Romans - రోమీయులకు 6 | View All

1. ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?

2. అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?

3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?

4. కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.

5. మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.

6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయ బడెనని యెరుగుదుము.

7. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు.

8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు,

9. మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము.

10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు

11. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

12. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.

13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.

14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

15. అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికిని కూడదు.

16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?

17. మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

18. పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్ప గించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.

20. మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

21. అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,
యెహెఙ్కేలు 16:61, యెహెఙ్కేలు 16:63

22. అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.

23. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.బైబిల్ అధ్యయనం - Study Bible
6:1-23 నీతిమంతునిగా తీర్చబడినవాడు, తాను నీతిమంతునిగా తీర్చబడక ముందు జీవించినట్లు జీవించవచ్చా? సంఘ సంస్కరణ చర్చలలో ఇది ఒక పెద్ద ప్రశ్న. పాపం విస్తరించే చోట, కృప మరింత ఎక్కువగా విస్తరిస్తే, మరింత ఎక్కువ కృప పొందుకోవడానికి మరింత పాపం చేయవచ్చు కదా? సంఘచరిత్రలో కొందరు అబద్ధ బోధకులు ఎక్కువ పాపం చేయడం ద్వారా మరింత ఎక్కువ కృపను అనుభవించవచ్చని నిజంగానే వాదించారు. అది ఎందుకు సాధ్యం కాదో ఈ అధ్యాయం వివరిస్తుంది. 

6:2 చెల్లని ఈ సందేహాన్ని పౌలు అట్లనరాదు అనే చాలా బలమైన భావనతో తిరస్కరించాడు. విశ్వాసులు పాపము విషయమై చనిపోయారు అని పౌలు వాదించాడు. సిలువవద్ద లేక మనం మారుమనస్సు పొందినపుడు లేక బాప్తిస్మం పొందినపుడు మన పాప స్వభావం తొలగిపోయిందని అతని భావన కాదు. కానీ అతడు మరొకచోట చెప్పినట్లు, దేవుడు “మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్య నివాసులనుగా చేసెను” (కొలస్సీ 1:13). అలాంటి మార్పును అనుభవించిన తర్వాత కూడా పాపంలో జీవించడానికి మనం ధైర్యం చేయగలమా? 

6:3 విశ్వాసులు పాపం విషయమై మరణించారనే తన వాదనను సమర్ధించు కుంటూ, బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తు యేసులోనికి, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందామని పౌలు ఎత్తిచూపుతున్నాడు. “పాపం విషయమై క్రీస్తు మరణించడం, మనం కూడా పాపం విషయమై మరణించేటట్లు చేస్తుంది" (రాబర్ట్ హెచ్. మౌన్స్). 

6:4 సాదృశ్యాత్మకంగా విశ్వాసులమైన మనము క్రీస్తుతోకూడ పాతిపెట్టబడి, నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు ఆయనతోపాటు మృతు లలోనుండి లేపబడ్డాము. కాబట్టి "కృప విస్తరించునట్లు పాపమందు నిలిచి యుందుమా” (వ. 1) అనే ఆలోచనలోని అసంబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది. 

6:5 విశ్వాసులు ఇంకా పునరుత్థానాన్ని అనుభవించకపోయినప్పటికీ, మనం ఎవరి మరణంలో పాలుపంచుకున్నామో ఆ క్రీస్తు మృతులలో నుండి లేచాడు అనేది సత్యం కాబట్టి భవిష్యత్తులో మన విషయంలో ఇది నిజమౌతుందనే నిశ్చయత ఉన్నది. 

6:6 మనం క్రైస్తవులం కాకమునుపు, మనం కలిగియుండినదంతా మన ప్రాచీన స్వభావమే (గ్రీకు. "పాలయియోస్ ఆంత్రోపోస్", అక్షరార్థంగా "పాత మనిషి"). తద్విరుద్ధంగా, మనం క్రైస్తవులం కాగానే కొత్త స్వభావం మనదవుతుంది (ఎఫెసీ 4:22-23; కొలస్సీ 3:9-11). కొత్త స్వభావం పరిపూర్ణమైనది కాదు. మన క్షయమైన శరీరాలలో ఇంకా పాపం నివసిస్తున్నం దున, మనం ఇంకా పాపం చేసే అవకాశం ఉంది. (రోమా 7:13-25), కానీ మనం నూతనపరచబడే ప్రక్రియలో ఉన్నాం (ఎఫెసీ 4; కొలస్సీ 3). క్రైస్తవుడు ఇంకా పాపంలో జీవించవచ్చా అనే ప్రశ్నకు జవాబు ఇందులోనే ఉంది. ఒకప్పుడు మనం జీవించినట్లుగా ఇకపై జీవించరాదు. ఎందుకంటే మన "పాత స్వభావము” ఆయనతో (క్రీస్తుతో) కూడ సిలువవేయబడింది. విశ్వాసి క్రీస్తులో “నూతన సృష్టి" (2 కొరింథీ 5:17).

6:7 మరణించిన వ్యక్తిపై పాపం (ఇక్కడ వ్యక్తిగా చూపుతున్నాడు) అధికారం చేయలేదు. అతనిని తనకు విధేయుడు కమ్మని చెప్పలేదు. 

6:8-9 మన పాపాన్ని బట్టి మరణం యేసును బంధించగలిగింది, కానీ ఆయన నిరంతరం జీవించడానికై తిరిగిలేచాడు. ఇక ఎన్నడూ మరణించని క్రీస్తుతోకూడ... మనము... చనిపోయాము కాబట్టి విశ్వాసిపై మరణమునకు ఇకను... ప్రభుత్వము లేదు.

6:10 యేసు తన మరణ పునరుత్థానాలలో మార్చజాలని రూపాంతరం పొందాడు. అలాగే విశ్వాసులు కూడా మార్చజాలని రూపాంతరం పొందుతారు. మారుమనస్సు పొందినపుడు మనం "ప్రాచీన స్వభావము” విషయమై మరణించి (వ.6), తరువాత కొత్త సృష్టిగా (2కొరింథీ 5:17) జీవిస్తాము. యేసువలె విశ్వాసి కూడా దేవుని విషయమై జీవిస్తాడు. 

6:11 ఇది రోమీయులకు రాసిన పత్రికలోని మొదటి ఆజ్ఞ. 

6:12-13 కొత్త రాజ్యంలో సభ్యుడైన విశ్వాసి, పాత రాజుకు (సాతాను, పాపం, మరణం), అతని రాజ్యానికి ఎలాంటి సహాయము చేయకూడదు. మనమింకా బానిసలమే, కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త యజమానుడు ఉన్నాడు. పౌలు పాపమును తన పరిపాలనను విస్తరింపజేయాలనుకుంటున్న రాజుగా (ఒక రాజ్యం, పౌరులతో సంపూర్ణమైనట్లు) వ్యక్తీకరించడం గమనిం చండి. ఈ రెండు రాజ్యాల మధ్య ఒక ఆత్మీయ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో సరియైన రాజు పక్షంగా వాడబడే సాధనములుగా మనలను మనం అప్పగించుకోవాలి. శత్రువుకు సహాయం చేయడం, సహకరించడం రాజద్రోహం అవుతుంది. 

6:14 5:20-21 నుండి పాపము ఒక వ్యక్తిగా చూపబడుతూ ఉంది. పాపం ఇక విశ్వాసిపై అధిపతి కాదు. ధర్మశాస్త్రమును వాడుకుని పాపం అధికారం సంపాదించింది, కానీ ఇప్పుడు క్రైస్తవుడు ధర్మశాస్త్ర పాలన క్రింద కాక కృప క్రింద ఉన్నాడు. ఈ 6:15-23. ఈ వచనాలు పౌలు సాదృశ్యాల పొడిగింపును చూపుతున్నాయి. ఏ యజమానికి సేవచేయాలో ఎంచుకునే అవకాశం మనుషులకు ఉంది.

6:16 పౌలు దాసులు అనే మాటను వాడాడు. నీవెవరికి అప్పగించుకొందువో, అతని అధికారం క్రిందికి వస్తావు. పాపమునకు విధేయత చూపితే మరణం వస్తుంది. పాపం తన దాసులకు జీతం ఇస్తుంది, అది మరణం (వ.23తో పోల్చండి). దేవునికి విధేయత చూపడం నీతిని, నిత్యజీవమనే వరాన్ని తెస్తుంది. 

6:17 రోమాలోని క్రైస్తవులకు కలిగిన రక్షణ కార్యాన్ని బట్టి పౌలు దేవుని స్తుతించాడు. 

6:18-19 ఆధ్యాత్మిక మరణం, రక్షణలకు సాదృశ్యంగా బానిసత్వం, విమోచన అనే మాటలను సాధారణంగా బైబిల్లో ఉపయోగించారు. హెబ్రీయులు ఒకప్పుడు ఐగుప్తులో బానిసత్వంలో (ఆధ్యాత్మిక, భౌతిక) ఉన్నారు. వారు ఐగుప్తునుండి బయటికి వచ్చి తనను ఆరాధించాలని దేవుడు వారి దాస్యశృంఖలాలు తెంచాడు. (నిర్గమ 7:16; 12:29-42) అలాగే రోమాలోని క్రైస్తవులు కూడా ఒకప్పుడు దేవతలు కానివాటికి ఆధ్యాత్మిక బానిసలుగా ఉండేవారు, కానీ వారు నీతికి దాసులుగా ఉండునట్లు దేవుడు వారిని విమోచించాడు. 

6:20-23 దేవుని దాసులుగా, విశ్వాసులు ఫలము ఫలిస్తారు. (యోహాను 15:1-8 చూడండి). ఇది వారి జీవితాల్లో జరిగే పరిశుద్ధత లేక పవిత్రీకరణం, దాని తుదిఫలం నిత్యజీవం. యోగ్యతలను బట్టి దొరికే జీతంగా దీన్ని అపార్థం చేసుకోకూడదు. నిత్యజీవము క్రీస్తు ద్వారా కలిగే దేవుని కృపావరము. ఒక
యజమాని (పాపం) పనికి జీతంగా మరణం ఇస్తాడు; మరొక యజమాని (దేవుడు) మనం సంపాదించని కృపద్వారా నిత్యజీవాన్ని ఇస్తాడు (యోహాను 17:3).


Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |