కీర్తన-141. దావీదు. ఎదుర్కొన్న అపవాదులకు లోనైన వ్యక్తి. దానికి తగినట్టుగా తిరిగి కఠినమైన, బుద్ధిహీనమైన మాటలు పలుకుతాడు. అయితే అలాటి పాపానికి తనను దూరంగా ఉంచమని ప్రార్థనను వ్యక్తం చేసే కీర్తన.
141:1-2 దేవాలయంలో ఉదయ, సాయంకాల సమయాల్లో నియమాను సారం ధూపములు అర్పిస్తూ ఉండాలి (నిర్గమ 30:7-8; 2రాజులు 16:15). ఇవి పరలోకంలో ఉన్న దేవునికి చేసే ప్రార్థనలకు ప్రతీకలు. (నెహెమ్యా 13:5,9; యెషయా 1:13; యిర్మీయా 41:5). ఆరాధన సమయంలో చేతులు పైకెత్తడం (చేతులెత్తుట) రివాజు (28:2; 63:4; 134:2).
141:3 యుక్తాయుక్త విచక్షణతో మాట్లాడడాన్ని నా పెదవుల ద్వారమునకు అనే పదాలు అలంకారికంగా సూచిస్తున్నాయి. ఇవి బైబిల్లో ఇక్కడ ఒక్కచోట మాత్రమే కనిపిస్తాయి.
141:4 రుచిగల పదార్ధములు బహుశా నిషిద్ధమైన అర్పణల్ని, భోగాసక్తతగల పాపపు క్రియల్ని సూచిస్తుండవచ్చు.
141:5 నాటి సంస్కృతిలో తల మీద నూనె పోయడాన్ని (తైలాభిషేకం) మన్ననపూర్వకమైన ఉపశమనంగా పరిగణించేవారు. - (23:5; 45:7; 133:2; యెషయా 61:3; యాకోబు 5:14). నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము - మనం- నిజంగా దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరితే దేవుని పవిత్రతకు వ్యతిరేకమైన దేని విషయంలోనైనా ఆయన గద్దింపును ఆహ్వానిస్తాం. నీతిమంతుడైన ఒక వ్యక్తి తన పాపం విషయంలో మనఃపూర్వకంగా దుఃఖపడి, సంఘంతో తిరిగి చేరితే అతన్ని లేక ఆమెను స్వీకరించి బలపరచాలే గాని తిరస్కరించకూడదు. (సామె 15:5,32; యోహాను 16:8; ఎఫెసీ 5:11; 2తిమోతి 4:2 చూడండి). అలాంటివారి పట్ల వైఖరి మన ఆధ్యాత్మిక పరిణతిని తెలియజేస్తుంది. (2తిమోతి 4:3-4 చూడండి),
141:6 ఏది జరిగితే కీర్తనకారునికి న్యాయం జరిగినట్లవుతుందో అదే జరగాలని అతడు కోరుకుంటున్నాడు. దుష్టులైన అధికారులు తమ పదవులు కోల్పోయినప్పుడు వారి అనుచరులు. అది చూచి కీర్తనకారుడే మంచి వాడనుకుంటారు.
141:7 తన ప్రజలు వధకు గురవుతున్నారనీ వారిని సరైన రీతిలో సమాధి చేయడం లేదనీ కీర్తనకారుడు మనసులో తలంచుకుంటున్నాడు (79:2-4).
141:8 కీర్తనకారుడు దేవునిలో తన విశ్వాసాన్ని దృఢంగా తెలియజేస్తున్నాడు (2:12; 5:12; 57:1; 64:10; 71:1; 118:8; యెషయా 14:32; 57:13).
141:9-10 భక్తిహీనులు కీర్తనకారున్ని ఉచ్చుల్లో ఇరికించాలనుకుంటున్నారు; అయితే అతడు వాటినుండి తనను తప్పించి, వారు వేసిన వలలలో వారే చిక్కుకొనేలా చేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు (7:16; 9:16; 35:8; 69:22; 106:36; 140:9-11; సామె 26:27).