12:1-11 బేతనియలో మరియ యేసును అభిషేకించడం, యేసు బందీ కావడం, విచారణ, శిక్ష విధించడం, సిలువ, సమాధి వెంటనే జరుగబోతున్నాయని ముందుగా చూపింది. (వ.7-8). ఈ వృత్తాంతం లాజరును మృతులలో నుండి లేపిన దానికి చాలా సన్నిహితంగా కలపబడింది. లాజరు యేసు అద్భుతకార్యాలు చేసే శక్తికి నిదర్శనంగా అక్కడ ఉండడంతో, అది యూదు నాయకుల కోపం అధికం కావడానికి కారణమైంది. దానికంటే, ఈ అభిషేకం ఇస్కరియోతు యూదాలో యేసుపై ఉన్న ద్వేషాన్ని కూడా బయటపెట్టింది (వ.4-8), మరియ చేసిన ఆరాధనా కార్యం ఒక్క వచనం (వ.3)లో వుంటే, యూదా అభ్యంతరం, యేసు యూదాను గద్దించడం ఐదు వచనాల్లో ఉంది (వ.4-8). 12:1 ఈ పస్కా పండుగను గురించి 2:13; 11:55 నోట్సు చూడండి. పస్కా పండుగకు ఆరు దినములు ముందు అంటే శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆరంభమై, శనివారాన్ని సూచిస్తుండవచ్చు.
12:2 భోజనము (గ్రీకు డేప్నోన్; రాత్రి భోజనం), సాధారణంగా రోజంతటిలో ముఖ్యమైన సాయంత్రపు భోజనాన్ని సూచిస్తుంది (లూకా 14:12). ఈ మాట పండుగ విందును కూడా సూచిస్తుండవచ్చు (మత్తయి 23:6; మార్కు 6:21). దీన్ని తరువాత చివరి భోజనం (ప్రభువు బల్ల)కు ఉపయోగించారు (యోహాను 13:2,4; 21:20), భోజనమునకు కూర్చున్న అనే మాటలు సాధారణమైన భోజనాన్ని కాక, ఒక విందును సూచిస్తున్నాయి (13:2-5,23).
12:3 పేరున్నర లేక అరలీటరు అంటే చాలా ఎక్కువ అత్తరు (11:2). మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరును ఉత్తర భారతదేశం నుండి దిగుమతి చేసుకుని, తలపై రాసుకోవడానికి రోమీయులు ఉపయోగించేవారు. ఈ అత్తరును అత్తరుబుజ్జిలో ఉంచేవారని సమదృక్పథ సువార్తలు సూచిస్తాయి (మత్తయి 26:7; మార్కు 14:3). అతిథి పాదముల యొద్ద ఉండే పని సేవకులది (1:27; 13:5). కాబట్టి మరియ చేసినవి దీనత్వాన్ని, భక్తిని చూపుతున్నాయి. ఆమె తన తలవెండ్రుకలతో యేసు పాదాలను తుడవడం గమనించాల్సిన విషయం, ఎందుకంటే యూదు స్త్రీలు అందరిముందు తమ కురులను విప్పడం అరుదు.
12:4-5 మూడువందల దేనారములు ఒక్క అత్తరుబుడ్డి కోసం చాలా ఎక్కువ మొత్తం. అత్తరుబుడ్డిని పగులగొట్టడం మరింత ఎక్కువ “వృథా" అని ఇస్కరియోతు యూదా భావన.
12:6 యూదా ఉద్దేశం అపవిత్రం. యేసుకు ద్రోహం చేయడానికి ముందే వాడు దొంగ.
12:8 యేసు జవాబు ద్వితీ 15:11ను సూచిస్తుండవచ్చు.
12:9-11 మత నాయకులు - యేసునుండి ఒక సూచకక్రియను కోరారని సమదృక్పథ సువార్తలు మనకు తెలియజేస్తాయి (ఉదా. మత్తయి 12:38). లాజరును మృతులలోనుండి లేపడంతో సహా, యేసు “అనేక సూచకక్రియలు" చేశాడని నాయకులు ఒప్పుకున్నారు అని యోహాను మనకు చెబుతాడు (11:47). కానీ వారు యేసును నమ్మడానికి బదులు “ఆయనను చంపనాలోచించుచుండిరి" (11:53), అంతేకాక వారు లాజరును కూడ చంపనాలోచన చేసిరి.
12:12-19 ప్రజలు ఖర్జూరపు మట్టలను ఊపుతూ ఆయనకు అభివాదం చేయడంతో యేసు యెరూషలేము విజయ ప్రవేశాన్ని క్రైస్తవ సాంప్రదాయంలో మట్టలాదివారంగా పాటిస్తారు. యేసు గాడిదపై కూర్చుని యెరూషలేము లోనికి రావడం, పా.ని. లేఖనాల నెరవేర్పు(జెకర్యా 9:9; కీర్తన 118:25-26 చూడండి)గా ఉంది. మట్టలను ఊపడం, ఒకడు తన శత్రువుపై విజయాన్ని వేడుకగా చేసుకోవడాన్ని, లేదా ఒక రాజును ఆహ్వానించడానికి సాదృశ్యంగా ఉండి, యేసు ఇశ్రాయేలులోని ఖాళీ సింహాసనాన్ని అధిష్టించి, రోమీయుల ఆక్రమణ నుండి, అణచివేత నుండి దేశాన్ని విడిపిస్తాడని తలంచారు. అయినప్పటికీ యేసు పొందిన ప్రశంసలు ఎక్కువకాలం నిలవలేదు; ఆయనను విజేతగా ఇప్పుడు ఘనపరచినవారిలో కొందరు. కొద్దిరోజుల తర్వాత ఆయనను సిలువవేయమని కేకలు వేశారు.
12:12 మరునాడు బహుశా ఇప్పుడు మనం మట్టలాదివారంగా పిలుచుకునే శ్రమవారంలోని ఆదివారాన్ని సూచిస్తుండవచ్చు. పండుగ అనేది పస్కా పండుగ.
12:13 ఖర్జూరపు మట్టలు యూదుల జాతీయచిహ్నం. కీర్తన 118:26 లోని దావీదు వంశికుడైన రాజుగా ప్రజలు యేసుకు జేజేలు చెప్పారు (మత్తయి 21:4-9తో పోల్చండి). కీర్తన 118 హల్లెల్ లోని భాగం (కీర్తన 113-118 కీర్తనలను హల్లెల్ కీర్తనలు అంటారు). వీటిని దేవాలయ గాయకబృందం యూదుల పెద్ద పండుగలలో పాడుతారు.
12:15 యేసు జెకర్యా 9:9 లో చెప్పినట్టు తన అధికారిక స్థానాన్ని తీసుకోవడానికి పరిశుద్ద పట్టణానికి వచ్చిన దీనుడైన కాపరి-రాజు అని చూపబడ్డాడు. ఒక పాలకుడు యూదయనుండి వచ్చి, జనుల విధేయతను శాసిస్తాడు. అతడు గాడిదను ఎక్కి వస్తాడు అని మెస్సీయకు సంబంధించిన ఒక ప్రవచనం (ఆది 49:10-11) చెబుతుంది. భయపడకుము అనే మాటలను బహుశా యెషయా 40:9 నుండి తీసుకుని ఉండవచ్చు. అవి సీయోనుకు శుభవార్తను తెచ్చేవానిని సూచిస్తున్నాయి (యెషయా 44:2).
12:19 ఇక్కడ లోకము అనే మాట పరిసయ్యుల భంగపాటును ఎత్తిచూపే అతిశయోక్తి అనేది స్పష్టం (అపొ.కా. 17:6).
12:20-50 ఈ భాగంతో యోహాను సువార్తలోని మొదటి పెద్ద భాగం ముగుస్తుంది. ఇందులో యూదుల కోసం యేసు పనిని చూస్తాం. కొందరు గ్రీకులు రావడం, యేసు మరణించి సకల జనులను రక్షించడానికి, ఆయన పరిచర్య తుది ఘట్టానికి చేరిందని సూచిస్తుంది. ఆయన “గడియ” వచ్చివున్నది (వ. 23-26; 2:4 నోట్సు చూడండి), మనుష్యకుమారుడు త్వరలోనే మనుష్యులచేత "పైకెత్త"బడతాడు (సిలువ వేయబడతాడు), దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చిస్తాడు (12:32; 3:14-15 నోట్సు చూడండి). ఇవి జరిగిన తర్వాత యేసు జనులను (యూదులు, యూదేతరులు) తనయొద్దకు ఆకర్షించ గలుగుతాడు. (12:32). అంతేకాదు, తమ మధ్య అనేక సూచకక్రియలు చేసిన మెస్సీయను తిరస్కరించినందుకు యూదు జనులు తీర్పు పొందుతారు (వ.37-40). 12:20 గ్రీసు దేశస్థులు కేవలం గ్రీకులనే కాక (7:35-36 నోట్సు చూడండి) అన్యజనులను సూచిస్తుండవచ్చు. వారు పస్కా పండుగలో ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చిన “దైవభక్తి" గలవారు.
12:21-22 అండ్రెయ... ఫిలిప్పులను గురించి, 1:44; 6:5-6 నోట్సు చూడండి. గ్రీకులు బహుశా ఫిలిప్పు ఒక్కని మీదనే దృష్టి నిలిపి వుండవచ్చు (అతడు అండ్రెయ దగ్గరకు వెళ్ళాడు). ఎందుకంటే పన్నెండుగురిలో గ్రీకు పేర్లు కలిగినవారు వాళ్ళిద్దరే.
12:23,27 యేసు గడియ గురించి, 2-4 నోట్సు చూడండి.
12:24 మరణం ద్వారా జీవం అనే సూత్రాన్ని, ఒక వ్యవసాయ ఉదాహరణతో వివరించాడు.
12:25 క్రీస్తును వెంబడించడంలో స్వత్యాగం ఉంది. అది సిలువలో అత్యున్నతంగా వెల్లడైంది.
12:26 ఈ సత్యం శిష్యుని భూసంబంధమైన జీవితం నుండి అతని నిత్యగమ్యా న్ని దాటి విస్తరిస్తుంది (7:34,36; 14:3; 17:24).
12:27 యేసు కలవరాన్ని వ్యక్తం చేయడం, కీర్తన 6:3 లేక 42:5,11 వంటి దావీదు కీర్తనలను గుర్తుచేస్తుంది.
12:28 యేసు భూమిమీద పరిచర్య చేసిన కాలంలో, పరలోకంనుండి శబ్దము వచ్చి ఆయన గుర్తింపును నిర్ధారించిన మూడుసార్లలో ఇది ఒకటి (ఆయన బాప్తిస్మం, ఆయన రూపాంతరంతో పోల్చండి; మత్తయి 3:13-17; 17:1-13 వాటి సమాంతర వాక్యభాగాలు చూడండి).
12:29 ఉరుము, దేవదూతల ద్వారా దేవుని ప్రత్యక్షతలనేవి పా.ని.లో చక్కగా నమోదు చేయబడ్డాయి. సీనాయి పర్వతం దగ్గర దేవుని ప్రత్యక్షతలలో ఉరుము కూడా ఒక భాగం (నిర్గమ 19:16, 19), దేవదూతలు (లేక దేవుని దూత) హాగరుతో (ఆది 21:17), అబ్రాహాముతో (ఆది 22:11), మోషేతో (అపొ.కా.7:38), ఏలీయాతో (2రాజులు 1:15), దానియేలుతో (దాని10:4-11) మాట్లాడారు.
12:30-31 లోకాధికారి అంటే తన పతనమైన పాపస్థితిలోని సాతాను (14:30; 16:11; 1యోహాను 5:19). ఇప్పుడు, సిలువ దగ్గర అపవాది బయటకు త్రోసివేయబడును లేక నిర్ణయాత్మకంగా ఓడింపబడతాడు (లూకా 10:18; కొలస్సీ 2:14-15).
12:32 పైకెత్తబడుటను గూర్చి 3:14-15 (అక్కడ నోట్సు చూడండి), 8:28 లోని వాక్యభాగాలలో అత్యంత స్పష్టంగా చెప్పబడింది. ఇక్కడ పూర్తి అవుతుంది. బహుశా ఇది యెషయా 52:13 లోని పరిభాషను ధ్వనిస్తుంది. అందరిని అనే మాట ప్రస్తుత నేపథ్యంలో, “అన్ని రకాల ప్రజలు" -అంటే యూదులు, అన్యజనులు (10:16; 11:52ను 12:20-21తో పోల్చండి) అని అర్థమిస్తుంది.
12:33 యేసు పొందబోయే మరణ... విధము గురించి, 21:19 నోట్సు చూడండి.
12:34 యోహాను సువార్తలో మెస్సీయను గురించి ప్రస్తావించిన అనేక అపార్థాలలో ఇది చివరిది (7:27,31,41-42తో పోల్చండి; 7:25-44 నోట్సు చూడండి). ఈ వాక్యభాగానికి ఆధారం, కీర్తన 89:4,36-37 వంటి వాక్యభాగాలలో ఉంది (వాటికి ఆధారం 2సమూ 7:12-16; కీర్తన 110:1;
యెషయా 9:7; దాని 7:14లో ఉంది).
12:35-36 యేసు జవాబు పరోక్షంగా ఉంది. (వ.46 చూడండి). వెలుగు ప్రజలతో కొంతకాలము మాత్రమే ఉంటుంది అనే సత్యపు వెలుగులో, ఆయన సిలువ వేయబడడం సమీపంగా ఉంది (7:33; 16:16-19). ఇంకా సమయముండగానే వారు వెలుగునందు విశ్వాసముంచమని ఆయన వారిని బ్రతిమిలాడుతున్నాడు (9:4; 11:10; 8:12 నోట్సు చూడండి).
12:37 యేసు వారికి కనబడకుండ దాగివున్నపుడు, ఆయన వెంటనే వచ్చే దేవుని తీర్పును కనుపరచి, ఇశ్రాయేలు ప్రజలకు తన ప్రత్యక్షపు పనిని పూర్తిచేశాడు (1:18).
12:37-50 ఈ నేరారోపణ అరణ్యయాత్రలోని ఇశ్రాయేలు తరమువారిని, యేసు కాలంలోని అవిశ్వాసులైన యూదులతో ముడి పెట్టింది. ప్రాచీన యూదులు దేవుని శక్తిని (మోషేద్వారా కార్యాలు జరిగించడంలో) నిర్గమములో చూసి కూడా (ద్వితీ 29:2-4) వెనుదిరిగినట్లే, యేసు కాలంలో యూదులు కూడా (యేసు చేసిన) అద్భుతకార్యాలను చూసి, సణిగారు (యోహాను 6:41,61ను నిర్గమ 17:3; సంఖ్యా 11:1 తో పోల్చండి), అవిశ్వాసంతో ఉన్నారు (యోహాను 12:39).
12:38-40 యూదులు యేసును తిరస్కరిస్తారని లేఖనాలు ప్రవచించాయని సూచిస్తూ, యెషయా 53:1; 6:10 లను యోహాను పేర్కొన్నాడు. వారి తృణీకారం దేవుని ప్రణాళికను నిర్ధారించాయి గాని అడ్డుకోలేదు. యెషయా 53:1 లోని మాటలు,
జనులు తృణీకరించినా దేవుడు హెచ్చించిన యెహోవా సేవకుని సూచిస్తున్నాయి. ప్రజలు చిట్టచివరికి దేవుని విషయంలోనే కఠినపరచుకున్నారు. (ఫరో లాగా, రోమా 9:17,18 నోట్సు చూడండి) అని యెషయా 6:10 చెబుతుంది. యోహాను సువార్తలోని రెండవ సగంలో నెరవేర్చబడిన వచనాల వరుసలో ఇవి మొదటివిగా ఉన్నాయి.
12:41 యెషయా ఆయన (యేసు) మహిమను చూడడం, “హెచ్చింపబడి (పైకెత్తబడి) ప్రసిద్ధు"డయ్యే (యెషయా 52:13) శ్రమనొందే సేవకుని బట్టి దేవుడు సంతోషించడం యెషయా ముందుగానే చూశాడని సూచిస్తుంది. అబ్రాహాములాగా యెషయా కూడా “యేసు దినము"ను చూచాడు (యోహాను 8:58తో పోల్చండి).
12:42-43 యేసునందు విశ్వాసముంచిన అధికారులలో అరిమతయియ యోసేపు, నీకొదేము ఉన్నారు (7:50-57; 19:38-42), పరిసయ్యులను బట్టి, మహాసభను బట్టి భయపడడాన్ని గూర్చి, 7:13 నోట్సు చూడండి.
12:44-50 ఈ భాగం యేసు సందేశ సారాంశాన్ని చెబుతూ, యోహాను సువార్తలోని మొదటి అతిపెద్దభాగాన్ని ముగిస్తూ, ఆయన చివరి విజ్ఞప్తిని సువార్తలోని మొదటి అతి పెద్దభాగాన్ని ముగిస్తూ, ఆయన చివరి విజ్ఞప్తిని తెలియజేస్తుంది. నన్ను పంపినవాని అనే మాట ఒక వార్తాహరునినుండి అతనిని పంపినవానిని విడదీయలేము అనే యూదుల ప్రాతినిధ్యపు ఆలోచనను ప్రతిపాదిస్తుంది. వ.48-50 లు ద్వితీయోపదేశకాండాన్ని ప్రతిధ్వనిస్తాయి (ద్వితీ 18:19; 31:19,26).