Nehemiah - నెహెమ్యా 5 | View All

1. తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి.

2. ఏదనగా కొందరు మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకు లము. అందుచేత మేము తిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసి కొందుమనిరి.

3. మరికొందరుక్షామ మున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువ పెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందు మనిరి.

4. మరికొందరురాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితివిు.

5. మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తె లలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా

6. వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని.

7. అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించిమీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి

8. అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితివిు, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.

9. మరియు నేనుమీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా?

10. నేనును నా బంధువులును నా దాసులునుకూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితివిు; ఆ అప్పు పుచ్చుకొనకుందము.

11. ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని.

12. అందుకు వారునీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.

13. మరియు నేను నా ఒడిని దులిపిఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన యింటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును; ఇటువలె వాడు దులిపి వేయబడి యేమియు లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరు ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరును ఈ మాట చొప్పుననే జరిగించిరి.

14. మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరము వరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు.

15. అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.

16. ఇదియుగాక నేను ఈ గోడపని చేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి.

17. భూమి సంపాదించుకొనినవారము కాము; నా భోజనపు బల్లయొద్ద మా చుట్టునున్న అన్యజనులలోనుండి వచ్చిన వారు గాక యూదులును అధికారులును నూట ఏబదిమంది కూర్చునియుండిరి.

18. నా నిమిత్తము ప్రతి దినము ఒక యెద్దును శ్రేష్ఠమైన ఆరు గొఱ్ఱెలును సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను, పదిరోజులకు ఒకమారు నానావిధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు.

19. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగు నట్లుగా నన్ను దృష్టించుము.బైబిల్ అధ్యయనం - Study Bible
5:1-19. నగర ప్రాకారాలను పునర్నిర్మించడంలో నెహెమ్యా చేసిన ప్రయత్నం యెరూషలేము, యూదాల భద్రత, పురోభివృద్ధికి ఒక కీలకమైన మెట్టు. అయితే యెరూషలేము లోపల పనివారి లేమి ఎంతగా ఉందంటే అప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్న బీదల పరిస్థితిని అది మరింత దిగజార్చింది. ఆ కాలంలోని దీనమైన ఆర్థిక పరిస్థితులను చెరకు ముందున్న ప్రవక్తలు తమ రచనల్లో రూఢిపరిచారు. సరిగా పండని పంటలు, పారశీక రాజులు విధించిన విపరీతమైన కప్పం, వారి కష్టాలను మరింత దుర్భరం చేశాయి (హగ్గయి 1:6-11; మలాకీ 3:7-15). క్రీ.పూ. 8వ శతాబ్దంలో ఉన్నట్టుగా (ఆమోసు 2:6-8; 4:1-5) ఇప్పుడు మళ్ళీ ధనవంతులకు, బీదవారికి అంతరం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితిని రాకుండా చేయడానికే పా.ని. ధర్మశాస్త్రం ఆస్తి - హక్కులు, సునాద సంవత్సరం అనేవాటిని నియమించడం ద్వారా ప్రజలకు భరోసా ఇచ్చింది.. 

5:1 ఫిర్యాదు చేసినవారిలో జనులును వారి భార్యలును మొదటి గుంపు. వీరు భూమిలేని నిరుపేదలు, వీరు తమ అనుదినాహారం కోసం కేవలం తమ భర్తలు రోజువారి కూలీలుగా చేసి సంపాదించిన దానిపై ఆధారపడ్డారు. వారు తమ ఇళ్ళు విడిచిపెట్టి యెరూషలేములో పనిలో ఉండిపోవడం వలన అది వారిని మరింత నిస్పృహకు గురిచేసింది. 

5:2 వారు తాము గోడలు కట్టటం గురించి కాక తమ ఆహారం విషయం చూసుకోవలసి ఉందని వారు ఫిర్యాదు చేశారు. “మేము గోడలను భుజించ లేము కదా!"

5:3 తమ మనుగడ కోసం తమ ఆస్తులను తనఖా పెట్టవలసి వచ్చినవారు ఆ రెండవ గుంపు. సాధారణంగా పంటకోత చేతికి వచ్చిన కాలంలో వారి అప్పులు తీర్చివేయబడేవి. అయితే వారి పురుషులు ఆగష్టు, సెప్టెంబరు నెలలలో యెరూషలేములో పనిచేస్తుండడాన్ని బట్టి వారి అప్పులు ముగింపుకు చేరుకుంటున్నాయి. 

5:4 ఇక ఫిర్యాదు చేయడానికి వచ్చిన మూడవ గుంపు రాజుగారికి పన్ను చెల్లించుటకై అప్పులు తీసుకున్నవారు. దీనికి రుజువుగా ఆ కాలం నాటి బబులోనియా, ఐగుప్తు వ్రాత ప్రతుల్లో ఈ విధంగా పన్నులు కట్టలేక తమ పిల్లలను దాసత్వంలోకి అమ్మివేసిన కుటుంబాల జాబితాలు లభించాయి. వారిలో చాలామంది. చివరికి తమ - భూములను కోల్పోయి భూమిలేని కూలీలుగా మారిపోయారు. ఆ సమయంలో పన్నులు కట్టడం కోసం వారు తీసుకొనే అప్పులకు వడ్డీ 40 నుండి 50 శాతంగా ఉండేది. 

5:5 ఈ మూడు గుంపుల ప్రజలకు (వ.2-4) అంతిమ ఫలితం ఒక్కటే: తల్లిదండ్రులు తమ పిల్లలను... దాసులగుటకై అప్పగించవలసి వచ్చింది. దీనికి కొన్ని ముఖ్యమైన షరతులతో (లేవీ 25:39-46) పాత నిబంధన ధర్మశాస్త్రం అనుమతి ఇచ్చింది. (నిర్గమ 22:2-11). చాలాసార్లు తల్లిదండ్రులు తమ ఆస్తులను అమ్మడానికి ముందే పిల్లలను అమ్ముకునేవారు. ఎందుకంటే అలా చేయడం వలన వారు తమ పిల్లలను తిరిగి వెల చెల్లించి విడిపించుకోడానికి తమ ఆస్తులు పనికి వస్తాయనే భావన. ముఖ్యంగా వారి కుమార్తెలు దాసురాళ్ళుగా అమ్మబడినప్పుడు పరిస్థితి మరింత దుర్భరంగా ఉండేది. ఎందుకంటే వారి యజమాని లేక అతని కుమారుడు వారిని వివాహం చేసుకోవలసిందిగా వత్తిడి చేసేవారు. అంతేగాక వారు తేలికగా లైంగిక వేధింపులకు గురికావడానికి అవకాశం ఉంది. వారి కుమార్తెలు... దాసత్వమునకు అప్పగించబడినట్టు వర్ణించబడ్డారు. ఈ మాట పాత నిబంధనలో కొన్నిసార్లు లైంగికపరమైన నేపథ్యంలో ఉపయోగించబడి “లోబరచుకోబడడం" అని అర్థమిచ్చే హెబ్రీ పదం (కెబాష్) నుండి వచ్చింది (ఎస్తేరు 7:8 లోని “బలవంతము").

5:6 ధనవంతులు బీదల నిస్సహాయతను అలుసుగా తీసుకోవడాన్ని బట్టి నెహెమ్యా కోపం తెచ్చుకున్నాడు. వారు కలిసిమెలసి ఒక లక్ష్యం కోసం పనిచేయడం లేదు. 

5:7 ఆ ప్రజలపై నెహెమ్యా చేసిన ఆరోపణ వారు ప్రజలనుండి అధిక వడ్డీలను వసూలు చేస్తున్నదాని గురించి అనిపిస్తుంది. మీరు మీ సహోదరులయొద్ద వట్టి పుచ్చుకొనుచున్నారని. అయితే ఈ సందర్భంలో వాడిన పదాలను చూస్తే అది అంతకు మించిన విషయంగా అనిపిస్తుంది. అంటే వారు. అప్పులు చేసి చెల్లించలేని వారి పక్షంగా తామే ఆ సొమ్ము చెల్లించి దానికి బదులుగా వారు ఆస్తులను లాక్కుంటున్నారు. వారి అత్యవసరతల్లో వారి తాకట్టును తామే దొరకబుచ్చుకుంటున్నారు. వాస్తవానికి ప్రధానులు, అధికారులు చేసిన పని చట్ట విరుద్ధం కాకపోయినప్పటికీ ప్రజల దీన పరిస్థితి దృష్టిలో చూస్తే అది మనస్సాక్షికి విరుద్ధంగా ఉంది. 

5:8 బబులోనులో నివసిస్తున్న సమయంలో అక్కడి ఇశ్రాయేలు బానిసలను వెల చెల్లించి విడిపించడం గురించి కాక ఈ మధ్య తమ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఆ విధంగా అమ్ముడుపోయిన బానిసలను విడిపించిన సంగతి గురించి నెహెమ్యా మాట్లాడుతుండవచ్చు. ఇక్కడ పేర్కొన్న ప్రధానులు, అధికారులు ఆ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. 

5:9 ఆ ప్రధానులు, అధికారులు చేసే పనిని చుట్టుపక్క ఉన్న జాతుల ప్రజలు చూస్తున్నారనీ, కాబట్టి వారు తమ నడవడి దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండేలా సరిదిద్దుకోవాలని నెహెమ్యా అభిప్రాయపడుతున్నాడు. ద్వితీ 4:6; 1పేతురు 2:12 చూడండి. 

5:10 ఈ అంశాల విషయంలో నెహెమ్యా పాపాన్ని ఒప్పుకోవాలన్నట్టుగా కనిపించడం లేదు. బీదలకు సొమ్ము అప్పుగా ఇవ్వడం ఒక దయాకార్యంగా భావించబడింది (కీర్తన 37:26; 112:5; సామె 19:17). ఇక్కడ - వారి తప్పిదం ఏమిటంటే బీదల పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకోవడం (ద్వితీ 15:7-11; 24:10-13), వారి దిగజారిన ఆర్థిక పరిస్థితిలో వారు సొమ్ము చెల్లించాలని వత్తిడి చేయడం. నెహెమ్యా 5:7 లో ఉన్నట్టు ఈ వచనంలో ఒక అనువాద సమస్య ఉంది. నెహెమ్యా చేసిన హెచ్చరికను, “ఈ 2 అప్పుల విషయంలో మనం వత్తిడి చేయడం ఆపివేద్దాం" అని అనువదించవచ్చు. 5:11 వారు తాకట్టుగా తీసుకున్న ఆస్తినీ, దానిపై వారు సంపాదించిన వడ్డీని లేక రాబడిని తిరిగి ఇచ్చేయాలని నెహెమ్యా వారిని హెచ్చరించాడు. 

5:12-13 నెహెమ్యా చెప్పిన మాటలకు అధికారులు అంగీకరించిన తరువాత దాని విషయంలో వారు ఒక ప్రమాణము చేశారు. అది నెహెమ్యా తన ఒడిని దులిపి, ఆ విధంగా ఈ ఒప్పందాన్ని నెరవేర్చని వారిపై ఒక శాపాన్ని ప్రకటించడం ద్వారా జరిగించిన ఒక ఆచారక్రియ చేత ధృవీకరించ బడింది. అతని ఒడి లేక అంగీ మడతలను చిన్న జేబుల్లాగా వాడతారు. నెహెమ్యా తన అంగీకి ఉన్న ఆ చిన్న జేబులను ఒక ఇంటిలోని గదులతో పోలుస్తూ ఈ ఒప్పందానికి అవిధేయులైనవారిని తమ ఇళ్ళలోనుండి తరిమివేయమని దేవునిపై ఆన పెడుతున్నాడు. ప్రజలు దానికి వెంటనే ఆలాగు కలుగును గాక అని పలికారు. ఈ విధమైన సామాజిక అన్యాయం వారి సమాజాన్ని విచ్చిన్నం చేసి వారి శత్రువులు ఏ ఫలితాలను సాధించడంలో విఫలమయ్యారో అవే ఫలితాలను కలిగించి ఉండేవి. అయితే దేవుని కృప వలన నెహెమ్యా ఒక సమంజసమైన ముగింపును తేవడం ద్వారా మందిర నిర్మాణం కొనసాగడానికి దోహదం చేశాడు. 

5:14 ఆ ప్రాంతానికి నెహెమ్యా అధికారి (హెబ్రీ. పెభామ్) అని ఇక్కడ మొదటిసారి ప్రస్తావించబడింది. పైగా గవర్నరుగా అతని పదవీకాలం ఎంత అనేది కూడా ఇక్కడ చెప్పబడింది. బహుశా అది క్రీ.పూ. 445 నుండి 432 వరకు అయ్యుండవచ్చు. అధికారికి రావలసిన సొమ్మును (లేదా అధికారికి కేటాయించబడిన ఆహారంలో తీసుకోడానికి నిరాకరించడం ద్వారా, తనకూ తన ముందు పనిచేసిన గవర్నరుకూ గల వ్యత్యాసాన్ని నెహెమ్యా ప్రస్ఫుటంగా కనిపించేలా చేశాడు. వ.17-18 లో వెల్లడైనట్టు ఆ విధమైన నిరాకరణ అతనికి వ్యక్తిగతంగా ఎంతో నష్టాన్ని మిగిల్చింది.

5:15-16 జెరుబ్బాబెలుకు, నెహెమ్యాకు మధ్య బహుశా అరవై సంవత్సరా లకు మించిన అంతరం ఉంది. నెహెమ్యా ఆ నగరాన్ని, దాని ప్రాకారాలను పునరుద్ధరించిన తరవాతే యూదా (హెబ్రీ. యెహూద్) ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా ఆవిర్భవించింది అనీ, అందుకే నెహెమ్యా విమర్శించిన అధికారులు
సమరయ ప్రాంతానికి గవర్నరులై ఉంటారనీ కొందరు పండితులు వాదించారు. కానీ చారిత్రక రుజువులు, బైబిలులో గ్రంథస్తం చేయబడిన సమాచారం పర్షియనుల పాలన ప్రారంభం నుండీ యెహూద్ ఒక ప్రత్యేక రాజకీయ ప్రాంతంగా ఉన్నదని వెల్లడి చేస్తున్నాయి. పురావస్తు సంబంధ తవ్వకాలలో జెరుబ్బాబెలు, నెహెమ్యాల మధ్య కాలంలో గవర్నర్లుగా చేసిన యెహోయెజెర్, అహజాయ్, ఎల్నాతాను, యెహెజ్కియా మొదలైన వారికి చెందిన ముద్రలు, నాణాలు లభించాయి.
- తనకు ముందున్న నాయకుల్లా కాక నెహెమ్యా యెరూషలేము పునరుద్ధరణ అనే దేవుని కార్యాన్ని అప్పటికే అణచివేతకు గురవుతూ ఉన్న ప్రజలకు మరింత కష్టాలు కలిగించకుండా పూర్తి చేయాలని కోరుకున్నాడు. నెహెమ్యా, అతని (నా) పనివారును (యౌవనస్తులు అని అక్షరార్థం) మందిర పునర్నిర్మాణానికి తమను తాము సమర్పించుకున్నారు. మేము భూమి సంపాదించుకొనినవారము కాము అని అతడు రూఢిపరచిన సంగతి గమనించదగినది. సాధారణంగా అధికారంలో ఉన్నవారు తరచుగా తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమకు, తమ స్నేహితులకు సంపదలు సమకూర్చు కోడానికి ప్రయత్నిస్తారు, కానీ నెహెమ్యా, అతని సాటి అధికారులు తమ అధికారాన్ని ఎన్నడేగానీ, మరి ముఖ్యంగా అణగారిన ఆ ప్రజలు ఆహారం కోసం తమ ఆస్తులను అమ్ముకోడానికి కూడా సిద్ధపడుతున్న పరిస్థితుల్లో తమకు అవకాశంగా మలుచుకోలేదు.

5:17-18 అధికారికి రావలసిన సొమ్ము గురించి వ. 14 నోట్సు చూడండి. 

5:19 నెహెమ్యా చేసిన కుప్తమైన ప్రార్ధన స్వార్థపూరితమైందనీ, అది అతని "నీతి కార్యాలను” సూచిస్తున్నదనీ తరచు విమర్శకు గురైంది. అయితే జె.జి. మెక్ కన్విల్ రాసిన విధంగా, “దేవుని దయను కోరుకోవడం అనేది ఒక వ్యక్తి తాను నిజమైన విశ్వాసంతో లేక స్వచ్ఛమైన ఉద్దేశాలతో వ్యవహరించినందుకు ఏదో బహుమానం తనకు దక్కాలని కాదు. అది దేవుడు ఒక న్యాయాధిపతి అనీ ఎవరైతే ఆయన చిత్రాన్ని చేయడానికి ఇష్టపడతారో వారి పక్షంగా ఆయన తీర్పు తీరుస్తాడనీ. చెప్పే ఒక ప్రకటన." 


Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |