Jeremiah - యిర్మియా 8 | View All

1. యెహోవా వాక్కు ఆ కాలమున శత్రువులు యూదారాజుల యెముకలను అధిపతుల యెముకలను యాజకుల యెముకలను ప్రవక్తల యెముకలను యెరూషలేము నివాసుల యెముకలను సమాధుల లోనుండి వెలుపలికి తీసి

2. వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.
అపో. కార్యములు 7:42

3. అప్పుడు నేను తోలివేసిన స్థలము లన్నిటిలో మిగిలియున్న యీ చెడ్డ వంశములో శేషించిన వారందరు జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు; సైన్యముల కధిపతియగు యెహోవా వాక్కు ఇదే.
ప్రకటన గ్రంథం 9:6

4. మరియయెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుముమనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగిరారా?

5. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసికొని తిరిగిరామని యేల చెప్పుచున్నారు?

6. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు నేనేమి చేసితినని చెప్పితన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేక పోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు.

7. ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.

8. మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్న దనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.

9. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాక రించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?

10. గనుక వారి భార్యలను అన్యుల కప్పగింతును, వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరును మోసముచేసి దోచుకొనువారు; ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచకులు.

11. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు.
1 థెస్సలొనీకయులకు 5:3

12. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు

13. ద్రాక్షచెట్టున ఫల ములు లేకుండునట్లును, అంజూరపుచెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను; వారిమీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

14. మనమేల కూర్చుండియున్నాము? మనము పోగు బడి ప్రాకారములుగల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి; యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు.

15. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదా యెను; క్షేమముకొరకు కనిపెట్టుచున్నాముగాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు.

16. దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశ నము చేయుదురు.

17. నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.

18. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును?

19. యెహోవా సీయో నులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహు దూరదేశమునుండి నా ప్రజల రోదనశబ్దము విన బడుచున్నది; వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపములచేతను నాకేల కోపము తెప్పించిరి?

20. కోత కాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణనొందకయే యున్నాము అని చెప్పుదురు.

21. నా జనుల వేదననుబట్టి నేను వేదనపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరభయము నన్ను పట్టియున్నది.

22. గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?బైబిల్ అధ్యయనం - Study Bible
8:1 ఆ కాలమున అనే పదజాలం అధ్యా. 7లో యిర్మీయా మందిరద్వారం దగ్గర సందేశం సెలవిచ్చిన సందర్భం తరువాత జరిగిన సంఘటనలను ఇక్కడ జోడిస్తుంది. యెముకలను (రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు, నివాసుల యెముకలు) సమాధులలో నుండి వెలుపలికి తీసి అనే వర్ణన పరాజితులైన ప్రజలకు జరిగిన అంతిమ అవమానాన్ని తెలియజేస్తుంది. యూదా ప్రజలు తమ పూర్వికుల అవశేషాలను కాపాడుకోలేకపోయారు, కనీసం తమను తాము సైతం కాపాడుకోలేకపోయారు. 

8:2 వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట యెముకలను (వ.1) వెదజల్లడం అసత్యమతం యొక్క వ్యర్ధతను హేళనచేసే ప్రదర్శన.
యూదా ప్రజలు పూజించిన నక్షత్రదేవతలు పై నుండి కిందికి చూసి ఈ అపవిత్రతను ఆపలేని శక్తిహీనులు. 

8:3 జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు - ద్వితీ 28:64-68 చూడండి. 

8:4-5 మరొకసారి యెహోవా వైపు. “తిరగడం, మళ్ళుకొనడం" లేదా “పశ్చాత్తాపపడడం” (హెబ్రీ. షువ్) గురించి నొక్కి వక్కాణించడం జరిగింది. యిర్మీయా శబ్దచమత్కారంగా ఈ మాటలను పలుకుతున్నాడు: తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగిరారా? వారు... తిరిగి రామని యేల చెప్పుచు న్నారు? సాధారణంగా, క్రిందపడిన మనుషులు తిరిగి పైకి లేచే ప్రయత్నం చేస్తారు. గదా. అయితే ఈ ప్రజలెందుకు సహజస్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు? ఇంకా వారు మోసాన్నే ఆశ్రయిస్తున్నారన్నదే ఈ ప్రశ్నకు జవాబు. 

8:6 తన చెడుతనమును (హెబ్రీ. నిఖామ్) గూర్చి పశ్చాత్తాపపడు వాడొకడును లేకపోయెను అనే పదజాలం పదే పదే ఉపయోగించిన “తిరిగి రా” (హెబ్రీ. షువ్) అనే పదజాలానికి సరిగ్గా సరిపోతుంది. 

8:7 సంకుబుడి కొంగ, తెల్లగువ్వ, మంగలకత్తి పిట్ట, ఓదెకొరుకు ఇవన్నీ వలస వెళ్ళే పక్షులు. ఇవి వాటి సహజ స్పందనను అనుసరించి సృష్టికర్త నియమించిన ప్రకృతి ధర్మాలను పాటిస్తాయి. వివేచన, వివేకం కలిగిన ప్రజలు రాబోతున్న విపత్తును తెలిపే సంకేతాలను చూస్తున్నప్పటికీ తమ త్రోవలను సరిదిద్దుకొనడానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు. 

8:8-9 యూదా ప్రజలు తమకు ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి అదే తమను కాపాడుతుందనీ, అదే తమను దేవునితో సరైన సంబంధం గలవారిగా చేస్తుందని ఆలోచించారు. అయితే వారు ధర్మశాస్త్రంలోని మాటలను ఉద్దే శాలను అపార్థంతో తారుమారు చేసారు. “నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్దముగా దానికి అపార్ధము చేయుచున్నది” అని వ.8 అక్షరార్థంగా తెలియజేస్తుంది. చెడుతనాన్ని కప్పిపుచ్చడం కోసం శాస్త్రులు తమ చేతులతో దేవుని ధర్మశాస్త్రాన్ని వక్రీకరించారు. 

8:10-11 "6:13-14 చూడండి. 

8:12 వారేమాత్రమును సిగ్గుపడరు గురించి 3:3 నోట్సు చూడండి. 

8:13-9:23 ఈ విభాగం యూదా, దాని నివాసుల వినాశనాన్ని తెలియజేస్తుంది. 

8:14-15 దేవుడు యూదా చేత విషజలమును త్రాగింపచేస్తాడు. ఈ అలంకారిక వర్ణన యూదా ప్రజలు అనుభవించబోతున్న దేవుని తీర్పును తెలియజేసే 9:15; 23:15 లో మళ్ళీ కనబడుతుంది. ప్రజలు సమాధానము కొరకు... క్షేమము కొరకు కనిపెట్టారు గానీ, కేవలం భీతియే కలిగింది.

8:16 ఫేనీకేకు ఉత్తరాన సరిహద్దు ప్రాంతంలోని దాను పట్టణం తూర్పు నుండి శత్రువు వచ్చే దారి. తూర్పున ఉన్న అరణ్యం వాస్తవంగా ఎవరూ చొరబడలేని దట్టమైన ప్రాంతం.

8:17 యుద్ధం గురించి అలంకారిక వర్ణనలు గుఱ్ఱం వేగం. నుండి సర్పభీతికి మారుతున్నాయి. దేవుడు విషపూరితమైన మిడునాగులను ప్రజల మధ్యకు పంపిస్తున్నాడు. విషయమేమిటంటే, గుర్రలమీద స్వారీచేస్తూ వచ్చే యుద్దశూరుల నుండి మరణం కలగకపోయినట్లయితే, దేవుడు మరొకవిధంగా వారు మరణించేలా చేయగలడు. తప్పించుకొనడమంటూ ఉండదు.

8:18-21 ఈ వచనాలు అలంకారిక వర్ణనలో ఉన్నాయి. వ, 18, 19,21 లలో యిర్మీయా మాట్లాడుతున్నాడు. 19,20 వచనాలలో ప్రజలు యిర్మీయా ద్వారా మాట్లాడుతున్నారు, మధ్యభాగమైన వ. 19 లో యెహోవా మాట్లాడుతున్నాడు. క్రీ.పూ. 605 నాటికే యూదులు బబులోను చెరలో ఉన్నారు. 

8:20 కోతకాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణనొందకయే యున్నాము అనే మాటలు అన్ని అవకాశాలు పోయాయి. రక్షణ లభిస్తుందనే ఆశ ఇక లేనే లేదని జనం వాడుకగా మాట్లాడుకొనే సామాన్యమైన లోకోక్తిని సూచిస్తున్నాయి.

8:22 గిలాదు మొర్దాను కవతల మోయాబుకు ఉత్తరాన ఉన్న ప్రాంతం, గిలాదులోని ఉత్తరప్రాంతాలు దట్టమైన అడవులున్నాయి. ఔషధంగా పనిచేసే గుగ్గిలము ఇక్కడ ప్రసిద్ధిచెందిన దినుసు. గుగ్గిలం చెట్ల నుండి తీసిన జిగురుపదార్థాన్ని గాయాలకు ఔషధంగా ఉపయోగించేవారు. అయితే ఔషధం గానీ వైద్యుడు గానీ ప్రజల బాధను తీసివేయలేడు. 


Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |