7:1-8:59 అనేకమంది శిష్యుల అవిశ్వాసము (6:60-66) వెన్నంటి వచ్చిన 7 అధ్యాయం యేసు సహోదరుల అవిశ్వాసంతో ఆరంభమై, యూదుల నాయకుల అవిశ్వాసంతో ముగుస్తుంది (7:45-52). అధ్యా. 7,8 లు యెరూషలేములోని పర్ణశాలల పండుగలో యేసు బోధలను తెలియజేస్తాయి. దప్పిగొన్నవారెవరైనా తనయొద్దకు వచ్చి దాహం తీర్చుకోమనే ఆహ్వానంతో ముగిస్తూ, యేసు తన బోధను రెండు విడతలుగా ఇచ్చాడు (7:10-24,37-39; 8:12-30). ఒక్క సారి పరిశుద్ధాత్మ ఇవ్వబడిన తర్వాత, విశ్వాసులు “జీవజలనదులు" ప్రవహింప జేసేవారిగా మారారు (7:37-38). రెండవ విడత బోధ, “నేను... వెలుగును" (8:12) అని యేసు దృఢంగా చెప్పిన ఆశ్చర్యకరమైన మాటతో ఆరంభమైంది.
7:1 రోమీయులు ముఖ్యపాలనాధికారులుగా ఉన్న యూదయ కంటే, హేరోదు అంతిప పాలన కింద ఉన్న గలిలయ యేసుకు క్షేమకరమైనది, ఎందుకంటే యూదులు ఆయనను చంప వెదకినారు.
7:2 యూదుల పర్ణశాలల పండుగ ప్రతిష్ఠ పండుగకు రెండు నెలల ముందు, సెప్టెంబరు లేక అక్టోబరు నెలలో చేసుకునేవారు (10:22 నోట్సు చూడండి). ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో దేవుని విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రజలు పర్ణశాలలలో తాత్కాలికంగా నివసించేవారు (లేవీ 23:42-43తో మత్తయి 17:4 పోల్చండి). 2:13 నోట్సు చూడండి.
7:3-5 యేసు సహోదరులు మరియ, యోసేపులకు పుట్టిన సంతానం. వారి పేర్లు యాకోబు, యోసేపు, యూదా, సీమోను (మత్తయి 13:55; మార్కు 6:3). ఈ పేలవమైన సలహా వారి అవిశ్వాసంనుండి పుట్టి (యోహాను 7:5), యేసే మెస్సీయ అనే గుర్తింపు విషయంలో ప్రాథమిక అపార్ధాన్ని బయల్పరుస్తుంది (మత్తయి 4:5-7).
7:6-10 నా సమయమింకను రాలేదు అనే మాటలను గురించి, 2:4 నోట్సు చూడండి. 7:8 లో నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని యేసు అన్నాడు. వ.10లో, ఆయన... బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను అని తెలుసుకుంటాం (వ.1 నోట్సు - చూడండి). ఇది ఆయన వివేకాన్ని బయలుపరుస్తుంది.
7:11 ముఖ్యంగా యేసును అంతవరకు చూడనివారు, పండుగలో ఆయనను కనుగొనాలని ఆసక్తిగా ఉన్నారు.
7:12 యేసు జనులను మోసపుచ్చువాడనడం ద్వితీ 13:1-11ను జ్ఞాపకం చేస్తుంది (మత్తయి 27:63; లూకా 23:2 తో పోల్చండి).
7:13 యూదులకు భయపడి అనే మాటలు (9:22; 19:38; 20:19) సన్నైడ్రిన్ (యూదుల మహాసభ) ప్రతినిధులైన యెరూషలేము అధికారులను సూచిస్తుంది (3:1 నోట్సు చూడండి).
7:14-15 యూదులు అంటే యూదుల సమూహము, యూదుల అధికారులు కూడా కావచ్చు. యేసుకు రబ్బీలకుండాల్సిన కనీస తర్ఫీదు లేదు (ఆయన శిష్యులకు కూడా; అపొ.కా.4:13), కానీ ఆయన బోధ, అధికారం దేవునినుండి వచ్చినవి (యోహాను 7:16; 8:28తో మత్తయి 5:21-26; 7:28-29 పోల్చండి).
7:16 మిగతా రబ్బీలవలే కాక, తన జ్ఞానం నేరుగా దేవునినుండి వచ్చిందని యేసు చెప్పాడు (8:28).
7:17 దేవుని చిత్తాన్ని వెంబడించడానికి సమర్పించుకున్న నిజమైన విశ్వాసులు మాత్రమే యేసు బోధలను సరిగ్గా వివేచించగలరు.
7:18-19 అధికారపూర్వకమైన చోటునుండి వచ్చిన యేసు, అబద్దపు, వ్యర్థమైన ప్రవక్తలతో విభేదిస్తున్నాడు - (ద్వితీ 18:9-22). ధర్మశాస్త్రమును మోషే తమకు ఇచ్చాడనే సత్యాన్ని బట్టి యూదులు గర్వించేవారు (9:28తో పోల్చండి; రోమా 2:17; 9:4).
7:20 యేసుకు దయ్యము పట్టినదని నేరం మోపిన అనేక సందర్భాలలో ఇది ఒకటి (8:48; 10:20; మత్తయి 12:24), ఇదే నింద బాప్తిస్మమిచ్చు యోహానుపై కూడా మోపారు (మత్తయి 11:18). యేసుమీద మోపబడిన ఇతర నేరాలు: విశ్రాంతి దినమును అతికమించినవాడు (యోహాను 5:16, 18; 9:16), దేవదూషణ చేసినవాడు (5:18; 8:58-59, 10:31,33,39; 19:7), ప్రజలను మోసపుచ్చువాడు (7:12,47), సమరయుడు (అంటే మతభ్రష్టుడు అనీ, 8:48), పిచ్చివాడు (10:20), దుర్మార్గుడు(18:30).
7:21 యేసు చెప్పిన ఒక కార్యము బహుశా 5:1-15 లోని స్వస్థత కార్యం కావచ్చు.
7:22-23 సున్నతి అనే సంస్కారం పితరులవల్ల (అంటే అబ్రాహాము; ఆది 17:9-14), మోషేవల్ల (నిర్గమ 12:44,48-49; లేవీ 12:3) కలిగింది. యేసు వాదన “తక్కువనుండి ఎక్కువకు” అనేదిగా ఉంది. యూదులు తమ మగ పిల్లలకు ఎనిమిదవరోజు సున్నతి చేయించాలి, ఆరోజు విశ్రాంతి దినము వచ్చినా సరే ("తక్కువ విషయం). మానవ శరీరంలోని ఒక భాగాన్ని “పరిపూర్ణం" చేయడానికి విశ్రాంతిదినం ఒప్పుకుంటే, ఒక మనుష్యుని పూర్తిగా స్వస్థపరచడాన్ని ఇంకెంతగా ఒప్పుకుంటుందో కదా!
7:24 తీర్పు తీర్చడం గురించి యేసు వాఖ్య లేవీ 19:15ను ప్రస్తావిస్తుంది (ద్వితీ 16:18-19; యెషయా 11:3-4; జెకర్యా 7:9 తో పోల్చండి)...
7:25-44 తరువాతి మూడు దృశ్యాలు (వ.25-31,32-36, 37-44) “యేసును క్రీస్తనవచ్చునా ?" అనే ప్రశ్నను కేంద్రంగా చేసుకున్నవి. జనసమూహాలలో ప్రతినిధులనుండి వచ్చిన ప్రశ్నలు (కొన్నిసార్లు అపార్థాలు కూడా ఉన్నాయి. ఈ అంశంతో వ్యవహరించడానికి సహాయం చేశాయి (వ.27,31,42), మెస్సీయ (క్రీస్తు) ఎక్కడనుండి వస్తాడో, ఆయన చేసే సూచక క్రియలు, మెస్సీయ పుట్టే స్థలంగా బెల్లెహేము గూర్చిన తెలియని విషయాలపై దృష్టిపెట్టారు.
7:26 అధికారులు అనే మాట బహుశా సన్నైట్రిన్ (యూదుల మహాసభ)ను సూచిస్తుండవచ్చు (వ.48; 12:42; 3:1; 7:13 నోట్సు చూడండి).
7:27 ఇశ్రాయేలుకు రక్షణను సంపాదించుటకు వెళ్ళేవరకు మెస్సీయ ఎవరికీ తెలియబడకుండా ఉంటాడని కొందరు రబ్బీలు బోధించారు. ఇతరులు ఆయన పుట్టేస్థలం ముందే తెలుసని భావించేవారు. (వ.42తో మత్తయి 2:1-6 పోల్చండి).
7:28-29 యూదులు దేవుని ఎరగరని వారితోనే చెప్పడం బలమైన ప్రతిస్పందనకు కారణమైంది.
7:30 తన శత్రువులనుండి తప్పించుకోవడానికి యేసుకున్న సామర్థ్యాన్ని గురించి 2:4 నోట్సు చూడండి.
7:31 మెస్సీయ కూడా మోషేవలె ఒక ప్రవక్త అవుతాడు కాబట్టి (ద్వితీ 18:15, 18), మోషే నిర్గమము సమయంలో అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు కాబట్టి (నిర్గమ 7-11), మెస్సీయ ఆశ్చర్యకార్యాలు చేస్తాడని వారు ఆశించారు (యోహాను 6:30,31 నోట్సు చూడండి). యేసు చేసిన అద్భుతాలు కళ్ళారా చూసిన తర్వాత, ఆయనే మెస్సీయ ఏమో అని ప్రజలు తర్జనభర్జన పడడం సహజమే.
17:32 ప్రధాన యాజకులును, పరిసయ్యులును అనే సనైద్రిన్ ప్రతినిధులు యేసును పట్టుకొనుటకు బంఛైతులను పంపారు. ఆయనను బంధించడం అంటే ఆయనను నేరస్తునిగా చూపడమే (కానీ వ.45-52 నోట్సు చూడండి). ఇలా చేస్తే ప్రజలు ఆయనను అనుసరించకుండా, వారిని నిరుత్సాహపరుస్తుందని నాయకులు ఆశించారు.
7:33-34 ఈ ప్రవచనం చెప్పిన ఆరునెలల తర్వాత, యేసు సిలువవేయ బడ్డాడు.
7:35-36 వ.34 లోని యేసు వ్యాఖ్యను ప్రజలు అపార్థం చేసుకున్నారు. చెరగొనిపోబడిన తర్వాతనుండి, చాలామంది యూదులు పాలస్తీనాకు తిరిగి రాకుండా, గ్రీసు దేశస్థులలో (“అన్యజనులు” అనే మాటకు సమానార్థకం) చెదరిపోయి జీవించడం కొనసాగించారు.
7:37 వ.14 లో “సగము” పండుగైనప్పుడు అని సూచించినట్లు, ఇది పర్ణశాలల పండుగలోని చివరి, మహాదినం. యేసు ఆహ్వానం యెషయా 55:1 వంటి పా.ని. ప్రవక్తల వాక్యభాగాలను జ్ఞప్తికి తెస్తుంది (యెషయా 12:3తో పోల్చండి).
7:38-39 యేసు అనుచరుల కడుపులోనుండి జీవజల నదులు ప్రవహించడం అనేది పా.ని.లో ప్రవచించిన అంత్యకాల ఆశీర్వాదాలను నెరవేరుస్తుంది. ఈ నదులు యేసు తండ్రివద్దకు హెచ్చించబడిన తర్వాత ఇవ్వబడబోయే ఆత్మకు గుర్తులు అని యోహాను వ.39లో చెప్పాడు (20:22).
7:40-41 ఇక్కడ ఆ ప్రవక్త అంటే ద్వితీ. 18:15-18 లో చెప్పబడిన వ్యక్తి (యోహాను 1:19-21 నోట్సును 6:14 తో పోల్చండి). మొదటి శతాబ్దపు యూదులలో కొందరు ఈ ప్రవక్త, క్రీస్తులు వేరు వేరు వ్యక్తులని భావించేవారు కానీ యేసు రెండూ తానే అయ్యాడు.
7:42 యెరూషలేముకు దక్షిణంగా, యూదయకు కేంద్రస్థానంలో ఉన్న బేళ్లే హేమను గ్రామము, మెస్సీయ జన్మస్థలంగా మీకా 5:2లో ప్రవచించాడు (మత్తయి 2:5-6 తో పోల్చండి; యోహాను 7:27 నోట్సు చూడండి). దావీదు పట్టణంగా (1సమూ 16:1,4; 20:6), బేల్లెహేముకు మెస్సీయకు సంబంధించి ముఖ్యమైన సూచనలున్నాయి. ఈ వచనంలో ఆ వ్యంగ్యం స్పష్టంగా ఉంది. యేసు గలిలయనుండి వచ్చాడని ఎరిగిన కొందరు, క్రీస్తు బేల్లెహేములో పుడతాడని చెప్పి అభ్యంతరం చెప్పారు. యేసు నిజానికి బేల్లెహేములోనే పుట్టాడనే సత్యం వారికి తెలియదు.
7:43-44 యేసు మరణ పునరుత్థానాల ఖచ్చితమైన సమయం కోసం, 2:4 నోట్సు చూడండి.
7:45-52 యేసు ప్రసిద్ధి పెరగడం యూదుల నాయకత్వానికి ప్రమాదకారి కాబోతుందంటూ సనైద్రిన్ సమావేశం ఎత్తి చూపింది. అయితే నీకొదేము న్యాయం కోసం మనవి చేయడం, సన్నైధిలో అందరూ యేసుకు వ్యతిరేకం కాదు అని చూపుతుంది.
7:45 యేసును పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం గురించి, వ.32 నోట్సు చూడండి.
7:46 దేవాలయ ఆవరణంలో అనేకులు బోధించడం బంఛైతులు (వ.32 చూడండి) విన్నారు. కానీ యేసు బోధ చాలా అపూర్వమైంది (మత్తయి 7:28-29; యోహాను 7:14-15 నోట్సు చూడండి) అని వారు గుర్తించారు.
7:48 అధికారులు అనేమాట బహుశా సన్నైట్రిన్ సభ్యులను సూచిస్తుండవచ్చు (3:1 నోట్సు చూడండి).
7:49 ధర్మశాస్త్రమెరుగని ఈ జనసమూహము అనే - అవమానకరమైన మాట, విద్యలేని జనసమూహాల పట్ల అనేకమంది రబ్బీలకున్న అహంకార పూరితమైన అసహ్యతను వెల్లడి చేస్తున్నది.
7:50 నీకొదేము అంతకు ముందే యేసును కలుసుకోవడం గురించి 3:1-15లో వివరించాడు.
7:51 ఆరోపణలను న్యాయంగా (ద్వితీ 1:16), సంపూర్ణంగా (యోహాను 17:4; 19:18) విచారించాలని పాత నిబంధన ధర్మశాస్త్రం, న్యాయమూర్తు లకు ఆదేశించింది. న్యాయం కోసం నీకొదేము వేడుకున్నట్లే, తరువాత గమలీయేలు అనే రబ్బీ కూడా వేడుకున్నాడు (అపొ.కా.5:34-39).
7:52 పరిసయ్యులు భావించినదానికి విరుద్దంగా, గలిలయనుండి తరచుగా ప్రవక్తలు వచ్చారు. వీరిలో యోనా (2రాజులు 14:25), బహుశా ఏలీయా (1రాజులు 17:1), నహూము (నహూము 1:1) ఉన్నారు.