Isaiah - యెషయా 17 | View All

1. దమస్కును గూర్చిన దేవోక్తి

2. దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱెల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును.

3. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించినవారికి జరుగును సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు.

4. ఆ దినమున యాకోబుయొక్క ప్రభావము క్షీణించి పోవును వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును

5. చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును

6. అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లుదానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

7. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు.

8. మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును
ప్రకటన గ్రంథం 9:20

9. ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీయుల భయముచేత అడవిలోను కొండ శిఖరముమీదను జనులు విడిచిపోయిన స్థలముల వలెనగును. ఆ దేశము పాడగును

10. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొన లేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి

11. నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసితివి గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును.

12. ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటమువలె ఆర్భటించును.జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును

13. జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.

14. సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయము కాకమునుపు లేకపోవుదురు ఇదే మమ్మును దోచుకొనువారి భాగము, మా సొమ్ము దొంగిలువారికి పట్టు గతి యిదే.బైబిల్ అధ్యయనం - Study Bible
17:1-3 తరువాతి దేవోక్తి... దమస్కు గురించి ఉంది. ఈ పురాతన పట్టణం, సిరియాకు రాజధాని. సొలొమోను కాలం నుండి (1రాజులు 11:23-25) ఎనిమిదవ శతాబ్దం మధ్యవరకు ఇశ్రాయేలుకు సిరియాకు మధ్య కలహాలుండేవి. యూదా రాజైన ఆహాజు సిరియా-ఎఫ్రాయిముల కూటమి వలన కలిగే బెడద నెలా ఎదిరించాలో యెషయా అతనికి తెలియజేస్తూ అతణ్ణి ధైర్యపర్చినట్టుగా ఈ గ్రంథంలోని అధ్యా.7 తెలియజేస్తుంది. విస్తరిస్తున్న అషూరు సామ్రాజ్యం 3వ తిధత్పిలేసేరు ఆధ్వర్యంలో దమస్కును విలీనం చేసుకుంది. 

17:2 బాగా ప్రాచుర్యం పొందిన అరోయేరు పట్టణములు మోయాబులో ఉన్నాయి. అయితే దమస్కు నుద్దేశించిన ఈ ప్రకటన మధ్యలో వీటి ప్రస్తావన అసంబద్ధంగా కనబడుతుంది. “బహుశా ఈ పేర్లతో వేరే పట్టణాలున్నాయేమో, లేదా కొందరు సూచిస్తున్నట్టుగా వాక్యభాగాన్ని దాని పట్టణములన్నియు నిర్మానుష్యమగును" అని సవరించవలసి ఉంటుందేమో” (బ్రెవార్డ్ చైల్డ్స్). 

17:3 తరువాతి వచనం సూచించినట్టుగా (వ.4), సిరియా ప్రభావం ఇశ్రాయేలీయుల ప్రభావమును పోలి ఉండడం సిరియాకే మంచిది కాదు. ఈ రెండు జాతులూ నాశనం కానున్నాయి.

17:4 ఆ దినమున (వ.7,9) అనే పదజాలం అనిర్దిష్టమైన భవిష్యకాలాన్ని సూచిస్తుంది. ఇశ్రాయేలు వినాశనం గురించి మొదటి సాదృశ్యం శరీరము కృశించి పోవడం. 

17:5 వినాశనం గురించి రెండవ సాదృశ్యం చేను కోయువాడు ధాన్యపుకంకుల్ని కోయడం. రెఫాయీము లోయ యెరూషలేముకు నైరుతిలో ఉంది. ఈ పేరు “మృతుల లోయ” అనే అర్థాన్నిస్తూ అమంగళకరంగా ఉంది. 

17:6 వినాశనం గురించి మూడవ సాదృశ్యం ఒలీవ చెట్లు దులపడం. చెట్లను దులిపి, క్రింద పడిన పండ్లను తినడం పరిపాటి. అయితే ఈ సాదృశ్యం వినాశనం విపరీతంగా ఉన్నాగానీ, చెట్లకు కొన్ని పండ్లు మిగిలే ఉంటాయని తెలియజేస్తుంది. మిగిలిన ఒలీవ పండ్లు శేషజనాన్ని సూచిస్తున్నాయి. 

17:7-8 ఆ దినమున (వ.4) శిక్షకు ఆవల ఉన్న కాలాన్ని సూచిస్తుంది. వాస్తవానికి, దేవుని నుండి వచ్చే శిక్ష శేషజనం అబద్దపు ఆరాధనను విడిచిపెట్టి తమ సృష్టికర్తయైన నిజదేవుణ్ణి ఆరాధించేలా చేస్తుంది. అషేరా కనానీయుల ప్రేమదేవత, యుద్ధదేవత. దేవతాస్తంభమునైనను అనే పదం చెక్క స్తంభాల్ని లేదా దేవత పూజకు సంబంధించిన చెట్లను సూచిస్తుంది.

17:9 ఆ దినమున భవిష్యకాలంలో రాబోయే తీర్పును మళ్లీ సూచిస్తుంది (వ.4), వినాశనం పట్టణాల్ని అడవి లోను కొండల శిఖరముల మీదను... విడిచిపోయిన స్థలములవలె చేస్తుంది. ఇశ్రాయేలీయులు విడిచి పెట్ట బడడానికి కారణం, వ. 10 వివరిస్తున్నట్టుగా వారు దేవుని మర్చిపోయి పాపం చేయడమే. 

17:10-11 దేవుణ్ణి జ్ఞాపకము చేసికొనడమంటే కేవలం మనసుకు సంబంధించిన చర్య కాదు, ఆయనకు విధేయత చూపడం ఆయనను ఆరాధించడం. ఆయనను మర్చిపోవడం ఇశ్రాయేలు అవిధేయతను సూచిస్తుంది. యెషయా ఇశ్రాయేలు ముగింపు విషాదభరితంగా ఉంటుందని తెలియజేయడానికి మొక్కను సాదృశ్యంగా ఉపయోగించాడు. ఇశ్రాయేలు రమ్యమైన వనములను నాటడానికి బాగా ప్రయాసపడింది. వారు తమ శక్తినంతా ఉపయోగించారు. అయితే చివరకు ఏమీ సాధించలేకపోయారు. ఇశ్రాయేలు స్వావలంబన ప్రయత్నాలు సైతం శూన్యాన్నే మిగుల్చుతాయి. ఈ 

17:12 ఓహో అనే ప్రారంభం శ్రమను సూచించే పదం వంటిదే (1:4 చూడండి). ఇది అంత్యక్రియల సందర్భంలో ఉపయోగించే శోకగీతాన్ని పోలిన ప్రకటనను ప్రారంభిస్తుంది. అన్యజనాంగాలు ఆర్భటిస్తున్నారు, ఘోషిస్తున్నారు, కల్లోలపడుతున్నారు (కీర్తన 2:1-4). వీరి కల్లోలం అలలు ఘోషిస్తున్నట్టుగా ఉంది. ప్రవాహజలము అనే వర్ణన తరచూ సామాజిక, మతపరమైన కలవరాన్ని సూచిస్తుంది (కీర్తన 18:16; 29:3; 32:6). 

17:13 జనములు ఘోష పెడ్తున్నప్పటికీ, దేవుని గద్దింపు వారిని తరిమివేసి నిమ్మళపరుస్తుంది. (కీర్తనలు 2; 48). పొట్టు తేలికగా ఉండి గాలికి ఎగిరిపోతుంది, దేవుని గద్దింపు అల్లకల్లోలంగా ఉన్న జనాల్ని ఎగరగొడ్తుంది. 

17:14 దేవుని నుండి తీర్పు శీఘ్రంగా రానుంది, అది ఒక రోజులోనే వస్తుంది (సాయంకాలమున... ఉదయము కాకమునుపు). అన్యజనాంగాలకు చిక్కినవారు (దేవుని ప్రజలు) ఇక్కడ మమ్ము... మా అంటూ మాట్లాడుతున్నారు. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |