Chronicles I - 1 దినవృత్తాంతములు 1

1. ఆదాము షేతు ఎనోషు
లూకా 3:36-38

2. కేయినాను మహలలేలు యెరెదు

3. హనోకు మెతూషెల లెమెకు

4. నోవహు షేము హాము యాపెతు.

5. యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

6. గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.

7. యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.

8. హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.

9. కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.

10. కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.

11. లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు

12. పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.

13. కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.

14. యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు

15. హివ్వీయులు అర్కీయులు సీనీయులు

16. అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.

17. షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.

18. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

19. ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.

20. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

21. హదోరమును ఊజాలును దిక్లానును

22. ఏబాలును అబీమా యేలును షేబను

23. ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.

24. షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
లూకా 3:34-36

25. సెరూగు నాహోరు తెరహు

26. అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.

27. అబ్రాహాము కుమారులు,

28. ఇస్సాకు ఇష్మాయేలు.
లూకా 3:34

29. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము

30. మిష్మా దూమా మశ్శా హదదు తేమా

31. యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.

32. అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.

33. మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.

34. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.
మత్తయి 1:2, లూకా 3:34

35. ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.

36. ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.

37. రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.

38. శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.

39. లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.

40. శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.

41. అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.

42. ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.

43. ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.

44. బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.

45. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.

46. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.

47. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.

48. శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.

49. షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.

50. బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.

51. హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,

52. అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,

53. కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,

54. మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.