Ezekiel - యెహెఙ్కేలు 47 | View All

1. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను; మందిరము తూర్పుముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడపక్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణ ముగా మందిరపు కుడిప్రక్కను క్రిందనుండి పారుచుండెను,
ప్రకటన గ్రంథం 22:1

2. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను.

3. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను.

4. ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను.

5. ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడెను, దాట వీలులేకుండ ఈదవలసినంత నీరుగల నదియాయెను.

6. అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది యిద్దరికి తోడుకొనివచ్చెను.

7. నేను తిరిగిరాగా నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను.
ప్రకటన గ్రంథం 22:2

8. అప్పుడాయన నాతో ఇట్లనెను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును.

9. వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.

10. మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.

11. అయితే ఆ సముద్రపు బురద స్థలము లును ఊబిస్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.

12. నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడి పోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.
ప్రకటన గ్రంథం 22:2-14-19

13. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సరి హద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను.

14. నేను ప్రమాణముచేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.

15. ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహా సముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.

16. అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దు నకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును.

17. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.

18. తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువ వలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు.

19. దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు.

20. పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.

21. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను.

22. మీరు చీట్లువేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలో దేశమందు పుట్టినవారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీవలె వారును చీట్లు వేయవలెను.

23. ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.బైబిల్ అధ్యయనం - Study Bible
47:1-5 యెహెజ్కేలు గ్రంథంలోని 47-48 అధ్యాయాలు ప్రకటన గ్రంథంతో సమసంబంధం కలిగి ఉండి యావత్ మానవచరిత్ర యొక్క లక్ష్యసిద్ధిని తెలియజేస్తున్నాయి. మందిరపు గడప క్రిందనుండి నీళ్ళు ఉబికి ప్రవహించే జీవజలనది. దేశానికి స్వస్థతనిస్తుంది (వ. 1-12). ఆది. 2:8-10 వచనాల్లో దేవుడు ఏదెను తోటలో సస్యసమృద్ధి నివ్వడానికి నదిని ప్రవహింపజేశాడు. పాపం ప్రవేశించినప్పుడు తోట, దానిలోని నది మరుగు చేయబడ్డాయి. అయితే, దేవుడు తన విమోచనాప్రణాళికలో లోకంలోని ప్రజలందరికీ యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవంతో కూడిన సంపూర్ణ రక్షణ అనుగ్రహిస్తున్నాడు కాబట్టి నిత్యజీవనది. మళ్లీ ప్రవహించి భూమిని స్వస్థపరుస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలోని పునరుద్ధరణ కార్యక్రమం సీయోను ప్రాముఖ్యతను, దావీదు ప్రాముఖ్యతను తగ్గించకుండానే ఏదోను తోట వాగ్దానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

47:6-7 ఈ దర్శనంలో చెట్లు విస్తారముగా ఉండడం ఏదెను తోటలోని ఫలసమృద్ధితో సమసంబంధంలో కనబడుతుంది, భవిష్యకాలంలోని నూతన సృష్టిని సూచించే దర్శనం యెహెజ్కేలుకు గోచరమైందని ఇది తెలియజేస్తుంది (ఆది 2:9). అద్భుతమైన జీవజలనది నీళ్లు దేశం మధ్యనుండి ప్రవహిస్తున్నాయి కాబట్టి సస్యసమృద్ధి విస్తారంగా ఉంటుంది (ఆది. 2:10-14). నీళ్లు తోట మధ్యలో నుండి కాక, దేవాలయం నుండి ప్రవహిస్తున్నాయి కాబట్టి నూతన సృష్టికి కేంద్రబిందువు దేవాలయమవుతుంది (కీర్తన 46:4). 

47:8 సముద్రపు నీళ్లు అనే పదజాలం మృతసముద్రాన్ని సూచించే వేరొక విధానం. రాబోయే కాలంలో ఈ ప్రదేశం దీవెనకరంగా ఉండడం ఇతర ప్రవచనాత్మక సందేశాల్లో కూడా ఉంది (యెషయా 35:1-2,6-7; యోవేలు 3:18). మృత సముద్రం నీళ్లు ఇతర సముద్రజలాలకంటె సుమారు ఆరు రెట్లు ఉప్పగా ఉంటాయి. 

47:9-11 ఈ దృశ్యం ఆది. 1:20-21 వచనాల్ని గుర్తు చేస్తుంది. మృతసముద్రం జీవంతో అలరారుతుంది. 

47:12 ఏదెను తోటలోని చెట్లులాగా (ఆది. 2:15-17), ఈ వృక్షములు సతతహరితాలై ఆహారం కోసం కావలసిన వాటినన్నీ ఇస్తాయి. పరిశుద్ధ స్థలములో నుండి ప్రవహించే నది నీటిని పీల్చుకొనే ఈ ఫలవృక్షాలు నెల నెలకు కాయలు కాయును (34:27, 36:30). ఈ ప్రకారంగా ఈ వృక్షాలు ఏదెను తోటలోని వృక్షాల్ని పోలి ఉండి, నిరంతరమూ ఆహారాన్నిస్తూ ఉంటాయి. (ఆది. 2:15-17). ఈ చెట్ల పండ్లు ఆహారంగాను, ఆకులు స్వస్థతనిచ్చే ఔషధంగాను ఉంటాయి (జెకర్యా 13:1; ప్రక 22:1-2). 

47:13 భూమి సరిహద్దులు యెహోషువ కాలంలో వివిధ గోత్రాలకిచ్చిన భూభాగాల సరిహద్దుల లెక్కకు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు భూమి.. గోత్రాల మధ్య సరిసమానంగా విభాగించబడుతుంది, ఇది ఇశ్రాయేలీయుల .. పితరుల కిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లవుతుంది. (20:6; 36:28; ఆది 12:1-3; 15:9-21; 17:8). యెహెజ్కేలుకు వాగ్దానం చేయబడిన నూతన నిర్గమంలోను, నూతన నివేశనం లోను (20:33-38) భూమి మళ్లీ కొత్తగా విభాగించబడడం దావీదు సామ్రాజ్యకాలంలోను, 2వ యరొబాము కాలంలోను (2సమూ 8:5-12; 2రాజులు 14:25; సంఖ్యా 34తో పోల్చండి) ఉన్న విధంగా ఉంటుంది. యొర్దాను కవతల ఉన్న భూభాగం ఇక్కడ లేవపోవడం గమనార్హం (సంఖ్యా 34).

47:14 ప్రమాణపూర్వకమైన వాగ్దానంతోబాటు (20:5,15,42; 36:7-8; నెహెమ్యా 9:15), చేతిని పైకి ఎత్తి ప్రమాణం చేయడం వుంటుంది. దేవుని చిత్తానికి వేరుగా ఏదైనా జరగవచ్చునేమో అని ఊహించడం సైతం పాత నిబంధన గ్రంథకర్తలకు అసాధ్యమైనది. సకలమును సృష్టించిన దేవుడు చరిత్రను నిర్వహిస్తుండడం, తన కోసం సృజించుకున్న ప్రజలతో సహవాసాన్ని కోరి తన నిత్య ప్రణాళికను ప్రత్యక్షపరుచుకొనడమే చరిత్రలో మనం చూస్తాం. అందుచేత ప్రవక్తలు దేవుడు తన భవిష్యప్రణాళికల గురించి వీరికి తెలియజేసిన వాటిని అప్రతిహతమైన నిశ్చయతతో మాట్లాడారు.

47:15-20 ఈ వచనాల్లో ఇశ్రాయేలు దేశ సరిహద్దులు తెలియజేయబడ్డాయి.

47:15 ఇశ్రాయేలు పూర్వపు భూ విభజనల్లో హమాతుకు పోవు మార్గము ఉత్తర దిక్కున చిట్టచివరి ప్రదేశం (సంఖ్యా 13:21; 1రాజులు 8:65). 

47:19 నది మార్గము (వాడి-ఎల్ ఆరీష్) సొలొమోను రాజ్యంలో దక్షిణ దిక్కున చిట్టచివర ఉన్న ప్రదేశం (1రాజులు 8:65).

47:20 దేశానికి పశ్చిమంలో మహాసముద్రము (మధ్యధరా సముద్రము) ఆ సరిహద్దు. నిత్యరాజ్యంలో సముద్రం ఉండదు (ప్రక 21:12)

47:21-23 ఇశ్రాయేలు గోత్రస్థానాల్లో ఉన్న పరదేశులకును స్వాస్థ్యములు పంచి ఇవ్వబడతాయి. దేశంలో నివాసముంటున్న పరదేశులు ఏ గోత్రంలో ఉంటే, అదే వారి స్వాస్థ్యమవుతుంది. దేశంలో నివాసముంటున్న పరదేశుల పట్ల శ్రద్ధ వహించాలని దేవుడెల్లప్పుడూ ఇశ్రాయేలీయులకు ఉపదేశిస్తూనే ఉన్నాడు (లేవీ 19:33-34; 24:22; సంఖ్యా 15:29), రాబోయే కాలంలో పరదేశులు సైతం గొప్ప స్థితిననుభవిస్తారు (యెషయా 56:3-8). దేశంలో నివసిస్తున్న పరదేశులకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఎటువంటి అసమానతలు ఉండవు. 


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |