Zephaniah - జెఫన్యా 3 | View All

1. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.

2. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాస ముంచదు, దాని దేవునియొద్దకు రాదు.

3. దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.

4. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువు లను అపవిత్రపరతురు.

5. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు

6. నేను అన్య జనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసి యున్నాను, జనము లేకుండను వాటియందెవరును కాపుర ముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే.

7. దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులు కలిగి శిక్షకులోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్‌క్రియలు చేయుటయందు అత్యాశగలవా రైరి.

8. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నాకోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమ కూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.
ప్రకటన గ్రంథం 16:1

9. అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను.

10. చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషుదేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసి కొని రాబడుదురు.

11. ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతో షించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నామీద తిరుగబడి నీవుచేసిన క్రియలవిషయమై నీకు సిగ్గు కలుగదు

12. దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండ నిత్తును.

13. ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగల వారై అన్నపానములు పుచ్చుకొందురు;
ప్రకటన గ్రంథం 14:5

14. సీయోను నివాసు లారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.

15. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.
యోహాను 1:49

16. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;

17. నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.

18. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు.

19. ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను,

20. ఆ కాలమున మీరు చూచు చుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.బైబిల్ అధ్యయనం - Study Bible
3:1-2 ఖచ్చితంగా పేర్కొనని ఒక పట్టణమును 1-8 వచనాలు పలుమార్లు సూచిస్తున్నాయి. “న్యాయము తీర్చు (నీతిగల) యెహోవా దాని మధ్యను న్నాడు" అని 5 వచనంలో గల మాటల ద్వారా అది యెరూషలేమును సూచిస్తుందని అర్థమవుతుంది. 

3:3-4 యూదా నాయకులందరూ అవినీతిపరులని ఈ వచనాలు ఆరోపిస్తున్నాయి.

3:5 దాని మధ్యను గురించి (లేదా “వారి మధ్యన”) వ. 15,17తో పోల్చండి. 

3:6-7 నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురు (దిద్దుబాటు అంగీకరిస్తారు) అనేమాట, 2 వచనంలో యెరూషలేము “శిక్షకు లోబడదు” “యెహోవా యందు విశ్వాసముంచదు” (సామె 1:7; 3:5,7) అనేదానికి కొనసాగింపుగా ఉంది. తార్కికంగా అది 6 వచనానికి కొనసాగింపు. దేవుడు అన్యజనులకు చేసినదంతా, తన ప్రజలకు పాఠం నేర్పించడానికే అని గ్రహించాలి. అయితే వారు పాఠం నేర్చుకోలేదు. 

3:8 నా రోషాగ్ని అనే మాటలో రెండు పాత నిబంధన అంశాలు ఇమిడి ఉన్నాయి: (1) విగ్రహారాధనకు వ్యతిరేకంగా చేసిన హెచ్చరికలు ఇశ్రాయేలీయులు పెడచెవిని పెట్టారు (ద్వితీ 29:16-18), కాబట్టి నిబంధన శాపాలు (ద్వితీ 29:20,21) వారిపైకి వచ్చేలా దేవుడు రోషంతో, ఉగ్రతతో వారికి తీర్పుతీర్చాడు; (2) తన ప్రజలకు రక్షణ అనుగ్రహించాలని (జెకర్యా 8:6-8), ఆయనకు గల ఆసక్తి లేదా రోషం (జెకర్యా 8:2 పోల్చిచూడండి) వలన, భూమిపైకి దిగివచ్చిన సార్వత్రిక తీర్పులో (యెషయా 24), అగ్ని ఆయన శత్రువులపైకి (యెషయా 26:11) దిగివచ్చింది.

3:9-10 పవిత్రమైన పెదవుల (భాష) నిచ్చెదను అనే మాట బాబెలు తికమక తొలగిపోతుందని (యెషయా 2:2-4 పోల్చి చూడండి; 19:18-25) లేదా భాషా భేదం లేకుండా ప్రపంచమంతా ఆరాధన జరుగుతుందని సూచిస్తుంది. మోసం కపటం లేకుండా దేవునికి నిజమైన ఆరాధన జరుగుతుందని ఈ మాటల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది (జెఫన్యా 3:13-14; ప్రక 14:5 పోల్చండి). చెదరిపోయిన ఇశ్రాయేలీయులు ఇతర దేశాలతో కలసి ఆరాధనలో పాల్గొంటారని జెఫన్యా 3:10 వివరిస్తుంది.

3:11 వారికి మనస్సాక్షి లేదు, పశ్చాత్తాపం లేదు, గనుక వారికి సిగ్గులేదని వ.5 తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఈ వచనంలో వారి పాపం తొలగించబడి, క్షమాపణ పొందారు కాబట్టి వారికి ఇక సిగ్గు కలగదు. ఇక్కడ కనిపించే సిగ్గు కలుగదా? అనే మాటను వాస్తవంగా సిగ్గుపడనవసరం లేదు అని అర్ధం చేసుకోవాలి. 

3:12-13 గర్వమే ఇశ్రాయేలీయుల పాపానికి మూలకారణం. అయితే, యెహోవా నామము ఆశ్రయించడానికి సిద్ధపడే నీతిగల జనశేషానికి దీనత్వం ప్రధాన గుణలక్షణంగా ఉంటుంది. శేషించిన వారి ప్రవర్తనలో ముఖ్యమైన లక్షణం యథార్ధత, దానికి ప్రతిఫలంగా వారు సమాధానం పొందుతారు. 

3:14-15 వ.1 లో ప్రకటించిన “శ్రమ"కు, ఇక్కడ 14 వచనంలో సంతోషించి గంతులువేయాలని పిలిచిన పిలుపుకు ఎంత వ్యత్యాసముందో గదా! ఇశ్రాయేలు రాజు వారి మధ్యన ఉన్నాడు, వారికి ఇక భయం ఉండదు అనే మాట వ.15 లో ప్రాముఖ్యంగా కనబడుతుంది. అపొస్తలుడైన యోహాను రాబోయే రాజును గురించి ప్రకటిస్తూ, ముందుమాటగా “భయపడకుడి" అని యోహాను 12:14,15లో తెలియజేశాడు. 

3:16-17 భయపడకుడి అనే మాట మళ్ళీ పునరావృతమయ్యింది, దాని వెంటనే ధైర్యము తెచ్చుకొనుము (నీ చేతులు సడలనీయకుము) అనే హెచ్చరిక ఉంది. రాబర్టన్ అనే రచయిత "భయం మానవులను అచేతనావస్థకు గురిచేస్తుంది,” అని పేర్కొన్నాడు. విడుదల పొందినవారి జీవితాలు స్వార్థపూరిత సుఖాలలో, సంతోషించడంలో ముగిసిపోకూడదనే జాన్ కాల్విన్ మాటలను ఉదహరిస్తూ, “వారు తమ బాధ్యతలను నిర్వర్తించడానికి తీవ్రమైన అంకితభావం కలిగివుండాలి” అని పేర్కొన్నాడు. ఈ 17 వచనం పాత నిబంధనకు యోహాను 3:16 వంటిదని రాబర్టన్ పేర్కొన్నాడు. 

3:19-20 తాను విడిపించిన ప్రజల జీవితాల్లో దేవుడు జరిగిస్తానని వాగ్దానం చేసిన ఏడు విషయాలు ఈ వచనాల్లో ఉన్నాయి.

Shortcut Links
జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |