Proverbs - సామెతలు 24 | View All

1. దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము

2. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును.

3. జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును.

4. తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును.

5. జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.

6. వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము

7. మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు.

8. కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును.

9. మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు.

10. శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.

11. చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?

12. ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.
మత్తయి 16:27, రోమీయులకు 2:6, 2 తిమోతికి 4:14, 1 పేతురు 1:17, ప్రకటన గ్రంథం 2:23, ప్రకటన గ్రంథం 20:12-13, ప్రకటన గ్రంథం 22:12

13. నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా.

14. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.

15. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.

16. నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.

17. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము.

18. యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.

19. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము.

20. దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును

21. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము.
1 పేతురు 2:17

22. అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును?

23. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు

24. నీయందు దోషములేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టివానియందు అసహ్యపడుదురు.

25. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.

26. సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును.

27. బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొల ములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.

28. నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుక కుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?

29. వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెదననుకొనకుము.

30. సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా

31. ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి యుండెను.దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను.

32. నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని.

33. ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట

34. వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.బైబిల్ అధ్యయనం - Study Bible
24:1-2 ఈ వచనాలు 23:17-18 వచనాల్లోని హెచ్చరికలను పోలి ఉన్నాయి. బలాత్కారము మరియు కీడు చేయడం ఒక వ్యక్తిని పతనానికి నడిపిస్తుంది.

24:3-4 దేవుని జ్ఞానము వలన... వివేచన వలన... తెలివిచేత లోకం స్థాపించబడినట్టుగా (3:19-20), ఇల్లు కూడా కట్టబడుతుంది. భౌతిక దీవెనలు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు రెంటినీ సర్వసంపదలతో అనే మాట సూచిస్తుంది. పాపాత్ములు సైతం తమ ఇళ్లు సమృద్ధితో నిండి ఉండాలని కోరుకుంటారు, అయితే అందుకు వారనుసరించే విధానాలు వారిని స్వనాశనానికి నడిపిస్తాయి (1:13,18).. 

24:5-6 వ.5 ని అనువదించడం కష్టం. వ. 5 లోని రెండవ పంక్తి “తెలివి గలవాడు అంతకంతకు శక్తిమంతుడు" అవుతాడు అని అర్థమిస్తుండవచ్చు. విషయం ఏదేమైనా గానీ, జ్ఞానంతో బాటు ఆలోచన చెప్పువారు ఉండడం వలన ఏ పరిస్థితిలోనైనా విజయం లభిస్తుంది.

24:7 ప్రముఖులు, తెలివిగలవారు పట్టణ గుమ్మము దగ్గర వ్యాజ్యాలను, వ్యాపార లావాదేవీలను చర్చించి పరిష్కరిస్తారు (1:21; 22:22; 31:23; ద్వితీ 21:19; యెహో 20:4; రూతు 4:1; 2సమూ 15:2). 

24:8-9 ఒక వ్యక్తికి పెట్టబడే పేరు అతని ఖ్యాతిని సూచిస్తుంది (16:21; 21:24) వచ్చిన పేరు పోగొట్టుకోవడం కష్టం. తంటాలమారి గురించి 1:4 దగ్గర "వివేచనయు" వివరణ చూడండి. యోచన అంటే కుట్రపూరితమైన ఆలోచన, ఇది సిగ్గుమాలినది, నీచమైనది అయిన చర్య (లేవీ 18:17). అపహాసకులు గురించి 1:22 నోట్సు చూడండి. హేయులు గురించి 3:32 నోట్సు చూడండి. 

24:10-12 శ్రమదినమున అంటే “ఏం చేయడానికి స్వేచ్చ లేని దైన్యస్థితి” (హెబ్రీ. సారా) అని అక్షరార్థం. క్రుంగినయెడల అంటే “నిరుత్సాహంగా ఉండడం" అని అక్షరార్థం (18:9 దగ్గర “జాగు వివరణ చూడండి). చేతకాని వాడవగుదువు అంటే “ఏం చేయాలన్నా వల్లపడని దౌర్బల్యం లేదా అధైర్యం" అని అక్షరార్థం (హెబ్రీ. సార్). నిరుత్సాహం ఆవరించకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. చావునకై అనే మాట భౌతిక మరణం, ఆధ్యాత్మిక మరణం లేదా ఒక దయనీయమైన స్థితిని సూచిస్తుండవచ్చు. పట్టబడినవారు అంటే ఇతరుల వలన ఆపదలో పడినవారిని, జోగుచున్న వారు అంటే తమంతట తామే ఆపదలో పడినవారిని (కీర్తన 82:4; యెషయా 58:6-7) సూచిస్తున్నాయి. జ్ఞానం నడిపించే మార్గంలో నడవనివారు నాశనమార్గంలో ఉన్నట్టే లెక్క వీరిని ఆ మార్గం నుండి తప్పించవలసిన అవసరముంది (10:17; 12:28; 14:12; 15:24). దేవుడు హృదయము లను శోధించువాడు (21:12; కీర్తన 44:21) కాబట్టి ఈ సంగతి మాకు తెలియదని, మాకు బాధ్యత లేదని చెప్పడం వ్యర్థం. క్రియాశూన్యత చెడ్డపనిలో పాలుపంచుకొనడంతో సమానం (యెహె 3:17-18). ఒకని పాపానికి తగినట్టు వారికి ప్రతీకారము చేయడం దేవుని పని, ఆయన తన కాపుదలను తీసివేయడం దీనిలో ఒక భాగం. 

24:13-14 తేనె లాగా జ్ఞానము కూడా ప్రయోజనకరమైనది, ఆహ్లాదకరమై నది (16:24; 25:16,27 కూడా చూడండి). ముందుకు... మంచిగతి గురించి 23:17-18 నోట్సు చూడండి. 

24:15-16 భక్తిహీనుల దుర్మార్గపు చర్యలు వ్యక్తమవుతాయి. నీతిమంతుడు తన బలం క్షీణించేంత వరకూ పడుతూనే ఉన్నా, చివరికి మరణం అంచున ఉన్నా గానీ అతను తిరిగి లేచును. ఏడు అనే సంఖ్య పరిపూర్ణతకు ఒక సంకే తం (6:31; 9:1; 26:16,25; మత్తయి 18:21). "దుర్మార్గపు క్రియలు” చేసే భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులు. భక్తిహీనులు ఇద్దరూ తమ క్రియలను బట్టి ఫలితాలు అనుభవిస్తారు. కొన్నిసార్లు ఇహలోకంలో కావచ్చు, నిత్యత్వంలో అయితే నిశ్చయంగా.. 

24:17-18 అసహ్యించుకొని అనే మాట - ఎదుటి వ్యక్తికి - ఆపద సంభవించినప్పుడు చూచి సంతోషించడం దేవుని దృష్టిలో “చెడుగా కనబడు" తుందని సూచిస్తుంది (యోబు 31:29; కీర్తన 35:11-14; లూకా 6:27,35; రోమా 12:20-21). 

24:19-20 వ్యసన పడడమంటే తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఊగిపోవడం (కీర్తన 37:1,7-8). పాపపు క్రియలు చేసే దుర్మార్గులను చూచినప్పుడు కోపం రావడం సరైనదే కావచ్చు. అయితే వారు వర్ధిల్లుతున్నందుకు వ్యసనపడడం సరైనది కాదు (కీర్తన 37). ఎందుకంటే దుర్మార్గులకు ముందు గతి (భవిష్యత్తు) ఉండదు, నీతిమంతులకు మంచి భవిష్యత్తు ఉంటుంది (23:17-18). దీపము గురించి 20:20 నోట్సు చూడండి.. 

24:21-22 రాజు సామాజిక న్యాయాన్ని అమలుపర్చే దేవుని ప్రతినిధి ( రోమా 13:1-4; 1పేతురు 2:13-14). ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును అనే మాటలు దేవుడూ రాజూ ఇరువురూ దుష్టుల మీద తీసుకునే చర్యల తీవ్రత ఎంతో ఎవరికీ తెలియదు అని సూచిస్తున్నాయి (ప్రసంగి 3:21; 6:12; 8:1 లతో పోల్చండి). హఠాత్తుగా గురించి 6:15 నోట్సు చూడండి. 

24:23-24 ఇవి కూడా ముందు ఉన్న శ్రేష్టమైన సామెతలతో బాటు (22:20-21) సొలొమోను సంకలనం చేసిన సామెతలే (10:1). 

24:23-25 పక్షపాతము చూపుట అంటే అక్షరార్థంగా “ముఖాన్ని చూడడం" (28:21; ద్వితీ 16:19), హోదాను బట్టీ స్థాయిని బట్టి మనుషుల పట్ల ప్రవర్తించడం. న్యాయాధిపతి “బీదా గొప్పా" తేడా లేకుండా అందరినీ ఒకేలాగా చూడాలి (ద్వితీ 1:17). ప్రజలు అన్యాయపు న్యాయాధికారిని ఏవగించుకుంటారు (17:15). దీవెన... వచ్చును అనే ఈ పదజాలం దీవెనలు దేవుని నుండి కలుగుతాయని తెలియజేస్తుంది.

24:26 కుటుంబంలో (ఆది 33:4; 45:15), లేదా ప్రాణ స్నేహితుల మధ్య (1సమూ 20:41) ముద్దు అనేది నమ్మకమైన ప్రేమను, సంఘీభావాన్ని తెలియజేస్తుంది. "యథార్థత” సైతం ప్రేమకు మరొక వ్యక్తీకరణే. 

24:27 యౌవనస్థుడు మొదట తన బ్రతుకు తెరువు కోసం ఉపాధి నేర్పరచుకోవాలి. ఒక జీవనాధారం ఏర్పడిన తర్వాత కావలసిన సౌకర్యాలైన వివాహం, కుటుంబం, సంతానం, సేవకులు మొదలైన వాటిని ఇల్లు కట్టుకొనడం అనే మాటలు సూచిస్తున్నాయి (వ.3; 14:1). 

24:28-29 నిర్నిమిత్తముగా... సాక్ష్యము (3:29-30 నోట్సు చూడండి) అనేది సాక్ష్యం చెప్పడానికి ఎవరూ పిలవకుండానే, ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూడకుండానే ముందుగానే మాట్లాడడాన్ని సూచిస్తుంది. ఎవరూ కీడుకు ప్రతికీడు చేయాలని కోరుకోకూడదు (20:22).. 

24:30-34 ఒక తెలివిలేని (6:30-33 నోట్సు చూడండి) సోమరివాని (6:6 నోట్సు చూడండి) పనులు, అతని వారసత్వ సంపాదన అంతా నాశనమైపోతాయి. ముండ్ల తుప్పలు (యెషయా 34:13; హోషేయ 9:6), దూలగొండ్లు (జెఫన్యా 2:9) అనేవి వేరే సందర్భాల్లో దేవుని తీర్పుకు సాదృశ్యాలు. జ్ఞానవంతుడు పరిశీలించి నేర్చుకుంటాడు. 33-34 వచనాలు సామె 6:10-11 వచనాల్ని ప్రతిధ్వనిస్తున్నాయి. రెండు సందర్భాలకూ ఇవి తగినవే. 


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |