5:1-2 యోసేపు (బర్నబా) దాతృత్వంలో అందరూ పాలుపొందలేదు. అననీయ, అతని భార్య సప్పీరా కూడా పొలము అమ్మారు, కానీ దాని వెలలో కొంత దాచుకొని అంతా ఇచ్చేశాము అన్నట్లుగా చూపించారు (వ.8),
5:3-4 అననీయ, సప్పీరాలు తాము కేవలం మనుషులతో (అపొస్తలులతో) అబద్దం చెపుతున్నామని భావించారు. కానీ నిజానికి వారు సంఘంలో ఎల్లప్పుడూ ఉండే పరిశుద్దాత్మతో అబద్దం చెప్పారు. పేతురు. ఉపయోగించిన మాటలు పరిశుద్దాత్ముడు కూడా దేవుడు అని సూచిస్తున్నాయి. అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? అనే పేతురు ప్రశ్న అననీయ, సప్పీరాలు పొలము అమ్మి, అందులో కొంత సొమ్ము మాత్రమే సంఘానికి ఇచ్చినా తప్పు అయివుండేది కాదు అనే భావనను సూచిస్తున్నాయి. వారి పాపం వారి మోసంలో, మనుషుల మెప్పును పొందాలనే వారి దురాశలో దాగి ఉంది.
5:5-9 అననీయ, సప్పీరాల మోసం, ముఖ్యంగా పేతురుకు సప్పీరా చెప్పిన అబద్ధంతో, ప్రభువుయొక్క ఆత్మను శోధించినట్ల యింది. సంఘంలో, సంఘ నాయకత్వంలో ఆత్మ పాత్ర ఎంత శక్తివంతమైందో అనడానికి ఇది సూచన;
పేతురు కేవలం మనిషే. కానీ ఈ విశ్వాసుల సహవాసాన్ని నడిపించే దేవుని మనిషి.
5:11 దేవుని కార్యాలకు స్పందనగా కలిగే భయమును గురించి, వ. 5; 2:43; 9:31; 19:17 చూడండి.
5:12 దేవాలయంలో ఇంతకు ముందు ఖైదు చేయబడిన అనుభవాన్ని బట్టి బెదరక (4:3), అపొస్తలులు సొలొమోను మంటపములో ఉన్న ప్రజల మధ్య సూచకక్రియలును మహత్కార్యములును చేయడం కొనసాగించారు.
5:18-14 ఈ రెండు వచనాల మధ్య స్పష్టమైన వైరుధ్యం ఉంది. అననీయ, సప్పీరాల సంఘటనకు ముందు, సూచకక్రియలు, మహత్కార్యాలను బట్టి అనేకమంది అవిశ్వాసులు క్రైస్తవ గుంపు వైపు ఆకర్షించబడ్డారని అనిపిస్తుంది. ఇప్పుడిక ఆ పరిస్థితి లేదు. అయినా సరే, అనేకమంది యథార్థమైన విశ్వాసులు ఇంకా వారితో చేర్చబడుతూ ఉన్నారు.
5:15-16 పేతురు అద్భుత శక్తులు గలవాడని, తమను స్వస్థపరచడానికి అతని నీడ చాలు అని ప్రజలందరూ నమ్మడం మొదలుపెట్టారు. అపొస్తలుల కార్యములు గ్రంథంతో పాటు, కొ.ని.లో అనేకచోట్ల, దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ప్రజలను స్వస్థపరచాడు. వీటిలో పేతురు నీడతో పాటు, యేసు వస్తపు చెంగు (లూకా 8:44), అపొస్తలుడైన పౌలు తాకిన చేతిరుమాళ్ళు, నడికట్లు కూడా ఉన్నాయి (అపొ.కా. 19:12). అయితే ఈ వస్తువులలో ప్రత్యేకత ఏమీ లేదు గాని ఈ వస్తువులు ఎవరివో, వారు దేవుని వార్తాహరులు, వారిద్వారా దేవుని శక్తి పనిచేస్తుంది.
5:17-18 ప్రధాన యాజకుడును అతనితో కూడ ఉన్నవారందరును క్రైస్తవ్యం విస్తరించడాన్ని ఎదిరించారు. వారు యేసును మెస్సీయగా నమ్మకపోవడం ఒక్కటే అందుకు కారణం కాదు గాని అపొస్తలులు ప్రకటిస్తూ, అద్భుతాలు చేస్తుండగా ఆయనకు పెరుగుతున్న అనుచరులను చూచి వారు మత్సరముతో నిండుకొనడం కూడా మరొక కారణం.
5:19-20 యేసు నామంలో వారు చేస్తున్న పరిచర్యను బట్టి మళ్ళీ ఖైదు చేయబడిన (వ. 18) అపొస్తలులు ఎవరి దృష్టినీ ఆకర్షించని విధానంలో, ఒక ప్రభువు దూత ద్వారా విడిపించబడ్డారు. వారు చెరసాల నుండి నేరుగా దేవాలయానికి కొనిపోబడ్డారని కొందరు ఊహిస్తారు, కానీ దేవదూత చెరసాల తలుపులు తీసి, మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడండి అని చెప్పడం అది సరి కాదు అని తెలుపుతుంది. ఇలాంటి సంభవాన్నే మరలా 12:6-10లో గమనించండి.
5:21 విడుదల పొందగానే అపొస్తలులు యెరూషలేము నుండి పారిపోతారని మనం అనుకోవచ్చు. కానీ దానికి బదులు వారు తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్ళి, తమకు ఇంతకు ముందు సమస్యను తెచ్చిన పనినే (యేసును గురించి బోధించడం) మరలా చేయడం మొదలు పెట్టారు.
5:22-24 తెల్లవారిన తర్వాత, క్రైస్తవ విశ్వాసం అభివృద్ధి చెందకుండా చేసేందుకు గట్టి నిర్ణయాలు చేయాలనే ఉద్దేశంతో మహాసభ సమావేశమైంది. బంట్రోతులు...చెరసాల భద్రముగా మూసియుండుట, కావలివారు కావలిగా ఉండుట కనుగొనడం, వారు చెరసాల నుండి తప్పించబడడం ఆశ్చర్యకరమే కాదు, రహస్యంగా జరిగిందని తెలుస్తున్నది. 5:25-26 యెరూషలేము ప్రజలంతా అపొస్తలులకు అనుకూలంగా స్పందిస్తున్నందువలన, దేవాలయ బంఛైతులు ప్రజలు రాళ్ళతో కొట్టుదురేమో
అని భయపడిరి. ఈ మధ్యలో యూదా నాయకులు తమ అధికారం జారిపోతున్నట్టు కనుగొన్నారు.
5:27-28 యేసు మరణానికి ప్రజలు తమను బాధ్యులుగా చేస్తారేమోనని యూదా నాయకులు భయపడ్డారు. వారు సత్యాన్ని హత్తుకోవడంకంటే తమ అధికారాన్ని నిలుపుకోవడం పైనే ఎక్కువ శ్రద్ధ చూపారు.
5:29 క్రైస్తవులు తామున్న దేశపు చట్టాలను పాటించాలి, కానీ మానవ చట్టం, దేవుని చట్టంతో విభేదిస్తే, మనం మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెను.
5:30-32 వారు అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత దేవుడు హెచ్చించిన యేసును సంహరించినట్లు ప్రకటించి మహాసభ మీద పేతురు వత్తిడి పెంచివుంటే తనను తాను, ఇతరులను మరింతగా ప్రమాదంలోకి నెట్టి ఉండేవాడు. అది నిజమని పేతురుకు, మిగిలిన అపొస్తలులకు తెలుసు, ఎందుకంటే వారు, పరిశుద్దాత్మ కూడా దీనికి సాక్షులైయున్నారు.
5:33-34 యూదు నాయకులు. యేసునే చంపడానికి ఇష్టపడినట్లైతే, ఆ యేసును గురించిన సమస్యను తమ మొండి సాక్ష్యం ద్వారా ఇంకా పొడిగిస్తున్న అపొస్తలులను చంపడానికి వారు మరి ఎక్కువగా సిద్ధపడ్డారు. కానీ, గమలీయేలు తన జ్ఞానంతో వారి కోపాన్ని చల్లబరచాడు. ఈ గమలీయేలు అపొస్తలుడైన పౌలుకు గురువు (22:3). అతడు గొప్ప బోధకుడైన హిల్లెలు వారసుడో లేక అతడు తన స్వంత పాఠశాల నెలకొల్పాడో స్పష్టంగా తెలియదు. రెండింటిలో ఏదైనా, అతడు గొప్ప రబ్బీ (బోధకుడు) అయ్యాడు. అపొస్తలుల పట్ల అతనికున్న సమాధానపూర్వక వైఖరి, మిగతాచోట్ల అతడు చూపిన సహన వైఖరికి కొనసాగింపుగా ఉంది.
5:35-36 యేసు కాలంలో రోమా పరిపాలన మీద అనేక తిరుగుబాట్లు జరిగాయనీ, వాటిలో కొన్ని తమను తాము మెస్సీయగా ప్రకటించుకొన్న కొందరికి సంబంధించినవిగా కూడా ఉన్నాయని యూదా చరిత్రకారుడైన జోసిఫస్ చెబుతాడు. గలిలయుడైన యూదా (వ.37) అనేవాని వెనుక వచ్చిన థూదా అనే ఒకనిని పేర్కొంటాడు. ఇక్కడ చెప్పిన థూదా బహుశా అతడు కాకపోవచ్చు.
5:37 గలిలయుడైన యూదా క్రీ.శ. 6లో కురేనియు జరిగించిన జనసంఖ్యకు విరోధంగా తిరుగుబాటు చేశాడు. ఇశ్రాయేలీయులు అన్యులైన పాలకులకు కప్పం కట్టవద్దు అని అతడు ఇశ్రాయేలీయులకు బోధించినట్లు జోసిఫస్ అతన్ని గురించి పేర్కొన్నాడు. అతని తిరుగుబాటు అపజయంతో ముగిసింది.
5:38-39 గమలీయేలు సలహా పరిసయ్యుల విశ్వాసాన్ని ప్రతిబింబించింది: దేవుడు దేనినైనా నియమిస్తే, అది తప్పక నెరవేరుతుంది. కాబట్టి ఒకడుగు వెనక్కివేసి, క్రైస్తవుల ఉద్యమాన్ని దేవుడు ఏమిచేస్తాడో చూడడం మహాసభకు వివేకమనిపిస్తుందని గమలీయేలు భావించాడు.
5:40-42 శ్రమలు, కష్టాలు రావడం మనం దేవుని చిత్తంలో లేము అనడానికి గుర్తులని కొందరు నమ్ముతారు. దెబ్బలు తిన్న తర్వాత, మహాసభ యెదుట నుండి వెళ్ళి, క్రీస్తు పక్షంగా అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున సంతోషించిన అపొస్తలుల నమ్మకంతో ఆ నమ్మకాన్ని పోల్చి చూడండి.