Song of Solomon - పరమగీతము 8 | View All

1. నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు.

2. నేను నీకు మార్గదర్శినౌదును నా తల్లియింట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమఫలరసమును నేను నీకిత్తును.

3. అతని యెడమచెయ్యి నా తలక్రింద నున్నది అతని కుడిచెయ్యి నన్ను కౌగిలించుచున్నది

4. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్ఛపుట్టువరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.

5. తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతె? జల్దరువృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీవలన ప్రసవవేదన కలిగెను నిన్ను కనిన తల్లి యిచ్చటనే ప్రసవవేదన పడెను.

6. ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము.

7. అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును.

8. మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దానివిషయమై యేమి చేయుదుము?

9. అది ప్రాకారమువంటిదాయెనా? మేము దానిపైన వెండి గోపురమొకటి కట్టుదుము. అది కవాటమువంటిదాయెనా? దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము

10. నేను ప్రాకారమువంటిదాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతనిదృష్టికి నేను క్షేమము నొందదగినదాననైతిని.

11. బయలు హామోనునందు సాలొమోను కొక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వేయి రూపాయిలు తేవలెను.

12. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది సొలొమోనూ, ఆ వేయి రూపాయిలు నీకే చెల్లును. దానిని కాపుచేయువారికి రెండువందలు వచ్చును.

13. ఉద్యానవనములలో పెంచబడినదానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము.

14. నా ప్రియుడా, త్వరపడుము లఘువైన యిఱ్ఱివలె ఉండుము గంధవర్గవృక్ష పర్వతములమీద గంతులువేయు లేడిపిల్లవలె ఉండుము.బైబిల్ అధ్యయనం - Study Bible
8:1-2 ఈ వచనాల్లో దంపతులు ఇంటి లోపలికి వెళ్ళిన వర్ణన కనబడుతుంది. గతంలో ఒక వసంత కాలంలో సొలొమోను షూలమ్మితిని చూడాలనుకుంటున్నాడని ఆమె స్వరం వినాలనుకుంటున్నాడనే వర్ణన ఉంది. అదే విధంగా ఇప్పుడు షూలమ్మితి సొలొమోనును అందరి ముందు ఒక సోదరుడిని ముద్దాడినట్టు ముద్దాడాలనీ తరువాత ఎవరూ తనను నిందించని రీతిలో మరింత సన్నిహితంగా సొలొమోనును ముద్దాడాలని కోరుకుంటున్నది. వ.1 లోని నేను... ముద్దులిడుదును (హెబ్రీ. ఎషఖా) అనే పదజాలం, వ.2 లోని నేను “నీకిత్తును” (హెబ్రీ. ఆశ్కేకా) అనే పదజాలంతో ధ్వనిసామ్యం కలిగి ఉంది. ప్రాచీన హెబ్రీలో అచ్చక్షరాలు లేని ప్రతిలో ఇది ఒకే పదం అయ్యుండవచ్చు. సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమఫలరసమును అనే సాదృశ్యాలు ఏదైనా ఒక పాత్ర నుండి పానం చేయడాన్ని పరోక్షంగా సూచిస్తున్నాయి. ఈ వర్ణనలోని మూడు సాదృశ్యాలు: (1) నాభిని గుండ్రని ద్రాక్షారసపు పాత్రగా వర్ణించడం (7:2 నోట్సు చూడండి), (2) షూలమ్మితి ముద్దులను ద్రాక్షారసంలాగా పానం చేయడం అనే వర్ణన (7:9), (3) తల్లియొద్ద స్తన్యపానము చేయడం అనే వర్ణన (8:1, హెబ్రీ. రేఖాక్) నోటి తోను లేదా తెరచిన పెదవుల తోను ధ్వనిసామ్యం అయ్యుండవచ్చు (హెబ్రీ. రక్కా - కణతలు అని కాక, పెదవులు అనే అర్థంతో - 4:3 నోట్సు చూడండి). వివాహపు రాత్రి షూలమ్మితి పెదవుల తడి విచ్చిన దాడిమ ఫలముల వలె ఉంది. ఇప్పుడు “నా (ఆమె) దాడిమఫల" రసము “సంభార సమ్మిళిత ద్రాక్షరసము” వలె ఉన్నది. 

8:3-14 ఈ విభాగం, 1:1-2:7 లోని కథావిషయాన్ని పరిసమాప్తి చేస్తుంది (గ్రంథ పరిచయం లోని గ్రంథ విభజన చూడండి). మొదటి విభాగం ముగింపులో ఉన్న పల్లవి, రెండవ విభాగంలోని చివరి వచనంతో అలంకారి కంగా సరితూగుతుంది. ఈ విభాగం మళ్ళీ షూలమ్మితి సోదరుల గురించి పరిచయం చేస్తూ, మొదటి విభాగంలోని పరిస్థితుల్నే వివరిస్తూ ప్రేమికులైన షూలమ్మితి సొలొమోనులు ఎలా కలుసుకున్నారో కూడా మళ్ళీ వివరిస్తుంది. 

8:3 ఈ వచనంలోని పల్లవి, పూర్వభాగాన్ని ముగిస్తూ తరువాతి భాగాన్ని ప్రారంభిస్తుంది. ఇంతకు ముందు వేచియుండమని కోరినదానికి భిన్నంగా ఇప్పుడు ఈ పల్లవి దాంపత్యసిద్ధి కలుగజేయమని సొలొమోనును తగినరీతిలో కోరుతుంది (2:6 నోట్సు చూడండి). 

8:4 ప్రేమలో జాగరూకత చాలా ముఖ్యమే గాని తగిన సమయం వచ్చిన ప్పుడు అందలి సంతోషాన్ని జారవిడుచుకో కూడదు. 2:7 లో "ప్రేమకు ఇష్టమగువరకు” అనే పదజాలం తగిన సమయం వచ్చేవరకు వేచి ఉండడాన్ని సూచిస్తుండగా ఇక్కడ ఇచ్ఛ పుట్టువరకు అనే పదజాలం తృప్తి పొందేవరకు అనే అర్థాన్ని సూచిస్తుంది.

8:5-7 ఇప్పటివరకున్న వేర్వేరు సమయాల్లోని ప్రశంసలు (6:4-10 నోట్సు చూడండి) షూలమ్మితి సొలొమోనుల పరస్పర ప్రశంసలు. అయితే, ఈ విభాగం ప్రేమకే ప్రశంసగా కనబడుతుంది. సొలొమోను షూలమ్మితిలను ప్రేరేపించిన ప్రేమకు మూలం స్వచ్ఛమైన దేవుని ప్రేమలో ఉంది. 

8:5 గ్రంథంలో ఒక కొత్త విభాగానికి ప్రారంభంగా ఉన్న తన... అరణ్యమార్గమున వచ్చునది ఎవతె అనే ఈ వర్ణన, వివాహదినం నాటి ఊరేగింపు వర్ణనను పోలి ఉంది (3:6 నోట్సు చూడండి). ఆదాము హవ్వలు ఉద్యానవనాన్ని అరణ్యంగా మార్చిన తావునుండి, ఇప్పుడు సొలొమోను షూలమ్మితిలు ఉద్యానవనంలో (పరదైసు) ఆనందించడానికి వస్తున్నారు, వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ దేవుడు తన ప్రజల పట్ల చూపించిన ప్రేమను పోలి ఉంది, మరీ ముఖ్యంగా వారు ఆయనను నమ్ముతూ ఆయన మీద ఆనుకొని అరణ్యంలోని కఠినమైన బాధలను ఓర్చుకుంటూ దాన్ని దాటిరావడాన్ని పోలి ఉంది. 

8:6-7 ప్రాచీన కాలంలో నామాక్షరము అనేది విలువైన చిహ్నం లేదా ముద్ర, ఒక వ్యక్తికి సంబంధించిన వాటన్నిటిని ఆ వ్యక్తికి చెందిన నామాక్షరంతో (చిహ్నం లేదా ముద్ర) గుర్తించడం జరిగేది. మరణమంత బలవంతమైనది అనేది బహు స్పష్టమైన, దృఢమైన పోలిక. మరణం మనుషులను ఎలా జయిస్తుందో ప్రేమ కూడా అలాగే జయిస్తుంది. అయితే ఇక్కడ ప్రేమకే అంతిమ విజయం అన్న సూచన కనిపిస్తుంది. పాతాళమంత కఠోరమైనది ఈ సాదృశ్యానికే కొనసాగింపు. పాతాళం (సమాధి, మృత్యువు) మనుషులను వెంటాడినట్టుగా ప్రేమ కూడా ప్రియమైన వారిని వెంబడిస్తుంది. ఈర్ష్య (పౌరుషం) దేవునికి చెందిన గుణలక్షణం. అది ఆయన ప్రేమించిన వారిపట్ల ఆయన చూపించే శ్రద్ధాసక్తుల్లో వెల్లడవుతుంది (ద్వితీ 4:24; 32:21-22). ఆ పౌరుషం యెహోవా పుట్టించు జ్వాల (అగ్నిజ్వాలా సమములు) కాబట్టి, దానినెవరూ ఆర్పివేయలేరు. ప్రేమను పొందడానికి చేసే అనుచితమైన ప్రయత్నాలేవీ ఫలించవు (త్రోసివేయబడును).

8:8-12 షూలమ్మీతి ప్రేమ ఎలా సార్ధకమైందో ఈ విభాగం వివరిస్తుంది. ఆమె సొలొమోను ప్రేమను పొందాలని ముందుగా సిద్ధపడింది, అందుచేత ద్రాక్షతోటలో దైవ సంకల్పానుసారంగా సొలొమోనును కలుసుకున్నది. గ్రంథంలోని ఈ చివరి భాగం, గ్రంథ ప్రారంభంలోని అలంకారిక వర్ణనతో సరితూగుతూ, షూలమ్మితి సహోదరుల ప్రస్తావనను (1:6) మళ్ళీ తెస్తుంది (గ్రంథపరిచయం లోని గ్రంథ విభజన చూడండి).

8:8-9 షూలమ్మితికి ఇంకా యుక్త వయస్సు రానప్పుడు ఆమె సోదరులు బాధ్యత తీసుకొని ఆమెను సంరక్షించారు. ఆమె కట్టుదాటి ప్రవర్తిస్తే (కవాటము వంటిదాయెనా) ఆమెకు పరిమితులు విధించాలనుకున్నారు. ఆమె వారి సంరక్షణలో బాధ్యతాయుతంగా ఉంటే (ప్రాకారము వంటిదాయెనా) ఆమె కోరుకుంటున్న సమయం (వివాహకాలము) రాగానే ఆమెకు తగిన ప్రతిఫలాన్నివ్వాలనుకున్నారు. 

8:10 నేను ప్రాకారము వంటిదాననైతిని నా కుచములు దుర్గములాయెను అంటూ వ. 8-9 లోని వర్ణన కొనసాగు తుంది, షూలమ్మితి తన సౌశీల్యం గురించి దృఢంగా చెబుతున్నది. గీత రచయిత ఇక్కడ బోయజు దృష్టిలో రూతు పొందిన మంచి పేరును, అతని ప్రసన్నతను జ్ఞప్తికి తెస్తున్నాడు (రూతు 2:2, 10, 13), రూతుకున్న పరిస్థితులే షూలమ్మితికి కూడా ఉన్నాయి. గీతరచయిత ఎంతో నైపుణ్యంతో నోవహు కాలం నుండి పారంపర్యంగా వస్తున్న భావ ప్రకటనను (యెహోవా దృష్టియందు కృపపొందిన వాడాయెను - ఆది 6:8) షూలమ్మితికి కళాత్మకంగా వర్తింపజేస్తూ సొలొమోను దృష్టికి ఆమె క్షేమమునొందదగినది అయ్యింది అని వర్ణించాడు. కళాత్మకమైన ఈ వర్ణనలో శబ్దచమత్కారం కూడా కనబడుతుంది, షాలోం (క్షేమము లేదా సమాధానం) అనే హెబ్రీ పదం నుండి షూలమ్మీత్ (షూలమ్మితి) అనే స్త్రీలింగ పదం, షేలోమో (సొలొమోను) అనే పుంలింగ పదం ఉత్పన్నమయ్యాయి. షూలమ్మితి సొలొమోను (షెలేమో)లో క్షేమం (షాలోం) పొందింది. భర్తను కోల్పోయి దిక్కులేని విధవరాలిగా ఉన్న రూతు పొలంలో పనిచేస్తున్నప్పుడు బోయజు చూశాడు. బోయజుతో రూతు వివాహం ఆమెకు ఒక ప్రముఖ స్థానాన్నిచ్చింది. బోయజు దృష్టిలో పడిన రూతు జీవితం మారినట్టుగా, సోదరుల నిర్లక్ష్యానికి గురైన షూలమ్మితి ద్రాక్షతోటలో పనిచేస్తున్నప్పుడు సొలొమోను దృష్టిలో పడిన వెంటనే షూలమ్మితి జీవితం కూడా మారిపోయింది. 

8:11-12 షూలమ్మీతి సోదరులు సొలొమోను నుండి ద్రాక్షతోటలను కౌలుకు తీసుకున్న తర్వాత ఏం జరిగిందో ఈ వచనాలు వర్ణిస్తున్నాయి, షూలమ్మితిని ఆమె సోదరులు ఈ తోటల్లో పనిచేయడానికి పంపించారు (1:6). ఒప్పందం ప్రకారం వీరు తోట యజమానియైన సొలొమోనుకు ఒక్కొక్కడు వేయి రూపాయలు ఇవ్వాలి, వారు తోటను కాపు కాసినందుకు రెండువందలు తీసుకోవాలి. అక్షరార్థంగా తన స్వంత తోట విషయంలో సొలొమోను ఏం చేయాలంటే అది చేయవచ్చు, అలంకారిక వర్ణనలో షూలమ్మితి తన విషయంలో (నా ద్రాక్షావనము నా వశమున నున్నది) తాను ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు. ప్రేమను కొనలేము గానీ దానిని ఉచితంగా ఇవ్వవచ్చు. సొలొమోనుకు చెందిన ద్రాక్షతోటలను షూలమ్మితి సోదరులు కొంతకాలం కౌలుకు తీసుకొని కాపు కాసినట్టే, షూలమ్మితిని (ద్రాక్షవనము) వారు ఆమెకు వివాహపు వయసు వచ్చేవరకు సంరక్షించారు (వ. 8-9), షూలమ్మితిని ఆమె సోదరులు కష్టపెట్టారు (1:6), అయినా ఆమె వారిని క్షమించింది. అది బహుశా వారు ఆమెను ఆ ద్రాక్షతోటలోకి పనిచేయడానికి పంపినందు వల్లనే ఆమె సొలొమోనును కలిసే అవకాశం పొందినందుకు కావచ్చు. 

8:13-14 ఈ వచనాలు వసంతకాలం నాటి కథా విషయాలను ప్రతిధ్వ నిస్తున్నాయి (7:12-13 నోట్సు చూడండి). ఏదెనులో జరిగిన సంఘటనల తర్వాత ప్రపంచం మసకబారిన అద్దంలా తయారైంది. దేవుడు తన రమ్యమైన ప్రేమ ఏ విధంగా ప్రతిఫలించాలని కోరుకున్నాడో ఆ విధంగా జరగడం లేదు. ప్రపంచమంతటా ప్రేమ వక్రీకరించబడి భార్యాభర్తల సాహచర్యంలో స్త్రీ కేవలం భద్రతను, ప్రేమపూర్వక సంభాషణను మాత్రమే కోరుకుంటుండగా, పురుషుడు లైంగిక కోరికలను తృప్తిపర్చుకోవడాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు. పరమగీతము లోని ఆదర్శప్రేమ పునరుద్ధరించబడినప్పుడే ప్రేమకు ఆదర్శవంతమైన సమతుల్యత ఏర్పడుతుంది. సొలొమోను షూలమ్మితిల మధ్య ప్రేమపూర్వకమైన భావప్రకటన, ఇద్దరి మధ్య యుక్తమైన లైంగిక వ్యక్తీకరణలు ఉన్నాయి. ఏదేమైనా, పరమగీతము ముగింపులో వసంతకాలపు కథాంశాలు ముందుగా సొలొమోను నుండి చర్య మొదలైందనీ షూలమ్మితితో మాట్లాడాలని సొలొమోనే ముందుగా కోరుకున్నాడనీ, దానికి షూలమ్మితి స్పందించి సొలొమోనును ప్రేమించాలని కోరుకుందని తెలియజేయడం గమనార్హం. ఈ వర్ణన మూసధోరణి (ఒకే ధోరణి) లో వస్తున్న శృంగారంతో నిండిన ప్రేమ అసలు నిజమైన ప్రేమ కాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో బాటు, మనపట్ల దేవునికున్న ప్రేమను ప్రతిబింబిస్తుంది: “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము” (1యోహాను 4:19).

Shortcut Links
పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |