Chronicles I - 1 దినవృత్తాంతములు 5 | View All

1. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమా రులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠు డుగా దాఖలుచేయబడలేదు.

2. యూదా తన సహోద రులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్ర్యము యోసేపు దాయెను.
హెబ్రీయులకు 7:14

3. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారు లెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ.

4. యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు,

5. షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు,

6. బయలునకు బెయేర కుమారుడు, ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరతీసికొని పోయెను.

7. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబ ముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును,

8. యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెల యును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.

9. వారి పశువులు గిలాదుదేశమందు అతివిస్తారము కాగా తూర్పున యూఫ్రటీసునది మొదలుకొని అరణ్యపు సరిహద్దువరకును వారు కాపురముండిరి.

10. సౌలు దినములలో వారు హగ్రీ యీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.

11. గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.

12. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.

13. వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబయోరై యకాను జీయ ఏబెరు.

14. వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.

15. గూనీ కుమారుడైన అబ్దీ యేలునకు పుట్టిన అహీ వారి పితరుల యిండ్లవారికి పెద్ద.

16. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి.

17. వీరందరు యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి.

18. రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.

19. వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి.

20. యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను

21. గనుక వారిని జయించు టకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబది వేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱెలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.

22. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడు వరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి.

23. మనష్షే అర్ధగోత్రమువారును ఆ దేశమందు కాపుర ముండి వర్ధిల్లుచు, బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శెనీరువరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి.

24. వారి పితరుల యిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమశాలులై తమ పితరుల యిండ్లకు పెద్దలైరి.

25. అయితే వారు తమ పితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి.

26. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
5:1-5 మోషే, ఇశ్రాయేలీయులు మొదటిసారి వాగ్దాన భూమికి వచ్చిన సమయంలో యొర్దాను నదికి తూర్పున స్థిరపడిన (రూబేను, గాదు, మన ప్లే అర్థ) గోత్రాలు ఆ భూమి తమకు కావాలని అడిగారు. అయితే, నదికి పడమర భాగంలోనున్న భూమిని స్వాధీనం చేసుకోవడానికి యెహోషువకు సహాయం చేసిన తరువాత మాత్రమే వారు ఈ భూభాగాన్ని స్వాస్థ్యంగా పొందారు. ఇలా దక్షిణం నుంచి ఉత్తరదిశ వరకు వ్యాపించిన గోత్రాల వివరాలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. రూబేనీయులు మృతసముద్రం దగ్గర నివసించారు. ఇది వారి మానసిక స్థితికి సరిపోయే కఠినమైన ప్రదేశం. యాకోబు ఉపపత్నులలో ఒకరు, తన సహోదరులలో ఇద్దరి తల్లియైన బిలాతో శయనించి పాపానికి ఒడిగట్టినందున (ఆది 35:25) అతడు యాకోబు పన్నెండు మంది కుమారులలో జ్యేష్ఠునిగా తన గౌరవం కోల్పోయాడు.

5:6 ఇక్కడ రూబేను గోత్రం గురించి తెలియజేసిన త్వరిత, సంక్షిప్త వంశావళి మనకు బెయేరను పరిచయం చేస్తుంది. గోత్రానికి నాయకుడిగా అతడు దురదృష్టవంతుడని చెప్పాలి. ఎందుకంటే అతడు నాయకునిగా ఉన్నప్పుడే అషూరు రాజైన తిధత్పిలేసరు గోత్రమంతటినీ చెరగా తీసుకుపోయాడు. పాత నిబంధన చరిత్రకు ఈ కింద పేర్కొన్న అష్నూరు రాజులు ప్రాముఖ్యమైనవారు. 3వ షల్మనేసరు గురించి (క్రీ.పూ. 858-824) బైబిలులో ప్రస్తావించలేదు, కానీ అతడు ఉత్తరాది ఇశ్రాయేలు దేశంపై యుద్ధం చేసి రాజైన యెహూను లొంగదీసుకున్నాడు. 3వ తిగత్పిలేసరు (క్రీ.పూ. 744-727) యొర్దాను నదికి తూర్పున నివాసమున్న గోత్రాలను చెరపట్టుకున్నాడు, ఉత్తర ఇశ్రాయేలు దేశంలో అధికభాగాన్ని జయించి స్వాధీనం చేసుకున్నాడు. యూదా రాజైన అహాజు అతనికి కప్పం కట్టాడు (2దిన 28:1-27). 5వ షల్మనేజరు (క్రీ.పూ. 726-722) ఇశ్రాయేలు దేశ రాజధాని పట్టణమైన షోమ్రోనును నాశనం చేయడం మొదలుపెట్టాడు (2రాజులు 17:6). తరవాత ఈ నాశనాన్ని 2వ సర్గోను (క్రీ.పూ. 722-705) పూర్తిచేసి, ఉత్తరాది గోత్రాలవారిని చెరపట్టుకుపోయాడు. స్వరీబు (క్రీ.పూ. 704-681) యూదాను జయించాడు. కానీ హిజ్కియా పాలనలో యెరూషలేమును నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు అతని ఆట కట్టించాడు. (2దిన 32:1-23). ఏసర్దర్లోను (క్రీ.పూ. 681-669) యూదా రాజైన మనషేను తన స్నేహితునిగా, మద్దతుదారునిగా ఎంచినా, తరవాత కాలంలో అతనికి విరోధంగా తిరిగాడు. అష్యూరుబనిపాల్ (క్రీ.పూ. 668-627) అనేవాడు గుర్తింపు పొందిన అషూరు రాజులలో చివరివాడు. యూదాతో తన స్నేహ సంబంధం కొనసాగించి, ఐగుప్తును అణచివేయడంలో సఫలీకృతుడయ్యాడు. అయితే అతని పాలన చివరికాలంలో అధికారం అషూరు నుండి బబులోను చేతిలోకి మారిపోయింది.

5:7-10 రూబేనీయుల గతకాలపు విజయాలు ఆ గోత్రీకులు యూఫ్రటీసు నది వరకు విస్తరించడానికి, హగ్రీయులను ఓడించడానికి ఉపయోగపడ్డాయి. హగ్రీయులు, హాగరు వంశస్థులైన ఇష్మాయేలీయులు. 

5:11-17 గాదు గోత్రం రూబేనుకు ఉత్తరాన ఉంది. వృత్తాంతకారుడు వంశావళుల వంటి ఇతర లిఖిత ప్రతుల గురించి తరచు పేర్కొనడం, ఇంకా చారిత్రక గ్రంథాలు, బైబిలు గ్రంథకర్తలకు లిఖిత ప్రతులు అందుబాటులో ఉన్నాయని సూచిస్తాయి. లభ్యతలో ఉన్న ఇలాంటి సమాచార వనరులను ఉపయోగించడం గమనిస్తే బైబిలు రచనా స్వరూపం అర్థమవుతుంది. అది పరిశుద్దాత్మ ఆధీనంలో మానవుని రచన, దైవ ప్రత్యక్షతల మేలు కలయికను స్పష్టంగా తెలియజేస్తుంది. (29:29-30 పోల్చండి; సంఖ్యా 21:14; లూకా 1:1-4).

5:18-22 తూర్పున కాపురమున్న గోత్రాలు అనేక సైనిక విజయాలలో కలసి పోరాడాయి, అధిక మొత్తంలో దోపుడుసొమ్ము కూడబెట్టుకున్నాయి. ప్రజలు తమ సొంత శక్తితో పోరాడటానికి ప్రయత్నించినప్పుడు, దేవుడు వారిని ఆశీర్వదించడు కానీ, యుద్ధమందు ఆయనే తన ప్రజల పక్షంగా పోరాడితే, ఆయన ప్రజలు మానవుని అంచనాలకు అందని ఉన్నతమైన స్థాయిలో అద్భుత విజయాలు చూస్తారు. దినవృత్తాంతముల గ్రంథంలో ఇది ఒక స్థిరమైన ఇతివృత్తం. ఆ విధంగా, వారు దేవునికి మొట్ట పెట్టగా, ఆయన వారికి ప్రతిఫలమిచ్చాడు. 

5:23 యోసేపు గోత్రమే లేదు. అందుకు బదులు, యోసేపు కుమారులైన ఎఫ్రాయిము, మనలు రెండు వేర్వేరు గోత్రాలకు పితరులయ్యారు. మనప్లే గోత్రం యొర్దానునదికి రెండువైపులా భూభాగాన్ని స్వతంత్రించుకుంది.

5:24-25 విగ్రహారాధనను గూర్చి దినవృత్తాంతముల గ్రంథంలో ఇక్కడ మొదటిసారిగా ప్రస్తావించబడింది. మనషే గోత్రంలో కీర్తి పొందిన పరాక్రమశాలురైన వ్యక్తులు ఉన్నట్లు ఈ భాగంలో కనబడినా, వారు దేవుని నుండి తొలగిపోయి తమచుట్టూ ఉన్న జనసమూహముల విగ్రహారాధన అలవాటు చేసుకున్నారు.

5:26 అష్పూరు రాజులలో తిగత్పిలేసరు క్రూరుడు, దుర్మార్గుడు. కానీ తన ప్రజలు చేసిన విగ్రహారాధన బట్టి వారిని శిక్షించడానికి దేవుడు అతడిని ఉపయోగించుకున్నాడు. ఇతర గోత్రాలను చెరపట్టడానికి చాలాకాలం ముందే, తూర్పున కాపురమున్న ఈ మూడు గోత్రాలను అష్బూరీయులు చెరగొని పోయారు. వారి విగ్రహారాధన కారణంగానే ఇది జరిగిందని వృత్తాంతకారుడు స్పష్టంగా తెలియజేశాడు. 


Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |