5:1-6:20 తనకు నివేదించబడిన కొన్ని అపవిత్ర కార్యాలను గురించి చర్చించడానికి పౌలు తన అంశాన్ని మార్చాడు. రెండు పెద్ద భాగాలను (1:18-4:21 ని 5:1-6:20తో) కలపడానికి ఉపయోగించిన ముఖ్య మైన పదం ఉప్పొంగుట అని అనువదించబడింది. (4:6,18-19; 5:2). ఈ విభాగంలో ఉన్న మూడు సమస్యలు వావి వరుసలు లేని లైంగిక దుర్నీతి (5:1-13), వ్యాజ్యాలు (6:1-11), జారత్వము (6:12-20).
5:1 అట్టిది... అన్యజనులలో నైనను జరుగదు అనే మాటలు రోమా చట్టాన్ని సూచిస్తున్నాయి. ఒక కొడుకు తన మారుటితల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవడం రోమీయుల ప్రవాసంలో కూడా మరణశిక్ష లేక దేశబహిష్కరణ విధించేటంత నేరం. మోషే ధర్మశాస్త్రంలో కూడా అది నిషేధించబడింది (లేవీ 18:8; ద్వితీ 22:30).
5:2 సంఘ క్రమశిక్షణను నిర్లక్ష్యపెట్టడమనే సంఘ సమస్యను ఒక సంస్థాగతమైన అతిశయంతో .. పోల్చాడు. . (వ.6). వారు ఎంతగా అతిశయపడుతున్నారంటే సంఘంలో ఉన్న బహు - అభ్యంతరకరమైన పాపాలను, అంటే కొరింథులో ఉన్న కి అన్యులైన రోమీయులు కూడా సహించలేనంతటి పాపాలను సహితం చూడలేనంత గుడ్డివారైపోయారు. ఆ పాపం చేసినవానిని వారు సహవాసంలో నుండి తొలగించి ఉండాల్సింది. ఈ చర్య యొక్క ఉద్దేశం వ.5లో వివరించబడింది.
5:3 అపొస్తలిక న్యాయాధిపతిగా, పౌలు ఆ పనిచేసినవానిని వెలివేయమని చెబుతూ తన “న్యాయ నిర్ణయాన్ని జారీచేశాడు... కానీ అంతిమంగా అతడు తిరిగి సమకూర్చబడాలనే ఉద్దేశంతోనే .. ఆ పని చేయాలి. న్యాయవిచారణలో వాడే భాషను వాడుతూ, అతడు. ఈ వచనాల్లో కనీసం పది న్యాయసంబంధమైన నుడికారాలను ఉపయోగించాడు. పౌలు వాడిన పదజాలం లౌకిక న్యాయస్థానంలో వాడే భాషలాగా ధ్వనించింది.
5:4-5 అపొస్తలుడుగా తాను అక్కడ ఉన్నట్లుగానే భావించి తన న్యాయ తీర్పును చెప్పేశాడు కాబట్టి ఇక ప్రభువు... నామమున సమావేశమైన సంఘమే ఆ నేరం చేసిన వానికి తీర్పు తీర్చగలదని పౌలు ప్రకటించాడు. ఈ విషయంలో పౌలు న్యాయ దృష్టి ఈ పాపం మీద నిర్ణయం తీసుకోవడానికి ప్రభువైన యేసు అధికారాన్ని కలిగి ఉన్న సంఘాన్ని సమర్థిస్తున్నది. వాని శరీరేచ్ఛలు నశించుటకై అలాంటి వ్యక్తిని తమ మధ్య నుండి తొలగించే అధికారం (2:2) వారికుంది. ఇది శారీరికమైన వ్యాధి లేక మరణాన్ని గురించిన తీర్పులను కూడా సూచించవచ్చు (11:30). ఆ వ్యక్తి నిజమైన విశ్వాసియైతే, అతనిని సాతానుకు అప్పగించడం అతనికి వేదన కలిగించి పశ్చాత్తాపం కలిగించే అవకాశం ఉంది. ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు (రోమా 2:6, 9) అన్న పౌలు మాటల్లో అపరాధియైన వాడు చివరికి సమకూర్చబడతాడనే నిరీక్షణ కనిపిస్తుంది.
5:6 సంఘంలో ఉన్న అతిశయం (గ్రీకు. కౌకమా) సామాజిక పాపాలను అధికంగా అనుమతించేలా చేస్తుంది (వ.2 లోని “అతిశయం”తో పోల్చండి). అతిశయపు వేషధారణ అనే పులిసిన పిండి కొరింథీయ ముద్దంతయు విస్తరించింది.
5:7-8 క్రీస్తు అను మన పస్కా పశువు అనే భావనపై ఒక చమత్కార ప్రయోగం చేస్తూ, ఈ సామూహిక అహంకారానికి పౌలు మూడు రకాల పరిష్కారాల్ని ఇచ్చాడు: (1) మరణం నుండి వారిని తప్పించడానికి క్రీస్తు అనే వారి పస్కాపశువు చేసినదానిని గుర్తించడం; (2) దేవుని యెదుట క్రీస్తు అనే వారి పస్కా గొర్రెపిల్ల వారిని శుద్ధి (కొత్త ముద్ద) చేసిందని ఎరగడం; (3) క్రీస్తును తమ పస్కా గొర్రెపిల్లగా వారు ఆచరిస్తుండగా, వారి గృహాల్లో దుర్మార్థతయు దుష్టత్వము ను తొలగించుకొని, నిష్కాపట్యముతో సత్యముతో పండుగ చేసుకోవాలని వారు గుర్తుచేసుకోవడం.
5:9 జారులతో సాంగత్యం చేయవద్దనే పౌలు నిషేధం, ఇంతకు ముందు రాసిన (మనకు లభించని) పత్రికలోని హెచ్చరికకు కొనసాగింపు.
5:10 తాను ఆ ఉత్తరంలో, రాసిన మందలింపు (వ.9) అవిశ్వాసులతో (ఈ లోకపు జారులతో) సమాజంలో ఒ కలిసి వుండవద్దని కాదు అని పౌలు సరిచేస్తున్నాడు. నిజానికి అతని భావం “బయటివారి”లా ఉండే “లోపటివారి"తో కలవవద్దని. అవిశ్వాసుల్లా జీవించే విశ్వాసులతో కలసి ఉండొద్దని (3:3).
5:11 సహోదరుడనబడిన వాడెవడైనను జారుడైతే కొరింథీ విశ్వాసులు వారితో కలవకూడదు. కానీ వారు విశ్వాసినని చెప్పుకునే లోభి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకొనువాడు గాని అయితే, వారిని కూడా దూరంగా ఉంచాలి. అలాంటి వారితో కలిసి భుజించడం అంటే వారి లోకానుసారమైన జీవన విధానాన్ని మనం సమర్దించినట్లే. పరిసయ్యులకు కూడా యేసు మీద ఈ అభిప్రాయముండేది కాని, వారు పొరపాటు పడ్డారు. (మార్కు 2:16-17).
5:12-13 దేవుని ధర్మశాస్త్రంపై - ఘోరంగా తిరుగుబాటు చేసినవారి విషయంలో ఇశ్రాయేలీయులు చేసినట్లే సంఘం కూడా అలాంటి వారిని వారి మధ్యనుండి తప్పక తొలగించాలని చెబుతూ ద్వితీయోపదేశకాండంలో (13:5; 17:7,12; 19:19; 21:21; 22:21,24; 24:7) లో దేవుడు పదే పదే చేసిన హెచ్చరికను పేర్కొంటూ పౌలు ముగించాడు.