Chronicles I - 1 దినవృత్తాంతములు 23 | View All

1. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను.

2. మరియు అతడు ఇశ్రా యేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను.

3. అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు.

4. వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను,ఆరు వేలమంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి.

5. నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.

6. గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.

7. లద్దాను కుమారులు ముగ్గురు;

8. పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు

9. షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.

10. యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.

11. యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి.

12. కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

13. అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.

14. దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.

15. మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.

16. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

17. ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.

18. ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.

19. హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు,యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.

20. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.

21. మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.

22. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.

23. మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.

24. వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.

25. ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు

26. లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.

27. దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.

28. వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,

29. సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,

30. అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.

31. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు,

32. యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
23:1 సొలొమోను తన తరవాత రాజు కావాలని దావీదు కోరుకున్నాడు... ఈ విషయం సొలొమోనుకు, తన అధిపతులకు తెలియజేశాడు. ఈ వాంగ్మూలానికి అనుగుణంగా వ్యవహరించి తనతోపాటు సమపాలకునిగా సొలొమోనును అధికారికంగా నియమించాడు. సొలొమోను గురించి దావీదు, ఇలా బహిరంగ ప్రకటన చేసినా, ఈ నిర్ణయాన్ని బట్టి బలమైన వివాదం చాలాసార్లు పునరుద్ఘాటించాడు (1రాజులు 1:38-39). ఇంకా 1దిన 29:22, 29:20-22 నోట్సు చూడండి. 

23:2-3 దావీదు ఇశ్రాయేలీయుల యధిపతులందరిని, యాజకులను, లేవీయులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ అధ్యాయంలో మొదటిభాగం ముప్పది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయసు గలవారికి ఉద్దేశించిన విషయాలు. మందిర నిర్మాణం పూర్తికాగానే వీరు తమ బాధ్యతలను పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. తరవాత (వ.24) కనీస వయసు ఇరవై సంవత్సరాలకు తగ్గించారు. ఇలా కనిష్ట వయసు తగ్గించడం వలన ఇంకా శిక్షణలోనే ఉండి, అసలు పరిచర్యకు అర్హులు కానివారు కూడా మందిర పరిచర్యలో వారికి సంబంధించిన విభాగంలో నమోదు అవుతారు. మందిరంలో పనిచేయడానికి మొత్తం ముప్పది యెనిమిది వేలమంది పురుషులు సిద్ధంగా ఉన్నారు. ఇంతమంది జనులతో, ప్రతివారు సంవత్సరంలో అధికభాగం ఇంటివద్దనే ఉంటూ సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. మందిర విధులు నిర్వర్తించడానికి యెరూషలేములో కొంతకాలం ఉంటే సరిపోతుంది. 

23:4-5 లేవీయులను అనేక విధాలుగా విభజించారు. వారిలో ఎక్కువమంది (ఇరువది నాలుగువేలమంది) వాస్తవంగా మందిరంలో పనులు నిర్వహిస్తున్నారు. అర్పణలు చెల్లించడానికి వచ్చేవారిని ముందస్తు పరిశీలన చేయడానికి ఆరువేలమందిని అధిపతులుగా నియమించారు. అర్పణలు
చెల్లించడానికి వచ్చేవారు, వారు తీసుకుని వచ్చే అరణలు పవిత్రంగా ఉన్నయో లేదో నిర్ధారించడం, కార్యక్రమమంతా ధర్మశాస్త్రానుసారంగా జరిగేలా చూడటం వీరి పని. నాలుగు వేలమంది ద్వారపాలకులు భటులుగా ఉన్నారు. ఆ భవిష్యత్తులో జరగబోయే ఆరాధన గురించి దావీదుకు గల దర్శనం నిలబెట్టేందుకు, స్తుతిచేయడానికి నాలుగువేలమందితో) ఒక పెద్ద సంగీతకారుల సమూహం సిద్ధంగా ఉంది. 

23:6 ఇలా చేసే పనులను బట్టి లేవీయులను విభాగాలుగా ఏర్పరచిన తరవాత, మరలా అదే గుంపును గెరోను కహాతు మెరారీ అనే లేవీ కుమారుల వంశాల ప్రకారం మూడు వరసలుగా ఏర్పరచారు. 

23:7-8 వంశావళుల గురించి - తెలియజేసే క్రమంలో వృత్తాంతకారుడు తాను అనుసరిస్తున్న నమూనా అంటే ఒక వంశాన్ని పేర్కొని తరవాత వెనుకకు వెళ్ళి వారి వంశం వివరాలన్నీ పేర్కొనే పద్ధతినే ఇక్కడ ఉపయోగించాడు. 

23:9 ఈ షిమీ లద్దానుకు నాలుగవ కుమారుడు కావచ్చు. ఇతని పినతండ్రి పేరునే ఇతనికి పెట్టారు. ఇతని ముగ్గురు కుమారుల పేర్లతోనే ఇతని వంశీకులను పిలిచారు. లద్దానును "లిట్నీ” అని కూడా పిలిచారు (6:17). 

23:11 యూషు... బెరీయా లకు కుమారులు అనేకులు లేకపోయిరి కాబట్టి వారిని ఒక్క వంశముగానే ఎంచారు......

23:12 కహాతు వంశంనుంచే యాజకులైన అహరోను వంశం వచ్చింది. ఈ గోత్రంలో మిగిలిన వంశీకులు యాజకత్వానికి అహరోనుకు ఉన్న ప్రత్యేకతను సవాలు చేశారు. అయితే దేవుడు శిక్ష విధించిన కారణంగా భూమి వారిని సజీవులుగానే మింగేసింది (సంఖ్యా 16). 

29:13-14 ఈ సందర్భంలో వృత్తాంతకారుడు మోషే సంతతికి చెందిన వారికన్నా అహరోను సంతతి వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. 

23:15-20 మోషే కుమారులైన గెరోము, ఎలీయెజెరు యాజకులతో కలసి పనిచేయడం వృత్తాంతకారుడు వివరించాడు. నిర్గమ 18:24 చూడండి.

23:21-23 ఎలియాజరు కుమార్తెలు కీషు కుమారులను వివాహం చేసుకోవడంతో అతని వంశం నిలబడింది. కీషు కుమారులలో యెరెహ్మెయేలు ఒకడని 24:29లో మనం తెలుసుకుంటాం. మెరారికి యహజీయాహు అనే మూడవ కుమారుడు ఉన్నాడని, అతనికి కూడా ముగ్గురు కుమారులున్నారని 
24:26-27లో అదనపు సమాచారం కనబడుతుంది.

23:24 వ్యక్తుల పేర్లు కేవలం పేర్లకోసమే పేర్కొనేలా వృత్తాంతకారుడు ఆసక్తి చూపలేదు. వృత్తాంతకారుని కాలంలో ఈ సమాచారం ఆధారంగానే యెహోవా మందిరపు సాధారణ సేవలో తాము ఎక్కడ ఉండటానికి సరిపోతామో లేవీయులు గ్రహించారు అనే సత్యంలోనే ఈ పేర్ల జాబితాకు గల ప్రాముఖ్యత ఇమిడివుంది.

23:25 ఇప్పుడు అక్కడ మందసమునకు, ఆరాధనకు ఒక శాశ్వత స్థలం ఏర్పడింది. కాబట్టి ఇశ్రాయేలీయులకు నెమ్మది కలిగిందని దావీదు ప్రకటించాడు. సొలొమోను కాలం - వరకు వాస్తవరూపం దాల్చని ఈ సంభవాన్ని దావీదు ముందుగానే కనిపెట్టాడు. 

23:26-29 ఇక మీదట ప్రత్యక్ష గుడారమును మోసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. ఇలా గుడారాన్ని మోసేపని తమ ముఖ్య బాధ్యతగా నిర్వహించిన లేవీయులకు ఇప్పుడు వేరే పనులు అప్పగిస్తారు. మందసమును అక్కడనుంచి కదలించే అవసరం కొన్ని వందల సంవత్సరాల తర్వాత వరకు రాలేదు (2దిన 35:2-3) 

23:30-31 మందిరంలో క్రమంగా స్తుతిపాటలు పాడాలని దావీదు ఏర్పరచిన నియమం వృత్తాంతకారుడు మరలా ధృఢంగా తెలియజేశాడు. సంగీతకారులు అనుదినము, ప్రధాన బల్యర్పణల సమయంలో, ఇంకా ప్రత్యేక సందర్భాలలో స్తుతి ఆరాధన నిర్వహించాలి. 


Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |