Jeremiah - యిర్మియా 30 | View All

1. యెహోవాయొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.

2. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

3. రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.

4. యెహోవా ఇశ్రాయేలువారిని గూర్చియు యూదా వారినిగూర్చియు సెలవిచ్చినమాటలివి.

5. యెహోవా యిట్లనెను సమాధానములేని కాలమున భీతిచేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము.

6. మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?

7. అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.

8. సెన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు నీకున్న కాడి నీ మెడనుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించుకొనరు గాని

9. వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు.
లూకా 1:69, అపో. కార్యములు 2:30

10. మరియయెహోవా సెలవిచ్చునదేమనగా నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము,నేను దూరముననుండు నిన్నును, చెర లోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.

11. యెహోవా వాక్కు ఇదేనిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.

12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;

13. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు.

14. నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు.

15. నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్తరించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.

16. నిన్ను మింగువారందరు మింగి వేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్పకుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడు సొమ్ముగా అప్పగించెదను.

17. వారుఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.

18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుయాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులుగలదగును.

19. వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.

20. వారి కుమా రులు మునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారి నందరిని శిక్షించెదను.

21. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.

22. అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు నేను మీకు దేవుడనై యుందును.

23. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టులమీద పెళ్లున దిగును.

24. తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు.



బైబిల్ అధ్యయనం - Study Bible
30:1-33:26 యెరూషలేము ముట్టడి చివరి కాలంలో ఈ అధ్యాయాలు రాయబడ్డాయి (ముట్టడి కాలంలో చివరి పద్దెనిమిది నెలలు; 32:1-2). అయినప్పటికీ ఈ అధ్యాయాలు భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుందని తెలియజేస్తున్నాయి. యిర్మీయా చెరసాలలో ఉన్నాడు, పట్టణం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఏదేమైనప్పటికీ, చెరలో ఉన్న ప్రజలకు పునరుద్ధరణ ఉంటుందనీ, విమోచన నిచ్చే కొత్త నిబంధన ఉంటుందనీ, పవిత్రీకరించబడిన సీయోనులో దావీదు వంశానికి చెందిన పవిత్రుడైన రాజు పరిపాలిస్తాడనీ, విస్తార సంఖ్యలో అన్యజనులు మెస్సీయను సమీపిస్తారని తెలిపే నిరీక్షణాస్పదమైన సుదూర భవిష్యత్తును యిర్మీయా చూస్తున్నాడు. 

30:2-3 రాబోవు దినములలో అనే పదజాలం అంత్యకాలాల గురించి ప్రకటిస్తుంది. (3:16; 16:14; 23:5; 31:27,31). ఇది యిర్మీయా మనసులో ఉన్న సుదూర భవిష్యత్తు, చెరలోనుండి విడిపించి అనే పదజాలం ఈ అధ్యాయాల్లో అనేకసార్లు కనబడుతుంది. వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు అనే మాటలు చెరలో నుండి ప్రజలు తిరిగి రావడాన్ని మించిన విషయాన్ని సూచిస్తున్నాయి. చెరలో నుండి తిరిగి వచ్చిన ప్రజలు తమ పితరుల స్వాస్థ్యల్లో కొంత భాగాన్ని మాత్రమే స్వాధీనపర్చుకున్నారు కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన ఈ పునరుద్ధరణ సుదూరకాలంలోని సంభవాన్ని సూచిస్తుంది. నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము అని యెహోవా యిర్మీయాకిచ్చిన ఆజ్ఞ 30-31 అధ్యాయాలకు, ఇంకా 32-33 అధ్యాయాలకు పరిచయంలాగా ఉంది.

30:4-8 ఆ దినమున అనే పదజాలం చుట్టూ అనేక వాదోపవాదాలున్నాయి. ఇది కోరెషు బబులోనును పట్టుకొన్న దినమా? అలా అయితే, అది ఇశ్రాయేలు కెందుకు భయంకరమైన దినమవుతుంది? కోరెషు వారికి విడుదలనిచ్చేవాడు గదా. కాబట్టి, “ఆ దినము” అనేది దేవుడు అన్యజనులందరికి తీర్పు తీర్చే దినం. “ఆ దినము" అనే పదాన్ని లేఖనంలో “యెహోవా దినము" గురించి తెలియజేయడానికి ఉపయోగించారు (ఆమోసు 5:18-20; జెఫన్యా 1:14-18). ఇశ్రాయేలు అనుభవించిన అన్ని అణచివేతలు భవిష్యకాలంలో రాబోయే “ఆ దినము" నాడు తొలగిపోనున్నాయి. “నీకున్న కాడి” అనే మాటలు ఇశ్రాయేలు నణచివేసిన వారినందరినీ ఉమ్మడిగా సూచిస్తున్నాయి. 

30:9 వారిమీద రాజుగా నియమించు దావీదును అనే మాటలు భవిష్య కాలంలోని ఆదర్శవంతుడైన రాజును, అంటే “రెండవ దావీదు”ను సూచిస్తున్నాయి. దావీదు వంశంలోని ఈ మెస్సీయ తమ దేవుడైన యెహోవా అనే మాటలకు సరైన జోడీగా ఉన్నాడు. యూదుల టార్గమ్ లో ఈ పంక్తి “దావీదు కుమారుడైన మెస్సీయ” అని సరిగా అనువదించబడింది.

30:10 దేవుడు యూదాను, ఇశ్రాయేలును నా సేవకుడవైన యాకోబూ అని పిలుస్తున్నాడు. ఇతర చోట్ల నెబుకద్నెజరు, కోరెషు, మెస్సీయ అనే వేర్వేరు వ్యక్తులు దేవుని సేవకులుగా లేదా కాపరులుగా పేర్కొనబడ్డారు (ఉదా: 25:9; యెషయా 44:28). బెదిరించువాడు లేకుండ అనే మాటలు గొట్టెలు ఏ భయమూ లేకుండా సేదతీరడాన్ని సూచిస్తున్నాయి. యాకోబు సంతతి తిరిగి వచ్చి అనే మాటలు దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏయే దేశాల్లోకి చెదరగొట్టాడో ఆయా దేశాలనుండి వారిని తిరిగి రప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇక వారు నిమ్మళించి నెమ్మది ననుభవిస్తారు, ఇది కాపరి సంరక్షణను తెలియజేసే అలంకారిక వర్ణన.

30:11 ఇశ్రాయేలు నణచివేసే అన్యజనులందరినీ దేవుడు. శిక్షించి సమూలంగా నాశనం చేస్తాడు. అయితే ఆయన ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకపోయినప్పటికీ, ఇశ్రాయేలును సమూలనాశనము చేయను అని చెబుతున్నాడు. 

30:12-17 ఇశ్రాయేలు వ్యాధిని, గాయాలను మనుషులెవరూ బాగుచేయ లేరు, అయితే యెహోవాయే వారికి వైద్యుడుగా ఉంటాడు (అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, 3:22; 33:6 చూడండి). ఇశ్రాయేలు విషాద స్థితి మూడు అలంకారిక వర్ణనల్లో కనబడుతుంది. చికిత్సచేయదగిన మందు లేదు, వ్యాజ్యెమాడువాడు (వైద్యుడు) లేడు, స్నేహితులు లేరు. 

30:15-16 ఈ రెండు వచనాల మధ్య దేవుని వైఖరిలో విప్లవాత్మకమైన "మార్పు కనబడుతున్నదని కొందరి అభిప్రాయం. అయితే దేవుడెప్పుడూ ఒకే లాగా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల్ని పునరుద్ధరించగలిగే దశకు వారు చేరుకొ నేలా ఆయన వారి మీదకు తీర్పును రప్పిస్తున్నాడు. మనుషులెంత అస్థిరులైనప్పు టికీ దేవుడు నిరంతరం ఒకేలాగా ఉండడం ఇశ్రాయేలుకున్న గొప్ప నిరీక్షణ. ఇశ్రాయేలు అనుభవించిన కష్టాలన్నిటినీ ఇశ్రాయేలు శత్రువులు అనుభవించ బోతున్నారు. (1) ఇశ్రాయేలును మ్రింగువారందరు మ్రింగివేయబడుదురు. (2) ఇశ్రాయేలును చెరలోకి తీసుకొని వెళ్లినవారు చెరలోనికి పోవుదురు. (3) ఇశ్రాయేలును దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు. (4) ఇశ్రాయేలును అపహరించినవారందరు దోపుడుసొమ్ముగా అప్పగించబడతారు.

30:18-20 ఈ వచనాల్లో ఇశ్రాయేలుకివ్వబడిన వాగ్దానం కేవలం పునరుద్ధరణ మాత్రమే కాదు, ఒక నూతన శకారంభం. యెరూషలేము మళ్లీ కట్టబడుతుంది, మళ్లీ జనభరితమౌతుంది. దేవునిపట్ల భయభక్తులు గల ఓ కొత్త అధిపతి ప్రజల్ని పరిపాలిస్తాడు.

30:18 ప్రతి పట్టణము దాని కొండమీద కట్టబడును అనే మాటల్లో “కొండ” అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదం టెల్ “నాశనమైన” లేదా “విడిచి పెట్టబడిన" పట్టణ శిథిలాల దిబ్బను సూచిస్తుంది. 

30:21-22 మెస్సీయ గురించి ఈ ప్రవచనం మూడు విషయాలను నొక్కి వక్కాణిస్తుంది. (1) మెస్సీయ వారిలో పుట్టినవాడు, పరదేశి కాడు. (2) అతడు యాజకత్వపు హక్కుదారుడై పరిచర్యను జరిగిస్తాడు. ఆయన మెల్కీసెదెకులాగా దేవుని సన్నిధికి ప్రవేశించగల అర్హత కలిగి ఉంటాడు (హెబ్రీ 5:5-6). (3) మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును అని మెస్సీయ ప్రకటిస్తాడు.

30:23-24 ఇప్పటికిప్పుడు వ.17-22 లలో చెప్పబడిన వాగ్దానాల్ని బట్టి ప్రజల్లో కృత్రిమమైన భద్రతాభావం కలగకుండా చేయడం కోసం దోషుల మీదకు తీర్పు కుమ్మరించబడాలి. దేవుని నుండి వచ్చే. తీర్పు హఠాత్తుగా వచ్చే సుడిగాలిలాగా ఉండబోతున్నది. యెహోవా తన హృదయాలోచనలను నెరవేర్చువరకు ఆయన కోపం కొనసాగుతూనే ఉంటుంది. ఇశ్రాయేలు పాపాలకు, వారి శత్రువుల పాపాలకు శిక్ష పూర్తయినప్పుడు మాత్రమే ఆయన హృదయాలోచనలు నెరవేరినట్టు లెక్క.


Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |