2:1 నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు.2:3 కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.2:4 బోయజు బేత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వ దించును గాకనిరి.2:5 అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా2:8 అప్పుడు బోయజు రూతుతో నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.2:10 అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్య ముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.2:14 బోయజు భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.2:15 ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి2:19 అంతట ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి–ఎవని యుద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను.2:23 కాబట్టి యవలకోతయు గోధుమలకోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివసించెను.3:2 ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.3:7 బోయజు మనస్సున సంతోషించునట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.4:1 బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు ఓయి, యీ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.4:2 బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడనిచెప్పగా వారును కూర్చుండిరి.4:5 బోయజు నీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా4:8 ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా4:9 బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు.4:13 కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారునికనెను.4:20 నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,4:21 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,