Ezekiel - యెహెఙ్కేలు 11 | View All

1. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్నుదింపగా గుమ్మపు వాకిట ఇరువదియైదుగురు మనుష్యులు కనబడిరి; వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి.

2. అప్పుడాయన నాకీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా యీ పట్టణము పచనపాత్రయనియు, మనము మాంసమనియు, ఇండ్లు కట్టుకొన అవసరములేదనియు చెప్పు కొనుచు

3. ఈ పట్ణణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే.

4. కావున వారికి విరోధముగా ప్రవచింపుము; నరపుత్రుడా, ప్రవచింపుము.

5. అంతట యెహోవా ఆత్మ నామీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా నీవు నీ మాట వారికి తెలియజేయుము, యెహోవా సెలవిచ్చిన మాట యిదే ఇశ్రాయేలీయులారా, మీరీ లాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి.

6. ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీచేత హతులైన వారితో వీధులు నిండియున్నవి.

7. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు హతముచేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము, ఈ పట్టణమే పచన పాత్ర, యీ పట్టణములోనుండి మిమ్మును వెళ్ల గొట్టుదును.

8. మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీమీదికి ఖడ్గము రప్పించెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

9. మరియు మీకు శిక్ష విధించి పట్టణములోనుండి మిమ్మును వెళ్లగొట్టి అన్యులచేతికి మిమ్మునప్పగించుదును.

10. ఇశ్రాయేలు సరిహద్దులలోగానే మీరు ఖడ్గముచేత కూలునట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.

11. మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పచనపాత్రగా ఉండదు; నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును.

12. అప్పుడు మీ చుట్టు నున్న అన్యజనుల విధుల నాచరించుటకై మీరు ఎవని కట్టడల ననుసరింపక మానితిరో యెవని విధులను ఆచరింపకపోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలిసికొందురు.

13. నేను ఆ ప్రకారము ప్రవచింపు చుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి యెలుగెత్తి–అయ్యో, ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా? అని మొఱ్ఱపెట్టితిని.

14. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

15. నరపుత్రుడా, యెరూషలేము పట్టణపువారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్య బడెను, మీరు యెహోవాకు దూరస్థులుగా నుండుడి, అని యెవరితో చెప్పుచున్నారో వారందరు ఇశ్రాయేలీయులై నీకు సాక్షాద్బంధువులును నీచేత బంధుత్వధర్మము నొందవలసినవారునై యున్నారు.

16. కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆ యా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆ యా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును.

17. కాగా నీవు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా ఆ యా జనముల మధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి, మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి, ఇశ్రాయేలుదేశమును మీ వశము చేసెదను.

18. వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి, తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు.

19. వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొను నట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.
2 కోరింథీయులకు 3:3

20. అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును.

21. అయితే తమ విగ్రహములను అనుసరించుచు, తాము చేయుచు వచ్చిన హేయక్రియలను జరిగింప బూనువారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

22. కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములును వాటి ప్రక్కనుండెను అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన నుండెను.

23. మరియయెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పుదిశనున్న కొండకుపైగా నిలిచెను.

24. తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయులదేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండ పైకెక్కెను.

25. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నిటిని చెరలో ఉన్నవారికి నేను తెలియజేసితిని.



బైబిల్ అధ్యయనం - Study Bible
11:1 అంత క్రితం వర్ణించబడిన ఇరువదియైదుగురు మనుష్యులు గురించి ఈ వచనం కూడా తెలియజేస్తుంది (8:16 నోట్సు చూడండి). 

11:2-4 యెరూషలేము మంచి - ఆహారపదార్థాలతో నిండిన కుండ లాగా ఉందని 24:3-5 వచనాలు తెలియజేస్తున్నాయి. ప్రజలు తాము యెరూషలేముకు చెందినవారు కాబట్టి తామే అక్కడికి వెళ్ళి, ఇళ్ళు కట్టుకొన వచ్చని అనుకుంటున్నారు (యిర్మీయా 32:6-15), చెరలో ఉన్నవారు కుండలో వేయడానికి పనికిరాని పదార్థాల్లాగా ఉన్నారు. చెరలో ఉన్న ప్రజలు, అధిపతుల గురించి యిర్మీయా 29:5 ఇదే విషయాన్ని చెబుతుంది. 

11:5 యెహోవా ఆత్మ నామీదికి వచ్చి అనే మాటల గురించి 2:2 నోట్సు చూడండి.. 

11:6 రాజులు మనుషుల్ని వేటాడి భక్షిస్తున్నారు అంటూ యూదా అధిపతుల్ని ఆక్షేపించడం గురించి 19:3.6 వచనాలు వర్ణిస్తున్నాయి. 22:27 వచనంలో యెహెజ్కేలు ఇశ్రాయేలు అధిపతుల్ని వేటను చీల్చే తోడేళ్లు అని వర్ణిస్తున్నాడు. 

11:7-8 హతులైనవారు మాత్రమే యెరూషలేములో మిగిలి ఉంటారు, తక్కినవారందరూ చెరలోకి కొనిపోబడతారు.

11:9-10 గతంలో ఐగుప్తు మీదకు వచ్చిన తీర్పులు (నిర్గమ 6: 6; 12:12), - ఇప్పుడు యెరూషలేము నివాసుల మీదకు రానున్నాయి. వీరు అన్యుల చేతికి అప్పగించబడబోతున్నారు. 

11:11-12 నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును అనే ప్రవచనం అక్షరార్థంగా రిబ్లా దగ్గర నెరవేరింది (2రాజులు 25:18-21; యిర్మీయా 52:24-27). 

11:13 యెహెజ్కేలు విలాపం 9:8 లో కూడా ఉంది. 

11:14-15 దేవుడు ఇశ్రాయేలుకు .. దేశము , నిచ్చాడు. అయితే ఇశ్రాయేలీయులు అవిధేయులైనప్పుడు వారిని దేశం నుండి బయటకు చెదరగొడతానని కూడా ఆయన సెలవిచ్చాడు (ద్వితీ 28:36, 64-68). దేవుడు శేషాన్ని ఉండనిస్తాడు. అయితే ఈ శేషంలో భ్రష్టులైన నాయకులుండరు (6:8; 12:16).

11:16 పరిశుద్ధాలయము ఇశ్రాయేలీయుల మధ్య యెహోవా : సన్నిధికి సూచన.. అరణ్య ప్రయాణాల్లో ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నట్టుగాను, ఈ వచనం ప్రకారం చెరలో ఉన్నవారి మధ్య “పరిశుద్ధాలయము" ఉన్నట్టుగాను, యేసు రాకతో దేవుని సన్నిధి మానవనిర్మిత భౌతిక దేవాలయంలో కాక, మనుషుల మధ్య ఉండడం జరిగింది (యోహాను 1:14). ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసు రాకతో దేవుని మహిమ, ఆయన సన్నిధి ప్రత్యక్షతలలో మౌలికమైన మార్పు గోచరించింది. ఈ మార్పు విమోచనకు సంబంధించిన చారిత్రక పరిణామం . ఈ వచనానికి సంబంధించిన దగ్గరి పోలికలు కొత్త నిబంధనలో, యేసు తనను తాను “దేవాలయము" అని తెలియజేయడంలోను (యోహాను 2:19-22), “ఆత్మతోను సత్యముతోను" ఆరాధించడమే నిజమైన ఆరాధన అని ఆయన చెప్పడంలోను ఉన్నాయి (యోహాను 4:21-24). అయితే, యెరూషలేములో దేవాలయం ఉన్నట్టుగానే, చెరలో ఉన్న వారి మధ్య తాను ఉంటానని యెహోవా ఇక్కడ తెలియజేస్తున్నాడు.

11:17. యెహోవా ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టవచ్చునేమోగానీ, తన ప్రజల్ని మటుకు శాశ్వతంగా విడిచిపెట్టడు. ఆ యా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి అనే మాటలు బబులోను చెర కాలం ముగిసిన తర్వాత ఆయన వారిని మళ్ళీ స్వదేశానికి రప్పించడాన్ని, భవిష్యకాలంలోని వెయ్యేళ్ళ రాజ్యపాలన ప్రారంభంలో ఇశ్రాయేలీయుల్ని ప్రోగుచేయడాన్ని సూచిస్తున్నాయి (36:24-38; 37:11-28). 

11:18 స్వదేశానికి తిరిగి చేరుకున్న తర్వాత, ఒకప్పుడు దేశమంతటా ప్రజలు ఉంచిన హేయమైన విగ్రహాల్ని తీసివేయడం జరుగుతుంది (7:20; 8:3-17). ఇది, చారిత్రకంగా, ఎజ్రా 6-10 అధ్యాయాల్లో నెరవేరిందని కొందరు పండితుల అభిప్రాయం. 

11:19 రాతిగుండె అనే పదం . మార్పుచెందని హృదయాన్ని, దేవుని చిత్తానికి లోబడడానికి నిరాకరించినవారిని సూచిస్తుంది (జెకర్యా 7:12). ఈ ప్రకారంగా, రాతిగుండె “కఠినహృదయులై" ఉన్నవారిని సూచిస్తుంది. (2:4; 3:7). ఈ ప్రవచనంలోను, కొత్త నిబంధన గురించి ఉన్న ఇతర ప్రవచనాల్లోను (34:20-31; 36:24-38; 37:15-28; యిర్మీయా 31:31-34) వాగ్దాన పూర్వకంగా కనబడే సమూలమైన హృదయ పరివర్తన మరియు దానికి సంబంధించిన భౌతికమైన ఆశీర్వాదాలు భవిష్యకాలంలో మెస్సీయ యుగంలో నెరవేరతాయి. 

11:20-21 ఇశ్రాయేలీయులకు దేవునితో సహవాసం పునరుద్ధరణ కావడం (వారు నాకు జనులైయుందురు నేను వారికి దేవుడనై యుందును) మొదటి నిర్గమం లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. (నిర్గమ 6:7 చూడండి; ఆది 17:7-8; 2కొరింథీ 6:16; ప్రక 21:3 తో పోల్చండి). అయితే ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికీ వర్తించదు.

11:22-23 దేవుని మహిమ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళడం, రాజైన దావీదు అబాలోము నుండి పారిపోయిన దిశలో సాగింది, దేవుని మహిమ పట్టణపు తూర్పుదిశనున్న కొండకు పైగా (ఒలీవల కొండ) నిలిచింది. (2సమూ 15:23)
యేసు క్రీస్తు ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణుడ య్యాడు, అదే స్థలానికి తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు (జెకర్యా 14:4; అపొ.కా. 1:9-12 తో పోల్చండి). 


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |