అలాంటి జనసమూహంలో అనేకమంది తనను నిజంగా అనుసరించేవారు కారని యేసుకు తెలుసు. అంతేగాక అనేకమంది 16-23 వచనాల్లోని ఉదాహరణల్లాంటివాటిని అపార్థం చేసుకుని శిష్యరికం చెయ్యడానికి గల నియమాలు అంత కష్టతరమైనవి కాదనుకుంటారు కూడా. ఇలాంటి అపార్థాలేవైనా ఉంటే ఇప్పుడు యేసుప్రభువు వాటిని సవరించబూను కుంటున్నాడు. తనను అనుసరిస్తూ తనదగ్గర నేర్చుకోగోరే వారు తప్పనిసరిగా పాటించవలసిన మూడు నియమాలను ఇక్కడ చెప్తున్నాడు.
ఇతరులపట్ల ఒక శిష్యుని మనస్తత్వం సరిగా ఉండాలి (వ 26), తనపట్ల తనకు సరైన అభిప్రాయం ఉండాలి (వ 26, 27), ఇహలోక విషయాలపట్ల అతని మనస్తత్వం సరిగా ఉండాలి (వ 33), నియమాలన్నీ అంతరంగంలో ఉండే స్థితికి సంబంధించినవి, ఆత్మలో దేవుడు జరిగించిన కార్యాన్ని వెల్లడించేవి. తెలివి, చదువు, ఈ లోకంలోని స్థానం, జాతి మొదలైనవాటికి మనుషులు చాలా ప్రాధాన్యత ఇస్తారు గాని పై విషయాలు ఇలాంటివాటిపై ఆధారపడి లేవు. ఈ మనస్తత్వాలు సహజసిద్ధంగా ఎవరిలోనూ ఉండవు. ఇవి దేవుని కృపవల్ల పవిత్రాత్మ పని ద్వారా కలిగేవి.