Revelation - ప్రకటన గ్రంథము 3 | View All

1. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే

2. నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.

3. నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.

4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.

5. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
నిర్గమకాండము 32:33, కీర్తనల గ్రంథము 69:28, దానియేలు 12:1

6. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

7. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతులేవనగా
యోబు 12:14, యెషయా 22:22

8. నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయ నేరడు.

9. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.
యెషయా 43:4, యెషయా 45:14, యెషయా 49:23, యెషయా 60:14

10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.

11. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.

12. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
యెషయా 62:2, యెషయా 65:15, యెహెఙ్కేలు 48:35

13. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

14. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా
కీర్తనల గ్రంథము 89:37, సామెతలు 8:22

15. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.

16. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.

17. నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
హోషేయ 12:8

18. నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.

19. నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
సామెతలు 3:12

20. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.

21. నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

22. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.బైబిల్ అధ్యయనం - Study Bible
3:1 సంఘపు దూత గురించి 1:20 నోట్సు చూడండి. తుయతైరకు 30 మైళ్ళు ఆగ్నేయంగా ఉన్న సాఫ్టస్, చిన్నాసియాలో సుమారు క్రీ.పూ.1200 సం||లో స్థాపించబడి ప్రసిద్ధిచెందిన ప్రాచీన పట్టణాలలో ఒకటి. క్రీ.శ. 17లో ఒక భూకంపం సారీను (ఫిలదెల్ఫియాను కూడా, వ.7 నోట్సు చూడండి) నేలమట్టం చేసింది. కానీ తిబెరియ చక్రవర్తి సహకారంతో దాన్ని పునర్నిర్మించారు. సాఫ్ట్స్ ప్రజలు మరణం, నిత్యత్వం, ప్రాకృతిక సంతానోత్పత్తి చక్రాలు, దాని దేవతయైన అర్తెమి ఆరాధన అనేవాటితో బాగా ఆకర్షితులయ్యేవారు. దేవుని యేదాత్మలు గురించి 1:4 నోట్సు చూడండి. ఏడు నక్షత్రములు గురించి 1:16 నోట్సు. చూడండి. సాఫ్టస్ సంఘాన్ని ప్రభువు మెచ్చుకోలేదు. ఆయన విమర్శ మాత్రం వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఆత్మీయంగా వారు మృతులతో సమానంగా ఉన్నారు. 

3:2 ప్రభువు ఈ ఉత్తరాన్ని ఒక అత్యవసర ఆధ్యాత్మిక మేలుకొలుపుగా ఇవ్వాలనుకున్నాడు. సాఫ్టస్ సంఘం ఆధ్యాత్మికంగా మిగిలి వున్నవాటిని బలపరచుకోకపోతే, వారు చావగలరు, ఎందుకంటే వారు దేవున్ని ఘనపరచే క్రియలు జరిగించలేదు. 

3:3 సార్ట్స్ సంఘం దేవుని ఆశీర్వాదాలను జ్ఞాపకము చేసికొని, మారుమనస్సు పొందకపోతే క్రీస్తు దొంగవలె త్వరగా, కఠినమైన తీర్పుతో వస్తాడు. పట్టణపు చరిత్ర చూస్తే అది దాని శత్రువులను జాగ్రత్తగా కనిపెట్టడంలో విఫలం కావడం వలన రెండుసార్లు ఆక్రమణకు గురైంది. 

3:4-5 కొందరు సారీలో ప్రభువుకు నమ్మకస్తులుగా మిగిలారు. తెల్లని వస్త్రములు ధరించుకోవడం అంటే, పరలోకానికి (7:9), క్రీస్తు రెండవ రాకడలో (19:14) ఆయనతోపాటు తిరిగివచ్చే అర్హత కలిగిన జయించువాడు ధరించే వస్త్రాలను ధరించడం (2:7 నోట్సు చూడండి). నిత్యత్వానికి ఎన్నుకొనబడిన ప్రతి ఒక్కని పేరు జీవ గ్రంథములో ఉంటుంది. (13:8; 20:15). వీరు తమను తాము జయించువారుగా నిరూపించుకుంటారు, క్రీస్తు వీరి పేర్లు జీవ గ్రంథంనుండి ఎన్నడూ చెరిపివేయడు. 

3:6 చెవిగలవాడు వినును గాక గురించి 2:7 నోట్సు చూడండి. 

3:7 సంఘపు దూత గురించి 1:20 నోట్సు చూడండి. సారీకు ఆగ్నేయంగా నలభై మైళ్ళ దూరంలో ఉన్న ఫిలదెల్ఫియ, క్రీ.శ.17లో వచ్చిన భూకంపంవల్ల సుదీర్ఘ ప్రభావంతో కూడిన శ్రమపొందింది. కాబట్టి ప్రజలు భవిష్యత్తును గూర్చి ప్రణాళిక చేసుకున్నపుడు, భూకంపాలను దృష్టిలో పెట్టుకున్నారు. పట్టణంలో యూదుల సమాజం గురించి బైబిలేతర సాహిత్యంలో చాలా తక్కువ ఆధారాలు ఉన్నప్పటికీ, స్ముర్నలో ఉన్న పరిస్థితినే ఈ పత్రిక సూచిస్తుంది. సంఘారంభం గురించి ఏమీ తెలియదు గాని మిగిలిన ఆరు స్థానిక సంఘాల్లాగా, ఎఫెసులో పౌలు పరిచర్యకు దీనికి సంబంధం ఉంది. దావీదు తాళపు చెవి... ఎవడును తీయలేకుండ అనే మాటలు, యెషయా 22:22ను ప్రతిధ్వనిస్తూ, దేవుని కుటుంబంలో క్రీస్తు అధికారాన్ని గురించి చెప్తున్నాయి. 

3:8 ఈ చిన్న సంఘపు శక్తి కొంచెమైయుండినను, దాని నమ్మకమైన క్రియలను క్రీస్తు మెచ్చుకున్నాడు. ఎవడును వేయనేరకుండా ఒక తలుపు దేవుని రాజ్యా నికి, పరలోకానికి తెరవబడి వుంది (కొలస్సీ 4:2-4). 

3:9 సాతాను సమాజపు వారు, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొనువారిని గురించి 2:9-10 నోట్సు చూడండి. ఈ మాటలు 2:9 క్రమానికి విరుద్దంగా ఉన్నాయి, అంటే ఈ రెండు పత్రికలలో కొన్ని ముఖ్యమైన పోలికలు ఉన్నాయని అర్థం. స్ముర్న సంఘం ఎదుర్కొనే కొద్దికాలపు స్థానిక “శ్రమ"కు (2:10), లోకమంతటికీ రాబోయే "శోధన కాలము"లో ఫిలదెల్ఫియా సంఘం కాపాడబడుతుందనే వాగ్దానాన్ని పోల్చి చూడండి (3:10). 

3:10 శోధన కాలము "మహా శ్రమలను" (7:14) సూచిస్తుంది. ఆ కాలంలో లోకంలో నివసించే వారందరికీ అన్నట్లుగా మాటలు అనిపించినా, భూ నివాసులను అనే మాట ప్రకటన గ్రంథంలో పదే పదే ఉపయోగించబడింది (6:10; 8:13; 11:10; 13:8), అందులో ఎన్నిక చేయబడని వారిని “ఎవరి పేర్లు జీవగ్రంథములో రాయబడి వుండలేదో” అని చెప్పారు (17:8). "శోధన కాలములో... కాపాడెదను” అంటే: (1) శ్రమ కాలానికి ముందే తొలగింపబడడం అనీ లేక (2) శ్రమ కాలములోనే అద్భుతంగా సంరక్షిస్తాననే రెండు అర్థాలు ఉండవచ్చు. కాలము అనేది కొంత కాలాన్ని సూచిస్తుంది, శోధన కాలపు ఉద్దేశం విశ్వాసులను కాక, “భూనివాసులలో" ఎన్నిక చేయబడనివారిని శోధించడం. ఈ మహా శ్రమ కాలం ఆరంభమయ్యే కాలానికి ముందే విశ్వాసులు భూమిమీద నుండి తీసివేయబడతారని సాధారణంగా అంగీకరించబడింది.

3:11 త్వరగా వచ్చుచున్నాను గురించి 1:1,3 నోట్సు చూడండి. నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము అనే మాటలు వ.8లో వివరించబడిన సంఘపు నమ్మకత్వాన్ని గూర్చి సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. 

3:12 జయించువానికి (2:7 నోట్సు చూడండి) దేవుని నిత్యపట్టణమైన నూతనమైన యెరూషలేములోని ఆలయములో శాశ్వతస్థానం వాగ్దానం చేయబడింది. నిజానికి ప్రభువు, గొట్టెపిల్లే ఈ "ఆలయం" (21:2,22). క్రీస్తు క్రొత్త పేరు “ఆయనకేగాని మరి ఎవనికిని తెలియని” పేరును సూచిస్తుండవచ్చు (19:12). 

3:13 చెవిగలవాడు వినునుగాక గురించి 2:7 నోట్సు చూడండి. 

3:14 సంఘపు దూత గురించి 1:20 నోట్సు చూడండి. ఎఫెసుకు తూర్పుగా 90 మైళ్ళదూరంలో, ఫిలదెల్ఫియకు ఆగ్నేయంగా 45 మైళ్ళ దూరంలో ఉన్న లవొదికయ ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. ఫిలదెల్ఫియ లాగా అది భూకంపాలు సంభవించే ప్రదేశంలో ఉంది. ఈ పట్టణం తనకు కావల్సిన నీళ్ళు ఒక ఆనకట్టద్వారా తెచ్చుకుంటుంది. అది దాని శత్రువుల ద్వారా కరవు కలిగించడానికి అవకాశమిచ్చేదిగా ఉంది. ఎఫెసులో పౌలు మూడు సంవత్సరాల పరిచర్య కాలంలో (అపొ.కా.19:8-10; 20:31), హియెరాపొలి, కొలస్సీ సంఘాలతోపాటు, లవొదికయ సంఘం బహుశా ఎపఫ్రా స్థాపించి వుంటాడు (కొలస్సీ 1:7). ఆమేన్ అనే మాట “సత్యము” అనే హెబ్రీపదానికి లిప్యంతరీకరణ. దేవుని సృష్టికి ఆదియునైనవాడు అంటే సృష్టికి కారణమైన త్రిత్వములోని వ్యక్తులలో యేసు ఉన్నాడని అర్థం (యోహాను 1:3; కొలస్సీ 1:16). 

3:15-16 లవొదికయలోనికి వచ్చే నీళ్ళు గొట్టాల ద్వారా వచ్చేవి కాబట్టి అవి తాజాగా చల్లగానైనను లేక చికిత్సావసరమైన వెచ్చగానైనను ఉండేవి కావు. అవి నులివెచ్చగా ఉండి నిరుపయోగంగా ఉండేవి. లవొదికయ సంఘంలోని ఆత్మీయ నియోజకత్వం క్రీస్తుకు వికారం కలిగించింది. (నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను). 

3:17-19 లవొదికయ సంఘంలోని అనేకమంది విశ్వాసులు ధనవంతులు, అహంకారులు కావడం వలన వారు ఆధ్యాత్మికంగా దరిద్రులు, దిగంబరులు అనే సత్యానికి వారు పూర్తిగా గ్రుడ్డివారుగా ఉన్నారు. వారు ఆసక్తి కలిగి మారుమనస్సు (2:5 నోట్సు చూడండి) పొంది, ఆధ్యాత్మికంగా నులివెచ్చగా
లేకుంటేనే క్రీస్తు వారికి ఆధ్యాత్మిక దృష్టిని ఇచ్చి, వారిని ఆధ్యాత్మికంగా ధనవంతులుగా చేసి, సరియైన వస్త్రములు ఇవ్వగలుగుతాడు. నేను ప్రేమించు వారినందరినీ శిక్షించుచున్నాను అనే మాటలు హెబ్రీ 12:6 లో పేర్కొన్నట్లు, సామె 3:11-12 ను ప్రతిధ్వనిస్తున్నాయి. 

3:20 లవొదికయ సంఘంలో నుండి ప్రభువును బయటకు నెట్టివేశారు. వారు మారుమనస్సు పొందడం ద్వారా ఆయన మరల లోనికి ప్రవేశించడానికి చూస్తున్నాడు (తలుపు తీసినయెడల). 

3:21 జయించువానిని గురించి 2:7 నోట్సు చూడండి. క్రీస్తుతోపాటు ఆయన సింహాసనమునందు కూర్చుండనివ్వడం అనేది మత్తయి 19:28లో అపొస్తలులకిచ్చిన వాగ్దానాన్ని దాటి, ప్రక 20:4-6 లోని భూమిపై ఆయన పాలనవైపు చూస్తుంది. నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండుట అనే మాటలు అధ్యా. 4-5 లో ఉన్న సింహాసనాసీనుని గదిని సూచిస్తున్నాయి. 

3:22 చెవిగలవాడు వినును గాక గురించి 2:7 నోట్సు చూడండి. 


Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |