Proverbs - సామెతలు 20 | View All

1. ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.

2. రాజువలని భయము సింహగర్జనవంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు

3. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.

4. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

5. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.

6. దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తట స్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?

7. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.

8. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.

9. నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?

10. వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.

11. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.

12. వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.

13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండినయెడల ఆహారము తిని తృప్తి పొందుదువు.

14. కొనువాడుజబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును.

15. బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.

16. అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చు కొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము

17. మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.

18. ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.

19. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.

20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.

21. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.

22. కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.
1 థెస్సలొనీకయులకు 5:15

23. వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు.

24. ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?

25. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును.

26. జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.

27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.
1 కోరింథీయులకు 2:11

28. కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు కొనును.

29. ¸యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము

30. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును.బైబిల్ అధ్యయనం - Study Bible
20:1 వెక్కిరింతల పాలుచేయును గురించి 1:22 నోట్సు చూడండి. అల్లరి పుట్టించును అంటే బిగ్గరగా కేకలు వేయడం, పోకిరిలా ప్రవర్తించడం (7:11; 9:13). “వశమైన” అంటే అక్షరార్థంగా జ్ఞానం నుండి వైదొలగి వేరొకదాని వైపు మళ్ళు కొని (19:27) చివరికి అందులోనే నశించిపోవడం (5:19-20,23). 

20:2 రాజునకు క్రోధము గురించి 19:12 నోట్సు చూడండి. రాజుకు ఆగ్రహం తెప్పించేవారు తమ చావును తామే కొని తెచ్చుకుంటారని భావం. 

20:3 జ్ఞానంగల వ్యక్తి చీట్లు వేసి వివాదాన్ని పరిష్కరిస్తాడు (18:18), లేదా కలహప్రియులైన అపహాసకులకు దూరంగా ఉంటాడు (23:10). అయితే మూరుడైన వ్యక్తి (హెబ్రీ. ఏవిల్) మాత్రమే కలహాన్ని ప్రారంభిస్తాడు (17:14). 

20:4 విత్తులు వేయడానికి ముందుగా పొలాన్ని దున్నుకోవాలి. అయితే సోమరి పని తప్పించుకుంటాడు, రాబోయే కాలం గురించి ముందుగా ఆలోచించడు (6:6-11). విత్తులు వేయు కాలము అంటే నవంబర్ మాసంతో మొదలయ్యే "శీతాకాలం”. విచారించునప్పుడు అంటే సోమరి తన పొలంలోకి వచ్చి తమ పంటను గురించి వాకబు చేసినప్పుడు అని అక్షరార్థం.

20:5 లోతుగా ఉండే నీళ్ల బావి వలన ప్రయోజనం ఉంటుంది గానీ దానిలో నీళ్లు చేదుకోవడం కష్టమవుతుంది. 

20:6 దయ గురించి 19:22 దగ్గర “కృప చూపుట" వివరణ చూడండి. దయ గలవాళ్లమని అనేకులు చెప్పుకోవడం జరుగుతుంది, అయితే అవసరమైన సమయంలో నిజంగా ఆదుకొనే నమ్ముకొనదగినవాడు ఉండడం అరుదు (13:17). ఎవరికీ కనబడడు అనే భావంలో ఎవరికి కనబడును అని అలంకారికమైన ప్రశ్న వేస్తున్నాడు. 

20:7 యథార్థవర్తనుడు గురించి 2:7 నోట్సు చూడండి. ధన్యులు గురించి 3:13-18 నోట్సు చూడండి. పిల్లలు సంతోషం గురించిన వాగ్దానాన్ని యెహెజ్కేలు 18 అధ్యా. తో సమతుల్యపరిచి చూడాలి. 

20:8 గాలికి పొట్టు ఎగిరిపోయేలా చేటతో ధాన్యాన్ని తూర్పార పట్టడాన్ని చెదరగొట్టును అనే మాట వర్ణిస్తుంది (రూతు 3:2; కీర్తన 106:27; యెషయా 30:24; 41:16; యెహె 5:10; 20:26 తో పోల్చండి).

20:9 ఆచారరీత్యా శుద్ధిచేసుకొని, దేవాలయంలో ఆరాధనకు యోగ్యత కలిగి ఉండడాన్ని పవిత్రుడనైతిని అనే మాట సూచిస్తుంది (సంఖ్యా 8:6). ఈ అలంకారిక ప్రశ్న ఏ నరుడూ పరిపూర్ణుడు కాడనీ, ఏ మానవ ప్రయత్నమూ పాపాన్ని నిర్మూలించ లేదనీ (యోబు 15:14; 25:4; రోమా. 3:23; 1యోహాను 1:8) తెలియజేస్తుంది. దేవుడు మాత్రమే నరుడి పాపాన్ని క్షమించి, పవిత్రపర్చగలడు (యెషయా 55:7; మార్కు 2:5-11; 1యోహాను 1:7) 

20:10 ఎవరినైనా మోసగించి వారికి చెందినవాటిని దోచుకొనడం యెహోవా దృష్టికి హేయము. 

20:11 హెబ్రీలో తెలియజేయును అనే మాటకు వాడిన పదం బహుశా ఒక వ్యక్తి గుర్తింపును కోరి తనగురించి తాను తెలియపర్చుకోడాన్ని సూచిస్తుండవచ్చు. పసి వయసులోని పిల్లలను పవిత్రతకూ, యథార్థతకు కొలమానాలుగా తీసుకోవడాన్ని బాలుడు అన్న మాట సూచిస్తున్నది.

20:12 మనుషులు జ్ఞానాన్ని వినగలిగేలా, చూడగలిగేలా దేవుడు వారి చెవి, కన్నులను తెరవగలడు. 

20:13 లేమి అనే మాట అక్షరార్థంగా “కలిగిన వాటినన్నిటినీ కోల్పోయిన స్థితిని” (యెహో 3:11), లేదా ఏదైనా విపత్కర పరిస్థితిలో సమస్తాన్ని పోగొట్టుకొన్న స్థితిని సూచిస్తుంది. (ఆది 45:11; జెకర్యా 9:4; 23:21; 30:9 తో పోల్చండి). 

20:14 ఇది క్రయవిక్రయాల తీరును చమత్కారరీతిలో చెప్పడం. అయితే ఇది అనేకులు అబద్దాలు చెప్పడంలో తామే . దిట్టలు అనుకొనడాన్ని సైతం సూచిస్తుంది. మెచ్చుకొనును అంటే అక్షరార్థంగా “తనను తాను పొగడుకోవ డం". జబ్బుది గురించి 1:16 "కీడు” నోట్సు చూడండి. 

20:15 ప్రశస్తమైన ముత్యములు (యోబు 28:18), బహుశా ఇవి పగడాలు (విలాప 4:7) కూడా అయ్యుండవచ్చు. 

20:16 అన్యుని కొరకు పూటబడడం అంటే ఇతరుల కోసం హామీ ఉండడం, అది బుద్దిలేని పని (6:1-2 నోట్సు చూడండి). అది నష్టపోయినదానితో సమానమే కాబట్టి దానికి బదులు అతనికి చెందిన దేనినైనా కుదువ పెట్టుకోవడం కొంతలో కొంత యుక్తమైన పని. 

20:17 మంటితో గురించి విలాప 3:16 తో పోల్చి చూడండి. 

20:18 ఉద్దేశములు... స్థిరపరచబడును అంటే “స్థాపించడం” లేదా “సాధిం చడం”. దేవుడు మాత్రమే ఉద్దేశాలను స్థిరపర్చగలడు. (4:26; 16:3,9). తరచుగా దేవుడు తన పట్ల భయభక్తులు గల ఆలోచన కర్తలు, వివేకంగల నాయకుల ద్వారా కార్యాలు జరిగిస్తాడు. 

20:19 కొండెగాడై గురించి 11:13 నోట్సు చూడండి. 

20:20 ఈ వచనంలో దూషించు అనే మాటకు అక్షరార్థంగా “పర్యవసానాల గురించి ఆలోచించకుండా అసందర్భమైన మాటలు ఉచ్చరించడం" లేదా ద్వేషభావంతో వ్యవహరించడం (ఆది 12:3; 1సమూ 3:13; 2సమూ 16:7) అని అర్థం. దీపము ఆరిపోవడం అనేది అకాల మరణాన్ని సూచించే అలంకారిక వర్ణన (13:9; 24:20; 2సమూ 21:17 చూడండి; నిర్గమ 20:12; ఎఫెసీ 6:2-3 తో పోల్చండి). 

20:21 ఈ సామెత వాస్తవమని తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో ఋజువైంది (లూకా 16:11-13).

20:22 ప్రతికీడు అంటే సరైన ప్రతిఫలం అందించడం. ప్రతిఫలాన్నివ్వడం, బహుమతులివ్వడం దేవుని అధీనంలోనివే (11:31; 19:17; 24:29; ద్వితీ 32:35). కనిపెట్టుకొనడం నిరీక్షణను సూచిస్తుంది (కీర్తన 25:3; 27:14; 37:9,34; 39:7; 40:1; 130:5). 

20:23 20:10 నోట్సు చూడండి. 

20:24 ఒకని నడతలు అనే పదజాలం “ధైర్యస్థుడైన వ్యక్తి" యొక్క బలాన్ని పౌరుషాన్ని సూచిస్తుంది. (24:5 లోని “బలవంతుడు" చూడండి). తనకు సంభవింప... యొకడెట్లు - బలవంతుడైనవాడి నడతల్ని సైతం దేవుడే నిర్ణయించినప్పుడు, ఏ నరుడూ తన జీవితం మీద తనకు పరిపూర్ణమైన అధికారం ఉందని వాదించలేడు. 

20:25 బుద్దిహీనుడు తొందరపడి ఆలోచించకుండా మ్రొక్కుకొనిన తరువాత తాను దాన్ని నెరవేర్చగలనో లేనో అని పదే పదే ఆలోచించుకుంటాడు. విచారించుట అంటే జాగ్రత్తగా పునరాలోచన చేసుకోవడం. బుద్దిహీనుడి నోరు అతనికే ఉరికాగలదు (18:7; న్యాయాధి 11:29-40 తో పోల్చండి). 

20:26 ధాన్యపు కంకుల నుండి ధాన్యాన్ని దుళ్ళగొట్టడం కోసం చక్రము అనే నూర్పిడి సాధనాన్నుపయోగిస్తారు. తరవాత దానిని తూర్పారపట్టి ధాన్యాన్ని, చెత్తను వేరుచేస్తారు (వ.8). 

20:27-28 అంతరంగము గురించి 18:8 నోట్సు చూడండి. కృపాసత్య ములు గురించి 3:3-4; 19:22 నోట్సు చూడండి.

20:29 వీరు "ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన" యౌవనస్థులు (యెహో 8:3). ఒకని తలనెరపు గౌరవప్రదమైన వృద్ధాప్యాన్ని చేరుకోవడాన్ని సూచిస్తుంది. దుష్టుల్లో అతి కొద్దిమంది మాత్రమే ఈ దశకు చేరుకుంటారు (10:27; 16:31).

20:30 అవసరమైనప్పుడు, భౌతిక దండన (దెబ్బలు) మంచి ఫలితాన్నిస్తుంది (13:24; 22:15; 23:14). అంతరంగము గురించి వ.27 చూడండి; 18:8 నోట్సు చూడండి. తొలగించును అంటే తోమి లేదా రుద్ది పేరుకున్న మురికిని తొలగించి శుభ్రం చేయడం (లేవీ 6:28; యిర్మీయా 46:4).


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |