Ezekiel - యెహెఙ్కేలు 23 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన యిద్దరు స్త్రీలు కలరు.

3. వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, ¸యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.

4. వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.

5. ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి

6. తన విటకాండ్రమీద బహుగా ఆశ పెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల ¸యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్టూరువారిని మోహించెను.

7. అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు, అపవిత్రురాలాయెను.

8. మరియఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.

9. కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించి యున్నాను.

10. వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను.

11. దాని చెల్లెలైన ఒహొలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్కచేసిన జారత్వములకంటె మరి ఎక్కువగా జారత్వము చేసెను.

12. ప్రశస్త వస్త్ర ములు ధరించినవారును సైన్యాధిపతులును అధికారులును గుఱ్ఱములెక్కు రౌతులును సౌందర్యముగల ¸యౌవనులును అగు అష్షూరువారైన తన పొరుగువారిని అది మోహించెను.

13. అది అపవిత్రురాలాయెననియు, వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను.

14. మరియు అది యధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై, మొలలకు నడికట్లును తలలమీద చిత్రవర్ణము గల పాగాలును పెట్టుకొని రాచకళలుగలవారై

15. సిందూరముతో పూయబడి గోడమీద చెక్కబడినవారై, తమ జన్మదేశమైన కల్దీయులదేశపు బబులోను వారివంటి కల్దీ యుల పటములను చూచి మోహించెను.

16. అది వారిని చూచినవెంటనే మోహించి కల్దీయదేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా

17. బబులోను వారు సంభోగము కోరివచ్చి జారత్వముచేత దానిని అపవిత్ర పరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడిన తరువాత, దాని మనస్సు వారికి యెడమాయెను.

18. ఇట్లు అది జారత్వము అధికముగాచేసి తన మానాచ్ఛాదనము తీసి వేసికొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోను ఆశాభగ్నుడ నైతిని.

19. మరియు ¸యౌవనదినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చెను.

20. గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విట కాండ్రయందు అది మోహము నిలుపుచుండెను.

21. యౌవనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి.

22. కావున ఒహొలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విట కాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను.

23. గుఱ్ఱములనెక్కు బబులోనువారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులను సౌందర్యముగల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరిని నీమీదికి నేను రప్పించు చున్నాను.

24. ఆయుధములు పట్టుకొని చక్రములుగల రథములతోను గొప్ప సైన్యముతోను వారు నీమీదికి వచ్చి, కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీమీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు, వారు తమ మర్యాదచొప్పున నిన్ను శిక్షించునట్లు నేనునిన్ను గూర్చిన తీర్పు వారికప్పగింతును.

25. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును, నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు, నీలో శేషించినవారు ఖడ్గముచేత కూలుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు, నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు.

26. నీ బట్టలను లాగి వేసి నీ సొగసైన నగలను అపహరించుదురు.

27. ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తుదేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండ ఈలాగున మాన్పించెదను.

28. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను.

29. ద్వేషముచేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును.

30. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును; నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను.

31. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ అక్క పానము చేసిన, లోతును వెడల్పునుగల పాత్రలోనిది నీవును పానము చేయవలెను.

32. అందులో పానము చేయ వలసినది చాల యున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను.

33. నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలో నిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు.

34. అడుగుమట్టునకు దాని పానముచేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు; నేనే మాటయిచ్చియున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

35. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు.

36. మరియయెహోవా నాకీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, ఒహొలాకును ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము.

37. వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్టించిరి.

38. వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి.

39. తాము పెట్టు కొనిన విగ్రహముపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్ర పరచి, నామందిరములోనే వారీలాగున చేసిరి.

40. మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి; వారు రాగా వారికొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుకపెట్టుకొని ఆభరణములు ధరించు కొని

41. ఘనమైన మంచముమీద కూర్చుండి బల్లను సిద్ధ పరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి.

42. ఆలాగున జరుగగా, అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహముయొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారియొద్దకు ఎడారి మార్గమునుండి వచ్చిరి, వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి.

43. వ్యభిచారము చేయుటచేత బలహీనురాలైన దీనితో నేనీలాగంటిని అది మరెన్నటికిని వ్యభిచారముచేయక మానదు.

44. వేశ్యతో సాంగత్యముచేయునట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు, ఆలాగుననే వారు కాముకురాండ్రయిన ఒహొలాతోను ఒహొలీబాతోను సాంగత్యము చేయుచువచ్చిరి.

45. అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు; వారు వ్యభిచారిణులే, నరహత్యచేయ యత్నించుదురు.

46. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా వారిమీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును.

47. ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గముచేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి యిండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు.

48. స్త్రీలందరు మీ కామాతురతచొప్పున చేయకూడదని నేర్చుకొనునట్లు మీ కామాతురతను దేశములో నుండకుండ మాన్పించుదును.

49. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు.



బైబిల్ అధ్యయనం - Study Bible
23:1-2 ఇశ్రాయేలును దేవునికి వధువుగా, అభివర్ణించడం పరిపాటి (యిర్మీయా 2-3; - హోషేయ 1-3), అయితే ఇక్కడ యెహెజ్కేలు షోమ్రోను(సమరయ)ను, యెరూషలేమును వర్ణించడానికి వేశ్యలను (యిద్దరు స్త్రీలు) సాదృశ్యంగా ఉపయోగిస్తున్నాడు. భావసూచక కథనమైన మరొక వాక్యభాగమైన అధ్యా, 16 యూదా విగ్రహారాధనను ప్రధానంగా తెలియజేస్తుంది. అధ్యా. 23 యూదా విగ్రహారాధనతోపాటుగా అనైతికమైన రాజకీయ - పొత్తుల గురించి - నొక్కి చెప్తుంది. అధ్యా, 16లో ఇశ్రాయేలు అన్యదేవతలను, అన్యదేశాల్ని నమ్ముకుంది.

23:3 లేవీయకాండము, ద్వితీయోపదేశకాండము లోని న్యాయవిధులు, కట్టడల ప్రకారం, వ్యభిచారం, వేశ్యావృత్తి రెండూ దేవునికి హేయమైనవే, రెండింటికి వచ్చే తీర్పు మరణశిక్ష (లేవీ 19:29; 20:10; 21:9; ద్వితీ 23:17). వ్యభిచారపాపంతో నిండిన పట్టణాలు నాశనం చేయబడతాయి. 

23:4 పెద్దదాని అనే పదం - షోమ్రోను(సమరయ)ను సూచిస్తుంది, ఇది యెరూషలేముకంటె ముందుగా విగ్రహ పూజలతోను ఇతర దేశాలతో రాజకీయ పొత్తులతోను నిండిపోయింది. చెర విషయంలో కూడా ఇది యెరూషలేము కంటే ముందు ఉంటుంది. వీరు నాకు పెండ్లి చేయబడినవారై అనే పదజాలం 16:8-13 వచనాల్ని గుర్తుచేస్తున్నాయి. ఒహోలా, ఒహోలీబా అనే పేర్లు హెబ్రీలోని ఓహెల్ (గుడారం) అనే నామవాచకానికి సంబంధించినవి, ఇవి ఆయా పట్టణాలెలా ఉన్నాయో సూచించే పేర్లు. ఈ పేర్లు ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణాల్లో గుడారాల్లో నివసించిన కాలాన్ని, సుదీర్ఘకాలంగా వారిలోని మత భ్రష్టతను, విగ్రహారాధననుబట్టి వారు శిక్ష ననుభవించడాన్ని నొక్కి చెబుతున్నాయి. ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణాల్లో దేవుడు వారిని కలుసుకోడానికి ఏర్పాటైన ప్రత్యక్ష గుడారానికి, ఈ పేర్లకు మధ్య సంబంధం ఉండవచ్చు. యెరూషలేమును పిలిచిన ఒహోలీబా అనే పేరుకు “అది నా గుడారము” అని అర్థం. దేవాలయం దేవుని నివాసస్థలమనీ, అంటే యెరూషలేము దేవునికి నివాసస్థలంగా ఉన్నదనీ సూచిస్తుండవచ్చు (2 సమూ 6:17; 1రాజులు 8:4; కీర్తన 48:1-14).. ఈ అక్కచెల్లెళ్ల (షోమ్రోను, యెరూషలేము) తల్లి ప్రస్తావన ఈ రెండింటి మూలం గతంలోని ఐక్య ఇశ్రాయేలు. అని నొక్కి చెబుతున్నది. షోమ్రోను ఉత్తర రాజ్యానికి, యెరూషలేము దక్షిణ రాజ్యానికి ముఖ్యపట్టణాలు.

23:5-9 "వ్యభిచరించుచు" అనే పదం అధ్యా. 16లో లాగా విగ్రహారాధనను కాక (వ.15), ఇక్కడ అన్యదేశాలతో రాజకీయ పొత్తుల్ని సూచిస్తుంది. ఇశ్రాయేలు భద్రత, సహాయం కోసం దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులు, అన్యదేశాల మద్దతు కోరుకోవడం దేవునికి ఏవగింపు కలిగించిందని ఈ వచనాలు తెలియ జేస్తున్నాయి.
షోమ్రోను (ఒహోలా) అష్పూరు అధిపతుల మద్దతు కోరుకోవడం గతంలో యెహూ వంశస్థులైన మెనహేము (2రాజులు 15:17-22), హోషేయ (2రాజులు. 17:1-6) అష్కూరుతో సంధి చేసుకోడాన్ని గుర్తుచేస్తున్నాయి. అష్నూరు రాజైన 3వ షల్మనేసరు (సుమారుగా క్రీ.పూ. 841) కాలం నాటి వ్రాతప్రతుల్లోని ప్రక్షిప్తభాగాలు “ఒఘీ కుమారుడైన యెహూ” అషూరు రాజు యెదుట వంగి నమస్కరిస్తున్నట్టుగా తెలియజేస్తున్నాయి. యెహూ అపూరు రాజుకు లోబడడం గురించి బైబిల్ అధ్యయనానికి ఇది లౌకిక చరిత్ర నుండి చారిత్రక ఆధారాల్ని అందిస్తుంది, ఇది చాలా ముఖ్యమైన పురావస్తు శాస్త్ర - పరిశోధన.

23:10 వీరు దాని మానాచ్చాదనము తీసిరి అనే పదజాలం క్రీ.పూ. 722లో షోమ్రోను పతనాన్ని సూచిస్తుంది. 

23:11-13 యెరూషలేము భూమ్మీద ఉన్న ప్రజలందరికీ రక్షణ సందేశాన్నందించడానికి దేవుడప్పగించిన కర్తవ్యాన్ని (ఆది. 12:1-3) స్వీకరించడానికి బదులుగా, ఒక వేశ్యలాగా తన స్వప్రయోజనం కోసం అన్యదేశాలను ఉపయోగించుకుంది. యూదా అష్బూరుతో. (2రాజులు 16:7-9), తర్వాత బబులోనుతో (యెహె. 17:13; 2రాజులు 24:1,17; యెషయా 39:1-8తో పోల్చండి) పొత్తు పెట్టుకుంది. రాజైన ఆహాజు రాజకీయపరంగా ప్రమాదకరమైన అడుగువేస్తూ యూదాను అషూరుకు సామంతరాజ్యంగా అప్పగించడం బహుశా యెహెజ్కేలు మనసులో ఉండి ఉండవచ్చు. యెషయా అతణ్ణి వేడుకున్నట్టుగా విడుదల కోసం రాజైన ఆహాజు దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులు అషూరు సహాయాన్ని ఆశ్రయించాడు. ఈ చర్యతో యూదా తదుపరి శతాబ్దంలో అష్నూరుకు కప్పం చెల్లించే సామంత రాజ్య మైంది (2రాజులు 16:5-9; యెషయా 7).

23:14-19 ఇశ్రాయేలు యింటివారి విగ్రహాల్లాగానే (8:10), రాచకళలు గలవారైన కల్దీయుల చిత్రాలు గోడమీద చెక్కబడినాయి. బైబిల్ కాలంలో గోడలమీద చిత్రపటాల్ని చిత్రించేవారు.

23:20-21 ఐగుప్తుతో సంబంధాలు (మోహము గల తన విటకాండ్రయందు) సొలొమోను కాలంనాటి ఐగుప్తుతో సంబంధాన్ని (1రాజులు 3:1), రాజైన యెహోయాకీము బబులోను వైపు మళ్ళడానికి పూర్వం ఫరో నెకో సహాయాన్ని కోరుకొనడాన్ని (2రాజులు 23:31-24:7) సూచిస్తుండవచ్చు. 

23:22-23 బబులోనీయులకు పర్యాయపదంగా ఉన్న కల్దీయులను అనే పదం మొదట్లో పర్షియా సింధు శాఖకు ఉత్తరంలో నివసించిన ప్రజల్ని సూచించింది. అధికారులను శూరులను మంత్రులను అనే వర్ణన టైగ్రిస్ నదికి తూర్పున నివసించిన అరామీ తెగల్ని సూచిస్తుండవచ్చు. వీరికి బబులోనుతో రాజకీయమైత్రి ఉంది. సుదూర ప్రాంతాల్లో నివసిస్తూ ఎవరికీ తెలియని వీరిని యెహెజ్కేలు ప్రస్తావించడం బహుశా సర్వలోకం యూదాకు వ్యతిరేకంగా ఉన్నారని తెలియచేయడం కోసం అయ్యుండవచ్చు (38-39 అధ్యా.)

23:24-30 దేవుడు తీర్పు తీర్చే పనిని (నిన్ను గూర్చిన తీర్పు) బబులోనుకు, అషూరుకు అప్పగిస్తున్నాడు. విగ్రహాలకున్న చెవులు ముక్కు చెవులను ముక్కును) విరిగిపోవడం మామూలే. వారి పాపం ఐగుప్తు కాలంనాటిది, అంటే వారి ప్రారంభంనాటిది.

23:31-33 బైబిల్లో పాత్ర తటస్థమైన సాదృశ్యపదం, విందు చేసే వ్యక్తి తన అతిథులకు వారి వారి పాత్రల్లో ద్రాక్షారసం పోయడమనే ఆచారం ఈ వర్ణనకు మూలమై ఉండవచ్చు. (కీర్తన 16:5). ఏదేమైనా, మత్తు కలిగించే పాత్రగా (కీర్తన 75:8; యిర్మీయా 25:15-16; విలాప 4:21; హబ 2:15-16) శిక్షాపాత్రగా లేదా ఉగ్రత పాత్రగా (యెషయా 51:17; యిర్మీయా 51:7; ప్రక 17:3-4; 18:6) ఈ సాదృశ్యాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ సాదృశ్యం యొక్క సంపూర్ణమైన భావం యేసులో నెరవేరింది, మనుషులందరి కోసం దేవుని తీర్పు అనే పాత్రను ఆయన ఇష్టపూర్వకంగా స్వీకరించాడు (మార్కు 14:36).

23:34 సంక్షోభ సమయాలలో స్పందనగా రొమ్ము కొట్టుకొనడం మామూలే (యెషయా 32:12; నహూము 2:7). నీ స్తనములను పెరుకుకొందువు అనే మాటలు ఈ వర్ణననింకా తీవ్రతరం చేస్తున్నాయి.

23:35-37 నీవు నన్ను... వెనుకకు త్రోసితివి అనే వర్ణన గురించి 1రాజులు 14:9; నెహెమ్యా 9:26 చూడండి. యెషయా 38:17 వచనంలోని వైరుధ్యాన్ని గమనించండి. 

23:38-39 యెరూషలేములోని పరిశుద్ధ స్థలమును అపవిత్రపర్చడం గురించి అధ్యా, 8 వివరిస్తుంది. ఆరాధనకు అనుమతి లేని బేతేలు దగ్గర షోమ్రోను దేవుణ్ణి ఆరాధించడం, దేవుని నిజమైన మందిరాన్ని అపవిత్ర పర్చడంతో సమానం (1రాజులు 12:25-30). 

23:40-41 పరిమళ ద్రవ్యమును - తైలమును యెహోవాకు చెందినవి మాత్రమే కాక ఇవి బల్యర్పణల్లో ఉపయోగించే పదార్థాలు. 

23:42 త్రాగుబోతులు అనే పదాన్ని "షేవి దేశపు పురుషులు" - అని అనువదించవచ్చు. అరేబియా ద్వీప కల్పానికి (ప్రస్తుత యెమెన్) నైరుతిమూ లన ఉన్న షేబ వర్తకానికి ప్రసిద్ది (27:22; 38:13; 1రాజులు 10:1-10; యోబు 6:19). 

23:43-45 తీర్పు ప్రకటించడానికి ముందు మిగిలిన హేయమైన చర్యలన్నిటినీ వివరించాడు. తలు

23:46 వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా అనే పదాలు నిబంధనలోని ప్రామాణికమైన శిక్షల్ని తెలియజేస్తున్నాయి (లేవీ 26:16-17; ద్వితీ 28:31, 66-67; 32:25) 

23:47 విగ్రహారాధనకు, శిశుబలికి, వ్యభిచారానికి శిక్ష రాళ్లతో కొట్టి చంపడం (లేవీ 20:2; ద్వితీ 13:10; 17:5; 22:21,24). ఇంతకు ముందు యెహెజ్కేలు ప్రకటించిన తీర్పులు కూడా ఇవే (16:40-41). 

23:48 ఇశ్రాయేలీయుల చర్యలు, వాటికి వారనుభవిస్తున్న పర్యవసానాలు అన్యదేశాలకు హెచ్చరికలుగా ఉండాలి. 


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |