Galatians - గలతీయులకు 4 | View All

1. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.

2. తండ్రిచేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును.

3. అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై యుంటిమి;

4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,

5. మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.

6. మరియు మీరు కుమారులై యున్నందుననాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.

7. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు.

8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని
2 దినవృత్తాంతములు 13:9, యెషయా 37:19, యిర్మియా 2:11

9. యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?

10. మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు.

11. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.

12. సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడు కొనుచున్నాను.

13. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.

14. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీక రించితిరి.

15. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.

16. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?
ఆమోసు 5:10

17. వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు; మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసి వేయగోరుచున్నారు.

18. నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే.

19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.

20. మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను.

21. ధర్మశాస్త్రమునకు లోబడియుండ గోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి.

22. దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?
ఆదికాండము 16:5, ఆదికాండము 21:2

23. అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దాన మునుబట్టి పుట్టెను.

24. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.

25. ఈ హాగరు అనునది అరేబియాదేశములోఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.

26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి.

27. ఇందుకుకనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదనపడని దానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది.
యెషయా 54:1

28. సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.

29. అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మనుబట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.
ఆదికాండము 21:9

30. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితోపాటు వారసుడై యుండడు.
ఆదికాండము 21:10

31. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమా రులమే గాని దాసి కుమారులము కాము.బైబిల్ అధ్యయనం - Study Bible
4:1 ప్రాచీన కాలంలో వయస్సుకు రాని వారసుడు, తన స్వాస్థ్యం మీద ఎలాంటి అధికారం కలిగి ఉండడు. చట్టప్రకారం అతడు తాత్కాలికంగా ఒక బానిస స్థాయిలోనే ఉంటూ ఎవరికీ ఏమీ చెల్లించనవసరం లేనివాడై ఉంటాడు. 

4:2 ఇక్కడ చెప్పిన సంరక్షకులు (గ్రీకు. పైడగాగోస్) అనే పదం 3:24-25 లోని భావాన్ని సూచించదు (అక్కడి నోట్సు చూడండి). ఇక్కడ “సంరక్షకులు” అంటే వయస్సుకు రాని వారసుణ్ణి సంరక్షించే బానిస. గృహనిర్వాహకులు అంటే అతడు వయసుకు వచ్చేవరకు (తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు) అతని ఇతర అవసరాలను చూడడానికి బాధ్యత వహించేవారు. ఈ సాదృశ్యం మోషే ధర్మశాస్త్ర కాలంలో సమస్తం దేవుని స్వాధీనంలో ఉండి, క్రీస్తు రాకకోసం పరిపూర్ణమైన పరిస్థితులను నెలకొల్పుతున్నాయని సూచించే ఒక వర్ణన.

4:3 లోకసంబంధమైన మూల పాఠములు “నిజమునకు దేవుళ్ళు కానివారు” అని వ.8లో, “బలహీనమైనవియు నిష్ప్ర యోజన మైనవియునైన మూల పాఠములు" అని వ.9లో పిలిచాడు. ఈ వర్ణనలు వ.10 లోని “దినములు, మాసములు, ఉత్సవకాలములు, ఈ సంవత్సరములను” ఆచరించడంతో కలపబడి ఉన్నాయి కాబట్టి, ఇవి ధర్మశాస్త్ర నియమాలపై, ప్రకృతి ధర్మాలపై ఆధారపడి ఉన్న మతాచారాలకు సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. 

4:4-5 పరిపూర్ణము అని అనువదించిన గ్రీకు పదం "ప్లెరోమా". క్రీస్తు పరిపూర్ణమైన (సరైన) సమయానికి వచ్చాడని ఇది సూచిస్తుంది. అది మంచి సమయం అని చెప్పడానికి ఆ కాలంలో అంతటా విస్తరించిన శాంతి సమాధానాలు (పాక్స్ రోమానా), అద్భుతమైన రోమా రహదారులు, సామ్రాజ్యమంతటా మాట్లాడే ఒకే భాష ప్రాబల్యం (కొయినే గ్రీకు) అనేవి దోహదం చేశాయి. ప్రాచీనకాలంలో మరే: విధానంలోనూ సాధ్యం కానీ విధంగా, వీటి ద్వారా సువార్త విస్తరించింది. దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి అనే మాటలు దేవుడు ఆది 3:15లో స్త్రీ సంతానం గురించి ఇచ్చిన వాగ్దానాన్ని దృష్టిస్తుండవచ్చు. అలాగే అది క్రీస్తు కన్యగర్భాన జన్మించడాన్ని కూడా సూచిస్తుండవచ్చు (యెషయా 7:14; మత్తయి 1:1825). ధర్మశాస్త్రమునకు లోబడిన అనే మాటలు మోషే ధర్మశాస్త్రం కింద జీవించడమంటే ఏమిటో యేసుకు తెలుసనే సత్యాన్ని సూచిస్తుంది. మరే మానవుడూ చేయలేని విధంగా ఆయన ధర్మశాస్త్రమంతటినీ సంపూర్ణంగా పాటించాడని ఇది తెలుపుతుంది (3:10,21-23 నోట్సు చూడండి). 

4:5-6 అవిశ్వాసులకు, వ.1-2లో చెప్పిన వయస్సుకు రాని వారసునికి ఉన్న గొప్ప తేడా ఏమిటంటే, క్రీస్తుతో అనుబంధంలో లేని ప్రజలు నిజానికి ఆధ్యాత్మికంగా పాపానికి బానిసలు. ఇది ధర్మశాస్త్రము ద్వారా స్పష్టమైంది. కాబట్టి, బానిసల బజారు నుండి పాపుల విమోచన కోసం (గ్రీకు. ఎక్సాగొరాజో, “వెల చెల్లించడం ద్వారా విడిపించడం") యేసు మరణించడం ఆవశ్యకం. రెండవ గొప్ప తేడా ఏమిటంటే, క్రైస్తవులు రక్తసంబంధం ద్వారా కాక, దత్తపుత్రత్వాన్ని స్వీకరించడం ద్వారా కుమారులవుతారు. తండ్రియైన దేవునికి సహజ కుమారుడు యేసు క్రీస్తు ఒక్కడే. మిగతా కుమారులందరూ (స్త్రీలతో సహా, ఎందుకంటే “కుమారత్వం" ఒక చట్టబద్ధమైన స్థితి) దత్తపుత్రులు. అరమేయిక్ భాషలో అబ్బా అంటే “తండ్రీ" అని అర్థం. కానీ దానిలో ఒక వ్యక్తిగత అనుబంధంతో కూడిన భావన ఉంది. అంటే దానిలో “డాడీ”, “నాన్నా”, “పాపా” అనే భావన ఇమిడి ఉంది. మార్కు 14:36లో యేసు ప్రయోగించిన “అబ్బా" అనే సంబోధనను గమనించండి. 

4:7 తన క్రియల ద్వారా దేవుని యెదుట నీతిమంతుడుగా తీర్చబడాలనుకునే వాడు మోషే ధర్మశాస్త్రానికి దాసుడు అని పౌలు గలతీయ సంఘాలతో చెబుతున్నాడు. అయితే క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డవాడు. ఇక దాసుడు కాక దేవుని అనంతమైన ఐశ్వర్యానికి పూర్తి వారసత్వపు హక్కులు గల కుమారుడు. 

4:8-11 పౌలు పాఠకులు క్రీస్తులో విశ్వాసం ద్వారా దేవునితో నిజమైన అనుబంధంలో స్థాపించబడ్డారు. వారు. ఇంతకు ముందు ఆచరించినట్టు క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం " అనే "బలహీనమైన... నిష్ప్ర యోజనమైన... మూలపాఠములకు (వ.3) మరల తిరిగి.. దాసులై జీవించడం ఎందుకు అని అడుగుతున్నాడు. దినములు అంటే సబ్బాతును ఆచరించడం, మాసములు, ఉత్సవ కాలములు అంటే యూదుల కాలపంచాంగంలోని దీర్ఘసమయాలను (ఉదా: పస్కా పండుగ నుండి పెంతెకోస్తు పండుగ వరకు ఉన్న కాలం) ఆచరించడం గలతీయలో యూదా బోధకుల ఉనికిని నిర్ధారిస్తున్నాయి. సంవత్సరములు విశ్రాంతి సంవత్సరాలు లేక సునాద సంవత్సరం కావచ్చు.
అపౌలు రాకముందు గలతీయులు ఆధ్యాత్మికంగా బానిసలుగా ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితికి వారు తిరిగితే తాను పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోయిందేమోనని పౌలు భయపడ్డాడు.

4:12 తన పాఠకులు తనలాగా ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందాలని పౌలు కోరాడు. తాను ధర్మశాస్త్రాన్ని అనుసరించడాన్ని క్రీస్తులో విశ్వాసానికి మార్పిడి చేసుకున్నప్పుడు తాను కూడా వారిలాగా మారాడు. ఇప్పుడు వారు యూదుల్లాగా తమను తాము ధర్మశాస్త్రానికి లోబరచుకోవడం అర్థరహితం. 
4:13-15 అసలైతే పౌలు వేరొకచోటికి, బహుశా ఎఫెసుకు వెళ్ళాలని కోరుకున్నాడు. కానీ అనారోగ్యం వల్ల గలతీయలో ఆగాల్సి వచ్చింది. పౌలు శరీర దౌర్బల్యము ఏమిటో సరిగ్గా తెలియదు. ఒక వాదన ప్రకారం, తన మొదటి మిషనరీ యాత్రలో ఒకచోట పౌలును రాళ్ళతో కొట్టి చనిపోయాడనుకొని వదిలేశారు. అది అతడు కంటిచూపును కోల్పోవడంతో సహా అనేక రకాలైన గాయాలకు కారణమై ఉంటుంది. పౌలు “శరీరంలో ముల్లు" (2కొరింథీ 12:7) అతని కంటి సమస్య అని కొందరు భావిస్తారు. చిన్నాసియా దక్షిణ పల్లపు ప్రాంతాలలో పౌలు మలేరియా బారినపడ్డాడని మరికొందరు తలుస్తారు (అపొ.కా.13:13-14).

4:16 వారు వినాలని కోరుకున్నది. కాక, వారు వినవలసినది. (నిజం) చెప్పినందుకు గలతీయులు తనను శత్రువులా చూడడం పౌలుకు దుఃఖం కలిగించింది. 4:17-18 గలతీయలోని అబద్ధ బోధకుల విషయంలో జరిగినట్లు, ఆసక్తి గలతీయుల్ని భ్రమింప చేయవచ్చు (1:13-14 నోట్సు చూడండి). గలతీయ సంఘాలలో ఆసక్తిని కొనసాగించడం కోసం ఈ బోధకులు “ధర్మశాస్త్ర క్రియల" ద్వారా నీతిమంతులుగా తీర్చబడని వారిని ఇతర అన్యుల సంఘాలలో నుండి త్రోసివేయగోరుచున్నారు (2:16).

4:19 గలతీయులు రెండవసారి “తిరిగి జన్మించాల”ని పౌలు ఆశించాడు (యోహాను 3:3,5-8). కానీ అది సాధ్యం కాదు (హెబ్రీ 6:4-7). తన భావోద్వేగాలలో అతడు ఒకే బిడ్డకు రెండవసారి జన్మనివ్వడానికి ఒక స్త్రీ ప్రసవవేదన పడిన భావన అతనికి కలిగింది. (అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అనే విషయానికి గలతీయులను మరలా తీసుకురావడానికి, తద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను నొక్కిచెప్పే తప్పుడు పద్దతిని కొట్టివేయడానికి).

4:20 తాను శ్రద్ధ వహించిన వారి విషయంలో కఠినంగా ఉండడం పౌలుకు సంతోషం కలిగించదు, కానీ తాను భౌతికంగా వారి మధ్య లేడు కాబట్టి వారి పరిస్థితిని గురించి ఏమి చేయాలో అతనికి తోచలేదు.

4:21 ధర్మశాస్త్రము అంటే కేవలం మోషే ధర్మశాస్త్రానికే కాక, ధర్మశాస్త్ర గ్రంథాలైన - పంచకాండాలు (ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం) ను సూచిస్తుంది. ధర్మశాస్త్రం కూడా అబద్ధ బోధకుల దృక్కోణాన్ని ఖండిస్తుంది అని పౌలు వాదన. 

4:22-23 దాసియైన హాగరుకు పుట్టిన ఇష్మాయేలు, స్వతంత్రురాలైన శారాకు పుట్టిన ఇస్సాకు అనే ఇద్దరు కుమారులను గురించి ఆదికాండంలో ఉంది. ఇష్మాయేలు శరీరప్రకారము పుట్టాడు. ఎందుకంటే శారా అబ్రాహాములు ఓపికతో దేవుని వాగ్దానాన్ని (ఆది. 16) నమ్మకుండా, తమ స్వంత చాతుర్యంతో హాగరును వాడుకుని కుమారుని కన్నారు. అబ్రాహాము శారాలు అనేక సంవత్సరాలు కనిపెట్టిన తరువాత దేవుని వాగ్దానప్రకారం ఇస్సాకు పుట్టాడు (ఆది 15:4; 17:16-17; 21:1-3). 

4:24-26 తాను ఈ సంగతులు అలంకార రూపకముగా చెబుతున్నానని పౌలు అన్నాడు. సుదీర్ఘమైన రూపకాలంకార వివరణలో ఒక పక్క నిబంధనలు పోలిక (ఎ) మోషే ధర్మశాస్త్రం పొందిన సీనాయికొండ, (బి) ఇష్మాయేలు తల్లియైన హాగరు, (సి) ప్రస్తుతమందున్న యెరూషలేము, అబద్ధ బోధకులు ఇక్కడి నుండే సిరియాలోని అంతియొకయకు, గలతీయకు వచ్చారు (2:11-13), పోలికలో ఈ పార్శ్వం ధర్మశాస్త్రం ద్వారా ఆధ్యాత్మిక బానిసత్వాన్ని సూచిస్తుంది. పోలికలో మరొక పార్శ్వం కొత్త ఆకాశములు కొత్త భూమిలో మాత్రమే పూర్తిగా నెరవేరే (ప్రక 21:2;21:9-22:5) యూదుల నిరీక్షణ అయిన పైనున్న యెరూషలేము. ఆసక్తికరంగా ఇక్కడ శారాను కాకుండా "పైనున్న యెరూషలేము”ను తల్లిగా పిలుస్తున్నాడు.

4:27 యెషయా 54:1 నుండి పేర్కొన్న ఈ వచనం, ధర్మశాస్త్రాన్ని ధిక్కరించినందుకు న్యాయంగా శిక్షించబడిన వారికంటే చెర తర్వాత పుట్టిన పిల్లలు మరింత ధన్యులు, సంఖ్యలో అధికులు అని చెబుతున్నది. దీని భావమేమంటే ధర్మశాస్త్రం మీద ఆధారపడే వారి స్థానాన్ని ఇప్పుడు సంఘమూ, ధర్మశాస్త్ర ప్రమేయం లేని దాని సువార్త భర్తీ చేస్తున్నాయి.

4:28-30 గలతీయ సంఘంలో ఉన్నవారు తన ఆలోచనను అంగీకరించి తమను తాము వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమని (అంటే క్రీస్తులో విశ్వాసం ద్వారా అబ్రాహాము సంతానమని; 3:29) కనపరచుకుంటారని పౌలు ఆశించాడు. కానీ ఆది 21:9-10లో ఇష్మాయేలు ఇస్సాకును హింసించినట్లే, యూదా బోధకులు కూడా నిజమైన క్రైస్తవులను హింసిస్తారని ఎదురు చూడవచ్చు. తన విరోధులు చివరికి దేవుని ప్రజల నుండి చెరగా పరవాసానికి వెళ్ళిపోతారనీ, తన ఆలోచనా విధానమే చివరికి తన స్వాసాన్ని పొందుతుందనీ పౌలు నమ్మకంగా ఉన్నాడు.

4:31 పౌలు తనను, గలతీయులను ఇస్సాకు, అతని సంతానమైన యూదుల పక్షంగా ఉంచుకొని, తన విరోధులను దాసి కుమారులుగా, అంటే యూదేతరులుగా పేర్కొంటున్నాడు. 


Shortcut Links
గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |