Philippians - ఫిలిప్పీయులకు 4 | View All

1. కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి.

2. ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను.

3. అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి
నిర్గమకాండము 32:33, కీర్తనల గ్రంథము 69:28, దానియేలు 12:1

4. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పు దును ఆనందించుడి.

5. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.

6. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.

7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.
యెషయా 26:3

8. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.

9. మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.

10. నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను.

11. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.

12. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చు కొనియున్నాను.

13. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.

14. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని.

15. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును.

16. ఏలయనగా థెస్సలొనీకలోకూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి.

17. నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పు చున్నాను.

18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి.
ఆదికాండము 8:21, నిర్గమకాండము 29:18, యెహెఙ్కేలు 20:41

19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.

20. మన తండ్రియైన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

21. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి.

22. నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.

23. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక.బైబిల్ అధ్యయనం - Study Bible
4:1 స్థిరులై యుండుడి అనే మాటలు దాడికి గురౌతున్నా మరణిస్తాననే భయంతో వెనుకంజ వేయని రోమా సైనికులను జ్ఞాపకం చేస్తాయి. 

4:2 యువొదియ, సుంటుకేలు ఫిలిప్పీ సంఘంలోని అనేకమంది స్త్రీల లాగా పలుకుబడి కలిగినవారు (అపొ.కా. 16 అధ్యా.). సంఘంలో వారు పదవులు కలిగి ఉన్నారని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. పక్షపాతం లేకుండా ఉండేటట్లు, ఒక్కొక్క పేరుతో ఒక్కొక్కసారి బతిమాలుకొనుట రెండుసార్లు వస్తుంది. "ఫ్రోనియో" అనే గ్రీకుపదం నుండి తీసుకున్న ఏకమనస్సు అనే మాట ఈ పత్రికలో చాలా తరచుగా కనిపిస్తుంది (ముఖ్యంగా 2:1-11లో). ఈ అనైక్యత మరీ అంత ప్రాముఖ్యమైన సమస్య అయి వుండకపోవచ్చు. ఎందుకంటే పౌలు గద్దింపు మాటలు పత్రిక చివరిలో రాస్తున్నాడు. అది నైతికమైన లేక వేదాంతపరమైన అనైక్యత కాదు.

4:3 వేడుకొనుట “బతిమాలుట" కన్నా తక్కువ అధికారంతో ఉంది (వ.2). నిజమైన సహకారి అనే పదం ఏక వచనంలో ఉంది. అధికారంతో ఉన్న ఒక వ్యక్తి (సంఘకాపరి) వారికి మధ్యవర్తిగా ఉంటాడు. ఇతరమైన చోట్ల “సహకారి” అనే మాటను “సహవాసం"గా అనువదించారు. ఇతడు పనిలో కాడిని కలిసి మోసే సహకారి. పౌలు ఈ స్త్రీలకు సహాయం చేయడానికి కారణాలను చెప్పాడు. మొదటిగా వారు పౌలుతోపాటు ప్రయాసపడ్డారు (క్రీడాపదం), రెండవది, వారు క్లెమెంతుతోనూ (ఇతని గురించి ఇతరత్రా ఏమీ తెలియదు), పౌలు జతపనివారితోనూ కలిసి పని చేసారు. జీవగ్రంథమును కొ.ని.లో అరుదుగా పేర్కొన్నారు (ప్రక 3:5; 20:15; 21:27తో పోల్చండి), ఇది రక్షణ పొందిన వారి జాబితాను సూచిస్తుంది.

4:4-9 ఈ భాగంలో పౌలు సమాధానం గురించి రెండు దృక్కోణాలతో రాశాడు. అవి, కష్టమైన పరిస్థితుల మధ్య సమాధానం కలిగి ఉండడం (వ.4-7), ఒక సమాధానకరమైన వాతావరణాన్ని నిర్మించడం (వ.8-9). 

4:5 సహనము (మృదుత్వము) నిస్వార్థతను, ఇతరుల పట్ల గౌరవాన్ని సూచిస్తుంది (2:1-4తో పోల్చండి). పౌలు తన రచనల్లో దీనిని అరుదుగా పేర్కొన్నప్పటికీ, విశ్వాసులు, క్రైస్తవ నాయకులు సహనం కలిగి ఉండాలని ఆశిస్తారు (1తిమోతి 3:3; తీతు 3:2తో పోల్చండి). తెలియబడనియ్యుడి అనే మాటలు అది సంఘ గౌరవ ప్రతిష్టల్లో ఒక భాగం అని సూచిస్తున్నాయి. ఫిలిప్పీ విశ్వాసులకు క్రీస్తు అదృశ్యసన్నిధిని ప్రభువు సమీపముగా ఉన్నాడు అనే మాటలతో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవి వారికి ఆయన తిరిగి రావడాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాయి. 

4:6-7 చింత అంటే వ్యాకులం, ఆరాటం (మత్తయి 6:25-34). చింతకు విరుగుడు ప్రార్థన. ప్రార్థన యొక్క వేర్వేరు దృక్కోణాలను మూడు మాటల్లో చెప్పవచ్చు. ఆరాధనా వైఖరితో కూడిన ప్రార్థన, ఒక అవసరత గురించిన విజ్ఞాపన, నిర్దిష్టమైన అవసరాల కోసం విన్నపము. కృతజ్ఞత
ప్రార్థనలను స్తుతులతో నింపుతుంది. దానికి స్పందనగా దేవుని సమాధానము సహించడానికి మనకు శక్తినిస్తుంది. ఏ కారణమూ కనిపించని స్థితిలో సమాధానం జ్ఞానాన్ని మించి, ఇబ్బందికర పరిస్థితులను నిమ్మళపరుస్తుంది. అంతేకాక సమాధానం మన చింతలను దూరం చేసి హృదయములకు (ఎంపికలకు) తలంపులకు (వైఖరులకు) కాపుదలగా ఉంటుంది. 

4:8-9 ఈ ఏడు అంశాలపై దృష్టి నిలిపే తలంపులు దేవుని సమాధానాన్ని అనుభవిస్తాయి. సత్యం అంటే నైతిక "యథార్థత". మాన్యమైనవి అంటే గౌరవప్రదమైనవి. న్యాయమైనవి అంటే ప్రజలు పొందడానికి యోగ్యమైన వాటిని వారికివ్వడం. పవిత్రమైనవి అంటే దేవునికి సంబంధించిన పరిశుద్ధత. రమ్యమైనవి అనే మాట కొ.ని.లో ఇక్కడ మాత్రమే ఉంది. ఆకర్షణీయమైన అని దీని అర్థం. ఖ్యాతిగలవి అనే మాట కూడా కొ.ని.లో ఇక్కడ మాత్రమే ఉపయోగించాడు, మెచ్చుకొనదగినవి అని దీని భావం. సమాధానకర్తయగు దేవుడు అనే మాట దేవుని సన్నిధిని ఆహ్వానించే ఈ లక్షణాలు గల జీవితంలో ప్రస్ఫుటించే "దేవుని సమాధానం” (వ.7) అనే దానిని సంపూర్ణం చేస్తుంది.

4:10 మరల అనే మాట ఫిలిప్పీ విశ్వాసులు ఇంతకు మునుపు పౌలుకు కానుకలను పంపడానికి (2కొరింథీ 8 అధ్యా.తో పోల్చండి), ఇప్పుడు ఎపఫ్రాదితును రోమాలో ఉన్న పౌలువద్దకు పంపడానికి (2:25-30) మధ్య కొంతకాలం గడిచిందని సూచిస్తుంది. పౌలుకు అవసరత ఉందని కాదు గానీ ఇవ్వడానికి వారికి తగిన సమయము దొరకకపోయెను.

4:11 నేర్చుకొని యున్నాను (గ్రీకులో సంపూర్ణ భూతకాలంలో ఉంది) అనే మాటలు మరింత అవగాహన ద్వారా నేర్చుకున్న పాఠాలను సూచిస్తున్నాయి. సంతృప్తి (అక్షరార్థంగా “స్వావలంబన") అనేది క్రీస్తులోని విశ్వాస ఫలితంగా కలిగే స్వయం సమృద్ధి. 

4:12 ఎరుగుదును అనే మాట వేర్వేరు పరిస్థితులను బేరీజు వేసిన తరవాత కలిగే ఫలితం. ఆకలిగొని యుండుట, లేమిలో ఉండుట, దీనస్థితి కష్టపరిస్థితులను సూచిస్తాయి. వాటికి భిన్నంగా కడుపునిండి యుండుట, సమృద్ధి కలిగి యుండుట, సంపన్న స్థితి మేలుకరమైన పరిస్థితిని సూచిస్తాయి. ఇవి రెండూ కలిసి పౌలుకు సంతృప్తిని నేర్పించాయి. 

4:13 సమస్తమును అనే మాటలు జీవితంలోని ఆర్థిక ఎగుడుదిగుడులను సూచిస్తాయి (వ. 12). నన్ను బలపరచు వానియందే అనే మాటలు విశ్వాసులు దేవుని చిత్తంలో జీవించడానికి క్రీస్తు బలపరుస్తాడని బోధిస్తాయి. విచిత్రంగా, పౌలు బలహీనంగా ఉన్నపుడే బలవంతుడు. ఆధారపడినపుడే స్వతంత్రుడు. అట్టిదే ఒక శిష్యుని జీవితం. 

4:14 పాలుపుచ్చుకొనుట అనే మాట “సహవాసం" (1:5) గురించి చెబుతున్నది. శ్రమ అంటే కష్టాలు. నిజమైన పాలిభాగస్తులు కష్టాలలో పాలు పంచుకుంటారు.

4:15 సువార్తను నేను బోధింప నారంభించిన అంటే పౌలు ఫిలిప్పీని వదిలి, ఐరోపాలో సాక్షమివ్వడం కొనసాగించి నప్పుడు అని సూచిస్తున్నాయి. పాలివారు అనే మాట ఇక్కడ కూడా "సహవాసం " (వ.14; 1:5)ను సూచిస్తుంది. ఇతరులు ఒక ఏకపక్ష సంబంధంతో ఉన్నారు. అంటే వారు పొందేవారు మాత్రమే గాని ఇచ్చేవారు కాదు. మీరు తప్ప అనే మాటలు ఫిలిప్పీ సంఘాన్ని పౌలు ఎందుకు ప్రేమించాడో తెలియజేస్తున్నాయి. ఇతరులు చేయనిదాన్ని వారు చేశారు. 

4:16 ఫిలిప్పీని విడిచిన తర్వాత పౌలు థెస్సలోనికకు వెళ్ళాడు. ఆ వెంటనే ఫిలిప్పీ విశ్వాసులు అతనికి కానుకలివ్వడం ప్రారంభమై అది ఆగకుండా స్థిరంగా కొనసాగింది (మాటిమాటికి). 

4:17 సంతృప్తి (వ.11), పరిస్థితులను బట్టి సర్దుకుపోవడం (వ.12) అనే లక్షణాలను బట్టి పౌలు యీవిని అపేక్షించ లేదు. అది తన ద్వారా మారుమనస్సు పొందిన వారిని దుర్వినియోగపరచి, సేవలో రాజీపడేలా చేస్తుంది. మరింత ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రేరణతో వారి లెక్కకు విస్తారఫలము రావలెనని పౌలు అపేక్షించాడు. ఆర్థిక సంబంధమైన పదజాలం ఉపయోగిస్తూ, ఈ “లాభము” ఒక కార్యాచరణ వలన ప్రాప్తమైందని పౌలు ప్రకటించాడు. “విస్తారఫలము” అనేది ఫిలిప్పీ విశ్వాసుల ఖాతాకు చేరే వడ్డీ, ఇవ్వడం అనే ఒక భౌతిక, వస్తుసంబంధమైన క్రియ ఆధ్యాత్మిక లావాదేవీగా ఉంది. 

4:18 ఆర్థికపరమైన పదజాలం కొనసాగిస్తూ, పౌలు నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది అంటున్నాడు. అతని విషయంలో వారికి ఉన్న బాధ్యత అంతా తీరిపోయింది. ఎపఫ్రాదితు రూపంలో పౌలుకు ఏమియు తక్కువ లేని స్థితి ఏర్పడింది. వారు పంపిన వస్తువులు పౌలు అవసరతలు తీర్చాయి కాబట్టి అది మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము (రోమా 12:1-2తో పోల్చండి). ఇవ్వడం అనేది పుచ్చుకునే వారికంటే ఇచ్చేవారికే ఎక్కువ లాభం తెచ్చిపెడుతుంది.

4:19-20 తన మహిమకు, ఉద్దేశాలకు తగినట్లుగా ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. ఇప్పుడు, ఎల్లప్పుడూ దేవునికి మహిమతేవడం అనే తన జీవిత లక్ష్యానికి తగినట్టుగా అతని ముగింపు దీవెనవాక్యం ఉంది. 

4:21-23 కైసరు ఇంటివారు అనే మాటలు రోమా చక్రవర్తికి సంబంధించిన వారిలో కూడా క్రైస్తవులున్నారని సూచిస్తున్నాయి. “ఇంటివారు" అంటే ఆ క్రైస్తవులు నేరుగా కైసరు కుటుంబానికి చెందినవారు అని కాక, అతని పాలనా యంత్రాంగంలో ఉద్యోగులు అయి ఉండవచ్చు.


Shortcut Links
ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |