikonenu.

26. రెండవ వాడును మూడవ వాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.

26. reṇḍava vaaḍunu mooḍava vaaḍunu ēḍava vaanivaraku andarunu aalaagē jarigin̄chi chanipōyiri.

27. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను.

27. andari venuka aa streeyu chanipōyenu.

28. పునరుత్థాన మందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి.

28. punarut'thaana mandu ee yēḍugurilō aame evaniki bhaaryagaa uṇḍunu? aame veerandarikini bhaaryagaa uṇḍenu gadaa ani aayananu aḍigiri.

29. అందుకు యేసులేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.

29. anduku yēsulēkhanamulanugaani dhevuni shakthinigaani erugaka meeru porabaḍuchunnaaru.

30. పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు.

30. punarut'thaanamandu evarunu peṇḍlichesikonaru, peṇḍli kiyya baḍaru; vaaru paralōkamandunna doothalavale unduru.

31. మృతుల పునరుత్థానమునుగూర్చినేను అబ్రాహాము దేవు డను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా?

31. mruthula punarut'thaanamunugoorchinēnu abraahaamu dhevu ḍanu, issaaku dhevuḍanu, yaakōbu dhevuḍanai yunnaanani dhevuḍu meethoo cheppinamaaṭa meeru chaduvalēdaa?

32. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను.
నిర్గమకాండము 3:6, నిర్గమకాండము 3:16

32. aayana sajeevulakē dhevuḍu gaani mruthulaku dhevuḍu kaaḍani vaarithoo cheppenu.

33. జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి.

33. januladhi vini aayana bōdha kaashcharyapaḍiri.

34. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి.

34. aayana saddookayyula nōru mooyin̄chenani pari sayyulu vini kooḍivachiri.

35. వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు

35. vaarilō oka dharmashaastrō padheshakuḍu aayananu shōdhin̄chuchu

36. బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.

36. bōdhakuḍaa, dharma shaastramulō mukhyamaina aagna ēdani aḍigenu.

37. అందు కాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే.
ద్వితీయోపదేశకాండము 6:5, యెహోషువ 22:5

37. andu kaayananee poorṇahrudayamuthoonu nee poorṇaatmathoonu nee poorṇamanassuthoonu nee dhevuḍaina prabhuvunu prēmimpa valenanunadhiyē.

38. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.

38. idi mukhya mainadhiyu modaṭidiyunaina aagna.

39. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
లేవీయకాండము 19:18

39. ninnuvale nee poruguvaani prēmimpavalenanu reṇḍava aagnayu daanivaṇṭidhe.

40. ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.

40. ee reṇḍu aagnalu dharma shaastramanthaṭikini pravakthalakunu aadhaaramai yunnavani athanithoo cheppenu.

41. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి

41. okappuḍu parisayyulu kooḍiyuṇḍagaa yēsu vaarini chuchi

42. క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి.

42. kreesthunugoorchi meekēmi thoochuchunnadhi? aayana evani kumaaruḍani aḍigenu. Vaaru aayana daaveedu kumaaruḍani cheppiri.

43. అందుకాయనఆలా గైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు
2 సమూయేలు 23:2

43. andukaayana'aalaa gaithē nēnu nee shatruvulanu nee paadamula krinda un̄chuvaraku

44. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువునా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు?
కీర్తనల గ్రంథము 110:1

44. neevu naa kuḍipaarshvamuna koorchuṇḍumani prabhuvunaa prabhuvuthoo cheppenu ani daaveedu aayananu prabhuvani aatmavalana ēla cheppu chunnaaḍu?

45. దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా

45. daaveedu aayananu prabhuvani cheppinayeḍala, aayana ēlaagu athaniki kumaaruḍagunani vaarinaḍugagaa

46. ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

46. evaḍunu maarumaaṭa cheppalēkapōyenu. Mariyu aa dinamunuṇḍi evaḍunu aayananu oka prashnayu aḍuga tegimpalēdu.Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |