Proverbs - సామెతలు 17 | View All

1. రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.

2. బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడి చేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచు కొనును.

3. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.
1 పేతురు 1:17

4. చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును.

5. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించు వాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు.

6. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము.

7. అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.

8. లంచము దృష్టికి మాణిక్యమువలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును.

9. ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.

10. బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.

11. తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును అట్టివానివెంట క్రూరదూత పంపబడును.

12. పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు

13. మేలుకు ప్రతిగా కీడు చేయువాని యింటనుండి కీడు తొలగిపోదు.

14. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

15. నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు.

16. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా?

17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.

18. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు.

19. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు.

20. కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును.

21. బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు.

22. సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.

23. న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును.

24. జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది బుద్ధిహీనువి కన్నులు భూదిగంతములలో ఉండును.

25. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును

26. నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము చేయుటే.

27. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.

28. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.బైబిల్ అధ్యయనం - Study Bible
17:1 కంటె...మేలు సామెతల కోసం 15:16-17 నోట్సు చూడండి. వట్టి రొట్టెముక్క బహుశా పాతబడిన రొట్టె (యెహో 9:5), నూనెతో కాల్చనిది లేక నంజుకోడానికి ఏమీ లేని వట్టి రొట్టె (రూతు 2:14) కావచ్చు. కలహము వివాదాన్ని, నెమ్మది క్షేమాన్ని సూచిస్తున్నాయి. భోజనపదార్థములు దేవునికి తన ఇంట ఉన్న కుటుంబీకులకు మధ్య సమాధానం కోసం అర్పించే సమాధానార్థబలుల్ని సూచిస్తుండవచ్చు. 

17:2 ఇది బహుశా రూపకాలంకారం లేదా అతిశయోక్తి కావచ్చు. “మొండివాడై తిరగబడే" కుమారుడిని రాళ్లతో కొట్టి శిక్షించాలనే న్యాయవిధి ఉంది గానీ (ద్వితీ 21:18-21), తల్లిదండ్రులకు సిగ్గు తెచ్చు (అవమానం కలిగించే) కుమారుని స్థానంలో దాసుడిని నియమించే న్యాయవిధి లేదు.

17:3 లోహాల్ని అధిక ఉష్ణం దగ్గర కరిగించి శుద్ధి చేయడానికి మూస, కొలిమి అనే మట్టి పాత్రలను ఉపయోగిస్తారు. పరిశోధించడమంటే యథార్థత వెల్లడయ్యేలా పరీక్షించడం. పరీక్ష శుద్ధిచేసే ఒక ప్రక్రియ (యోబు 23:10). హృదయ పరిశోధకుడైన దేవుణ్ణి ఎవరూ మోసగించలేరు ((1దిన 29:17; కీర్తన 7:9; 26:2; యిర్మీయా 11:20; 12:3). -

17:4 అసలే చెడ్డగా ఉన్న పరిస్థితిని ఇంకా దారుణంగా చేయడంలో చెడునడవడి గలవాడు... అబద్ధికుడు, ఇద్దరూ సమానమే. 

17:5 ఎవరినైనా వెక్కిరించడం వారిని నిందించడం, ద్వేషించడంతో సమానం (1:22). దేవుడే బీదలను సృష్టించాడు. కాబట్టి (14:31), వారి నపహాస్యం చేయడం దేవుణ్ణి అవమానించడం (నిందించడం)తో సమానం. నిస్సహాయకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడే కాపాడతాడు. (14:21; 15:25; 22:16,22-23). ఆపద గురించి 1:26-27 నోట్సు చూడండి. నిర్దోషిగా ఎంచబడకపోవడం గురించి 6:27-29 నోట్సు చూడండి.

17:6 కిరీటము ఘనతకు హోదాకు చిహ్నం. తమ కుమారులకు, కుమారుల కుమారులకు అలంకారముగా ఉండడం వృద్ధులకు తగిన గౌరవం. ఇటువంటి దీవెన దక్కాలంటే జ్ఞానాన్ననుసరించవలసి ఉంటుంది. 

17:7 బుద్దిలేనివానికి అనే మాటకు ఇక్కడ వాడిన హెబ్రీ పదం "నాబాల్ (1సమూ 25:25), ఈ పదం బుద్దిహీనతతో బాటు దేవుని పట్ల బొత్తిగా భయభక్తులు లేకపోవడాన్ని కూడా సూచిస్తుంది. దేవుని దూషించేవారు (యోబు 2:9-10), ఆయన ఉనికిని తృణీకరించేవారు వీరే (కీర్తన 14:1; యెషయా 32:6 తో పోల్చండి). మరొక రకం “బుద్దిలేనివాని" గురించి 1:7,22 నోట్సు చూడండి. బుద్ధిలేనివారి మాటల్ని ఎవరూ పట్టించుకోక పోయినా వారు అహంకారంగా మాట్లాడుతుంటారు. అయితే ఈ విధంగా మాట్లాడడం అధిపతికి (8:15-16 నోట్సు చూడండి) బొత్తిగా తగదు (11:31 నోట్సు చూడండి), ఎందుకంటే అధిపతి మాట్లాడే మాటలు విలువైనవి, ముఖ్యమైనవి అయ్యుంటాయి.

17:8 మాణిక్యము అంటే “దయ కలిగించే రత్నం లేదా ఆభరణం” అని అక్షరార్థం. అంటే ఇతరులను దయతో చూసేటట్లు చేసేది అని అర్థం. యజమాని ఇచ్చే లంచం అతని దృష్టికి మాణిక్యంలాగా ఉండి ఇతరుల్ని ఆకర్షిస్తుంది. (15:27 నోట్సు చూడండి) కాబట్టి, లంచము ఇచ్చేవారు జీవితంలో దేనినైనా తమ కనుకూలంగా సాధించుకోగలరు. అయితే లంచం చివరికి వినాశనం కలిగిస్తుంది.

17:9 ఇతరుల తప్పితములు. ఎవరు దాచి పెడ్తారో వారు ప్రేమను కోరుకొనేవారని గమనార్హం. ఒకడు గాయపరచబడినా దాన్ని అంతగా పట్టించుకోకుండా (19:11), ప్రతీకారాన్ని దేవునికి విడిచిపెట్టడం సమాజంలో సత్సంబంధాల్ని ప్రోత్సహిస్తుంది. 

17:10 మిక్కిలి తీవ్రమైన క్రమశిక్షణకు సైతం మార్పు చెందని మొండివాడు బుద్దిహీనుడు (హెబ్రీ. కేసిల్). నూరు దెబ్బలు అనే సంఖ్య అతిశయోక్తి మాత్రమే, ధర్మశాస్త్రం నలభై దెబ్బల్ని మాత్రమే అనుమతిస్తుంది. (ద్వితీ 25:3), బుద్ధిమంతునికి... లోతుగా నాటును అంటే బుద్ధి గలవాడు సున్నిత మనస్కుడు కాబట్టి అతనికి ఒక చిన్న గద్దింపు మాట చాలు. 

17:11 తిరుగుబాటు చేయడం అంటే దేవుణ్ణి ధిక్కరించి ఆయన నుండి తొలగిపోవడం (ద్వితీ 31:27). దూత అనే పదాన్ని “దేవదూత" అని కూడా అనువదించవచ్చు. క్రూరదూత అంటే దేవుడు పంపించే మరణదూత (16:14; 1దిన 21:15; కీర్తన 78:49). 

17:12 అరాము ప్రాంతంలో గోధుమవర్ణంలో ఉండే ఆడ యెలుగుబంటి భయంకరమైన క్రూరత్వంతో ఉంటుంది (2రాజులు 2:24; విలాప 3:10), ముఖ్యంగా పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటి క్రూరత్వం మరీ భయానకంగా ఉంటుంది (2 సమూ 17:8; హోషేయ 13:8). 

17:13 ఇది దారుణమైన కృతఘ్నతా స్వభావం. “ఆతిథ్యం ఇచ్చిన ఇంటిని విడిచి వెళ్ళక అక్కడే ఉండి ఇంటి యజమానుడిని నిరంతరమూ దారుణంగా శిక్షించడం” (బ్రూస్ వాల్డ్ కే).

17:14 కలహం గురించి 6:14 దగ్గర “జగడములు పుట్టించును” వివరణ చూడండి. వివాదము సద్దుమణగాలంటే దాని మట్టుకు దానిని విడిచిపెట్టాలి (26:20). 

17:15 ఇశ్రాయేలులో అవినీతిపరులైన న్యాయాధిపతులు దుష్టులను నిర్దోషు లని తీర్పు తీర్చుతూ నిజంగా నిర్దోషులకు న్యాయం అందకుండా చేస్తున్నారు (యెషయా 5:23). హేయులు గురించి 3:32 నోట్సు చూడండి. 

17:16 జ్ఞానము సంపాదించుట గురించి 4:5-8 నోట్సు చూడండి. సొమ్ము వలన కలిగిన ప్రయోజనాలలో జ్ఞానసంపాదనకు మించినది. లేదు. అయితే బుద్దిహీనుని (హెబ్రీ. కేసిల్) చేతిలో ఉన్న డబ్బుకు ఏమీ ప్రయోజనం ఉండదు, ఎందుకంటే అతనికి జ్ఞానాన్ని సంపాదించాలనే కోరిక గానీ బుద్ధి (అక్షరార్థంగా “హృదయం")గానీ లేదు గదా!

17:17 ఒక సహోదరుడు తన కుటుంబానికి దుర్దశలో తోడుగా ఉంటాడు. సహోదరుడు అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదం తోడబుట్టిన వారిని మాత్రమే కాక బంధువర్గంలోని ఇతరులను కూడా సూచిస్తుంది (ఆది 13:8; 29:15; న్యాయాధి 14:3). నిజమైన స్నేహితుడు ఉండడం ఎంతో మంచిది. ఎందు కంటే అతను కష్టకాలంలో మాత్రమే కాక ఎప్పటికీ విడువక ప్రేమించును. అంటే ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడని ఈ వచన భావం.

17:18 జామీను ఉండి పూటపడువాడు గురించి 6:1-2 నోట్సు చూడండి. తెలివిమాలినవాడు గురించి 6:30-33 నోట్సు చూడండి.

17:19 ఇంట్లోకి ప్రవేశించాలంటే వాకిండ్లు దాటి లోపలికి అడుగు వేయాలి. గుమ్మం ఎత్తుగా ఉన్నట్లయితే లోపలికి ప్రవేశించేవారికి దెబ్బ (నాశనము) తగలవచ్చు. లేదా, “వాకిండ్లు ఎత్తు చేయువాడు” బహుశా తన ఇల్లు పొరుగింటి కంటె ఎత్తుగా ఉండాలని కోరే అహంభావి అయ్యుండవచ్చు. ఇటువంటి గర్విష్ణుడు. తనకు తానే యెహోవా నుండి తన నాశనాన్ని వెదకువాడుగా ఉంటాడు (16:5). 

17:20 కుటిలవర్తనుడు... మూర్ఖముగా మాటలాడువాడు, ఇద్దరూ దేన్నైనా వక్రీకరించ గలరు. అంటే వీరు చెడును మంచిగా వర్ణించే మనుషులు (28:6,18). 

17:21 బుద్ధిహీనుని (హెబ్రీ. కేసిల్) లో మొదటి రకం అనైతికమైన, అహంభావంతో నిండిన, అపాయకరమైన వారు (1:22 నోట్సు చూడండి). రెండవ రకం (హెబ్రీ. నాబాల్) దేవుని పట్ల బొత్తిగా భయభక్తులు లేని వ్యక్తి, ధర్మాన్ని అతిక్రమించే వ్యక్తి (17:7 నోట్సు చూడండి). 

17:22 సామె 15:13 లో సంతోషము గల మనస్సు ముఖానికి తేట నిస్తుందని ఉంది. ఇది ఆరోగ్య కారకం అని ఈ వచనం తెలియజేస్తుంది. మనోవిచారం మనస్సు నలిగిపోయేలా చేస్తుంది (15:13 నోట్సు చూడండి). ఎముకలను ఎండిపోజేయడం అంటే జీవశక్తి కృశించి పోవడాన్ని సూచిస్తుంది (యెహె 37:11). ఎండిన యెముకలకు పూర్తిగా భిన్నమైన స్థితి యెముకలు మజ్జతో మెత్తని క్రొవ్వుతో నిండి ఆరోగ్య మైనవిగా ఉండడం (యోబు 21:24; కీర్తన 109:18). 

17:23 ఒడిలో నుండి అంటే చాటుగా తీసుకొనడమని అర్థం (21:14 తో పోల్చండి). ఇతరచోట్ల అంగీ లోపల నుండి (నిర్గమ 4:7), లేక ఒకని చేతిలోనుండి (1రాజులు 17:19) తీసుకోవడమని అర్థం. లంచము గురించి 15:27 నోట్సు చూడండి. 

17:24 జ్ఞానము వివేకముగలవాని ముఖం ఎదుట ఉందనీ, అంటే వివేకి జ్ఞానాన్ని దృష్టిస్తున్నాడనీ అక్షరార్ధం. భూదిగంతములలో అనే మాట ఏర్పరచబడిన ఇశ్రాయేలు ప్రజలకు సుదూర దేశాల్లో భక్తిహీనులు నివసించే ప్రాంతాలను సూచిస్తుంది. (ద్వితీ 13:7; 28:49). "బుద్దిహీనుడు” (హెబ్రీ. కేసిల్) అక్రమార్జన కోసం చూస్తుంటాడనీ, కష్టపడకుండా డబ్బు సంపాదించే సులభమైన దారుల కోసం వెతుకుతుంటాడని అర్థం.

17:25 బాధ అంటే దీనమైన పరిస్థితి. హానికరమైన స్థితి కాదు (యిర్మీయా 6:26). 

17:26 నీతిమంతులు అంటే కల్మషం లేనివారు. యథార్థత గురించి 2:7 దగ్గర "యథార్థవంతులను". నోట్సు చూడండి. మంచివారిని గురించి 8:1516 నోట్సు చూడండి. 

17:27-28 ఐగుప్తు జ్ఞానసాహిత్యంలోను, ఇశ్రాయేలు జ్ఞానసాహిత్యంలోను నిశ్చలత్వం, శాంతగుణం ఆదర్శవంతమైన సుగుణాలు. ఆత్మ సంయమనానికి సర్వోత్తమమైన మాదిరి యేసు క్రీస్తు (యెషయా 53:7; మార్కు 14:61). వ.28 లోని బలమైన వాదం: మూడుడైనను (హెబ్రీ. ఏవిల్) మౌనముగా నుండినయెడల జ్ఞాని అని లెక్కించబడినప్పుడు, సంయమనం పాటించే జ్ఞానం గల వ్యక్తి ఇంకా ఎక్కువగా గౌరవం పొందుతాడు. వివేకి గురించి 1:5 నోట్సు చూడండి.. 


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |