Job - యోబు 6 | View All

1. ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము.దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను

2. నా దుఃఖము చక్కగా తూచబడును గాకదాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులోపెట్టబడును గాక.

3. ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.

4. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెనువాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నదిదేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.

5. అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా?

6. ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?

7. నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.

8. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాకనేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక

9. దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక.

10. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదునుమరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును

11. నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?

12. నా బలము రాళ్ల బలమువంటిదా?నా శరీరము ఇత్తడిదా?

13. నాలో త్రాణ యేమియు లేదు గదా.శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.

14. క్రుంగిపోయినవాడుసర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును.

15. నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.

16. మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును

17. వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.

18. వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియులేకుండ అవి యింకిపోవును.

19. సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.

20. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు.

21. అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు.

22. ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా?

23. పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా?బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా?

24. నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి.

25. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?

26. మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశ గలవాని మాటలు గాలివంటివే గదా.

27. మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు,మీ స్నేహితులమీద బేరము సాగింతురు.

28. దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?

29. అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.

30. నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?



బైబిల్ అధ్యయనం - Study Bible
6:1-3 సముద్రముల ఇసుక - విస్తారమైన వాటిని (29:18; యెహో 11:4; 1రాజులు 4:20తో పోల్చండి), లేదా లెక్కించలేనంత అసంఖ్యాకమైన వాటిని (ఆది 22:17; న్యాయాధి 7:12; 1రాజులు 4:29; హోషేయ 1:10) సూచించే అలంకారిక దృష్టాంతం.

6:4 దేవుణ్ణి పలుచోట్ల యుద్దశూరుడుగా వర్ణించడం జరిగింది, ఆయన అంబులు శత్రువుల్ని చెల్లాచెదురు చేస్తాయి (ద్వితీ 32:42; కీర్తన 7:12-13; 18:14; హబ 3:11). దేవుని సర్వశక్తి ఆయన ఉగ్రతకు గురైనవారిని భయకంపితుల్ని చేస్తుంది (నిర్గమ 23:27; యెషయా 2:10,19; యిర్మీయా 49:5). దేవుడు స్వయంగా తనమీద దాడి చేస్తున్నాడని యోబు అనుభూతి చెందాడు. 

6:5 క్రూరమైన అడవిజంతువులైనా సాధుజంతువులైనా మచ్చిక అయిన ప్పుడు ఎదురుతిరగవు. తనకు సైతం తన నీతిని బట్టి (యథార్థత) న్యాయం జరిగినప్పుడు తాను కూడా ఫిర్యాదు చేయనని. యోబు చెప్తున్నాడు. 

6:6-7 వ.6 లోని అలంకారిక ప్రశ్నకు జవాబు నిషేధార్థంలోనే ఉంటుంది. ముట్టనొల్లని... భోజన పదార్ధము లాయెను దుఃఖంతో క్షోభపడుతున్న యోబు ప్రాణానికి ఎలీఫజు మాటలు రుచికరమైన భోజనంలాగా కాక తినలేని కలుషితమైన భోజనంలాగా ఉన్నాయి. 

6:8-10 యోబు ఎలీఫజు సలహాలను పాటించలేదని తెలుస్తుంది. యోబు తన ధర్మనిష్ఠలో (4:6-7), లేదా దేవుని గద్దింపులో (5:17) కాక, దేవుని నుండి వచ్చే చిట్టచివరి దెబ్బయైన మరణంలోనే తన నిరీక్షణనుంచుకున్నాడు (3:11-15; 10:21-22). తన కోరికను దేవుడు మన్నించి తనను నలుగగొట్టి నిర్మూలము చేసినప్పుడు తన వేదన తొలగిపోయి తన నిర్దోషత్వం వెల్లడవుతుందని యోబు భావన.

6:11-13 యోబు తన నిస్సహాయతను, నిరాశను వ్యక్తం చేస్తున్నాడు.

6:14 యోబు తన స్నేహితులు తనను మానసికంగా వేధిస్తూ యాతన పడు తున్నారని చెబుతున్నాడు. శ్రమననుభవిస్తున్న యోబు తన స్నేహితుల నుండి దయను (నమ్మకత్వం) కోరుకుంటున్నాడు (సామె 14:21). 

6:15-18 ఎండిపోయిన ఎడారిలో ఉండే వాగుల్లో అప్పుడప్పుడు మాత్రమే నీళ్లుంటాయి. తన "స్నేహితులు" (వ.15) వర్షం కురిసినప్పుడు మాత్రమే ప్రవహించి ఆ తర్వాత ఎండిపోయే వాగుల్లాంటి వారని యోబు చెప్తున్నాడు. యోబుకు నిజంగా వారి అవసరం ఉన్నప్పుడు.. వారి నుండి సహాయం అందడం లేదు.

6:19 తేమా అరేబియా వాయువ్య ప్రాంతంలోని ఒక ప్రముఖ వ్యాపార కూడలి. వాటిని అనే పదం తేమా ప్రాంతంలో వర్తకులు వెతికే నీటిచెలమల్ని (ఒయాసిస్సులు) సూచిస్తుంది. 

6:20 అవమానమొందుదురు అనే మాట నమ్మదగని వాటిని నమ్మి అవమానం పొందడాన్ని సూచిస్తుంది.

6:21 యోబు ఆపదను చూచి అతణ్ణి సమీపిస్తే తాము కూడా దేవుని శిక్షకు గురి కావలసి వస్తుందేమోనని అతని స్నేహితులు భయపడుచున్నారు. ఆ

6:22-23 తనపట్ల ప్రత్యేకమైన ఉపకారం చూపించాలనీ, యోబు తన స్నేహితుల్ని ఎప్పుడూ అడగలేదు. వారు కనీసం అతని పక్షం వహించి ఉండవలసింది. 

6:24-26 ఏ విషయమందు నేను తప్పిపోతినో- (హెబ్రీ. బాగా) ఉద్దేశపూర్వకం కానీ పాపాన్ని సూచిస్తుంది. యోబు పాపం చేశాడని అతని స్నేహితులు భావిస్తున్నట్లయితే వారు దాని గురించి నిజాయితీతో అతనికి చెప్పాలి, బలమైనదిగా తగిలేలాగా ఘాటుగా కాదు, మృదువుగా యోబు తన నిర్దోషత్వాన్ని వెల్లడిచేయడాన్ని అతని స్నేహితులు పూర్తిగా ఖండించడం లేదు, కేవలం ప్రక్కకు తోసివేస్తున్నారు.

6:27 అప్పులిచ్చి జాలి చూపించకుండా వాటిని వసూలు చేసుకొనేవారితో యోబు తన స్నేహితుల్ని పోల్చుతున్నాడు.. కఠినాత్ములైన వ్యాపారస్థులు అప్పు బాకీ పడినందుకు అనాథల్ని, చివరికి స్నేహితుల్ని సైతం బానిసలుగా చేసుకుంటారు (నిర్గమ 22:22; 2రాజులు 4:1; ఆమోసు 2:6, 8:6).

6:28-29 యోబు స్నేహితులు అతని వైపు చూడడం లేదు, కారణం అతని రూపాన్ని చూడలేక లేదా అతని మాటలు వినడం ఇష్టం లేక కావచ్చు. మరల విచారించుడి అన్న మాటలకు అక్షరాలా “పశ్చాత్తాపపడుడి” అని అర్థం.

6:30 యోబుకు ఎలీఫజు మాటలు “రుచి” లేనివిగా ఉన్నాయి (వ.5-7), అయితే అతని స్వంత మాటలు మటుకు నొప్పించడం లేదు. 


Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |