Ezekiel - యెహెఙ్కేలు 35 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2. నరపుత్రుడా, శేయీరు పర్వతమువైపు నీ ముఖము త్రిప్పుకొని

3. దానికి మాట యెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీమీద చాపి నిన్ను పాడు గాను నిర్జనముగాను చేసెదను.

4. నీవు నిర్జనముగా ఉండు నట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై యున్నానని నీవు తెలిసికొందువు.

5. ఇశ్రాయేలీయుల యెడల ఎడతెగని పగకలిగి, వారి దోషసమాప్తికాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి గనుక

6. నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసె దను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

7. వచ్చువారును పోవువారును లేకుండ అందరిని నిర్మూలముచేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును.

8. అతని పర్వతములను హత మైనవారితో నింపుదును, నీ కొండలలోను నీ లోయల లోను నీ వాగులన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు.

9. నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్టబడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును.

10. యెహోవా అక్కడనుండినను ఆ రెండు జనములును ఆ రెండు దేశ ములును మనవే; మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే;

11. నా జీవముతోడు నీవు వారి యెడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును.

12. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నియు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు.

13. పెద్దనోరు చేసికొని మీరు నామీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను.

14. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను.

15. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారము గానే చేసెదను; శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.



బైబిల్ అధ్యయనం - Study Bible
35:1-3 శేయీరు పర్వతము మృతసముద్రానికి దక్షిణంలో చీలిక లోయ కిరువైపుల ఉన్న పర్వత ప్రాంతపు ప్రాచీన నామం. ఎదోమీయులు పూర్వం ఇక్కడ నివసించిన హోరీయుల్ని తరిమికొట్టి ఈ ప్రాంతంలో నివసించారు (ద్వితీ 2:12, 22). ఎదోము మధ్యభాగంలో శేయీరు పర్వతం ఉంది, అంతే కాక ఇది ఎదోముకు పర్యాయపదంగా మారింది (ఆది 32:3). క్రీ.పూ. 126లో హస్మోనీయుడైన జాన్ హైర్కాన ఎదోమును స్వాధీనం చేసుకొని ఎదోమీయుల్ని యూదులుగా మారాలని బలవంతపెట్టాడని కొన్ని అప్రమాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. శిశువైన యేసును చంపించాలని తీవ్ర ప్రయత్నం చేసిన రాజైన హేరోదు ఎదోమీయుడే (లేదా ఇదూమీయుడు). అనంతరం, క్రీస్తు శకం ఆరవ శతాబ్దానికి ఎదోమీయులు అంతరించిపోయారు. అనంతర కాలంలో నెబాతీయులుగా ప్రసిద్ధిచెందిన అరబీ సంచార ప్రజలు ఎదోమీయుల్ని అక్కడనుండి తరిమికొట్టారు. అధ్యా. 36లోని “ఇశ్రాయేలు పర్వతముల"కు ఒక వ్యత్యాసంగా ఈ ప్రవచనంలో శేయీరు పర్వతాన్నుపయోగించడం జరిగింది. ఇశ్రాయేలును వ్యతిరేకించిన అన్యజనులందరి మీదకు దేవుడు రప్పించబోతున్న శిక్షకు ప్రతీకగా బహుశా ఇక్కడ ఎదోము గురించి ప్రస్తావించి ఉండవచ్చు. ఎదోము నుద్దేశించి యెహెజ్కేలు పలికిన ఇతర ప్రవచనాలకు 25:12-14 చూడండి. యెషయా 34:5-17; 63:1-6; యిర్మీయా 49:7-22; ఆమోసు 1:11-12 కూడా చూడండి.

35:4 ఈ శాపం (నీ పట్టణములను ఎడారులుగా చేసెదను) ఇశ్రాయేలు ఎడతెగకుండా అవిధేయతను కొనసాగిస్తున్నందు వలన దానిపై వచ్చే నిబంధనా శాపాన్ని ప్రతిధ్వనిస్తుంది (లేవీ 26:31). 

35:5- ఇశ్రాయేలుకు, ఎదోముకు మధ్య ఉన్న ద్వేషం రిబ్కా గర్భంలోనే ప్రారంభమైంది (ఆది. 25:22-23). యాకోబు ఇస్సాకును వంచించి ఏశావుకు చెందిన దీవెనను పొందినందుకు ఇద్దరి మధ్య ద్వేషం ఇంకా ఎక్కువైంది (ఆది 27). ఎడతెగని పగ అనే పదజాలం బైబిల్లో మరొక చోట ఫిలిపీయుల చర్యల్ని సూచిస్తూ 25:15లో మాత్రమే కనబడుతుంది. పగ (హెబ్రీ. ఎలా) అనే పదానికున్న వేదాంతపరమైన అర్థం ఆది 3:15లో సర్పానికి హవ్వ సంతానానికి మధ్య ఎడతెగకుండా ఉండే "వైరము” అనే పర్యాయపదంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. పగ ఇక్కడ యాకోబుకు ఏశావుకు మధ్య ఉన్న విరోధాన్ని సూచిస్తుంది. మొదట వ్యక్తిగతమైన ద్వేషంగా ఉండి (ఆది. 27:41), ఆ తరవాత అది రెండు జాతుల మధ్య శత్రుత్వంగా (సంఖ్యా 20:14-21; 2సమూ 8:13-14) మారింది. నెబుకద్నెజరు యెరూషలేమును నేలమట్టం చేసినప్పుడు, ఎదోమీయులు ఆ ఉపద్రవము చూస్తూ నిలబడి చప్పట్లు కొడుతూ సంతోషించారు (కీర్తన-137; విలాప 4:21; యోవేలు 3:19, ఓబద్యా వ.1-14; మలాకీ 1:2-5). 

35:6 ఈ వచనంలో రక్తము ఎదోమీయుల్ని తరుమును అని రెండు చోట్ల కనబడుతుంది. ఇది చర్యకు ప్రతిచర్య, నేరానికి తగిన శిక్ష (కీర్తన 109:17; మత్తయి 7:2; 26:52). "ఉపద్రవము”, “రక్తము”, “ఎదోము” - హెబ్రీలో ఈ పదాలన్నీ ధ్వనిసామ్యంలో ఉన్నాయి, ఈ వాక్యభాగంలో ఒకదానికొకటి సంబంధించినవిగా ఉన్నాయి. 

35:7-9 ఎదోము నాశనం చేయబడడం మాత్రమే కాదు, ఎల్లప్పుడును పాడుగాను నిర్ణనముగాను ఉంటుంది.

35:10-13 వారికి చూపిన... చొప్పునను అనే భావప్రకటన నేరమెటువంటిదో శిక్ష కూడా అటువంటిదేనని సూచిస్తుంది. ఇది లాటిన్ భాషలో లెక్స్ టలియోనిస్ అని ప్రసిద్ది చెందింది. ఇదే భావన ఆది. 9:6లోను కనబడుతుంది: “నరుని రకమును చిందించినవాని రక్తము నరుని వలననే చిందింపబడును", నిర్దమ 21 వ అధ్యాయంలో ఎవరైనా పొరబాటున గర్భవతిని గాయపర్చినట్లయితే నష్టానికి తగిన పరిహారం చెల్లించాలనే న్యాయవిధి ఉంది. ఈ వాక్యభాగంలోని నియమం: "ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ" (నిర్గమ 21:23-25). సులభమైన మాటల్లో చెప్పాలంటే నేరానికి తగిన శిక్ష, నేరం ఏదైతే శిక్ష కూడా అదే. ఒక రకంగా ఇది నేరానికి మించిన శిక్ష వేయకుండా కాపాడుతుంది. వ్యక్తిగత పగ, ప్రతీకారం పెరగకుండా కాపాడుతుంది. చాలా సందర్భాల్లో నేరం కంటే వ్యక్తిగత పగ, ప్రతీకారేచ్ఛ ఎక్కువగా ఉండడం సహజం. ఎదోము విషయంలో విధించబడిన శిక్ష దాని నేరానికి సరిగ్గా సరిపోయేదే. 

35:14-15 యూదా పతనాన్ని చూసి ఎదోము సంతోషించింది. కాబట్టి అనంతరం ఎదోము పతనం చూసి ప్రపంచం- సంతోషిస్తుంది. (ఓబద్యా వ. 12). భవిష్యత్ కాలంలో దేవుడు ఇశ్రాయేలును పునరుద్ధరించినప్పుడు, అన్యరాజ్యాలు ఇశ్రాయేలు పట్ల చూపిన వైఖరిని బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. (ఆది 12:1-3; మత్తయి 25:31-46). ఎదోము క్రమేపీ బబులోను కింద, పారసీకుల కింద, గ్రీకుల కింద, చివరకు రోమీయుల కింద నలిగిపోయింది. రోమీయుల కాలంలో ఎదోమును ఇదూమియ అనే పేరుతో పిలిచారు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య కాలంలో నెబాతీయులనే అరబీ ప్రజలు ఎదోమును ఆక్రమించుకొని పెట్టాను తమ ముఖ్యపట్టణంగా చేసుకున్నారు. 


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |