Ezekiel - యెహెఙ్కేలు 37 | View All

1. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా

2. యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి.

3. ఆయన నరపుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని.

4. అందుకాయన ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము ఎండి పోయిన యెముకలారా, యెహోవామాట ఆలకించుడి.

5. ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను;
ప్రకటన గ్రంథం 11:10-11

6. చర్మము కప్పిమీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడునేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

7. ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించు చుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను.

8. నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను.

9. అప్పడు ఆయన నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.
ప్రకటన గ్రంథం 7:1

10. ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.

11. అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతివిు అని యనుకొనుచున్నారు

12. కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను.
మత్తయి 27:52-53

13. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా

14. నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.
1 థెస్సలొనీకయులకు 4:8

15. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

16. నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారి దనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలువారి దనియు వ్రాయుము.

17. అప్పుడది యేకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక యగును.

18. ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా

19. ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారితోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను.

20. ఇట్లుండగా వారి కీలాగు చెప్పుము

21. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి

22. వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద

23. వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయ క్రియలవలనగాని యే అతి క్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.
తీతుకు 2:14

24. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు.
యోహాను 10:16

25. మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.

26. నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.
హెబ్రీయులకు 13:20

27. నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.
2 కోరింథీయులకు 6:16, ప్రకటన గ్రంథం 21:3

28. మరియు వారి మధ్య నా పరిశుద్ధస్థలము నిత్యము ఉండు టనుబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్య జనులు తెలిసికొందురు.బైబిల్ అధ్యయనం - Study Bible
37:1 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అనే ఉపోద్ఘాతపు పదజాలం ఒక కొత్త విషయాన్ని సూచిస్తుంది. శక్తిని సూచించడం కోసం “హస్తము” అనే పదాన్ని సాదృశ్యంగా ఉపయోగించడం లేఖనంలో పలుచోట్ల కన బడుతుంది. యెహోవా హస్తం ప్రవక్త మీదకు రావడం ప్రవక్త దేవుని ప్రచండ శక్తిచేత ఆవరించబడి ఆయన స్వాధీనంలో ఉండి మాట్లాడుతున్నాడని తెలియజేస్తుంది. యెహెజ్కేలును దేవుని శక్తి ఆవరించేలా “యెహోవా హస్తము” అతని మీదకు రావడం గురించి 1:3; 3:14; 8:1; 40:1 చూడండి. దేవుని ఆత్మ శక్తి యెహెజ్కేలును వేరొక చోటుకు తరలించడం గురించి 3:14; 8:3; 11:1,24; 43:5 చూడండి, ఇది దర్శనపూర్వకమైన ప్రత్యక్షత ప్రారంభమవుతోందని సూచిస్తుంది. - యాజకత్వంలో తర్ఫీదు పొందిన ఇశ్రాయేలీయుడిగా... యెహెజ్కేలుకు శవం విషయంలో ఏం చేయాలో బాగా తెలుసు. పాతిపెట్టబడని అస్థి పంజరాలు అసంఖ్యాకంగా కనబడి (యెముకలతో నిండియున్న) అవిధేయతకు వచ్చే తీర్పు శాపాలు ఎటువంటివో యెహెజ్కేలుకు గుర్తుచేస్తున్నాయి (ద్వితీ 28:26). 

37:2 యెముకలు కేవలము ఎండిపోయి ఉండడం - మనుషులు చాలా కాలం కిందటే మరణించారని తెలియ జేస్తుంది. అందుచేత, ఇక వాటిలోకి ఊపిరి ప్రవేశించడం సాధ్యమయ్యేది కాదని స్పష్టంగా తెలుస్తుంది (1రాజులు 17:17-24; 2రాజులు 4:18-37; 2రాజులు 13:21 చూడండి). ఎండిన యెముకలు బైబిల్ లోని ఇతర వాక్యభాగాల్లో కృంగిన మనస్సుకు సాదృశ్యం (సామె 15:30; 17:22). 

37:3 మృతులను సజీవులుగా పైకి లేపే శక్తి దేవునికుందని యెహెజ్కేలుకు తెలుసు (1రాజులు 17:17-24, 2రాజులు 4:18-37; యెషయా 26:19; దాని 12:1-2). అయితే, ఈ ఎముకలు పూర్తిగా ఎండిపోయాయి, వాటి మీద మాంసం లేనే లేదు. ఇలాటి అస్థిపంజరంలో ఊపిరిని పంపించడం అసాధ్యం (యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా?). 

37:4-6 ఒక శరీరంలో జీవాత్మనుంచగా అది బ్రతుకుతుంది. (కీర్తన 119:25; యోహాను 6:63 చూడండి). 

37:7-9 జీవాత్మ... నలుదిక్కులనుండి అనే పదజాలం ఆత్మ పూర్ణశక్తితో ఊపిరి నింపడాన్ని సూచిస్తుంది. ఈ దృశ్యం సృష్టి వృత్తాంతాన్ని గుర్తుచేస్తుంది, అక్కడ దేవుని ఆత్మ జలాల మీద అల్లాడుతుండగా భూమి నివాసయోగ్యమైన స్థలంగా మారింది (ఆది. 1:2).

37:10 ఈ ప్రక్రియలోని రెండు దశలు- భౌతిక శరీరాన్ని రూపొందించడం, దానిలోకి జీవాత్మను నింపడం-ఆది. 2:7లో దేవుడు ఆదామును సృష్టించిన క్రమంలో ఉన్నాయి. హతులైన వీరు... వారిమీద ఊపిరి విడువుము అనే మాటల్లో కనబడే క్రియాపదమే (హెబ్రీ. నఫాఖ్), ఆది 2:7లోని “వాని నాసికా రంధ్రములలో... ఊడగా” అనే పదజాలంలోనూ కనబడుతూ ఈ రెండు వృత్తాంతాల సమన్వయాన్ని స్పష్టీకరిస్తుంది. ఈ రెండు వృత్తాంతాల్లోనూ జీవాత్మ ప్రవేశించేవరకు శరీరాలు సజీవులై లేచి నిలబడలేదు (వాయువు, ఊపిరి, ఆత్మ - ఈ పదాలన్నీ హెబ్రీ, గ్రీకు, రెండు భాషల్లోను ఒకే భావం కలిగి ఉన్నాయి).

37:11 ఈ యెముకలు అనే మాటలు ఇశ్రాయేలీయులనందరిని వారి స్వదేశంలో పునరుద్ధరించడాన్ని సూచిస్తున్నాయి.

37:12-13 దేవుడు ఈ దర్శన వివరణను కొనసాగిస్తూ, ఎండిన యెముకలు సజీవులై లేచి వచ్చిన సందర్భానికి కొత్త కోణాన్ని జోడిస్తున్నాడు. దేవుడు సమాధులను నేను తెరచెదను అని ప్రకటిస్తున్నాడు. దేవుడు మృతుల సమాధులలోనుండి సజీవుల్ని బయటికి రప్పించడం జాతి పునరుద్ధరణ వాస్తవమనే విషయాన్ని ప్రదర్శనాత్మకంగా తెలియజేస్తుంది. దర్శనంలోని సంఘటనలు అద్భుత రీతిలో జరిగినట్లుగానే ఇశ్రాయేలు పునరుద్దరణ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇశ్రాయేలు నూతనజీవం దేవుని శక్తిమీద ఆధారపడి ఉందని ఈ దర్శనం తెలియజేస్తుంది.

37:14 మృతుల్ని బ్రతికించిన సంఘటనలు ఏలీయా పరిచర్యలోను ఎలీషా పరిచర్యలోను ఉన్నాయి (1రాజులు 17:17-24; 2రాజులు 4:18-37; 13:20-21). ఆత్మ జరిగించే కార్యం మీద దృష్టి కేంద్రీకరించడం 36:27 లోని ప్రకటన యొక్క అర్థాన్ని విపులీకరిస్తుంది. మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను అనే ప్రకటన నిర్గమ వృత్తాంతంలోని, కనాను విజయంలోని అంశాన్ని గుర్తుచేస్తుంది. క్రీస్తును విశ్వసించినవారి నూతన సమాజంలో ఇశ్రాయేలీయులు భాగం కావడాన్ని "మృతులు సజీవులైనట్టే అగును” అని పౌలు చెప్పిన మాటలను( రోమా 11:15) కూడా ఇది వివరిస్తుంది. ఈ ప్రవచనం నెరవేర్పు, నేడు యూదులు ఇశ్రాయేలులో నివసించడం గురించి కాదు, క్రీస్తు రాకడలో (మత్తయి 24:30-31). క్రీస్తును నమ్మిన ఇశ్రాయేలీయులందరిని దేశంలో తిరిగి సమకూర్చినప్పుడు (యిర్మీయా 31:33; 33:14-16) ఈ ప్రవచనం సంపూర్ణంగా నెరవేరుతుంది.

37:15-16 ఈ వచనాల్లో ఒకటి అనే పదం ముఖ్యమైంది, ఇది 15-28 వచనాల్లో పదిసార్లు కనబడుతుంది. కఱ్ఱతునక గోత్రానికి ప్రతీకగా ఉండడం గురించి సంఖ్యాకాండము అధ్యా. 17 చూడండి.

37:17 అతికించబడిన రెండు కఱ్ఱముక్కలు యేకమైన తునకలాగా కనబడతాయి. యెహెజ్కేలు సమకాలీనుడైన యిర్మీయా కూడా ఇశ్రాయేలు పునరైక్యమైన ప్రవచనాత్మక దర్శనాన్ని చూడడం జరిగింది. (యిర్మీయా 3:12,14, 31:2-6; చూడండి; యెహె 4:4-8, 16:53 లతో పోల్చండి). ఇశ్రాయేలు గురించి ఉన్న ప్రవచనాలన్నిటిలోను మౌలికమైన అంశం ఇశ్రాయేలు ఐక్యం కావడం, దేవుని ప్రజల మధ్య పగుళ్ళు బాగుపడి సమష్టి సమాజం ఏర్పడడం (యెషయా 11:12-13). ఉత్తర గోత్రాలింకా ఉన్నాయని ప్రవక్తలు గుర్తిస్తున్నారు. అయితే చెదరిపోయిన గోత్రాల విషయం తెలియడం లేదు (యెషయా 43:5-7; 49:5-6; యిర్మీయా 3:12-15). ఉత్తర గోత్రాలనుండి ఇశ్రాయేలీయులు దక్షిణాన ఉన్న యూదా రాజ్యంలోకి, మరీ ముఖ్యంగా సంక్షోభం ఏర్పడిన కాలంలో (2దిన 15:9; 30:11,18) రావడం జరిగింది. 

37:18-19 సొలొమోను మరణం తర్వాత వేరైన రెండు రాజ్యాల్ని దేవుడు పునరైక్యం చేస్తున్నాడు (1రాజులు 12). పునరైక్యత గురించి ఇతర ప్రవచనాలకు యిర్మీయా 3:18; 23:5-6; హోషేయ 1:11; ఆమోసు 9:11 చూడండి. దావీదు వంశంనుండి వచ్చిన రాజు ఇశ్రాయేలును యూదాను ఐక్యం చేయనున్నాడని తెలియజేయడానికి యెషయా ఎదిగి ఫలించే వృక్షాన్ని సాదృశ్యంగా ఉపయోగించాడు (యెషయా 11 అధ్యా.) 

37:20-23 ఇశ్రాయేలు యూదాలు దేవుని రాజ్యంగా, అంటే దేవుని పరిశుద్ధ ప్రజల రాజ్యంగా మారబోతున్నాయి. వ.23 లోని నిబంధనా పూర్వకమైన సూత్రీకరణను చూడండి (11:20; 14:11; 37:27; యిర్మీయా 24:7; 31:1,33; 32:38; జెకర్యా 8:8; 13:9; 2 కొరింథీ 6:16; హెబ్రీ 8:10 చూడండి).

37:24 - " సేవకుడైన” అనే పదం మెస్సీయ గురించి ఉన్న ప్రవచనాల్లోని విశిష్టమైన లక్షణం. దావీదు వారసత్వానికి ప్రతీకగా ఉన్న నా సేవకుడైన దావీదు వారికి రాజవును (2సమూ 7:5,8; కీర్తన 89:20 తో పోల్చండి) అనే పదజాలం జాతిసమైక్యత సుస్థిరమవుతుందని, చెరలోకి వెళ్ళక పూర్వం వారి చరిత్రలోని నిందాస్పదమైన వాటిని దూరం చేస్తుందని తెలియజేస్తుంది. కొత్త రాజు. ద్వితీ 17:14-20 వచనాల్లోని ఆదర్శవంతమైన గుణాలన్నీ కలిగి ఉండి, యెహోవా అధికారానికి లోబడతాడు. గోత్రాలన్నీ పునరైక్యం కావడం మెస్సీయ గురించి నిరీక్షణ నింకా పెంపొందిస్తుంది (37:25-28; రోమా 11:25-36 తో పోల్చండి).

37:25-28 ఈ వచనాల్లోని కొత్త నిబంధన సమాధానార్థమైన నిబంధన అని, నిత్య నిబంధన అని పిలవబడింది. 


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |