Peter I - 1 పేతురు 4 | View All

1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

మనల్ని పాపంనుంచి విడుదల చేయడానికి క్రీస్తు బాధలు అనుభవించాడు (1 పేతురు 2:24; 1 పేతురు 3:18). పాపానికి విరుద్ధంగా మన పోరాటంలో బాధలనెదుర్కొనేందుకు మనం సిద్ధపడి ఉండాలి. మనకు ఈ మనస్తత్వం ఉంటే అది మనం చేసే ఆధ్యాత్మిక యుద్ధంలో ఒక ఆయుధంలాగా ఉంటుంది. విశ్వాసులు క్రీస్తుతో తమకున్న ఏకత్వాన్ని గుర్తించి, క్రీస్తులో తాము కూడా పాపం విషయంలో మరణించామన్న సత్యాన్ని గ్రహించాలి. రోమీయులకు 6:5-13 చూడండి. క్రీస్తు బాధలను దృష్టిలో ఉంచుకుని చూస్తే పాపాల విషయంలో మనకెలాంటి జోక్యమూ ఎప్పుడూ ఉండకూడదు. మన కోరికలను నెరవేర్చుకోవడానికి కాక దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు మనం జీవించాలి (రోమీయులకు 8:5, రోమీయులకు 8:12; రోమీయులకు 12:1-2; కొలొస్సయులకు 1:9; కొలొస్సయులకు 4:12; 1 థెస్సలొనీకయులకు 4:3; హెబ్రీయులకు 13:21).

2. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,

తీతుకు 3:3; 1 తిమోతికి 1:13; ఎఫెసీయులకు 2:1-3; 1 కోరింథీయులకు 6:11 పోల్చి చూడండి. క్రీస్తు శుభవార్త పాపం అగాధం అట్టడుగున ఉన్నవారినైనా చేరగలదు. వారిని శాశ్వతంగా మార్చగలదు. ఇక్కడ వర్ణించిన విగ్రహ పూజ సంబంధమైన మతాలు, ఈ నీచమైన జీవిత విధానం తరచుగా కలిసే ఉంటాయని ఇక్కడ గమనించవచ్చు. “అసహ్యమైన”– ద్వితీయోపదేశకాండము 7:25; ద్వితీయోపదేశకాండము 12:31; ద్వితీయోపదేశకాండము 13:12-14; ద్వితీయోపదేశకాండము 17:2-5; ద్వితీయోపదేశకాండము 27:15; ద్వితీయోపదేశకాండము 29:17; ద్వితీయోపదేశకాండము 32:16.

4. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.

పాత జీవితాన్ని వదిలి పవిత్ర జీవనం గడిపే విశ్వాసులు అలా పాత జీవితంలోనే ఉండిపోయినవారికి మందలింపులుగా హెచ్చరికలుగా ఉన్నారు. దేవుడంటే భయభక్తులు లేనివారు, విశ్వాసులను ఇలా తిట్టిపోస్తూ నిందిస్తూ ఉండడానికి కొంతవరకు కారణం ఇదే. మత్తయి 12:36; అపో. కార్యములు 10:42; అపో. కార్యములు 17:31; రోమీయులకు 2:16; రోమీయులకు 14:12; 2 తిమోతికి 4:1; హెబ్రీయులకు 4:13.

5. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.

6. మృతులు శరీరవిషయములో మానవరీత్య తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికికూడ సువార్త ప్రకటింపబడెను.

ఈ వచనం కూడా అర్థం చేసుకునేందుకు కష్టమైనదే. దీని అర్థం బహుశా ఇది కావచ్చు – గతంలోనే చనిపోయినవారికి వారు జీవించి ఉన్నప్పుడు వారికి శుభవార్త ప్రకటించడం జరిగింది. ఇప్పుడు బ్రతికి ఉన్న మన విషయంలో లాగానే వారి విషయంలో కూడా ఇందులోని ఉద్దేశం ఒకటే – ఆత్మ సంబంధమైన జీవం కలగాలనీ, “దేవుని ఇష్టానుసారంగా” బ్రతకాలనీ (వ 2). ఈ వచనాన్ని బట్టి కొందరు పండితులు ఏమని వ్యాఖ్యానించారంటే – తమ జీవిత కాలంలో శుభవార్త విననివారికి చనిపోయిన తరువాత శుభవార్త ప్రకటన వినే అవకాశం ఉంటుందన్నారు. ఇలా వాదిస్తున్నవారు ఈ వచనాన్ని 1 పేతురు 3:19 తో ముడిపెట్టి ఆ వచనంలోని “ఆత్మలు” చనిపోయినవారి ఆత్మలే అన్నారు. అయితే బైబిలులో మరి ఎక్కడా ఇలాంటి ఉపదేశం కనిపించదు. ఇలాంటి ఒకటి రెండు సందేహాస్పదమైన, సందిగ్ధమైన వచనాలపై ఆధారపడ్డ ఇలాంటి ప్రాముఖ్యమైన ఉపదేశాన్ని మనం నమ్మకూడదు. ఒకవేళ అలాంటి అవకాశం గనుక నిజంగా ఉంటే దేవుడు మనకు దాన్ని వెల్లడి చేయలేదు. మనకు తెలిసినదల్లా ఆయన మనకు వెల్లడి చేసినదే – ద్వితీయోపదేశకాండము 29:29. మరి కొంతమంది పండితులు ఇక్కడ “చనిపోయినవారు” అనే మాటకు తమ పాపాల్లో అపరాధాల్లో చనిపోయినవారు అని అర్థం అంటారు (ఎఫెసీయులకు 2:1). ఈ వ్యాఖ్యానం కూడా ఇక్కడ అంత సరిగా అనిపించడం లేదు.

7. అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.

“దగ్గరలో”– రోమీయులకు 13:12; రోమీయులకు 5:9; ప్రకటన గ్రంథం 1:3; 2 పేతురు 3:8-9; మత్తయి 24:36, మత్తయి 24:42. ఈ యుగాంతంలో గొప్ప బాధలు, విషమ పరీక్షలు వస్తాయి. గొప్ప మోసకరమైన పరిస్థితులు ఉంటాయి (మత్తయి 24:4-14, మత్తయి 24:21-25). క్రీస్తుకు విశ్వాస పాత్రంగా, స్థిరంగా నిలవాలంటే ప్రార్థన చాలా అవసరంగా ఉంటుంది. నిజమైన ప్రార్థనకు అవసరమైన రెండు లక్షణాలు ఇక్కడ చూడండి. లూకా 21:36; లూకా 22:40, లూకా 22:46 పోల్చి చూడండి.

8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.
సామెతలు 10:12

“ప్రేమ”– 1 పేతురు 1:22; యోహాను 13:34; యోహాను 15:12, యోహాను 15:17; 1 యోహాను 3:11, 1 యోహాను 3:18; 1 యోహాను 4:8. పేతురు దైవ ప్రేమను సూచించే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. 1 కోరింథీయులకు 13:1 చూడండి. “కప్పుతుంది”– దీని అర్థం ఏమిటో, ఏమి కాదో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పేతురు సంఘంలో ఉండవలసిన క్రమశిక్షణ గురించి అంటే ఒక స్థానిక సంఘంలో బయటపెట్టవలసిన పాపాన్ని కప్పిపుచ్చడం గురించి రాయడం లేదు. మత్తయి 18:15-17; అపో. కార్యములు 5:1-11; 1 కోరింథీయులకు 5:1-5, 1 కోరింథీయులకు 5:12-13 పోల్చి చూడండి. వ్యక్తిగత సంబంధాలలో ప్రేమ ఎలా పని చేస్తూ ఉంటుందో పేతురు ఇక్కడ చూపిస్తున్నాడు. సామెత 10:12 చూడండి. ఇతరుల్లోని పాపాలను బట్టబయలు చేయడం ప్రేమకు ఇష్టం ఉండదు. ఎవరి మీదికీ సిగ్గునూ, తీర్పునూ అది తీసుకురాగోరదు. పాపాలను దేవుడు మాత్రమే నిజంగా కప్పగలడు. ప్రతి ఒక్కరినీ ఆయన దగ్గరికి తేవడానికే ప్రేమ ప్రయత్నిస్తుంది (కీర్తనల గ్రంథము 32:1-2; రోమీయులకు 4:6-8; యాకోబు 5:20 పోల్చి చూడండి). ప్రేమ క్షమిస్తుందనీ, అలా క్షమిస్తూనే ఉంటుందని ఇక్కడ పేతురు విశ్వాసులకు గుర్తు చేస్తూ ఉండవచ్చు (1 కోరింథీయులకు 13:5; మత్తయి 18:21-22). మనలో ప్రేమ గనుక ఉంటే మన అనేక పాపాలను దేవుడు కప్పివేస్తాడని కూడా పేతురు చెప్తూ ఉండవచ్చు (లూకా 7:47-50 పోల్చి చూడండి). ప్రేమ ఎక్కడ కనిపించినా సరే దానికుండే స్వభావం గురించి చెప్తున్నాడన్నది ఖాయం. దివ్య ప్రేమ ఎప్పుడూ న్యాయానికీ పవిత్రతకూ అనుగుణంగా పాపాలను కప్పివేసే దారికోసం వెతుకుతూ ఉంటుంది. ఆదికాండము 3:21; ఆదికాండము 9:21-23; ప్రకటన గ్రంథం 3:18-19 పోల్చి చూడండి. ఒక వ్యక్తి పాపాలను కప్పివేయడం అతనికి హానికరంగా ఉంటే, దానిమూలంగా అతడు ఆ పాపాలలో కొనసాగడానికి ఆస్కారం కలిగితే ప్రేమ ఎన్నడూ అలా చేయదు. పాపాలు చేసేవారు వాటిని విడిచిపెట్టేలా చేసేందుకే ప్రేమ ఎప్పుడూ ప్రయత్నిస్తుంది (సామెతలు 28:13 పోల్చి చూడండి). నిజమైన ప్రేమ ఏ విధంగానూ పాపాన్ని ప్రోత్సహించదు.“ప్రేమ”– 1 పేతురు 1:22; యోహాను 13:34; యోహాను 15:12, యోహాను 15:17; 1 యోహాను 3:11, 1 యోహాను 3:18; 1 యోహాను 4:8. పేతురు దైవ ప్రేమను సూచించే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. 1 కోరింథీయులకు 13:1 చూడండి. “కప్పుతుంది”– దీని అర్థం ఏమిటో, ఏమి కాదో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పేతురు సంఘంలో ఉండవలసిన క్రమశిక్షణ గురించి అంటే ఒక స్థానిక సంఘంలో బయటపెట్టవలసిన పాపాన్ని కప్పిపుచ్చడం గురించి రాయడం లేదు. మత్తయి 18:15-17; అపో. కార్యములు 5:1-11; 1 కోరింథీయులకు 5:1-5, 1 కోరింథీయులకు 5:12-13 పోల్చి చూడండి. వ్యక్తిగత సంబంధాలలో ప్రేమ ఎలా పని చేస్తూ ఉంటుందో పేతురు ఇక్కడ చూపిస్తున్నాడు. సామెతలు 10:12 చూడండి. ఇతరుల్లోని పాపాలను బట్టబయలు చేయడం ప్రేమకు ఇష్టం ఉండదు. ఎవరి మీదికీ సిగ్గునూ, తీర్పునూ అది తీసుకురాగోరదు. పాపాలను దేవుడు మాత్రమే నిజంగా కప్పగలడు. ప్రతి ఒక్కరినీ ఆయన దగ్గరికి తేవడానికే ప్రేమ ప్రయత్నిస్తుంది (కీర్తనల గ్రంథము 32:1-2; రోమీయులకు 4:6-8; యాకోబు 5:20 పోల్చి చూడండి). ప్రేమ క్షమిస్తుందనీ, అలా క్షమిస్తూనే ఉంటుందని ఇక్కడ పేతురు విశ్వాసులకు గుర్తు చేస్తూ ఉండవచ్చు (1 కోరింథీయులకు 13:5; మత్తయి 18:21-22). మనలో ప్రేమ గనుక ఉంటే మన అనేక పాపాలను దేవుడు కప్పివేస్తాడని కూడా పేతురు చెప్తూ ఉండవచ్చు (లూకా 7:47-50 పోల్చి చూడండి). ప్రేమ ఎక్కడ కనిపించినా సరే దానికుండే స్వభావం గురించి చెప్తున్నాడన్నది ఖాయం. దివ్య ప్రేమ ఎప్పుడూ న్యాయానికీ పవిత్రతకూ అనుగుణంగా పాపాలను కప్పివేసే దారికోసం వెతుకుతూ ఉంటుంది. ఆదికాండము 3:21; ఆదికాండము 9:21-23; ప్రకటన గ్రంథం 3:18-19 పోల్చి చూడండి. ఒక వ్యక్తి పాపాలను కప్పివేయడం అతనికి హానికరంగా ఉంటే, దానిమూలంగా అతడు ఆ పాపాలలో కొనసాగడానికి ఆస్కారం కలిగితే ప్రేమ ఎన్నడూ అలా చేయదు. పాపాలు చేసేవారు వాటిని విడిచిపెట్టేలా చేసేందుకే ప్రేమ ఎప్పుడూ ప్రయత్నిస్తుంది (సామెతలు 28:13 పోల్చి చూడండి). నిజమైన ప్రేమ ఏ విధంగానూ పాపాన్ని ప్రోత్సహించదు.

9. సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

రోమీయులకు 12:13; రోమీయులకు 16:23; హెబ్రీయులకు 3:2; 3 యోహాను 1:8. ప్రేమను వెల్లడి చేసే మార్గాల్లో ఇదొకటి.

10. దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.

“ఆధ్యాత్మిక వరం”– రోమీయులకు 12:6-8; 1 కోరింథీయులకు 12:4-11; ఎఫెసీయులకు 4:7-13. “ఇతరులకు సేవ చేయడానికి”– ప్రేమగలవారు దేవుడిచ్చిన సామర్థ్యాలను ఇతరులకు సహాయపడేందుకు ఉపయోగిస్తారు గానీ వ్యక్తిగత లాభం, డబ్బు, కీర్తి ప్రతిష్ఠలకోసం కాదు. “మంచి నిర్వాహకులుగా”– మత్తయి 24:45; మత్తయి 25:21; 1 కోరింథీయులకు 4:1-2.

11. ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచ బడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్‌.

“మాట్లాడితే”– బైబిలు ఆధారంగా మాటలద్వారా చేసే ఏ పరిచర్య అయినా ఈ కోవకే చెందుతుంది. ఇలా చేసేవాడు తాను క్రీస్తు స్థానంలో ఆయన ప్రతినిధిగా, దూతగా నిలబడివున్నానని గుర్తుంచుకొని అధికారంతో దేవుని వాక్కును బోధించాలి. “దేవుడిచ్చిన సామర్థ్యంతో”– మన స్వంత బలంతో సేవ చేస్తుండే అవకాశం ఉంది. ఇది వ్యర్థం అయిపోతుంది. “మహిమ కలగాలనే”– మన సేవంతటిలోనూ మన ఉద్దేశం ఇదే కావాలి. తమ స్వంత కీర్తి కోసం మాట్లాడేవారు, లేక తమకు మెప్పు కలగాలనే సేవ చేసేవారు దేవునికి చెందవలసిన స్తుతి, మహిమను దోచుకోజూస్తున్నారు. మత్తయి 6:2, మత్తయి 6:5; 1 కోరింథీయులకు 10:31 పోల్చి చూడండి.

12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

“మంటల్లాంటి”– అగ్ని పరీక్ష అంటే లోహాలను శుద్ధి చేసే పద్ధతిని దృష్టిలో ఉంచుకుని పేతురు రాస్తున్నాడు. 1 పేతురు 1:7; కీర్తనల గ్రంథము 66:10 చూడండి. మనల్ని పరీక్షించి శుద్ధి చేసేందుకే దేవుడు అగ్నివంటి పరీక్షలను రానిస్తాడు. “ఆశ్చర్యపడకండి”– కష్టాలు హింసలు వస్తాయని క్రీస్తు, ఆయన రాయబారులు కూడా పదే పదే హెచ్చరించారు (1 పేతురు 2:20-21; 1 పేతురు 4:1; యోహాను 10:33; అపో. కార్యములు 14:22; రోమీయులకు 8:17; 2 తిమోతికి 3:12).

13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతో షించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.

“వెల్లడి అయ్యేటప్పుడు”– తీతుకు 2:13. అప్పుడు మన విషమ పరీక్షలకూ బాధలకూ తగిన ప్రతిఫలం లభిస్తుంది (రోమీయులకు 8:17-18; 2 కోరింథీయులకు 4:17-18). “మహానందంతో ఉప్పొంగి”– మత్తయి 5:11-12; అపో. కార్యములు 5:3; రోమీయులకు 5:3; కొలొస్సయులకు 1:24; యాకోబు 1:2. విశ్వాసులకు విషమ పరీక్షలు ఎదురైతే దేవుడు వారికి చెప్పేది ఇదే. వాటి పట్ల మన మనస్తత్వం చాలా ప్రాముఖ్యం. పరీక్షలూ బాధలూ అనుభవించేటప్పుడు సణుక్కోకూడదు. సోలిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. మన విషయంలో మనకు మేలు జరగడానికి ఏమి చెయ్యాలో దేవునికి బాగా తెలుసని దేవునిలోనే నమ్మకం పెట్టుకుని రోమీయులకు 8:28 లో రాసి ఉన్నదాన్ని ఎరిగి సంతోషంగా ఉండాలి. అగ్నివంటి బాధలను భరించడం అంటే క్రీస్తు పడిన బాధల్లో పాలు పంచుకోవడమేనని గుర్తించండి (2 కోరింథీయులకు 2:5).

14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
కీర్తనల గ్రంథము 89:50-51, యెషయా 11:2

“ధన్యులు”– లూకా 6:22. మనం క్రీస్తులో విశ్వాసులం కాబట్టి మన మీదికి నిందలు వచ్చినప్పుడే ఇది నిజం. ఇతర కారణాలవల్ల నిందలు వస్తే ధన్యులం కాము. “మహిమా...దేవాత్మ”– దేవుని ఆత్మ పరలోక మహిమనుండి వచ్చి విశ్వాసులను అక్కడికి తోడుకుపోతాడు. ఇప్పుడు ఆయన వారిలో ఉన్నాడు (అపో. కార్యములు 1:8; 1 యోహాను 2:20). వారు బాధలను సహించడం, క్రీస్తు కోసం నిందల పాలవడం అంతా ఇందుకు రుజువు.

15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

“సిగ్గుపడకూడదు”– అపో. కార్యములు 5:41; హెబ్రీయులకు 11:26 పోల్చి చూడండి. క్రీస్తు పేరును ధరించినందుచేత క్రైస్తవులెందుకు సిగ్గుపడాలి? మనం జీవిస్తున్న లోకం అలాంటిది (యోహాను 15:18-25; యోహాను 16:1-4). లోకం తన ఇష్ట పూర్వకంగా చీకటిలో ఉంటూ, ఆధ్యాత్మిక వెలుగును తిరస్కరిస్తూ ఉంది. (యోహాను 3:19-20).

17. తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?
యిర్మియా 25:29, యెహెఙ్కేలు 9:6

“ఇంటివారి”– గలతియులకు 6:10; ఎఫెసీయులకు 2:19; హెబ్రీయులకు 2:11. “తీర్పు”– 1 కోరింథీయులకు 11:31-32; 2 థెస్సలొనీకయులకు 1:5. విశ్వాసులకు లోకమంతటితో కలిసి తీర్పు తీర్చే అవసరత లేకుండా చేయడానికి దేవుడు వారికి అస్తమానం తీర్పు తీరుస్తూ వారిని క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడు. “విధేయత చూపని”– యోహాను 3:36; 2 థెస్సలొనీకయులకు 1:8-9.

18. మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?
సామెతలు 11:31

సామెతలు 11:31. “కష్టమైతే”– మార్కు 10:24. న్యాయవంతులకు రక్షణ కలగడం ఎందుచేత కష్టం? వారి శత్రువులు చాలా మంది ఉన్నారు. వారు బలవంతులే – 1 పేతురు 5:8; ఎఫెసీయులకు 6:11-12. విశ్వాసులేమో బలహీనులు, వారిలో శరీర స్వభావం కూడా ఉంది – రోమీయులకు 7:18; గలతియులకు 5:16-17; 1 యోహాను 1:8. విత్తనాలు చల్లడం, పంట కోయడం అనే దేవుని నియమం విశ్వాసుల విషయంలో కూడా నెరవేరవలసిందే – రోమీయులకు 2:6-8; గలతియులకు 6:7-8. దేవుడు వారి ప్రవర్తనను న్యాయవంతంగా తీర్చి దిద్దాలి. దేవుని ప్రమాణాలు చాలా ఉన్నతమైనవి. తన ప్రజల్లో నెరవేరవలసిన కొన్ని సూత్రాలను ఆయన నిర్దేశించాడు. వారు ఇరుకు ద్వారంలో ప్రవేశించడం మాత్రమే కాదు, ఇరుకు మార్గంలోనే కొనసాగాలి (మత్తయి 7:13-14). తమ స్వంత చిత్తాన్ని చేయడానికి నిరాకరిస్తూ దేవుని చిత్తానికి లోబడడం నేర్చుకోవాలి (మత్తయి 7:21). తమకున్నదంతా విడిచి క్రీస్తును అనుసరించాలి (లూకా 14:33). పవిత్రతను అనుసరించడం నేర్చుకోవాలి (యోహాను 10:27; హెబ్రీయులకు 12:6). అగ్ని పరీక్షలు, విస్తారమైన క్రమశిక్షణ ద్వారా వారు భద్రంగా ప్రయాణించాలి (హెబ్రీయులకు 12:5-13). అంతం వరకు నమ్మకాన్ని నిలుపుకోవాలి (హెబ్రీయులకు 10:38-39). న్యాయవంతుల రక్షణ కష్టం అయినప్పటికీ అది ఖాయమైనదే (1 పేతురు 1:5; యోహాను 6:39; యోహాను 10:28; రోమీయులకు 5:9-10). “భక్తిహీనులూ”– న్యాయవంతుల రక్షణ అంత కష్టమైతే, క్రీస్తునూ, ఆయన ఇరుకు దారినీ, ఆయన సంకల్పాన్నీ, పవిత్రతనూ, నమ్మకాన్నీ నిరాకరించేవారి సంగతేమిటి?

19. కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
కీర్తనల గ్రంథము 31:5

“మంచి”– 1 పేతురు 2:12, 1 పేతురు 2:15; 1 పేతురు 3:11; రోమీయులకు 2:7; 2 కోరింథీయులకు 5:10; 2 కోరింథీయులకు 9:8; గలతియులకు 6:9-10; ఎఫెసీయులకు 2:10; కొలొస్సయులకు 1:10; 2 తిమోతికి 3:17; తీతుకు 2:14. “మంచి చేస్తూ”– కష్టాలూ అవమానాలూ హింసలూ, లేక దేవుని క్రమశిక్షణ ఇవేవీ కూడా మంచి చేయకుండా మనల్ని ఆపే అవకాశం రానియ్యకూడదు. “అప్పచెప్పుకోవాలి”– 1 పేతురు 5:7; కీర్తనల గ్రంథము 31:5; కీర్తనల గ్రంథము 37:5; అపో. కార్యములు 20:32.Shortcut Links
1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |