Esther - ఎస్తేరు 5 | View All

1. మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, రాజునగరుయొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనముమీద రాజు కూర్చుని యుండెను.

2. రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను.

3. రాజురాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించెదనని ఆమెతో చెప్పగా
మార్కు 6:23

4. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను.

5. ఎస్తేరు మాటప్రకారముగా జరుగునట్లు హామాను చేయ వలయునని త్వరపెట్టుమని రాజు సెలవియ్యగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి.

6. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడునని చెప్పగా
మార్కు 6:23

7. ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాజవైన తమ దృష్టికి నా యెడల దయకలిగి నా మనవి చొప్పునను నా కోరికచొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే

8. రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయు ననెను.

9. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసముగలవాడై బయలువెళ్లి, రాజుగుమ్మముననుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నం దున మొర్దెకై మీద బహుగా కోపగించెను.

10. అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయి తనస్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి

11. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను.

12. మరియు అతడు రాణియైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదు,రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను.

13. అయితే యూదుడైన మొర్దెకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ప్రయోజనమేమియు లేదని అతడు చెప్పగా

14. అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
5:1-2 మూడు రోజుల ఉపవాసంలోని మూడవ దినమున, హఠాత్తుగా రాజు ముందుకు వెళ్ళడానికి ఎస్తేరు తనను తాను సిద్ధపరచుకుంది. ఆమె తన ఉపవాస, దుఃఖ వస్త్రాలు కాక బహుశా తాను నిజానికి పారశీక రాణినని తన భర్తకు జ్ఞాపకం చేయడానికన్నట్లుగా, రాజభూషణములు ధరించి వెళ్ళింది. ఆమెయందు అతనికి దయపుట్టగానే, ఆమె మరణానికి కారణం కావల్సిన పరిస్థితి తిరగబడి ఆమెకొక అవకాశంగా మారింది. 

5:3-4 రాజ్యములో సగము మట్టుకు అని ఎస్తేరుకు అహష్వేరోషు ఇచ్చిన అవకాశం అక్షరార్ధంగా తీసుకోకూడదు; అది రాజు దాతృత్వాన్ని నొక్కిచెప్పడానికి ఉపయోగించిన అతిశయోక్తి (మార్కు 6:23తో పోల్చండి), తనకు వచ్చిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుంటే, రాజు, హామానులు తాను సిద్ధము చేయించిన విందు (హెబ్రీ. "మిల్‌) కు రావాలనే ఆహ్వానంతో కూడిన ఎస్తేరు జవాబు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కథలోని మొదటి విందు ఒక రాణి పతనంతో ముగిసినట్లే (అధ్యా. 1), ఈ వరస విందులు రాజు తర్వాతి స్థానంలో ఉన్నవాని పతనంతో ముగుస్తాయి (అధ్యా. 7).

5:4,8 హామానును ఆహ్వానించడంలో ఎస్తేరు ఉద్దేశాలను వ్యాఖ్యాతలు మరీ అధికంగా ఊహించారు. ఒక సాధారణ సూచన ఏమిటంటే, అహష్వేరోషులో అసూయను రేపడం ద్వారా, తన భర్తకు హామానుకు మధ్య (7:7-8) స్పర్ధలు సృష్టించడానికి ఎస్తేరు. ప్రయత్నించింది అనేది. ఉద్దేశం ఏదైనప్పటికీ, ఈ సంఘటనలు కథాగమనాన్ని పెంచి, హామాను హఠాత్తుగా పతనం కావడాన్ని మరింత నాటకీయంగా మార్చాయి.  

5:5-7 ఎస్తేరు తన అందం, జ్ఞానంతో రాజును జయించిందని మనం భావించే అవకాశం ఉంది. కానీ లేఖనానుసారమైన పఠనం ద్వారా, రాజుపై దేవుడు చూపిన ప్రభావమే నిజమైన కారణం అనే అభిప్రాయానికి వస్తాం. .

5:9 మొర్దికై తన్ను చూచియు...లేచి నిలువకపోవడం మాత్రమే కాక, కనీసం కదలక (వణకక, పా.ని.లో కేవలం ఐదుసార్లు మాత్రమే ఉపయోగించిన క్రియాపదం, హెబ్రీ "జువా") ఉండడం హామాను బహుగా కోపగించడానికి కారణమైంది. హామానును ధిక్కరించడం మొరైకైకు ఏమాత్రం ఆందోళన కలిగించలేదు. 

5:10-13 గొప్పలు చెప్పుకోవడంలోను, తన ఫిర్యాదులలోను హామాను డాంబికంగానే ఉన్నాడు. అతని ఫిర్యాదు మనకు ఆహాబు రాజును గుర్తుచేస్తుంది (1రాజులు 21:4). 

5:14 ఒకప్పుడు తన భర్తతో కలసి యెజెబెలు ఒక నిర్దోషిని చంపడానికి కుట్రపన్నినట్లుగానే (1రాజులు 21:7), ఇప్పుడు జెరేషు హామాను స్నేహి తులతో కలిసి, అతని శత్రువైన మొరైకైను బహిరంగంగా హత్య చేయడానికి పథక రచన చేసింది. శత్రువుపై తన భర్త ప్రతీకారేచ్ఛనను తీర్చుకోడానికి ఈ పథకం సహాయపడుతుందని జెరేషు నమ్మింది. తన భార్య సలహా హామానుకు యుక్తముగా కనిపించి, మరుసటిరోజు తన జీవితంలో విజయవంతమైనది కాబోతుందని నమ్మి, ఒక ఉరికొయ్యను సిద్ధం చేయించాడు. .


Shortcut Links
ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |