Ezekiel - యెహెఙ్కేలు 8 | View All

1. ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను.

2. అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజియైనట్టుగాను ఆయన నాకు కనబడెను.
ప్రకటన గ్రంథం 1:13

3. మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూష లేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను.

4. అంతట లోయలో నాకు కనబడిన దర్శనరూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను.

5. నర పుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను.

6. అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు.

7. అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కన బడెను.

8. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వు మని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను.

9. నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయు చున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా

10. నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహ ములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను.

11. మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆ యాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.

12. అప్పుడా యన నాకు సెలవిచ్చినదేమనగానరపుత్రుడా యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశ మును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.

13. మరియు ఆయననీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి

14. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని.

15. అప్పుడాయననరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచిన యెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి

16. యెహోవా మందిరపు లోపలి ఆవరణ ములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమున కును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మను ష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయు చుండిరి.

17. అప్పుడాయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలా త్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.

18. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును.



బైబిల్ అధ్యయనం - Study Bible
8:1 అరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున అనే మాటలు యెహెజ్కేలు తన మొదటి దర్శనం గురించి పద్నాలుగు నెలలు మనసులో మననం చేసుకున్నాడని తెలియజేస్తున్నాయి. యూదా పెద్దలు చేసిన చర్యలు పంచకాండాల్లో ఇశ్రాయేలీయుల్లోని డెబ్బయిమంది పెద్దలు చేసిన పనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అరణ్యంలో ఇశ్రాయేలీయుల పెద్దలకు దేవుణ్ణి చూడగలిగే విశేషమైన అర్హత లభించింది (నిర్గమ 24:1-11), మోషేలో ఉన్న ఆత్మయే వీరిలోను ఉండడం జరిగింది (సంఖ్యా 11:16-30). 

8:2-5 ఆత్మ యెహెజ్కేలును కొనిపోవడం జరిగింది, యెహెజ్కేలు అనుభవానికి చాలా దగ్గరగా ఉన్న అనుభవాలు ఏలీయాకున్నాయి (1రాజులు 18:12; 2రాజులు 2:1-12,16-18). ఆత్మ ఎలీషాకు అతీంద్రియ శక్తుల్ని ప్రసాదించడం జరిగింది. (2రాజులు 5:26; 6:17, 32-33), రోషము పుట్టించు ఈ విగ్రహము అనే అర్థాన్నిచ్చే. హెబ్రీ పదం సెమెన్ ఇక్కడ కాక, ద్వితీ 4:16; 2దిన 33:7,15 వచనాల్లో మాత్రమే కనబడుతుంది. ఈ పదం అన్యజాతీయమని పండితుల అభిప్రాయం, అందుచేత అన్యదైవానికి ఈ పదాన్నుపయోగించడం సరైనదే. ఇది బహుశా దేవాలయంలో మనషే నిలువబెట్టించిన అషేరా ప్రతిమల్లో ఒకటై ఉండవచ్చు (2రాజులు 21:7; 2దిన 33:7,15). 2దిన 33:7,15 వచనాలు మనషే నిలువబెట్టించిన ప్రతిమను ఇదే పదంతో సూచిస్తున్నాయి కాబట్టి ఇది అషేరా ప్రతిమ అయ్యుండవచ్చని ముక్తాయింపు. యెహోవా రోషం కలిగిన దేవుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఆయన తన మహిమను విగ్రహాలతో పంచుకొనడు (యెషయా 42:8). 

8:6 ఇటువంటి హేయమైన చర్యలు యెహోవా తన పరిశుద్ధాలయాన్ని విడిచి వెళ్ళేలా చేస్తాయి. 

8:7-9 యెహెజ్కేలు గోడను త్రవ్వుతూ రహస్య గదిలోకి వెళ్ళే ద్వారం తెరవాల్సివచ్చింది. 

8:10 సకల... హేయమైన అనే పదజాలం రోమా 1:23 వచనాన్ని గుర్తుకు తెస్తుంది.

8:11 పెద్దలు డెబ్బది మందియు అనే పదజాలం, దేవుని ప్రజల్ని నడిపించ డంలో తనకు సహాయం చేయడం కోసం మోషే నియమించుకున్న పెద్దల స్థానంలో ఉన్నవారు అయ్యుండవచ్చు (నిర్గమ 24:1,9; సంఖ్యా 11:16-25). ప్రాయశ్చిత్తార్ధ దినం నాడు ప్రధాన యాజకుడికి నిబంధన మందసానికి మధ్య ధూపం నుండి వెలువడే పొగ ఒక తెరలాగా పైకి ఎక్కుతుండేది (లేవీ16:2,13), ఇప్పుడు అటువంటి అనుభూతిని యెహెజ్కేలుకు దర్శనంలో మేఘమువలె ధూపవాసన ప్రతిధ్వనింపజేస్తుంది. 

8:12-13 దేవుడు ఇశ్రాయేలును విడిచిపెట్టాడని చెప్తూ, ఆయన నుండి దాగుకొనాలనుకొని వారు చీకటి గదిలో ఉన్నారు. 

8:14-15 తమ్మూజు దేవతను గూర్చి యేడ్చుట అనే పదజాలం, దుముజి అనే సుమేరియన్ దైవం మరణించి అధఃలోకంలోకి వెళ్ళిందని ఆ దైవం గురించి విలపించే బబులోను ఆచారాన్ని తెలియజేస్తుంది. ఏటేట ప్రకృతిలో ఋతువులు క్రమం ప్రకారం పునరావృతమైనట్టుగా దుముజి (తమ్మూజు) మరణిస్తూ, మళ్ళీ బ్రతుకుతూ ఉంటుందని వారు నమ్మేవారు. 

8:16 విగ్రహపూజలో చివరి హేయమైన చర్య మందిరపు లోపలి ఆవరణ ములో జరిగింది, అక్కడ ఇరువది యయిదుగురు మనుష్యులు... తూర్పుతట్టు వంగి సూర్యుడిని నమస్కరిస్తున్నారు. 2రాజులు 21:5 ప్రకారం, మనషే పరిపాలించిన కాలంలో సూర్యుడిని పూజించడం మొదలైంది, మనషే మందిర ఆవరణలో అన్యదేవతలకు బలిపీఠాల్ని నిర్మించాడు. ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్య ఉన్న స్థలం బహుశా యాజకులు మాత్రమే ఉపయోగిం చుకొనే స్థలం అయ్యుండవచ్చు, అది కూడా వారు ఉపవాస దినంనాడు దేవునికి ప్రార్థనచేయడం కోసం మాత్రమే ఉపయోగించేవారు (యోవేలు 2:17).

8:17-18 తీగె ముక్కునకు పెట్టుచు అనే పదజాలం బహుశా విగ్రహపూజల్లోని ఏదైనా ఆచారాన్ని సూచిస్తుండ వచ్చు, లేదా దేవునిపట్ల తిరస్కారాన్ని సూచించే భాషా ప్రయోగం అయ్యుండవచ్చు.. 


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |