Timothy I - 1 తిమోతికి 6 | View All

1. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడ కుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచ వలెను.

2. విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము.

3. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైనబోధనుపదేశించినయెడల

4. వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,

5. చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.

6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.

7. మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.
యోబు 1:21, ప్రసంగి 5:15

8. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.
సామెతలు 30:8

9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.
సామెతలు 23:4, సామెతలు 28:22

10. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

11. దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.

12. విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.

13. సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్య ముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను,

14. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.

15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.
ద్వితీయోపదేశకాండము 10:17, యెహెఙ్కేలు 34:29

16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.
నిర్గమకాండము 33:20, కీర్తనల గ్రంథము 104:2

17. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక,సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
కీర్తనల గ్రంథము 62:10

18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసి కొనుచు, మేలుచేయువారును,

19. సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.

20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.

21. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.



బైబిల్ అధ్యయనం - Study Bible
6:1-2 బానిసగా ఉన్న వ్యక్తికి సహితం తాను చేసే పరిచర్య ముఖ్య ఉద్దేశం, ప్రేమయై ఉండాలి (ఎఫెసీ 6:5-8; కొలస్సీ 3:22-25; తీతు 2:9-10; 1పేతురు 2:18-20 తో పోల్చండి). 

6:3-5 అబద్ధ బోధకులను గురించి ఈ పత్రికలో పౌలు రాయడం ఇది మూడవసారి (1:3-11; 4:1-5). పౌలు తన బోధ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యము లతో సమ్మతిస్తున్నట్లు భావిస్తున్నాడు. 

6:6-8 లోభానికి వ్యతిరేకం తృప్తి. అంటే ఆహారం, వస్త్రాల విషయంలో తృప్తి కలిగి ఉండాలి అని. 

6:9-10 ఇక్కడ వస్తు సామగ్రిని సంపాదించడాన్ని కాక, హానికరమైన దురాశలను ఖండిస్తున్నాడు. ధనవంతులగుటకు అపేక్షించుట హానిచేస్తుందని మామూలుగా హెచ్చరించడం మాత్రం కాదు, ఈ అపేక్ష కొందరిని తమ విశ్వాసాన్ని నిరాకరించేలా చేసి, వారిని అవిశ్వాసులుగా కనపరచుకొనేలా నడిపించింది. 

6:11-12 పాపం నుండి పారిపోవడాన్ని పౌలు పరిశుద్ధతను వెంటాడడంతో కలిపాడు. పరిశుద్ధతను/భక్తిని తీవ్రంగా వెంటాడడాన్ని ఇది దృశ్యీకరిస్తుంది. ఇది విశ్వాససంబంధమైన మంచిపోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము అనే పిలుపుకు సమాంతరంగా ఉంది. 

6:13 ఇక్కడ పొంతిపిలాతు ప్రస్తావన చిత్రంగా అనిపిస్తుంది. యేసు ధైర్యంగా ఇచ్చిన మంచి సాక్ష్యం నేపథ్యంలో అతడు కనిపిస్తాడు. అది విశ్వాసుల “మంచి ఒప్పుకోలు” (వ. 12)కు ఒక మాదిరిగా ఉంది.

6:14-16 దేవుని మహిమ వెలుగులో అతని పరిచర్యలో కొనసాగమని పౌలు తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. ఆయన ఒక్కడే సర్వాధిపతి. ఆయన రాజులు అందరిమీద అధిపతియై, తన ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చేవాడు. ఆయన మాత్రమే అమరత్వము గలవాడై, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడు. తన పరిచర్యలో తిమోతి ఎదుర్కొనే వ్యతిరేకత ఆయనతో పోలిస్తే చాలా చిన్నది, బలహీనమైంది. 

6:17-19 ధనవంతులైనవారు గర్విష్ఠులుగా ఉండే అవకాశం ఉంది. వారు దానినుండి కాచుకోవాలి వారు క్రీస్తుపై కాక తమ ధనంపై ఆశపెట్టుకునే అవకాశం ఉంది. సత్ క్రియలు చేయడం, ఔదార్యము చూపడం లోనే నిజమైన జీవితం ఉనికి కలిగి ఉంటుంది. 

6:20-21 నీకు అప్పగింపబడినదానిని అనే మాటలు సువార్తను సూచిస్తున్నాయి. జ్ఞానమని అబద్దముగా చెప్పబడిన విపరీత వాదములు పత్రికలో చెప్పిన అబద్ధ బోధలను సూచిస్తున్నాయి.


Shortcut Links
1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |