2:1 జ్ఞానులు అంటే ఖగోళశాస్త్ర పరిజ్ఞానం కలవారు (మాగి). తూర్పు దేశపు జ్యోతిష్కులలో కొందరు జోరాష్టియనిజంతో ఖగోళశాస్త్రాన్ని, చేతబడిని కలిపేవారు. దానియేలు. 2:2,4-5,10లో వీరి వర్ణన కనిపిస్తుంది. అక్కడ వారు శకునగాండ్రతో, గారడీవిద్య గలవారితో, మాంత్రికులతో కలపి చెప్పబడ్డారు. గ్రీకులో "మాగోస్" ("మాగి"కి ఏకవచనం) కొ.ని. లో ఒకే ఒక్కసారి కనిపిస్తుంది. అది “సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడు” “అపవాది కుమారుడు, సమస్త నీతికి విరోధి" అని పౌలు చెప్పిన గారడీవానిని వర్ణిస్తుంది. (అపొ.కా. 13:6-10). గారడీవాడు ("మాగుస్") అని లూకా వర్ణించిన ఈ వ్యక్తివంటివారు, మత్తయి ప్రస్తావించిన
ఈ జ్ఞానులు ఒకే రకమైన విశ్వాసాలను కలిగి ఉండవచ్చు. ఆ విధంగా, ఈ జ్ఞానులు యేసును దర్శించాలని ఆజ్ఞ పొందడం బట్టి, తమ వ్యర్ధ మతాలను అనుసరిస్తున్న అన్యజనులను దేవుడు రక్షించాలనుకుంటున్నాడనే ఉద్దేశం కనిపిస్తుంది. పెద్దవాడైనప్పుడు, యేసు దయ్యాలను వెళ్ళగొట్టి, ఇబ్బందులు పడుతున్న ప్రజలపై సాతాను అధికారాన్ని విరగ్గొట్టాడు. క్రీస్తు తన బాల్యంలో కూడా సాతాను రాజ్యాన్ని దోచుకుని, చెరలో వున్నవారిని విడిపించడం మనం ఇక్కడ చూస్తాం. తూర్పు అంటే బహుశా బబులోను లేక పర్షియా కావచ్చు. హేరోదు రాజు నిజానికి రోమీయుల అధికారం కింద పాలిస్తున్న సామంతరాజు. అతడు యూదుడు కాకుండా ఎదోమీయుడైనప్పటికీ, క్రీ.పూ. 40లో రోమా ఎగువసభ అతనిని యూదయ రాజుగా నియమించింది. అతడు పాలించడానికి సమర్థుడే గాని కౄరుడు, అనుమానస్తుడు.
2:2 జ్ఞానులు అడిగిన ప్రశ్న, హేరోదు పాలనకు అనుకోని సవాలుగా కనిపించింది. యేసు రాజుగా పుట్టడం అంటే ఆయన దావీదు వంశంలోని వాడనీ, కాబట్టి జన్మహక్కు ద్వారా రాజనీ వారి భావం. అయితే హేరోదు పూర్తిగా- యూదుడు కాదు, లేక దావీదు సంతానం కాదు; కాబట్టి రాజుగా పాలించడానికి నిజమైన యోగ్యత లేనివాడు. నక్షత్రము అని అనువదించబడిన మాట, అనేక ఖగోళ సంఘటనలను సూచించవచ్చు- తోకచుక్కలు, ఉల్క లేక గ్రహసంయోగం ఏదైనా కావచ్చు. ఈ నక్షత్రం ఆకాశంలో కదులుతూ జ్ఞానులకు యేసు ఉన్న స్థలాన్ని చూపించిందని మత్తయి. తరువాత (వ.9) వివరించాడు. అంటే ఇది సామాన్యమైన నక్షత్రం కాదు. ఈ నక్షత్రం మెస్సీయ జననాన్ని సూచించడం కోసం ఆకాశంలో తూర్పుదిక్కున ఉదయించింది అని
గ్రీకు భావం సూచిస్తుంది. మొదటిగా నక్షత్రంపట్ల జ్ఞానుల ఆసక్తికి కారణం జ్యోతిష్యం, దీనిని పాటించడాన్ని బైబిల్ నిషేధిస్తుంది (యెషయా 47:13-15). తన అత్యద్భుతమైన కృపనుబట్టి దేవుడు, జ్ఞానుల మూఢనమ్మకాన్ని కూడా వారిని యేసువద్దకు ఆకర్షించడానికి ఉపయోగించుకున్నాడు.
2:23 తన సింహాసనానికి చట్టబద్ధమైన హక్కుదారుడు పుట్టాడనే వార్త వినగానే హేరోదు కలవరపడ్డాడు. అతని మతిస్థిమితం లేని, భ్రమతో కూడిన ఆగ్రహాన్ని ఎరిగిన యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారు. గతంలో అతడు తన పరిపాలనను కాపాడుకోవడం కోసం...తనకిష్టమైనభార్యను, కుమారులను కూడా చంపించాడు....
2:4 క్రీస్తు ఎక్కడ పుడతాడని పా.ని. తెలియజేసిందో కనుగొనమని హేరోదు అనుభవజ్ఞులైన శాస్త్రులకు ఆజ్ఞాపించాడు. ఇంతవరకు నక్షత్రం యేసునొద్దకు జ్ఞానులను నడిపించింది, కానీ నక్షత్రం మరలావచ్చి, యేసు ఉన్న స్థలాన్ని చూపించేటట్లు దేవుడు చేయడానికి ముందు, ఇప్పుడు లేఖనాల సాక్ష్యం అవసరం. కాబట్టి కొత్త ప్రత్యక్షతలు వచ్చినా, బైబిల్ - ప్రత్యక్షత విలువ ప్రత్యేకంగా ఎత్తిచూపబడింది.
2:5-6 "ప్రధాన యాజకులు, శాస్త్రులకు క్రీస్తు జననప్రదేశం బేళ్లేహేము అని గుర్తించేటంతగా లేఖనాలు తెలుసు (మీకా 5:2; యోహాను 7:42), అయినప్పటికీ తరువాతి కాలంలో వారు ఆయన బోధలను వ్యతిరేకించారు. లేఖనాలను బాగా ఎరిగివున్నంత మాత్రాన, మన హృదయం దేవునితో సమాధానంతో ఉన్నట్లు కాదు. సుదూర ప్రయాణం చేసి వచ్చిన జానులు, మిగిలిన ప్రయాణానికై వెళ్తుండగా, యాజకులు కనీసం ఆయనను దర్శించడా నికి ప్రయత్నించకపోవడం, వారు యేసును వ్యతిరేకించడాన్ని ముందుగానే ఇక్కడ చూపిస్తుంది. ఇశ్రాయేలను... పరిపాలించు ఒక రాజు, ఒక అధిపతి జన్మించే స్థలమని బేల్లెహేమును గూర్చి మీకా 5:2లో ప్రవచించాడు. రాబోయే రాజు ఇశ్రాయేలును "పరిపాలించు"నని- మీకా వాగ్దానం చేసినా, మత్తయి తర్జుమాలో మెస్సీయ ఇశ్రాయేలుకు “కాపరి"గా ఉంటాడని చెబుతుంది. మీకా 5:4లో ఉపయోగించిన మాటను ప్రతిబింబించడానికి మత్తయి ఈ పదాన్ని ఎంచుకుని వుంటాడు, కాబట్టి మీకా 5 అంతా యేసుకు వర్తిస్తుంది. “పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను” (వ.2) అని మీకా చెప్పడం, యేసు నిత్యుడు అని సూచిస్తుంది. ఆ కాపరి “భూమ్యంతముల వరకు ప్రబలుడగును” (వ.4) అని కూడా మీకా ప్రవచిస్తున్నాడు. ముందు
2:7-8 బిడ్డ పుట్టగానే నక్షత్రం మొదటిసారి కనిపించి వుంటుంది. అనే
భావనతో, నక్షత్రము కనబడిన కాలముగూర్చి హేరోదు జ్ఞానులను ప్రలైంది పరిష్కారముగా తెలుసుకున్నాడు. ఈ తేదీని ఆధారం చేసుకుని, బేల్లెహేములో రెండు సంవత్సరాలకన్నా తక్కువ వయస్సున్న (వ.16) మగపిల్లలందర్నీ చంపమని అతడు ఆజ్ఞ ఇచ్చాడు. జ్ఞానుల ప్రయాణం సుదీర్ఘమైనది, ఇప్పు త్యాగంతో కూడినది అని ఇది సూచిస్తుంది. తాను కూడా మెస్సీయను ఆరాధించాలనే కోరికను వ్యక్తపరచినట్లు నటించడం, హేరోదు మోసాన్ని ఎత్తిచూపుతుంది. అందం
2:9-12 యేసు పుట్టిన పశువుల పాకకు భిన్నంగా (లూకా 2), ఇప్పుడు యేసు కుటుంబం ఒక యింటిలో నివసించారు.. అంటే లూకా వివరించిన గొబైల కాపరులు యేసును దర్శించిన తరువాత జ్ఞానులు యేసును దర్శించారని ఇది చూపుతుంది. యేసు జీవితకాలంలో అనేకులు ఆరాధించినట్లు (82915 14:33; 15:25; 20:20; 28:9,17), జ్ఞానులు యేసును బహిరంగంగాఆరాధించారు. యేసు ఆరాధనను స్వీకరించడం ఆయనను “దేవుడు మనకు తోడు" అయిన ఇమ్మానుయేలుగా (1:23).
స్థిరపరస్తుంది. బంగారము... సాంబ్రాణి... బోళము ఖరీదైన బహుమతులు. చివరి రెండు సువాసననిచ్చే పదార్థాలు. ధూపం వేయడానికి, పరిమళ ద్రవ్యాలు తయారుచేయడానికి సాంబ్రాణి వాడేవారు (నిర్గమ 30:34-35). బోళము అభిషేక తైలములో ఉపయోగించేదిగా (30:23-25), సుగంధ ద్రవ్యంగా (కీర్తన 45:8), సమాధికి సిద్ధపరచడానికి (యోహాను 19:39) వాడేవారు.
2:13-14 హేరోదు ఉద్దేశాన్ని గూర్చి హెచ్చరించడానికి, మరలా ప్రభువు దూత స్వప్నమందు. యోసేపును దర్శించాడు. హేరోదు చంచలుడైన, క్రూరమైన పాలకుడు. 2:3 నోట్సు చూడండి. రాబోయే ప్రమాదాన్ని శంకించి, పిల్లలను చంపడానికి అతడు కుట్ర చేయడం ఆశ్చర్యమేమీ కాదు (వ.16). ఐగుప్తునకు పారిపోవాలని చెప్పగానే యోసేపు విధేయుడయ్యాడు. 1:24-25 నోట్సు చూడండి.
2:15 ప్రభువు సెలవిచ్చినమాట నెరవేరునట్లు అని చెప్పడం బైబిల్ దేవుని ప్రేరణతో వచ్చిందనీ, చరిత్రపై అధికారం కలిగినదనీ సూచిస్తుంది. హోషేయ 11లోని దాని అసలైన నేపథ్యంలో, కుమారుని ఐగుప్తులోనుండి పిలవడం, మెస్సీయను ఐగుప్తునుండి ఇంటికి పిలవడం కాక, ఇశ్రాయేలీయులను నిర్గమము ద్వారా ఐగుప్తునుండి. పిలవడాన్ని గూర్చి చెప్పింది. మత్తయి దీన్ని అర్థం చేసుకున్నాడు. కానీ ఆత్మ నడిపింపుతో, ఒక కొత్త, చిట్టచివరి నిర్గమనానికి నడిపించే కొత్త మోషేలా అతడు యేసును గుర్తించాడు. ఫరో దాస్యత్వం నుండి మోషే తన ప్రజలను విడిపించినట్లే. సాతాను దాస్యత్వంలోనుండి యేసు మానవులను విడిపిస్తాడు. అలా హోషేయ 11:1లోను, ఇంకా మిగిలిన పా.ని. భాగాల్లో చెప్పిన విషయాలు యేసును, ఆయన జీవితంలోని సంఘటనలను గూర్చినవి అని మత్తయి సరిగ్గానే గుర్తించాడు.
2:16 హేరోదు బేల్లెహేములో చిన్నపిల్లలను చంపించాడన్న విషయాన్ని సంశయవాదులు నిరాకరిస్తారు. ఎందుకంటే బైబిలేతర సాహిత్యంలో ఈ భయంకరమైన సంఘటన రాయబడలేదు. అయితే అతడు తన సొంత కుటుంబాన్నే హత్య చేయించడం వంటి కార్యాలు అతడు చేయించాడని ఉన్న ఆధారాలను బట్టి, ఈ హత్యలు కూడా చేయించివుంటాడనవచ్చు. తాను మరణించినపుడు. దేశమంతా ఏడ్వాలని అనేకమంది యూదులైన అధికారులను చంపించాడని యూదుల చరిత్రకారుడైన జోసీఫస్ రాశాడు. హేరోదు ఇలా ప్రవర్తించడం, మోషే పుట్టినకాలంలో - ఫరోను జ్ఞాపకం చేస్తుంది. (నిర్గమ 1:15-22). ఇది మాత్రమేగాక మోషే జన్మించిన కాలంలో జరిగిన ఇలాంటి ప్రత్యేకమైన సారూప్యాలు, ద్వితీ 18:16-19 లో దేవుడు వాగ్దానం చేసిన కొత్త మోషేగా యేసును చూపించడానికి మత్తయి వృత్తాంతానికి బలాన్నిచ్చాయి. ప్రాచీన యూదులు మోషేను విమోచకునిగా
భావించారు (అపొ.కా. 7:25,35). మోషేకు, యేసుకు ఉన్న సారూప్యతలు ఎత్తిచూపడంవల్ల, ప్రజలను వారి పాపములనుండి రక్షించడానికి వాగ్దానం చేయబడిన విమోచకుడు యేసే అని మత్తయి చూపాడు (మత్తయి 1:7-16; 2:20-21 నోట్సు చూడండి). నక్షత్రం జ్ఞానులకు, యేసు పుట్టే సమయంలో, అంటే సుమారు అప్పటికి రెండు సంవత్సరాల ముందు కనిపించింది కాబట్టి బేబ్లె హేములో, దానిచుట్టూ ఉన్న ప్రాంతాల్లో, రెండు సంవత్సరములు
మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లలనందరినీ హేరోదు చంపించాడు.
2:17-18 మరొకసారి, పా.ని. రచయిత (ఇక్కడ యిర్మియా)ను దేవుడు వాడుకుని తన సందేశాన్ని ప్రకటించాడనే భావన కలిగేటట్లు మత్తయి మరొక వాక్యభాగాన్ని ఎత్తి చూపాడు. ప్రవక్తల కాలం మొదలుకొని యేసు కాలంవరకు మతాసక్తులైన యూదులమధ్య ఇది నిస్సందేహమైన దృక్కోణం. వ.18 లో మత్తయి యిర్మీయా 31:15 ఎత్తి రాస్తున్నాడు. నిజానికి అది చెరకు పంపబడుతున్న తమ కుమారులను బట్టి తల్లులు రోదిస్తున్న ఉదంతాన్ని చెబుతుంది. ఇశ్రాయేలు మరలా చెరలో, దేవునికి దూరంగా, విమోచన పొందాల్సి ఉందని మత్తయి ఇక్కడ అన్వయిస్తున్నట్లు కనిపిస్తుంది. యిర్మియా 31లో విలాపం, చివరిగా దేవుడు తన ప్రజలతో, వారి పాపములను క్షమించి, తన ధర్మశాస్త్రాన్ని వారి హృదయాలపై రాయబోయే ఒక కొత్త నిబంధన స్థిరపరుస్తాడనే సంతోషకరమైన వాగ్దానం ఉన్నందున, మత్తయి దీన్ని జ్ఞాపకం చేసి, బేల్లెహేములో జరిగిన హత్యాకాండకు, యేసు రాకకు అన్వయించాలని ఉద్దేశిస్తున్నట్లున్నాడు. యిర్మీయా 31లో కొత్త నిబంధన కోసమైన వాగ్దానానికి ముందుగా, తల్లుల రోదన ఉన్నట్లే, ఇప్పుడు తల్లుల అంగలార్పు తర్వాత యేసుద్వారా కొత్త నిబంధన స్థాపించడం జరుగబోతోంది. (26:27-28 నోట్సు చూడండి)..
2:19 హేరోదు క్రీ.పూ. 4 లో చనిపోయాడు కాబట్టి, బేల్లెహేములో మగపిల్లలను చంపమని హేరోదు ఆజ్ఞాపించడానికి రెండు సంవత్సరాల ముందు, అంటే క్రీ.పూ. 5 లేక 6లో యేసు జన్మించినట్లు కనబడుతుంది. నిస్సిగ్గుగా చేసిన బేఫ్ హేము మారణకాండ, హేరోదు. చివరి కార్యాలలో ఒకటిగా కనిపిస్తున్నట్లు ఉంది.
2:20-21 దేవదూత మాటలు, దేవుడు మండుచున్న పొదలోనుండి మోషేతో మాట్లాడిన మాటల్లాగా ఉన్నాయి. (నిర్గమ 4:19, సెప్టువజింట్). మోషే వృత్తాంతం మరలా ప్రస్తావించడం, యేసును కొత్త మోషేగా మరలా గుర్తిస్తుంది (2:15,16 నోట్సు చూడండి). ఇప్పుడు సుమారు మూడు సంవత్సరాల వయస్సున్న యేసు, తన కుటుంబంతో ఐగుప్తునుండి తిరిగి వచ్చాడు.
2:22-23 అర్కెలాయు, మహా హేరోదు కుమారునిగా, తన తండ్రి క్రూరత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. అతడు యూదయను పాలించడం అనేది, పరిశుద్ద కుటుంబం వేరొకచోట స్థిరపడాలని సూచించింది కాబట్టి యోసేపు తన కుటుంబాన్ని, తాను మరియ ఇంతకు ముందు నివసించిన (లూకా 1:26) గలిలయలో ఒక కుగ్రామమైన నజరేతను ఊరికి నడిపించాడు. ఈ నిర్ణయాన్ని
మెస్సీయ నజరేయుడనబడునని చెప్పబడిన ఒక పా.ని. ప్రవచన నెరవేర్పుగా మత్తయి పేర్కొన్నాడు. అయితే పా.ని.లోని ఏ వాక్యభాగములోనూ ఈ నిర్దిష్టమైన ప్రవచనం కనిపించదు. ఏదైనా ఒక పా.ని. లేఖనాన్ని కాక, బహుశా మెస్సీయను "చిగురు” అని వర్ణించిన ప్రాముఖ్యమైన ఒక పా.ని. అంశాన్ని మత్తయి పేర్కొంటుండవచ్చు. యెషయా 11:1లో "చిగురు" ("నెట్టెర్")ను బహుశా మూడు అచ్చులు (నజర)గా లిప్యంతరీకరించవచ్చు. దానినుండి "నజరేతు", ఇంకా "నజరేయుడు” అనే నామవాచకాలు వస్తాయి. ఈ మెస్సీయ ప్రవచనం, దావీదు సంతానంలో నీతిగలవాడు, పరిశుద్దాత్మ చేత బలోపేతం చేయబడిన తన జ్ఞానవంతమైన, న్యాయమైన పాలన చేసి, యూదాకు రక్షణ తెస్తాడు అనే మిగిలిన ప్రవచనాలకు (యెషయా 4:2; యిర్మీయా 23:5; 33:15) సమీపంగా ఉంటుంది.. అలా యేసు స్వంతపట్టణం, ఆయన మెస్సీయగా గుర్తింపు పొందడానికి కీలకమౌతుందని మత్తయి దృష్టించాడు.