John - యోహాను సువార్త 19 | View All

1. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.

2. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి

3. ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.
మీకా 5:1

4. పిలాతు మరల వెలుపలికి వచ్చిఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.

5. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు- ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.

6. ప్రధాన యాజకులును బంట్రౌతులును ఆయనను చూచి సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతు-ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను.

7. అందుకు యూదులు మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.
లేవీయకాండము 24:16

8. పిలాతు ఆ మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి

9. నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు

10. గనుక పిలాతునాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను.

11. అందుకు యేసుపైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.

12. ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులునీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.

13. పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి,రాళ్లు పర చిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు.

14. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడుఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా

15. అందుకు వారు ఇతనిని సంహ రించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతుమీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులుకైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.

16. అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

17. వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు.

18. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.

19. మరియపిలాతు యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.

20. యేసు సిలువవేయ బడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.

21. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గానియూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా

22. పిలాతునేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.

23. సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్ర ములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక

24. వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను;ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి.
కీర్తనల గ్రంథము 22:18

25. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.

26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,

27. తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.

28. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను.
కీర్తనల గ్రంథము 22:15, కీర్తనల గ్రంథము 69:21

29. చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి.
కీర్తనల గ్రంథము 69:26, కీర్తనల గ్రంథము 69:21

30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
యోబు 19:26-27

31. ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.
ద్వితీయోపదేశకాండము 21:22-23

32. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.

33. వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని

34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.

35. ఇది చూచిన వాడు సాక్ష్య మిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును.

36. అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.
నిర్గమకాండము 12:46, సంఖ్యాకాండము 9:12, కీర్తనల గ్రంథము 34:20

37. మరియు తాము పొడిచిన వానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.
జెకర్యా 12:10

38. అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గ

39. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.

40. అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.

41. ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.

42. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
19:1 యూదుల విచారణ తర్వాత, పిలాతు యేసును విచారించిన తర్వాత, ఆయనకి శిక్ష విధించే దశ విచారణ ప్రారంభమైంది. పిలాతు గురించి 18:29 నోట్సు చూడండి. కొరడాలతో కొట్టడం ఆయన్ని ఎంత ఎక్కువగా బలహీనపరచిందంటే సిలువ కాడిని ఆయన ఎక్కువ దూరం మోయలేకపోయాడు. 

19:2 ముండ్ల... కిరీటము యేసు మెస్సీయతనాన్ని హేళన చేసే విధంగా ఎగతాళి కిరీటాన్ని సూచిస్తుంది. ముళ్ళు పుర్రెలోకి చొచ్చుకుపోయి, ఆయన ముఖాన్ని రక్తమయంగానూ, వికారంగానూ చేశాయి. ఊదారంగు వస్త్రము (మత్తయి 27:28; మార్కు 15:17) ఎగతాళి పూర్వకమైన రాజవస్త్రాన్ని సూచిస్తుంది. ఊదా రంగు అధికారాన్ని సూచించే రంగు. 

19:3 యూదుల రాజా, శుభమని అనడంలో “అవే సీజర్" ("కైసరు, శుభం!") అని రోమా చక్రవర్తి కోసం వాడే బిరుదును అనుకరించారు. సాటర్నాలియా పండుగ సందర్భంగా "మాక్ కింగ్" (ఉత్తుత్తి రాజు) ఆటలను ఆడడం రోమా సైనికులకు అలవాటు. 

19:4 సాధారణంగా పిలాతు నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. కానీ యూదులు ఈ విషయాన్ని విడిచిపెట్టలేదు. 

19:5 ఇదిగో ఈ మనుష్యుడు (లాటిన్. ఎకే హోమో) అన్న మాటలు, “ఈ నిస్సహాయుడిని చూడండి!" _ అనే భావాన్ని తెలియజేస్తున్నాయి. ఎగతాళి పూర్వకమైన రాజ దుస్తులలో, చూడడానికి యేసు హృదయ విదారకంగా ఉన్నాడు. యోహాను సువార్త నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు యేసు మానవ స్వభావం గురించి నొక్కి చెబుతున్నాయి. అంతేకాక అవి జెకర్యా 6:12 వంటి మెస్సీయ ప్రవచనాలను సూచిస్తున్నాయి. 

19:6 మరణ శిక్ష విధించే అధికారం యూదులకు లేదని పూర్తిగా తెలిసినప్పటికీ పిలాతు వ్యంగ్యంగా మాట్లాడాడు (18:31 నోట్సు చూడండి). 

19:7 యూదుల వ్యాఖ్యలు “యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను" అని చెప్పే లేవీ 24:16 ని సూచిస్తూ ఉండవచ్చు (యోహాను 5:18 నోట్సు చూడండి; 8:59; 10:31,33). 

19:8 పిలాతు మరి ఎక్కువగా భయపడ్డాడు. ఆ రోజు ఉదయాన్నే అతని భార్యకు వచ్చిన కల అతనిని కలవరపెట్టింది (మత్తయి 27:19).

19:9 యేసు ఆవిర్భావం గురించి ఆయన ప్రత్యర్థులు తరచుగా అభ్యంతరాలు లేవనెత్తేవారు (7:27-28; 8:14; 9:29-30). యోహానుకి మాత్రం నీవెక్కడ నుండి వచ్చితివని (18:36-37) పిలాతు అడిగిన ప్రశ్నలో "స్పష్టమైన ఆధ్యాత్మిక నిగూడార్థాలేవో ఉన్నట్లు అనిపించింది. పిలాతు ముందు
యేసు మౌనం వహించడం, యెషయా 53:7 ను గుర్తుచేస్తుంది. (మార్కు 14:61; 15:5; 1పేతురు 2:22-23).

19:10-11 సాధారణ యూదుల పద్దతిలో యేసు వాడిన పై నుండి అన్న మాట దేవుణ్ణి సూచిస్తుంది.

19:12 యేసు చేసిన అపరాధాన్ని బట్టి పిలాతు ఒప్పించబడలేదు. కానీ యూదులు తీవ్రంగా ఒత్తిడి చేసిన తర్వాతే పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు (వ.13-16). మొదట కైసరు అనేది గాయస్ జూలియస్ కైసరు (44 క్రీ.పూ) ఇంటిపేరు, అయితే అది తర్వాతి రోమా చక్రవర్తుల బిరుదుగా మారింది (వ. 15; మత్తయి 22:17,21), కైసరునకు స్నేహితుడు అనేది చక్రవర్తి అభిమానించే వ్యక్తిని సూచించే హోదా. ఈ హోదా పూర్తిగా అధికారికమైనది కాదు. పిలాతు తానెక్కడ ఈ హోదాను కోల్పోతాడోనని భయపడ్డాడు.

19:13 న్యాయపీఠము న్యాయమూర్తి అధికారిక తీర్పులను ప్రకటించడానికి వేదికగా ఉపయోగపడేది (అపొ.కా. 25:6,17). గవర్నరు. నివాసం రెండు చోట్ల ఉండే అవకాశముంది... ఆ రెండింటిలో ఆంటోనియా కోట ఒకటి. ఆ కోట దిగువన రాళ్లు పరచిన స్థలమనే చోటును గురించే ఈ వచనంలో ప్రస్తావించారు (18:28 నోట్సు చూడండి).

19:14 పస్కా పండుగ జరిగే వారంలో విశ్రాంతిదినానికి ముందు రోజే పస్కాను సిద్ధపరచు దినము (మత్తయి 27:62; మార్కు 15:42; లూకా 23:54; యోహాను 18:28 నోట్సు చూడండి). అలా అయితే, గురువారం సాయంత్రం అంటే (యూదుల లెక్కల ప్రకారం, శుక్రవారం ప్రారంభమైనట్లు)
యేసు చేసిన పస్కా భోజనమే యేసు రాత్రి పూట చేసిన ఆఖరి భోజనమని నాలుగు సువార్తలూ ఏకీభస్తాయి.

19:15 కైసరును మాత్రమే తమకు రాజుగా అంగీకరిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా, యూదు నాయకులు తమ జాతీయ వారసత్వానికి ద్రోహం చేశారు. లేఖనాలలోని వాగ్దానాల ఆధారంగా మెస్సీయలో వారు కలిగి ఉన్న వారి విశ్వాసాన్ని వారే తిరస్కరించారు. 

19:16-42 శిక్షను ప్రకటించిన తర్వాత, శిక్ష పడిన ఆ వ్యక్తిని కొరడాలతో కొట్టి చంపుతారు. సిలువ వేయడం గురించి యోహాను వివరించిన కథనంలో ఇది చివరి భాగం. ఇందులో యేసును సిలువ వేయడం గురించీ, సమాధి చేయడం గురించి వివరించారు. 

19:17 సొమ్మసిల్లిపోయేంత వరకు యేసు తన సిలువ మోసికొని వెళ్ళాడు. అప్పుడు సైనికులు కురేనీయుడైన సీమోనును బలవంతం చేయగా, అతడు సిలువ వేసే ప్రదేశం వరకూ సిలువను మోసుకెళ్లాడు (మత్తయి 27:32), ఆయన... (బయటికి) వెళ్లెను అంటే “పట్టణంలో నుండి బయటికి” అని అర్ధం.. మరణ శిక్షలు అమలు చేయడానికి యూదుల సంప్రదాయం సూచించే ప్రదేశమది (లేవీ 24:14,23; సంఖ్యా 15:35-36; ద్వితీ 17:5; 21:19-21; 22:24; హెబ్రీ 13:12). గొల్గొతా అనే అరామిక్. పదాన్ని తర్జుమా చేస్తే. కపాలస్థలము అంటారు. సమానార్ధమిచ్చే లాటిన్ పదం “కల్వరి” ని వల్లేట్ లో ఉపయోగించారు (1:38 నోట్సు చూడండి). 

19:18 సిలువ వేయడం గురించి 18:32 నోట్సు చూడండి. ఇద్దరు నేరస్థుల మధ్య యేసును సిలువ వేయడం, కీర్తన 22:16 ను గుర్తుచేస్తుంది: “దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి యున్నారు”. ఈ వాక్యభాగం యెషయా 53:12 ని ప్రతిధ్వనింప జేస్తుంది: “అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను”

19:19 యేసు సిలువపై ఉన్న శాసనం ఆయన సిలువవేయ బడటానికి కారణమైన నేరాన్ని తెలియజేస్తుంది. బహుశా ఇతరులెవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిరుత్సాహపరచడానికి ఆ విధంగా రాసి ఉంటారు. 

19:20 స్థలము పట్టణమునకు సమీపమై యుండెను అన్న మాటల గురించి వ. 17 నోట్సు చూడండి. పాలస్తీనాలోని యూదుల జనాభా ఎక్కువగా అర్ధం చేసుకోగలిగిన భాష, హెబ్రీ (అరామిక్; రోమా సామ్రాజ్యపు అధికారిక భాష “లాటిన్", ఆ సామ్రాజ్యపు “అంతర్జాతీయ భాష”, గ్రీకును ఎక్కువశాతం చెదిరిపోయిన" యూదులూ అలాగే అన్యజనులూ అర్ధం చేసుకోగలిగేవారు. యేసుపై మోపిన నేరాలను వాస్తవంగా ఎవరైనా చదవగలరన్న విషయాన్ని ఆ త్రిభాషా శాసనం నిర్ధారిస్తుంది.

19:21-22 యూదుల ఒత్తిళ్లకు ఇంకా ఎక్కువ లొంగడం. పిలాతుకు ఇష్టం లేదు. యోహాను ప్రకారం, ఉద్దేశపూర్వకంగా కాకపోయినా తెలియకుండానే ఆ శాసనం యేసే నిజమైన రాజని ధృవీకరించింది. 

19:23 కుట్టులేక యున్న అంగీ అన్న మాటలు యోసేపు నిలువుటంగీని గుర్తు చెయ్యొచ్చు (ఆది 37:3,23). సిలువ వేసేటప్పుడూ, ఆ తర్వాతా జరిగిన అనేక సంఘటనల మాదిరిగానే (యోహాను 19:28-37), సైనికులు యేసు వస్త్రములను భాగాలుగా చెయ్యడం ద్వారా, చీట్లు వేయడం ద్వారా లేఖనాలు నెరవేర్చబడ్డాయి (కీర్తన 22:18). ఇతర నెరవేర్పు లేఖనాల గురించి యోహాను 12:38-40 నోట్సు చూడండి...


19:24 ఈ వచనంలోని మూలాన్ని కీర్తన 22 నుండి తీసుకున్నారు. అది దావీదుకు చెందిన విలాప కీర్తన. కీర్తనాకారుడి అనుభవానికి అనుగుణంగా యేసును శ్రమపడుతున్న నీతిమంతునిగా చూపించిన అనేక సందర్భాలలో ఇది మొదటిది (యోహాను 19:28,36-37). సైనికులు యేసు వస్త్రాన్ని చింపదలచుకోలేదు. ఎందుకంటే అది మొత్తం ఒకే వస్త్రంగా నేసినది. యేసు సిలువ మరణాన్ని గురించిన వృత్తాంతాన్ని దావీదూ, యేసుల అనుభవాల మధ్య సమాంతరాలనూ నెరవేర్పులను ఎత్తి చూపించే విధంగా యోహాను రూపొందించాడు. యోహాను ఉద్దేశ పూర్వకంగానే దానిని ఆ విధంగా రూపొందించాడు. ఉదాహరణకు కీర్తన 22:15-18, శ్రమనొందే వాని దాహం గురించీ (వ.15), అతని చేతులూ కాళ్ళూ చీల్చబడడం గురించి (వ.16), అతని ఎముకల సంరక్షణ గురించీ (వ.17) ప్రస్తావిస్తుంది. 

19:25 యేసు తల్లి గురించి 2:1-5 చూడండి;  19:26-27 నోట్సు చూడండి. ఆయన తల్లి సహోదరి అంటే జెబెదయి కుమారుల తల్లియైన సలోమి అయ్యుండొచ్చు. జెబెదయి కుమారుల గురించి మత్తయి, మార్కు సువార్తలలో పేర్కొన్నారు. క్లోపా భార్యయైన మరియ గురించి లూకా 24:18 చూడండి. మగ్దలేనే మరియ గురించి 20:1-18 చూడండి (లూకా 8:2-3). 

19:26-27 ఒకడు తన తల్లిదండ్రులను గౌరవించాలన్న బైబిల్ ఆదేశాలకు అనుగుణంగా (నిర్గమ 20:12; ద్వితీ 5:16) యేసు తన తల్లికి అవసరమైన ఏర్పాట్లు చేశాడు. ఆమె నిశ్చయంగా వితంతువు అయ్యుండొచ్చు. ఆమె వయస్సు యాభై సంవత్సరాలు పైబడి ఉండొచ్చు, ఆమె చాలా తక్కువ వ్యక్తిగత ఆదాయంతో కానీ లేదా అసలు ఆదాయమే లేకుండా కానీ ఉండి ఉండవచ్చు. అమ్మా అన్న పదం గురించి 2:4 నోట్సు చూడండి. యేసు ప్రేమించిన శిష్యుడి గురించి 13:23 నోట్సు చూడండి; 20:1-21:25; 21:7-8; 21:24.

19:28-29 లేఖనాలు నెరవేరడం అన్న విషయాన్ని వ.24 (అక్కడ నోట్సు చూడండి) ఆధారం చేసుకొని నిర్మించారు. ఇది చాలావరకు కీర్తన 69:21 ని సూచిస్తుంది: “నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి” (మత్తయి 27:34,48; కీర్తన 22:15 చూడండి). సైనికులూ కూలీలూ తమ దాహం తీర్చుకోవడానికి చిరకనుపయోగించేవారు (మార్కు 15:36). ఇది సిలువ వేసే ప్రదేశం దగ్గరికి వెళ్లే మార్గంలో యేసు నిరాకరించిన “బోళము కలిపిన ద్రాక్షారసానికి భిన్నంగా ఉంటుంది . (మార్కు 15:23). హిస్సోపు అనేది 1రాజులు 4:33 లో భూమికి దగ్గరగా ఉండే ఒక మొక్కగా వర్గీకరించారు.
మొదటి పస్కా జరిగేటప్పుడు ద్వారబంధాలపై రక్తం చిలకరించడానికి దీన్ని ఉపయోగించారు (నిర్గమ 12:22). 

19:30 అప్పగించెను అన్న మాట శ్రమనొందే సేవకుని గురించి చెప్పబడిన ప్రవచనాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది - "మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను” (యెషయా 53:12). 19:31 సిద్ధపరచు దినము గురించి వ.14 నోట్సు చూడండి. ఆ విశ్రాంతి దినము మహాదినము ఎందుకంటే అది పస్కా పండుగ జరిగే వారంలోని విశ్రాంతి దినం. యూదుల అవగాహనలో, వ్రేలాడదీసిన నేరస్తుల మృతదేహాలు రాత్రంతా.. మ్రాను మీదే ఉండి, ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేయకూడదు (ద్వితీ 21:22-23; యెహో 8:29).

19:31-33 మరణాన్ని వేగవంతం చేయడం కోసం సిలువ వేయబడిన బాధితుల కాళ్ళు విరుగగొట్టించేవారు. ఇలా చేయడం వల్ల బాధితులు తమ ఛాతీ కుహరాన్ని తెరవడానికీ, తద్వారా బాగా శ్వాస తీసుకోవడానికి వీలు కలిగేలా తమ కాళ్లతో తమను పైకి నెట్టుకునే అవకాశం లేకుండా పోతుంది. బాధితులు ఇప్పుడు తమను తాము చేతుల సహాయంతో పైకి లాగవలసి ఉంటుంది. కాబట్టి, వారి చేతుల బలం క్షీణించిన తర్వాత ఊపిరాడక చనిపోతారు. వ. 36 నోట్సు చూడండి. 

19:34 రక్తమును నీళ్ళును కారడం, యేసు చనిపోయాడని నిరూపించింది (1యోహాను 5:6-8). ఈ వాక్యభాగం నిర్గమ 17:6 ని కూడా సూచిస్తూ ఉండవచ్చు: “నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరును” (సంఖ్యా 20:11). ఈటె సుమారు మూడున్నర అడుగుల పొడవుంటుంది, ఇనుముతో చేసిన ఈటె తలను చెక్కతో చేసిన కర్రకు అతికిస్తారు. 

19:35 యేసు గురించి యోహానిచ్చిన సాక్ష్యం గురించి 5:31-47; 13:23; 21:24 నోట్సు చూడండి.

19:36 "24,28,29 వచనాల తర్వాత (ఆ వచనాల నోట్సులు చూడండి), యేసు మరణం లేఖనాలను నెరవేర్చిందని చూపించే మూడవ లేఖనాత్మక రుజువిది (నిర్గమ 12:46; కీర్తన 34:20). యేసు చాలా త్వరగా చనిపోవడం వల్ల ఆయన కాళ్ళు విరుగగొట్టాల్సిన అవసరం లేకపోయింది, ఈటె ఆయన ఎముకలలో దేనినీ విరుగగొట్టలేదు. 

19:37 రోమా సైనికులు మళ్ళీ తెలియకుండానే ప్రవచనాన్ని నెరవేర్చారు: “వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచి” (జెకర్యా 12:10; ప్రకటన 1:7 లో కూడా ఉదహరించారు). 

19:38 యూదు పాలక మండలిలో ధనవంతుడైన సభ్యుడు, అరిమతయియ యోసేపు (మత్తయి 27:57), యేసు దేహాన్ని తనకిమ్మని పిలాతును అడిగాడు. ఆ విధంగా యేసుని నేరస్తులతో కలిపి చంపారు, ధనవంతుని సమాధిలో పాతిపెట్టారు. ఇది మరొక లేఖనాన్ని నెరవేర్చింది: “అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను” (యెషయా 53:9).

19:39-40 యోసేపు నీకొదేములు తీసుకువచ్చిన సుగంధ ద్రవ్యాల మొత్తం బోళముతో కలిపి అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు ఉంటుంది. ఇది చాలా పెద్ద మొత్తం (2దిన 16:14). బోళం అంటే ఒక సుగంధ ద్రవ్యం ,

ఐగుప్తీయులు శవం కుళ్లిపోకుండా భద్రం చేయడానికి దీన్ని వాడేవారు, అగరు అంటే సుగంధ భరితమైన గంధపు చెక్క పొడి. శవం నుండి కుళ్ళు వాసన బయటికి రాకుండా ఈ మిశ్రమం శవాన్ని కప్పేస్తుంది. 

19:41 ఆయనను సిలువ వేసిన స్థలము గురించి వ.17,20 నోట్సు చూడండి.. తోట చూడటానికి కొంతవరకూ విస్తరించి ఉంది. 20:15 లో తోటమాలి ప్రస్తావనను గమనించండి. పా.ని. లో కూడా తోటలలో సమాధి చేయడాన్ని నమోదు చేశారు (2రాజులు 21:18 లో మనషే 2రాజులు 21:26 లో ఆమోను). 

19:42 యూదుల సిద్ధపరచు దినం గురించి వ.14 నోట్సు చూడండి. మసాలా దినుసులు రవాణా చేయడమూ, శవాన్ని రవాణా చేయడమూ వంటి అన్ని పనులు ఆగిపోయాయి. విశ్రాంతి దినం వేగంగా దగ్గరికొచ్చేస్తుంది. ఆ విధంగా చూస్తే, సమాధి సమీపములో ఉండడాన్ని, దేవుని ఏర్పాటుకు ఉదాహరణగా మనం చూడొచ్చు (20:1 నోట్సు చూడండి). 


Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |