Proverbs - సామెతలు 4 | View All

1. కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి

2. నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.

3. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక కుమారుడనైయుంటిని.

4. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.

5. జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటిమాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము.

6. జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.

7. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు కొనుము.

8. దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.

9. అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.

10. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీక రించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.

11. జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.

12. నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.

13. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము

14. భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.

15. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.

16. అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.

17. కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు

18. పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,

19. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.

20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.

21. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.

22. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.

23. నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము

24. మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము.

25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.

26. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.
హెబ్రీయులకు 12:13

27. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.



బైబిల్ అధ్యయనం - Study Bible
4:1-2 ఈ సదుపదేశము. ఈ వచనాలు తండ్రి తన కుమారులకు చేస్తున్న హితోపదేశాల్ని పరిచయం చేస్తున్నాయి, కుమారులు శ్రద్ధగా ఆలకించడం మంచిది. 4:20; 5:1; 7:24 చూడండి. 

4:3 మగపిల్లవాడుగా పుట్టినంత మాత్రాన కాక విధేయత చూపించినవాడే నిజమైన కుమారుడుగా ఉంటాడనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. సుకుమారుడు అంటే సున్నితమనస్కుడు, విని నేర్చుకొనే స్వభావం గలవాడు. యేక కుమారుడిని ప్రశస్తమైనవాడుగా పరిగణించడం జరుగుతుంది. (యిర్మీయా 6:26; ఆమోసు 8:10; జెకర్యా 12:10). 

4: 4, 6 ఆజ్ఞలను గైకొనడం అంటే ఆజ్ఞల్ని శ్రద్ధగా విని మనసులో భద్రపర్చుకొని విధేయత చూపించడం. ఆజ్ఞల్ని పాటిస్తూ వాటిని కాపాడుకోవడం అని కూడా దీనిని అనువదించవచ్చు. దైవజ్ఞానంలో నడిచేవారిని (వ.21; 2:20; 5:2; 7:1-2; 8:32; 10:17; 16:17; 19:16; 22:5), జ్ఞానము కాపాడుతుంది, లేదా యెహోవా వారిని కాపాడతాడని అర్థం (2:8,11; 3:26; 6:22, 24; 7:5; 14:3). 

4:5-8 సంపాదించుకొనుము అనే పదం “కొనుము" అని అర్థమిచ్చే సాధారణ హెబ్రీ పదానికి ఒక అనువాదం. జ్ఞానము మరియు బుద్ది చాలా గొప్ప సంపాదనలని రచయిత నొక్కి చెప్పాడు (16:16; 18:15; 23:23; 17:16 తో పోల్చండి). “మీ సంపాదనలన్నిటినీ ఇచ్చి బుద్ధిని కొనుక్కోమని అక్షరార్థం (వ.7). ముఖ్యాంశము అనే మాట ప్రారంభమనే అర్థాన్ని కూడా తెలియజేస్తుంది (1:7), అన్నిటికంటే ముందుగా ముఖ్యంగా సంపాదించుకొన వలసినదని అర్థం. రక్షణలాగానే దైవజ్ఞానం సైతం వెండి బంగారాలకంటె ఎంతో విలువైనది. అంటే మనిషి మరిదేన్నైనా కోరుకోవడానికంటే ముందుగా ఒకదాన్ని, అంటే జ్ఞానాన్ని ప్రేమించి... దాన్ని గొప్పగా చేసి... హత్తు (కౌగలించి) కోవాలి, జీవితంలో దేన్నైనా వదులుకొని పొందవలసినది జ్ఞానాన్నేనని అర్థం. ఇక్కడ వైరుధ్యభావం ఏమిటంటే, జ్ఞానం ఉచితమే, అయితే సమస్తాన్నీ మూల్యంగా వెచ్చిస్తేనే జ్ఞానాన్ని పొందగలం (యెషయా 55:1; మత్తయి 13:44-46; 16:24; 19:21,27; లూకా 5:11,28; ఫిలిప్పీ 3:8).

4:9 మాలిక... కిరీటమును అనే పదాలు ఒక వ్యక్తి జీవితంలో కనిపించే దైవకృపను, దైవానుగ్రహాన్ని సూచిస్తాయి.

4:10-19 కుమారుడు తన తండ్రి చెప్పే హితోపదేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా దానిని గట్టిగా పట్టుకొని ఉండి, చెడు మార్గాల్లోకి వెళ్లకూడదనీ హెచ్చరించబడ్డాడు. (వ.13-15; 1:15 తో పోల్చండి). జీవితంలో పరిమాణము, నాణ్యత అనేవి అసలైన ప్రోత్సాహకాలు (వ. 10, 13,22; 8:35 చూడండి; 3:22 నోట్సు చూడండి). భక్తిహీనులు లేక దుష్టులు కీడు (వ.14,16) చేయకుండా ఉండలేరు, కీడుచేయడమే వీరికి నిద్రాహారాలు (వ.16,17). నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది, దుష్టుల జీవితం అంతకంతకూ గాఢాంధకారమయముగా మారి, వారెక్కడ పడునది వారికే తెలియదు (వ.18-19 చూడండి; యోబు 29:2-3; 1 పేతురు 2:9; ప్రక 21:23-24 తో పోల్చండి), పాపానికి, శిక్షకు సంబంధముందనే విషయం మూరులైన దుష్టులకు తెలియనే తెలియదు (5:6; 7:23; 9:18; 28:22). 

4:20-21 4:1-2 నోట్సు చూడండి.

4:22 జీవమును గురించి 3:22 నోట్సు చూడండి.

4:23 అన్నిటికంటె అంటే దీనికి “కాపాడుకొనవలసిన అన్నిటికంటె” అని అక్షరార్ధం. హెబ్రీ భావన హృదయము అంటే జ్ఞానానికి కేంద్రస్థానం, నిర్ణయాలు ఏర్పడే ప్రారంభస్థానం (27:19; మత్తయి 15:18). మీరెటువంటి వారో మీ హృదయమే మీకు తెలియజేస్తుంది, మీ ఆలోచనల్ని మీ అనుభూ తుల్ని నిర్దేశించే హృదయమే “నిజమైన మీరు”. మీ హృదయానికి మీరే బోధించుకోవచ్చు. (24:32), ప్రాపంచిక - దృక్పథాన్ని చైతన్యవంతంగా రూపొందించుకొని మీరే దాన్ని సవరించుకోవచ్చు. ఆ తరవాత మీ హృదయం నుండి నిర్ణయాలు, చర్యలు మీరు నిశ్చయించుకున్న ప్రకారమే బయలు వెడలుతాయి (16:9,23; లూకా 6:45; రోమా 10:10; 2కొరింథీ 9:7). ఈ విద్యావికాసం ప్రపంచ జ్ఞానానికి సంబంధించి మీకు మీరే బోధించుకున్న స్వీయవిజ్ఞానం కావచ్చు, లేదా పరిశుద్దాత్మ ద్వారా కలిగే దైవజ్ఞానం కావచ్చు (2:6; యిర్మీయా 24:7; యెహె.36:26-27; అపొ.కా 16:14; రోమా 2:29). మీ హృదయం ఎటువైపు మొగ్గితే మీ జీవితం అటు మొగ్గుతుంది, ఇదే మీరు నిత్యజీవంలోకి (జీవధారలు) ప్రవేశించాలని కోరుకుంటున్నారో లేదో తెలియజేస్తుంది (3:22). దేన్ని పోగొట్టుకొనకూడదో దాన్ని భద్రంగా కాపాడుకొనుము అని చెప్పడంలో ఏదీ ది దానిమీద దాడిచేయకుండా పరిరక్షించుకోమని అర్థం.

4:24 హృదయం దేన్ని నిర్ణయిస్తుందో , అదే 2 నోటి నుండి బయటికి వస్తుందనేది నియమం. (వ.23 చూడండి), అయితే కుటిలమైన మాటలు హృదయాన్ని విషపూరితం చేస్తాయి.

4:25-27 మార్గమును సరాళము - ఋజుమార్గం మీద ఏక దృష్టి కలిగి ఉండడం (17:24, 27:20), ఏ చిన్న కీడునకు సైతం దూరంగా ఉండడం (వ. 13-15; 1:15 తో పోల్చండి), నిశ్చయముగా మీ. మార్గములన్నిటిని స్థిరపరుస్తాయి. ఇది మన మార్గాల్ని మనమే స్థిరపర్చుకోవడం కాక దేవుడే మన మార్గాల్ని స్థిరపరుస్తాడని తెలియజేస్తుంది. "స్థిరములగును" అనే పదం ఏ మార్పు లేదా ఏ నాశనానికి గురి కాని విధంగా లోతుగా, పాతుకొని కదిలిపోకుండా సుస్థిరంగా ఉండడాన్ని సూచిస్తుంది (12:3; 16:3; 24:3; 25:5). చెడు మార్గాల యావత్తు పరిథిని కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను అనే మాటలు సూచిస్తాయి. అంటే వీటి నడుమనున్న, మధ్యే మార్గంతో రాజీపడకుండా, ఏ వైపు దృష్టి మరల్చకుండా మంచిదైన ఒకే ఒక మార్గాన్ని విడిచిపెట్టకుండా దానిలో సూటిగా నడవడం ముఖ్యమని చెప్పడమే.


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |