16:1-2 ధనవంతుడొకడు తన ఆస్తికి, వ్యాపారాలకు సంబంధించిన విషయాలను నిర్వహించడానికి ఒక వ్యక్తిని (గ్రీకు. ఓయికోనొమొస్, గృహనిర్వాహకుడు, విచారణకర్త) నియమించుకున్నాడు. ఈ గృహనిర్వాహకుడు ఆ ధనవంతుని ఆస్తిని వృధా చేస్తున్నాడనే అపవాదు నిజమే. అతడు నిర్లక్ష్య
ధోరణితోనో లేదా అక్రమంగానో దాన్ని దుర్వినియోగం చేశాడు. అందువల్లనే తన యజమానుడు ప్రశ్నించినప్పుడు ఈ గృహనిర్వాహకుడు తనను తాను సమర్థించుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. యజమాని తన ఆస్తికి సంబంధించిన లెక్కల్ని జాగ్రత్తగా అప్పగించమని అతణ్ణి ఆదేశించాడు. దాని వలన తర్వాత రాబోయే గృహనిర్వాహకుడు ప్రారంభం నుంచే ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది.
18:3-4 తనను యజమాని ఉద్యోగంలో నుంచి తొలగించబోతున్నాడని ఎరిగిన ఆ గృహనిర్వాహకుడు తనను తాను పోషించుకునే మార్గాన్ని అన్వేషించ వలసి వచ్చింది. కాయకష్టం చేసి బ్రతికే స్థితిలో లేడు, భిక్షమెత్తడానికి అహం అడ్డువస్తుంది, అందువల్ల తన దగ్గరకు ఇంతకు ముందు వచ్చిన ఖాతాదారులు తనకు ఆతిథ్యమివ్వడానికి ఇష్టపడేలా చేయడంపై దృష్టిసారించాడు.
16:5-7 తన యజమాని ఖాతాదారుల అప్పులను ఈ గృహనిర్వాహకుడు తగ్గించి రాశాడు. దీనికి నాలుగు వివరణలు ఉన్నాయి: (1) ఆ రుణస్తులను సంతోషపెట్టి వారి అనుగ్రహం పొందేటంతగా అతడు రుణాన్ని తగ్గించాడు, (2) వాళ్లు తీసుకున్న రుణానికి చెల్లించవలసిన వడ్డీని రద్దు చేశాడు. (3) ఆ లావాదేవీల్లో తనకు రావలసిన వాటాను రద్దు చేశాడు. (4) తన దుబారా ఖర్చును సర్దుబాటు చేసుకోవడానికి ఇంతకు ముందు వేలంలో ఎక్కువ వడ్డీ చెల్లించమని అడిగినవాడు. ఇప్పుడు తొలిసారి తీసుకున్న దాన్నే చెల్లించమని అడిగి ఉంటాడు. ఈ నాలుగు ఎత్తుగడలు సాధ్యమే. యజమానికి పూర్తిగా ఈ గృహనిర్వాహకుడు లెక్కలు అప్పగించాల్సి వచ్చిందని గుర్తుంచుకోవాలి. అందువల్ల ఇతని ఎత్తుగడలు న్యాయమైనవే అయి ఉండవచ్చు.
18:8-9 యజమానుడు (వ.8) అనే మాటకు గ్రీకు మూలం “కురియోస్" (ప్రభువు). అందువల్ల అన్యాయస్టుడైన ఈ గృహనిర్వాహకుని అభినందించింది దేవుడేనని కొందరు అనుకున్నారు. అయితే, వ.8 మధ్యభాగానికే ఉపమానం పూర్తె ఉండదు. ఆ విధంగా, గృహనిర్వాహకుణ్ణి అభినందించింది. దేవుడు కాదు, యజమానుడే... గృహనిర్వాహకుడు తాను చేసిన తప్పిదాలకు స్పందనగా యుక్తిగా నడుచుకొనెనని మాత్రమే యజమాని మెచ్చుకున్నాడు. వ.8 చివరి భాగంలోనూ, వ.9 లోనూ ఈ ఉపమాన భావాన్ని యేసు తెలియజేస్తున్నాడు. ఈ లోక సంబంధులు (అవిశ్వాసులు) సాధారణంగా ఒకరితో మరొకరు యుక్తిగా వ్యవహరిస్తూ స్నేహితులను గెలుచుకుంటారు. అయితే, వెలుగు సంబంధులు (విశ్వాసులు) కొందరిని విశ్వాసంలోకి నడిపించడానికి తమ ఆర్థిక వనరులను ఉపయోగించడంలో విఫలమవుతున్నారు. విశ్వాసులు ఎవరినైతే గెలుచుకుంటారో వాళ్లే శాశ్వత మిత్రులుగా మారి విశ్వాసుల్ని తమ నిత్యమైన నివాసములలో.... చేర్చుకొంటారు. దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడానికి తమ ధనాన్ని యుక్తిగా (అదే సమయంలో నిష్కల్మషంగా) ఉపయోగించమని యేసు ఆ విధంగా తన అనుచరులను ప్రోత్సహించాడు.
16:10-12 ప్రభువు యెదుట నమ్మకముగా ఉండాల్సిన అవసరముందనేదే ఈ ఉపమానం బోధిస్తున్న రెండవ పాఠం. ఆధ్యాత్మికంగా ప్రతీ విశ్వాసి దేవుడు అనుగ్రహించిన వరాలకు గృహనిర్వాహకుడే. మీరు తక్కువ మొత్తంలో మీ దగ్గర ఉన్న ధనం విషయంలో నమ్మకంగా ఉంటే, ప్రభువు మీకు మరింత ఎక్కువగా ధనాన్ని ఇస్తాడు. అందులో నిత్య విలువ కలిగిన బహుమానాలు కూడా ఉం టాయి. మిక్కిలి కొంచెము విషయంలో నీవు నమ్మదగిన వ్యక్తివి కాకపోతే, నీకు ఎక్కువగా అప్పగించినా కూడా నువ్వు చెడ్డ గృహనిర్వాహకునిగానే ఉంటావు.
16:13 ఇద్దరు యజమానులను సేవింపడం గురించి, మత్తయి 6:24 చూడండి..
16:14-15 పరిసయ్యులు ధనాపేక్ష గలవారు కాబట్టి యేసును వాళ్లు అపహసించడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవునితోబాటు ధనాన్నీ సేవించడం సాధ్యమేనని వాళ్ళు నమ్మారు. (వ.13). దాని స్పందనగా మనుష్యులలో ఘనముగా ఎంచబడడం అనే వారి కోరిక దేవుని దృష్టికి అసహ్యము అనీ, ఎందుకంటే ఆయన లోకవిలువలను ఆమోదించడు అనీ యేసు పరిసయ్యులకు చెప్పాడు.
16:16-17 ధర్మశాస్త్రమును ప్రవక్తలును అనే మాట మొత్తం పా.ని.ను సూచించే మాట (వ.29; 24:27,44). బాప్తిస్మమిచ్చే యోహాను పరిచర్య పాత నిబంధన యుగానికి ముగింపును సూచిస్తుంది. యేసు పరిచర్య సువార్త ప్రకటనతో మొదలయ్యి, కొత్త నిబంధన యుగాన్ని ఆరంభించింది, దేవునిరాజ్య సామీప్యతను మూర్తీభవించింది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు అనే మాట ఈ సందర్భంలో బహుశా బాప్తిస్మమిచ్చే యోహాను, యేసు, అపొస్తలులు చేస్తున్న సువార్త ప్రకటనలోని తీవ్రతను సూచిస్తూ ఉండవచ్చు. ఒక పొల్లయిన అనే మాట గురించి మత్తయి 5:17-20 చూడండి.
16:18 మొదటి వివాహాన్ని చట్టవిరుద్ధమైన కారణాలతోనో వేరే ఉద్దేశాలతోనో తెంచేసుకుని పునర్వివాహం చేసుకోవడం వ్యభిచరించినట్లు అవుతుంది.. ఈ వచన భావం ఇదే. సమాంతర వాక్యభాగాలైన మత్తయి 5:31-32; 19:9 లు ఈ వాక్యభాగానికి మరింత వివరణ నిస్తున్నాయి. వ్యభిచార కారణం వలన మాత్రమే విడాకులు తీసుకుని మొదటి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో మాత్రమే పునర్వివాహం చట్టబద్దమవుతుందని ఈ వాక్యభాగాలు తెలియ చేస్తున్నాయి.
16:19-21 ధనవంతుడు (లాటిన్. డైవ్స్) నిత్యరాజ్యంలో స్నేహితులను పొందుకోడానికి తన ధనాన్ని ఉపయోగించ లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది (వ.8-9 నోట్సు, చూడండి). కురుపులు అనే మాట కొ.ని.లో ఇక్కడ మాత్రమే ఉపయోగించిన వైద్య పరిభాషిక పదం. ఈ పదం వైద్యునిగా లూకా నేపథ్యాన్ని సూచిస్తుంది (కొలస్సీ 4:14). బాధననుభవిస్తున్న దరిద్రుని పేరు లాజరు కావడం కాకతాళీయమే, ఎందుకంటే అదే పేరుతో ఉన్న వ్యక్తి కొంతకాలం తర్వాత మృతుల్లో నుంచి లేపబడ్డాడు (యోహాను 11:1-44). ఊదారంగు వస్త్రము గురించి, అపొ.కా.16:14 చూడండి.
16:22-24 ఈ ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యాయి. పరదైసు (23:43; 2 కొరింథీ 12:4), అబ్రాహాము రొమ్ము అనే మాటలను మరణం తర్వాత ధన్యకరమైన స్థలాలుగా యూదుల తాల్మూదు గ్రంథం ప్రస్తావిస్తుంది. హేడేస్ అనే గ్రీకు పదం షియోల్ అనే హెబ్రీ పదానికి సమాంతరమైనది. పాతాళము అని దీన్ని తెలుగులో అనువదించడం జరిగింది. ఇది మృతుల లోకాన్ని తెలియజేసే మాట. అయితే, ఈ సందర్భంలో యాతన పడడం గురించిన ప్రస్తావన ఉంది. కాబట్టి పాతాళాన్ని దుర్నీతిపరులైన మృతులుండే నరకం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ అగ్నిజ్వాలలో అనే మాట నిత్యాగ్ని గుండమును సూచిస్తుంది (మత్తయి 25:41).
16:25 లూకా 13:30లో కనబడే నియమానికి నిజరూపమే ఈ వచనం. ధనవంతుడు ఈ జీవితంలో ఎంతో సుఖము అనుభవిస్తూ “మొదటి "వానిగా ఉండేవాడు. ఇప్పుడు అతడు “కడపటి"వాడు అయ్యాడు, ఇది మరణం తర్వాత అతని యాతనను సూచిస్తుంది. దీనికి భిన్నంగా లాజరు తన భూసంబంధమైన జీవితంలో కడపటివానిగా ఉన్నాడు (వ.20-21), ఇప్పుడు మొదటివానిగా ఉంటూ నిత్య ఆదరణ (నెమ్మది) పొందుతున్నాడు.
16:26 మరణం తర్వాత విశ్వాసులకూ, అవిశ్వాసులకూ మధ్యన ఎవ్వరూ దాటిపోలేనంత అగాథం ఉంటుంది. పరలోకం నుంచి నరకానికి గానీ, నరకం నుంచి పరలోకానికి గానీ దాటిపోజాలడం సాధ్యం కాదు.
16:27-29 తనకు కలిగిన దుస్థితి నుంచి బయటపడలేనని గుర్తించిన ధనవంతుడు చివరికి తనకున్న అయిదుగురు సహోదరుల నిత్యత్వం గురించి శ్రద్ధ కనపరిచాడు. మోషేయు ప్రవక్తలు అనేవి మొత్తం పా.ని.ను సూచించడానికి ఉపయోగించబడిన మాటలు (వ.16 చూడండి).
16:30-31 చిత్రమేమిటంటే, యేసు పునరుత్థానం తర్వాత లూకా ఈ మాటలు రాశాడు. మృతులలో నుండి తిరిగి లేపబడిన వ్యక్తులను (లాజరును లేదా యేసును) చూసిన తర్వాత కూడా అత్యంత తక్కువమంది ప్రజలే మారుమనస్సు పొందేలా పురికొల్పబడ్డారని లూకాకు తెలుసు. ఇక్కడ. ఇదే విచారకరమైన సంగతి. లేఖనాల్లోని రక్షణ సందేశాన్ని వాళ్లు హృదయపూర్వకంగా “చెవిగలవాడు వినినట్టు" విశ్వాసంతో వినాలి. మోషేయు ప్రవక్తలు గురించి వ.16-17, 27-29 నోట్సు చూడండి.